amla
-
'ఉసిరి టీ' గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంట్లోనే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండే టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకాల హెర్బల్ టీలు విని ఉంటారు. ఈ టీ గురించి అస్సలు విని ఉండరు. గ్రీన్ టీకి మించి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టీ ఏంటనే కదా..మనం ఎంతో ఇష్టంగా పచ్చళ్లు పట్టుకునే తినే ఉసిరితో ఈ టీ తయారు చేస్తారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.కావాల్సినవి: ఉసిరి, చూర్ణంపుదీనా ఆకులు-4అల్లం-1 అంగుళం -క్యారమ్ విత్తనాలుతయారు చేయు విధానం..ఒక గ్లాస్ నీటిని మరిగించి..అందులో పైన చెప్పిన పదార్థాన్నీ వేసి కాసేపు తిరగబడనివ్వాలి. ఆ తర్వాత వడకట్టండి అంతే అదే ఉసిరి టీ. ప్రయోజనాలు..గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో మొత్తం పది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందట. వివిధవ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. గ్రీన్ టీ కంటే ఇదే మంచిదా..?పులుపు పడని వాళ్లు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. తీసుకునే మోతాదును బట్టి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..) -
మార్కెట్లో దండిగా ఉసిరి : ఇలా ట్రై చేస్తే.. ఆరోగ్యసిరి!
ఇంట్లో ఉసిరి ఉంటే... ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అందుకే ఉసిరిని ఆరోగ్యసిరి అంటాం. హైబీపీ ఉంటే ఒక డ్రింక్ తాగుదాం.డయాబెటిక్ అయితే మరో డ్రింక్. ఎనిమిక్‌గా ఉంటే తియ్యటి క్యాండీ. రోజుకో ఉసిరి కాయ తింటే చాలు...గట్ హెల్త్ గట్టిగా ఉంటుంది.ఆమ్లా జ్యూస్ కావలసినవి: ఉసిరి కాయలు: నాలుగు; అల్లం– అంగుళం ముక్క; నిమ్మరసం – టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; నీరు – 200 ఎంఎల్తయారీ: ∙గింజలు తొలగించి ఉసిరి కాయలను ముక్కలుగా తరగాలి అల్లం తొక్కు తీసి ముక్కలు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙నీరు కలిపి మరొకసారి తిప్పి గ్లాసులో పోయాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. ఇది డయాబెటిస్‌కి దివ్యమైన ఔషథం.ఆమ్లా కాండీ కావలసినవి: ఉసిరికాయలు– పావుకేజీ; చక్కెర– 150 గ్రాములు; జీలకర్ర ΄ పొడి– టీ స్పూన్; అల్లం తరుగు– టీ స్పూన్; చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు.తయారీ: ∙ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి నీటిని మరిగించి అందులో ఉసిరికాయలను వేసి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేయాలి వేడి తగ్గిన తర్వాత ఉసిరికాయలను ముక్కలుగా తరగాలి, గింజలు తీసేయాలి. ఆ ముక్కల మీద జీలకర్ర పొడి, చక్కెర కలిపి పాత్రకు మూత పెట్టి ఆ రోజంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి రోజుకి చక్కెర కరిగి నీరుగా మారుతుంది. మూడవ రోజుకు ఆ నీటిని ముక్కలు చాలా వరకు పీల్చుకుంటాయి. మరో రెండు రోజులు ఎండబెట్టాలి. ఐదవ రోజుకు ముక్కలు చక్కెర నీటిని పూర్తిగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కూడా ముక్కలను తాకినప్పుడు కొంత తేమగా అనిపిస్తుంది. ఉసిరి ముక్కల మీద చక్కెర పొడిని చల్లాలి. వాటిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుని రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు తినాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. హనీ ఆమ్లా డ్రింక్ ఒక గ్లాసు డ్రింక్‌కి టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. కావలసినవి: ఉసిరికాయలు– నాలుగు; గోరువెచ్చటి నీరు– 200 మి.లీ; పుదీన ఆకులు– నాలుగు; తేనె – టీ స్పూన్.తయారీ: ∙ఉసిరికాయ ముక్కలు, పుదీన ఆకులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చటి నీటిని కలపాలి. అందులో తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది హైబీపీ ఉన్న వాళ్లకు మంచిది. గమనిక: ఉసిరి కాయల డ్రింకులు చేసుకోవడానికి తాజా కాయలు అందుబాటులో లేకపోతే ఆమ్ల పౌడర్ తీసుకోవచ్చు. -
ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే!
దీపావళి వెళ్లింది...కార్తీక మాసం వచ్చింది. అంతకంటే ముందు ఉసిరికాయ వచ్చేసింది. ఊరగాయలు మెల్లగా పెట్టుకోవచ్చు. ఉసిరితో వనభోజనానికి సిద్ధమవుదాం. ఉసిరితో ఇన్‌స్టంట్‌గా ఇలా వండుదాం. రోటి పచ్చడి... వేడి వేడి చారు... ఈ వారానికి ఇవి చాలు. ఉసిరి చారుకావలసినవి: ఉసిరికాయ గుజ్జు – 5 లేదా 6 (100 గ్రాముల గుజ్జు రావాలి); కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు – 4–5 గింజలు; జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; నీరు – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.పోపు కోసం: నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి–2; కరివేపాకు రెమ్మలు –2.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలు తొలగించాలి. ఆ ముక్కలను, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుకర్‌లో కందిపప్పును ఉడికించి, వేడి తగ్గిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించాలి. వేగిన తర్వాత ఉసిరికాయ గుజ్జు వేసి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి, ఐదు నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. ఈ రసం అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉసిరి రోటి పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 6; ఎండు మిర్చి– 10; జీలకర్ర – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు– టేబుల్ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 7; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాలు – 2 టీ స్పూన్లు; నూనె టీ స్పూన్.పోపు కోసం: నూనె – టేబుల్ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు– 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలను తొలగించాలి ∙పెనంలో నూనె వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అవి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి. స్టవ్, పెనం వేడికి మెల్లగా వేగి అమరుతాయి. వేడి తగ్గిన తరవాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఆవపొడిలో వెల్లుల్లి రేకలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పోపు కోసం బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన ఉసిరి పచ్చడి వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. -
ఔషధాల సిరి ఉసిరి : జుట్టు, చర్మ సంరక్షణలో భళా!
ఔషధాల సిరి ఉసిరి. దీని ద్వారా లభించేఆరోగ్య ప్రయోజనాల ఉగరించి ఎంత చెప్పుకునే తక్కువే.చర్మం, జుట్టు ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విటమిన్ సీ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను, దీర్ఘాయువును పెంచడానికి ప్రతిరోజూ ఉసిరి తినాలని చెబుతారు. మనస్సు , శరీరం రెండింటి పనితీరుకు సహాయపడే తీపి, పులుపు, చేదు, ఘాటైన ఐదు రుచులతో నిండిన 'దివ్యౌషధం ఇది. వసాధారణంగా అక్టోబర్ ,నవంబర్ మధ్య వచ్చే కార్తీక మాసంలోదీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యతుంది. శివుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు.ఉసిరితో వాత, కఫ , అసమతుల్యత కారణంగా సంభవించే వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్ కేన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఉసిరికాయతో పచ్చళ్లు, స్వీట్ తయారు చేస్తారు. ఉసిరికాయ గింజలు కూడా మనకు ఎంతో మేలుస్తాయి. అయితే దీనిని పచ్చిగా, రసం, చూర్ణం, మిఠాయి, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. జుట్టుకుఆమ్లా ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్లగా నిగనిగ లాడే మెరుపు వస్తుంది. జుట్టును బలోపేతం చేయడమే కాదు తొందరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్‌ను కూడా బలపరుస్తుంది. చుండ్రు రాకుండా కాపాడుతుంది. చర్మం కోసంసహజ రక్త శుద్ధిలా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను నివారణలో సహాయపడుతుంది. జీవనశైలి,కాలుష్యం, సూర్యరశ్మితో వచ్చే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరి కుష్టు వ్యాధి, సోరియాసిస్, చర్మ అలెర్జీలు , తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.యాంటీ ఏజింగ్ పవర్హౌస్లా పనిచేస్తుంది. ఆమ్లా పేస్ట్ లేదా పౌడర్‌తో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది, మృత చర్మ కణాలను,మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.మచ్చలపై ఉసిరి పేస్ట్‌ను అప్లయ్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని వాడవచ్చు. లేదా ఫేస్ ప్యాక్‌గా కూడా అప్లై చేయవచ్చు. -
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
ఉసిరి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయో తెలిసిందే. అయితే దీన్ని వేసవిలో తీసుకోవచ్చా. తింటే మంచిదేనా..? అని చాలామందికి ఎదురయ్యే సందేహం. ఆయుర్వేదం పరంగా ఔషధంగా ఉపయోగించే ఈ ఉసిరిని వేసవిలో తీసుకోవచ్చా అంటే..నిపుణులు బేషుగ్గా తీసుకోవచ్చని చెబుతున్నారు. సమ్మర్ హీట్‌కి సరైన ఫ్రూట్ అని చెబుతున్నారు. వేసవిలో ఉసిరి తీసుకోవడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందామా..!వేసవిలో అందరూ ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్. దీని కారణంగా జీర్ణ సమస్యలు, అలర్జీలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి పలు సమస్యలు ఎదుర్కొంటారు. వాటికి చెక్‌పెట్టడంలో ఉసిరి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సమ్మర్ హీట్‌ని తట్టుకునేలా రోగనిరోధక శక్తినిపెంచి, పొట్టలో వచ్చే మంటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక విటమిన్ సీ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌గా పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టాన్ని అరికడుతుంది. అలాగే శరీర కణాలు, కణాజాలా ఆరోగ్యకరమైన పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఉసిరి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి ఉష్ణ సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. శరీరానికి చలువ చేస్తోంది. ఇది హైడ్రేట్‌గా ఉంచడంతో అంతర్గత ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా చాలా నీరు చెమట రూపంలో వెళ్లినా.. శరీరాన్ని హైడ్రేటడ్గా ఉంచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. అందువల్ల జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీలు వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకునేలా చేస్తుంది. కొలస్ట్రాల్‌కి చెక్‌పెడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఎల్డీఎల్ లేదా చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇది ఆకలిని తగ్గించి, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ రేడియేషన్, పర్యావరణ కారకాల నుంచి రక్షిస్తుంది. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండేలా చేసి ముఖంపై పడే ముడతలను నివారిస్తుంది. అందువల్ల సమ్మర్లో ఎండ వేడిని తట్టుకోవడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుందని, తప్పక తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ కూతురు!) Breadcrumb -
ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
ఆమ్లఛుందా తయారీకి కావల్సినవి: ఉసిరికాయలు – అరకేజీ; బెల్లం – అరకేజీ; అల్లం – చిన్నముక్క; బ్లాక్‌సాల్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు; మిరియాలు – టీస్పూను; యాలక్కాయలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; పసుపు – టీస్పూను; కశ్మీరీ కారం – ఒకటిన్నర టీస్పూన్లు; గరం మసాలా – అర టీస్పూను; నిమ్మకాయలు – రెండు. తయారీ విధానమిలా: ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఆవిరి మీద మెత్తగా (10 నిమిషాలు) ఉడికించాలి ∙అల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ∙యాలక్కాయలు, మిరియాలను విడివిడిగా దంచి పెట్టుకోవాలి ∙ఉడికిన ఉసిరికాయలు చల్లారాక గింజలు తీసి సన్నగా తురుముకోవాలి. ఉసిరి తురుములో బెల్లం వేసి మీడియం మంట మీద పెట్టాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ►నీరు పైకి తేలగానే అల్లం తురుము, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, యాలకుల పొడిని వేయాలి ∙దాల్చిన చెక్కను తుంచి వేయాలి ∙చివరిగా పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ∙మీడియం మంట మీదే ఉంచి కలుపుతూ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కారం, గరంమసాలా వేసి కలపాలి. బాగా కలిసిన తరువాత దించేసి, నిమ్మరసం పిండితే ఆమ్లా ఛుందా రెడీ. గమనిక: గాజు లేదా పింగాణీ పాత్రల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
క్యాన్సర్ ముప్పుని తగ్గించే ఉసిరి.. పచ్చడి పెట్టుకోండిలా
తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి: ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు; పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత తయారీ విధానమిలా: పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. -
కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే..
చర్మ యవ్వనంగా కనిపించాలని.. మేని మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి. కొబ్బరి పాలతో.. ►కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ►కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ►ఇలా యాంటీ ఏజింగ్ ప్యాక్స్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. మేనికాంతికి ఉసిరి.. నిమ్మ... నారింజ తేమను తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. తేనెతో పెదవులకు మసాజ్ చేస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపించడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని అది దొరికినంతకాలం విరివిగా తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి దొరకనప్పుడు వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారవచ్చు. అలాగే, వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం, తరచు ముఖాన్ని కడుక్కోవడం, ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా మేని చర్మం మెరుపులీనుతూ ఉంటుంది. చదవండి: Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే! -
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..
శరీరంలో అక్కడక్కడ రక్తం గడ్డ కడుతోందా? రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? సాధారణంగా రక్తం మూడు విధాలుగా గడ్డ కడుతుంది. 1. సిరలలో... అది ముఖ్యంగా కాళ్ళలో వస్తుంది. కాలికి వాపు రావడంతో పాటు నొప్పి ఉంటుంది. కొన్ని సార్లు చర్మం రంగు మారుతుంది. 2. ఊపిరితిత్తులలో కొన్ని సార్లు గడ్డ కడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కాళ్ళలో నుంచి రక్తప్రవాహంలో సిరల ద్వారా ఊపిరితిత్తులకు చేరవచ్చు. ఆయాసం, ఛాతీ నొప్పి ముఖ్య లక్షణాలు. 3. గుండె లో కూడా గడ్డ కడుతుంది. కొన్నిసార్లు ధమనుల ద్వారా మెదడుకు వెళ్లి పక్షవాతం రావచ్చు. D-dimer అనే రక్త పరీక్ష వలన సిరలలో ఉండే రక్త గడ్డ ను కొనుక్కో వచ్చు. గుండెలో ఉన్న రక్త గడ్డను Echocardiogramతో కనుక్కో వచ్చు. ఊపిరితిత్తుల రక్త గడ్డ ను ఛాతీ CT scanతో తెలుసుకోవచ్చు. రక్తం మన శరీరంలో చేసే కీలకమైన పనులేంటీ? 1. ఆక్సిజన్‌ను సరఫరాచేసేది రక్తమే మనం బతకాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అని తెలుసు. అయితే, ఆ ఆక్సిజన్ కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదు. శరీరమంతా వ్యాపిస్తుంది. మరి గాలి రూపంలో ఉండే ఆక్సిజన్ శరీరానికి ఎలా అందుతుందనేగా మీ అనుమానం? ఆ ఆక్సిజన్‌ను సరఫరా చేసేది వాహకం రక్తమే. కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన పోషకాలు, హార్మోన్లకు సైతం సరఫరా చేస్తుంది. అయితే, మనం తినే ఆహారం, మన అలవాట్లు సక్రమంగా ఉన్నప్పుడు రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. ప్రవాహానికి కూడా ఎలా ఆటంకాలు ఉండవు. 2. రోజూ వ్యాయామం చేయాలి వ్యాపారం లేదా ఉద్యోగరీత్యా ఎక్కువ సేపు కుర్చొనే వ్యక్తులు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. వాకింగ్ చేయడానికి సమయం లేనట్లయితే.. ఇంట్లో యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాసక్రియలో సమస్య లేనప్పుడే.. రక్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. 3. చక్కగా నిద్రపోండి నిద్ర సమయంలోనే శరీరంలో కణజాలంలో మార్పులు జరుగుతుంటాయి. కణాల పుననిర్మాణానికి అవసరమైన హార్మోనులు విడుదలవుతాయి. నిద్ర సమయంలో శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల పెద్దగా పని ఉండదు. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తుంటాయి. కాబట్టి ప్రతీ రోజూ తప్పనిసరిగా కంటి నిండా నిద్రపోండి. 4. బీట్రూట్ జ్యూస్ తాగండి లేదా తినండి బీట్రూట్లో శరీరానికి మేలు చేసే ఫైబర్, ఫొలేట్, విటమిన్ ఆ9, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, విటమిన్‌ఇ ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించడాన్ని అరికడుతుంది. బీట్రూట్ను ఆహారంగా గానీ, జ్యూస్‌గా గానీ తీసుకోవచ్చు. 5. నీళ్లు ఎక్కువగా తాగండి శరీరంలో ఎన్నో రకాల విషతుల్యాలు (టాక్సిన్) ఉంటాయి. అవన్నీ బయటకు పోవాలంటే తప్పకుండా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే చాలు శరీరం టాక్సిన్లు విసర్జించి రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 6. తులసి ఆకులు తులసి ఆకులు, విత్తనాల్లో విటమిన్-కె , ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, రక్త శుద్ధికి, వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచివి. 7. పసుపు తప్పనిసరి భారతీయులు పసుపును శుభ సూచకంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో కుర్కుమీన్ శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. అందుకే, మీరు తినే ఆహారంలో తప్పకుండా పసుపు ఉండేలా చూడండి. 8. ఆకుకూరలు ఎక్కువగా తినండి పచ్చని ఆకు కూరలతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకోండి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 9. నిమ్మరసం మంచిది కాలేయంలోని టాక్సిన్లను తొలగించాలంటే నిమ్మరసం తాగాల్సిందే. రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండుకుని తాగితే రక్త సరఫరా మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. 10. ఉసిరి తినండి ఇటీవల ఉసిరి వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వికులు ఏదో ఒక రూపంలో ఉసిరిని ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఇది దొరకడమే గగనమైపోయింది. ఒక వేళ మీకు ఉసిరి దొరికితే అస్సలు వదలొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫిటో న్యూట్రియంట్లు, విటమిన్ ఈ, సీ పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా శుద్ధి చేస్తుంది. 11. అల్లం వెల్లులి మంచిది మన వంటకాల్లో అల్లం వెల్లులి ప్రాధాన్యం తెలిసిందే. ఇవి నోటికి రుచే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వెల్లులిలో అనేక న్యూట్రియంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, ఐరన్, విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటాయి. వెల్లులి రక్తపోటును అదుపులోకి ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అల్లంలో విటమిన్ C, B3, B6, మెగ్నీషియం ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 12. బ్లాక్ కాఫీ తాగండి రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయమే. కాబట్టి.. ఇది సక్రమంగా పనిచేస్తేనే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధిగా ఉంచుతాయి. ఇందులో ఇంకా విటమిన్ B2, B3 కూడా ఉన్నాయి. మెగ్నీషియం, పోటాషియం, మ్యాంగనీస్‌లు కూడా శరీరానికి అందుతాయి. 13. ఇవి కూడా మంచివే రక్తంలో ఐరన్ లోపిస్తే బెల్లం తీసుకోండి. ఒమెగా 3 ఎక్కువగా ఉండే సోయాబీన్, చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌ను తప్పకుండా తీసుకోండి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు చదవండి: 37 Days Challenge: అతడి విజయ రహస్యమిదే! చెడు అలవాట్లకు దూరంగా.. ఇంకా ఇలా చేశారంటే! Suman Kalyanpur Facts: సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు ఎట్టకేలకు.. -
జుట్టు నిగనిగల కోసం... ఆవనూనె, మెంతి పొడి, ఉసిరి పొడి.. ఇంకా
Hair Care Tips: నల్లని నిగనిగలాడే ఒత్తైన కురులు కావాలని కోరుకోని అమ్మాయి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లు ఈ చిన్న చిట్కాతో నల్లటి జుట్టు సొంతం చేసుకోవచ్చు. ఆవనూనె, మెంతి పొడి.. ఇంకా ►ఇనుప మూకుడు తీసుకుని దానిలో టీకప్పు ఆవనూనె, మరోకప్పు కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదా మెంతులు, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, అరకప్పు ►గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు సన్నని మంట మీద ఈ మూకుడు పెట్టి పదినిమిషాల పాటు మరగనివ్వాలి. ఆయిల్ రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి దించి పక్కనపెట్టుకోవాలి. ►చల్లారిన తర్వాత దీనిని ఒక శుభ్రమైన పొడి సీసాలో పోసుకుని ఒక పూటంతా పక్కన పెట్టాలి. ►దీనిని రోజూ తలకు రాసుకోవాలి. ►ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. ►రోజూ వాడటం ఇష్టం లేనివాళ్లు వారానికి ఒకటి రెండుసార్లు తలకు పట్టించి రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ►ఈ ఆయిల్‌ను వాడటం వల్ల నల్లని ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి. చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! -
Health Tips: ఉసిరి టీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
Health Tips In Telugu- Amla Tea: కొందరికి రెండు గంటలకోమాటు టీ తాగడం అలవాటు. అయితే మధుమేహం ఉన్నవారు పంచదార వేసిన టీ తాగకూడదు. కానీ టీ అలవాటు ఉన్నవారు టీకి బదులు పంచదార కలపని టీ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఉసిరి టీ తాగితే ఇటు టీ తాగాలన్న కోరిక తీరడంతోపాటు.. విటమిన్ సి, పీచుపదార్థం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి టీని ఎలా తయారు చేసుకోవాలంటే... ►రెండు ఉసిరికాయలు, అరంగుళం అల్లం ముక్క తీసుకోవాలి ►ఈ రెండింటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. ►గ్లాసు నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టి గింజలు తీసేసిన ఉసిరి, అల్లం ముక్కలను దానిలో వేసి మరిగించాలి. ►ఇవి మరిగాక నీళ్లలో అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి స్టవ్ ఆపేసేయాలి. ►ఈ నీళ్ల గిన్నెపై మూతపెట్టి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►తరువాత వడగట్టి టీలా తాగాలి. ►ఈ టీని రోజూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బరువు తగ్గొచ్చు! ►ఉసిరి, అల్లం తాజాగా అందుబాటులో లేనప్పుడు.. కప్పు నీళ్లను వేడిచేసి దానిలో స్పూను ఉసిరిపొడి, స్పూను సొంఠి పొడి, అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. ►ఈ నీళ్లపై మూతపెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి. ►నీళ్లు బాగా మరిగాక దించేసి తాగే వేడికి వచ్చాక వడకట్టకుండా నేరుగా తాగాలి. ►దీనిని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందని.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్ తినడం వల్ల.. -
రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఉసిరి!.. ఆమ్ల క్యాండీ తయారీ ఇలా
ఆరోగ్యసిరినిచ్చే ఉసిరితో ఆమ్ల క్యాండీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోండి. ఆమ్ల క్యాండీ తయారీకి కావలసినవి: ►ఉసిరి కాయలు – 250 గ్రాములు ►చక్కెర – 150 గ్రాములు ►జీలకర్ర పొడి– టీ స్పూన్ ►శొంఠి పొడి– టీ స్పూన్ ►చక్కెర పొడి –2 టీ స్పూన్లు ►ఫుడ్ కలర్ – చిటికెడు (ఇష్టమైతేనే). తయారీ: ►ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి. ►ఒక పాత్రలో వేసి కాయలు మునిగేటట్లు నీటిని పోసి మరిగించాలి. ►నీరు మరిగిన తర్వాత ఉసిరికాయలను వేసి రెండు నిమిషాలు మరిగించిన తర్వాత పాత్రను స్టవ్ మీద నుంచి దించి నీటిని వంపేయాలి. ►ఉసిరికాయలను కట్ చేసి గింజలను తీసివేయాలి. ►ఉసిరి పలుకులలో జీలకర్ర, అల్లం పొడి, చక్కెర వేసి పాత్రకు మూతపెట్టి పక్కన పెట్టాలి. ►మరుసటి రోజుకు చక్కెర కరిగి ఉసిరి పలుకులు చక్కెర ద్రావణంలో తేలుతుంటాయి. ►మూడవ రోజుకు చక్కెర ద్రావణాన్ని ఉసిరి పలుకులు దాదాపుగా పీల్చుకుంటాయి. ►మూడవ రోజు ఉదయం ఉసిరి ముక్కలను ఒక పాలిథిన్ షీట్ మీద వేసి ఆరనివ్వాలి. ►తేమ పూర్తిగా పోవాలంటే రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ►తగినంత ఎండ లేకపోతే మూడవరోజు కూడా ఆరబెట్టాల్సి ఉంటుంది. ►చివరగా చక్కెర పొడిలో ఫుడ్ కలర్ కలిపి ఆ పొడిని ఎండిన ఉసిరి పలుకుల మీద చల్లాలి. వీటిని గాలిచొరని సీసాలో నిల్వ చేసుకుని రోజుకొకటి తినవచ్చు. ఆరోగ్య లాభాలు ►ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తాయి. ►నోరు రుచిలేనట్లు ఉన్నప్పుడు భోజనానికి గంట ముందు ఒక పలుకు తింటే రుచిగ్రంథులు ఉత్తేజితమవుతాయి. ►గర్భిణికి కడుపులో వికారం తగ్గిస్తుంది. చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల ఇవి కూడా ట్రై చేయండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా -
Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం తినొద్దు!
ఇటీవలి కాలంలో మానసిక వ్యాధులు అధికం అవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటినుంచి ఎక్కువ గారాబంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదయినా అనుకోని సంఘటనలు ఎదుర్కొనవలసి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.... మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏయే పదార్థాలు తీసుకోవాలి, ఏయే పదార్థాలు తీసుకోకూడదో చూద్దాం. Foods That Boost Mental Health: ఇవి తీసుకోవాలి ►ఎక్కువ పాలిష్ చేయని బియ్యం ►ముడి పెసలు ►తాజా పాలు ►నెయ్యి ►గోధుమలు ►వెన్న ►బూడిద గుమ్మడికాయ ►పరిశుభ్రమైన ఆహారం ► సీజనల్ పండ్లు, కూరగాయలు ►ద్రాక్ష ►దానిమ్మ ►ఉసిరి ►చేపలు ►కొవ్వు ఎక్కువగా ఉండని మాంసం ►యాపిల్ ►ఆర్గానిక్ ఎగ్స్. మానేయవలసినవి ►కలుషిత ఆహారం అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం ►రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ ►కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం (దీనివల్ల న్యూరోట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుంది) ►స్మోకింగ్, గుట్కాలు తినడం ►ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటం ►ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం ►డీప్ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ►అధికంగా పుల్లగా ఉండే పదార్థాలు (పులియబెట్టినవి, వెనిగర్ లాంటివి) ►అతి కష్టంమీద జీర్ణమయ్యే ఆహారం ►బూజు పట్టిన, పాడైన, కుళ్లిన ఆహారం తీసుకోవడం ►అధికంగా తినడం, తీసుకున్న ఆహారం అరగకముందే మళ్లీ తినడం ►పాలు–గుడ్డు లేదా చేపలు, వేడి–చల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం, పండ్లు–పాలు కలిపి తీసుకోవడం. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి
నగరి/విజయపురం(చిత్తూరు జిల్లా): సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడినిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయం అందిస్తోంది. తెగుళ్ల బెడద నుంచి కాపాడుతోంది. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తోంది. మరోవైపు ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇది ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగపడుతోంది. అధిక దిగుబడితోపాటు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చదవండి: జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ! పండించే పంట దిగుబడి లేదని, దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో మంచి ధర పలకలేదని, నేల సారవంతంగా లేదని.. ఇలా రకరకాల కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. అయితే వ్యవసాయంలో ఆశించిన లాభాలు చూడలేమని నీరసించిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కురిపిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది. ఆయుర్వేద ఔషధం ఆయుర్వేద వైద్యంలో ఉసిరే కీలకం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలైనా నాటాలని పూర్వీకులు చెబుతారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి–విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. కరోనా పుణ్యమా అని దీనిపై అందరికీ అవగాహన పెరిగింది. అయితే సి విటమిన్ ఎక్కువగా ఉండే వాటిలో ప్రథమ స్థానం ఉసిరికే దక్కుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఉసిరి రైతులు లాభాలను కూడా మెండుగా అందిస్తోంది. 200 ఎకరాల్లో సాగు విజయపురం మిట్టూరు, శ్రీహరిపురం, కాకవేడు ప్రాంతాల్లోని రైతులు ఉసిరి పంటను సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఉసిరి సాగవుతోంది. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకునే రైతులు ఈ ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఒక్క సారి సాగు చేసి మొక్కలు నాటితే రెండేళ్లకు కాత వచ్చి ఏడాదికి రెండు సార్లు ఫల సాయం అందుతోంది. ఎకరాకు 200 చెట్లు నాటి సాగుచేసిన రైతులు చెట్టు పెరుగుదలను అనుసరించి ఎకరాకు రెండు నుంచి 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. ఒక్క సారి మొక్కలు నాటితే 30 నుంచి 40ఏళ్ల వరకు ఫలసాయం అందుతుందని ఉద్యానవన అధికారులు తెలుపుతున్నారు. ఉసిరి చెట్టు నీటి కొరతను చాలా వరకు తట్టుకుంటుంది. చీడపీడలు, తెగులు ఎక్కువగా ఆశించదు. ఈ కారణంగా సాగు ఖర్చు తగ్గుతుంది. రాబడిలో ఖర్చు 10 శాతం మాత్రమే ఉంటుంది. డిమాండ్‌ను బట్టి టన్నుకు రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు ధర పలుకుతుంది. నగరి, విజయపురం మండలాల్లో సాగుచేసే ఉసిరి మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, తెనాలితో పాటు తమిళనాడు, తెలంగాణలని ఫ్యాక్టరీలకు రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు తరలి వెళ్లే ఉసిరితో మందులు, సిరప్లు, ఆయిల్, సోపు, ఊరగాయలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు. లాభాలనిస్తోంది.. పదిహేనేళ్ల నుంచి ఉసిరి సాగు చేస్తున్నాను. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకున్నా. ఇప్పటి వరకు ఆ చెట్లే ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఏడాదికి రెండు సార్లు కాపు వస్తోంది. తెగుళ్లు, చీడపీడల సమస్య ఎక్కువగా ఉండదు. పంట మధ్య కలుపు పెరగకుండా చూసుకుంటూ, చెట్లను పరిశీలించి తెగులు ఎక్కడైనా కనిపిస్తే మందులు స్ప్రే చేసుకుంటే చాలు. మంచి దిగుబడి చూడవచ్చు డిమాండ్‌ను అనుసరించి ఎకరాకు రూ.లక్ష వరకు లాభం ఉంటుంది. – జయరామరాజు, మిట్టూరు, విజయపురం మండలం. అవగాహన కల్పిస్తున్నాం నగరి, విజయపురం మండలాల్లో 15 యేళ్ల క్రితం నుంచి ఉసిరి పంట సాగవుతోంది. మెలమెల్లగా ఉసిరి సాగులో లాభాలను చూసిన రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉసిరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగులో నష్టాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. ఒక్క సారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడిని అందిస్తుంది. ప్రస్తుతం ఉసిరికి మార్కెట్లో ఎక్కువగా డిమాడ్ ఉంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు 18 వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది. – లోకేష్, ఉద్యానవన అధికారి, నగరి -
రసాయనాలు వాడకుండా ఇంట్లోనే షాంపు తయారు చేసుకోవచ్చు.. అదెలాగంటే..
కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, సరిగా పట్టించుకోకపోవడం, రసాయన షాంపుల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా విపరీతంగా జుట్టు రాలడం, త్వరగా రంగు మారడంతోపాటు, వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు ఇంట్లోనే ఎంచక్కా ఎటువంటి రసాయనాలు వాడకుండా షాంపు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ► ఉసిరి పొడి, కుంకుడు కాయలు, శీకాకాయ, మెంతులను వందగ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని బాగా ఎండబెట్టాలి. ► తడిలేకుండా ఎండిన తరువాత అన్నింటిని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ► ఉదయం దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి. ► అరగంట తరువాత చల్లారనిచ్చి వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఈ నీటిని షాంపుగా వాడుకోవాలి. ► ఈ షాంపు తలలో అధికంగా ఉన్న ఆయిల్, దుమ్ము దూళిని వదిలించి కుదుళ్లకు పోషణ అందిస్తుంది. ► ఈ షాంపుని క్రమం తప్పకుండా వాడితే జుట్టురాలడం తగ్గి, కొత్త జుట్టువస్తుంది. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు ►ఐదారు ఉల్లిపాయ తొక్కలు, వందగ్రాముల మెంతులు, యాభై గ్రాముల అలోవెరా జెల్, యాభై గ్రాముల టీ పొడి, విటమిన్ ఈ క్యాప్య్సూల్ ఒకటి, బేబి షాంపు యాభై గ్రాములు తీసుకోవాలి. ► ఉల్లిపాయ తొక్కలు, మెంతులు, టీ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మరిగించాలి. అన్ని మరిగి, నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ► చల్లారాక ఈ నీటిని సీసాలో వేసి విటమిన్ ఈ క్యాప్సూయల్, అలోవెరా జెల్, బేబి షాంపు వేసి బాగా షేక్ చేయాలి. ►పదిగంటలపాటు కదల్చకుండా పక్కన పెట్టేయాలి. తరువాత దీనిని షాంపులా వాడుకోవచ్చు. ► ఈ షాంపు జుట్టుకు పోషణ అందించడంతోపాటు, చుండ్రును దరిచేరనివ్వద్దు. ► ఉల్లిపాయ తొక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, మందంగా పెరిగేలా చేస్తాయి. చదవండి: రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్ రుచి చూడాల్సిందే.. -
రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల
ఏ విద్యలో అయినా ఫలానా వారు బాగా నిష్ణాతులు అని చెప్పడానికి వారికి అది కరతలామలకం అని అనడం తెలుసు కదా... ఆమలకం అంటే ఉసిరికాయ. కరతలం అంటే అరచేయి. అంటే అరచేతిలో ఉసిరికాయలా అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, అరచేతిలో ఉసిరికాయ ఉంటే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుందని. అవేమిటో చూద్దాం. ►ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరిని మించిన మందు మరొకటి లేదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ►రోజూ ఓ ఉసిరికాయని తింటే శ్లేష్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. కంటి సమస్యలకి ఉసిరి చాలా మంచిది. ►ఉసిరికాయల్ని ముద్దగా చేసి తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయట. ►ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా చేయడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది. ►ఆయుర్వేదమే కాదు, అల్లోపతీ కూడా ఉసిరిని ఔషధ సిరి అని కొనియాడుతుంది. ఎందుకంటే ఉసిరిలోని యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాల వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ స్రావాన్ని పెంచడం ద్వారా చక్కెర నిల్వల్ని తగ్గించి హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుందనీ తేలింది. కొన్నిరకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరికి ఉన్నాయి. ►రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అనేకం. అందుకే మన దేశంలో అధికంగా పండే ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, ట్యాబ్లెట్ల రూపంలో నిల్వచేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. కురులకు ఉ‘సిరి’ ►కురుల సంరక్షణకు ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో బాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఉసిరితో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి బాల నెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. అలాగే ఇందులోని సి–విటమిన్ ఎండ నుంచీ, చర్మరోగాల నుంచీ కాపాడటమే కాదు, శరీరానికి మంచి మెరుపునీ ఇస్తుంది. ►రోజూ ఓ ఉసిరికాయని తింటే కాల్షియం ఒంటికి పట్టడం పెరుగుతుంది. దాంతో ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మరి... తాజాగా, ఎండు పండుగా, ట్యాబ్లెట్గా లేదా పొడి రూపంలో–ఎలా తీసుకున్నా ఉసిరి... అందాన్నీ ఆరోగ్యాన్నీ సంరక్షించే అద్భుత ఔషధ సిరి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
Beauty Tips: ఈ సమయంలో హెయిర్ డ్రయ్యర్ అస్సలు వాడకూడదు!
Amazing Beauty And Kitchen Tips In Telugu Hair Care And Face Pack: సి విటమిన్ పుష్కలంగా కలిగి ఉండే ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఉసిరి పేస్టుతో అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా? ►రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్టులో టేబుల్ స్పూను పెరుగు, టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. రెగ్యులర్‌గా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద, మెడ మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుతుంది. చర్మంపై ముడతలు తొలగించుకోవచ్చు! ►రెండు టేబుల్ స్పూన్ల తాజా అలోవెరా జెల్లో, టేబుల్ స్పూను తేనె, టేబుల్ స్పూను గంధం పొడి వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖం, మెడకు అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవాలి. దీనివల్ల అలోవెరా జెల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి. గంధం పొడి మొటిమలను తగ్గించడమేగాక, చర్మంపై ఉన్న ముడతలను తొలగిస్తుంది. ►ఉసిరికాయ ముక్కలను నాలుగురోజుల పాటు నీడలో ఎండబెట్టాలి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి రంగు మారేంత వరకు మరిగించాలి. నూనె చల్లారాక తరువాత తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శీతాకాలంలో అస్సలు ఇలా చేయొద్దు ►చలికాలంలో జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో హెయిర్ స్టైల్ కోసం ఎటువంటి హెయిర్ స్టైలింగ్ స్టూల్స్‌ను వాడకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్ డ్రైయ్యర్‌ను వాడకూడదు. కిచెన్ టిప్స్: ►వంటనూనెలో లవంగాలు వేసి ఉంచితే పాడవకుండా ఎక్కువకాలం ఉంటుంది. ►పచ్చిబటానీలను ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి. ►చపాతీ పిండిలో ఉడికించిన బంగాళదుంపను కలపాలి. ఈ పిండితో చపాతీలు చేస్తే చపాతీలు మృదువుగా ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. ►పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో టీ స్పూను నెయ్యి కలపాలి. ►చెక్కతో చేసిన గరిటెలు, చెంచాలు వాసన వస్తుంటే.. వెనిగర్ కలిపిన నీటిలో కాసేపు నానబెట్టి తరువాత కడిగి వాడుకోవాలి. -
ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు!
మీ వయసు కంటే పదేళ్ల పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? పని ఒత్తిడి, కాలుష్యం కారణమేదైనా.. చర్మంపై ముడతలు, మచ్చలు, నల్లని వలయాలు, మృతకణాలు ఏర్పడి చర్మాన్ని జీవం కోల్పోయేలా చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్ ఫ్యాక్ ద్వారా మీ చర్మానికి తిరిగి జీవం పోయొచ్చంటున్నారు బ్యూటీషియన్లు. మందారం, ఉసిరిలతో ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. కావల్సిన పదార్ధాలు ►1 మందారం పువ్వు లేదా 2 టేబుల్ స్పూన్ల మందారం పువ్వు పొడి ►1 టేబుల్ స్పూన్ తేనె ►2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి లేదా 1 మీడియం సైజు ఉసిరి కాయ తయారీ ఇలా ►మందారం పువ్వు పొడి లేనట్లయితే ఒక మందారం పువ్వును ఒక రాత్రంతా నానబెట్టి మెత్తగా గ్రేండ్ చెయ్యాలి. ►అలాగే ఉసిరి పొడి అందుబాటులో లేకపోతే మీడియం సైజు ఉసిరి కాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ►వీటికి తేనె జోడించి అన్నింటినీ బాగా కలుపుకుంటే ఫేస్ ప్యాక్ రెడీ. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఎలా అప్లై చేయాలంటే.. 5-7 నిముషాలు ముఖానికి ఆవిరిపట్టించాలి. ఇలా చేయడం ద్వారా చర్మ గ్రంధులన్నీ తెరచుకుంటాయి. ఫలితంగా ఫేస్ ప్యాక్‌లో ఉన్న అన్ని పధార్థాలు చర్మంలోకి చొచ్చుకుని పోయి రెట్టింపు ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖం అంతటా ఫ్యాక్‌లా వేసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని, చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇవీ ప్రయోజనాలు.. వారానికి కనీసం ఒక్కసారైనా ఈ ఫేస్ ప్యాక్ వాడితే, దీనిలోని విటమిన్ సి, చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, తడిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడి, చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే మందారం పువ్వు చర్మంలోని మృతకణాలను, మురికిని తొలగించి కాంతివంతం చేస్తుంది. నల్లని వలయాలను, ముడతలను కూడా నివారిస్తుంది. చదవండి: Health Tips: గుడ్డు, బీట్రూట్, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్ లోపాన్ని తరిమేద్దాం..! -
ఇమ్యూనిటి బూస్టింగ్ డ్రింక్ తయారు చేసుకోండిలా!
తాజాగా ఉన్న మునగాకులను అరకప్పు తీసుకుని దానిలో విత్తనం తీసేసిన పచ్చి ఉసిరికాయను ముక్కలుగా కోసి వేయాలి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో అరగ్లాసు నీళ్లు పోసి జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత జ్యూస్‌ను వడగట్టి రోజూ పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మునగ ఆకులు అందుబాటులో లేనివారు, వీటికి బదులు కొత్తిమీర, పుదీనాను వాడ వచ్చు. ఉసిరి కాయ లేకపోతే మునగ ఆకుల పేస్టులో నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఇమ్యూనిటీ పేస్ట్! నాలుగు కరివేప ఆకులు, తులసి ఆకులు నాలుగు తీసుకుని మెత్తని పేస్టులాగా నూరుకోవాలి. ఈ పేస్టుని ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోని తినాలి. రోజూ ఏదోక సమయంలో ఈ పేస్టు తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది. బ్యూటిప్స్ బ్లాక్ హెడ్స్, మృతకణాలు తొలగిపోతే ముఖవర్ఛస్సు పెరుగుతుంది. ఈ రెండింటిని తొలగించుకోవడానికి.. ఒక అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దీనిలో బరకగా పొడిచేసుకున్న ఒక స్పూన్ ఓట్స్, స్పూను తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఎనిమిదో నంబర్ ఆకారంలో గుడ్రంగా, పైనుంచి కిందకు, కింద నుంచి పైకి మర్దనా చేసుకుని పది నిమిషాలపాటు అలా వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్‌హెడ్స్ పోయి ముఖం మెరుస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. -
జుట్టు సమస్యకు రవీనా టండన్ చిట్కాలివే ..
ముంబై: పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందిన బాలీవుడ్ నటి రవీనా టండన్ తాజాగా జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి ఓ చిట్కా చెప్పింది. ప్రస్తుత ప్రపంచంలో జుట్టు రాలడమనేది అతి పెద్ద సమస్య. అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉన్నాయి. కాగా రవీనా వరుసగా బ్యూటీ సిరీస్ పేరుతో ఆరోగ్య చిట్కాలను చెప్పనున్నారు. ప్రస్తుతం జట్టు సమస్యతో బాధపడుతున్న వారికి స్వాంతన కలిగించే చిట్కా చెప్పారు. ఎన్ని కెమికల్స్ వాడినా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని, కొద్ది రోజుల తర్వాత జుట్టు సమస్యతో బాధపడుతుంటారని రవీనా తెలిపింది. కాగా ప్రతి రోజు కొన్ని ఉసిరికాయలను(ఆమ్లా)తినడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చని పేర్కొంది. జట్టు రాలడాన్ని నివారించే రవీనా ఉసురికాయ(ఆమ్లా) మిశ్రమం: మొదట ఓ కప్పు పాలలో కొన్ని ఉసురుకాయాలను వేయాలి. ఆ తర్వాత ఉసిరి మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. కాగా బయట ఉన్న ఉసురి పోరలను తీసి వేస్తే గుజ్జు వస్తుంది. ఆ గుజ్జను జుట్టుకు మర్దన చేశాక, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రపరచాలి. ఈ పద్దతిని మీరు పాటించగలిగితే త్వరలోనే షాంపో వాడకాన్ని తగ్గించవచ్చని రవీనా టండన్ తెలిపింది. (చదవండి: వచ్చే జన్మలో కూడా ఖాళీ లేదు) -
ఆహా! ఆవకాయ
పచ్చళ్ల సీజన్ వచ్చేసింది.. మార్కెట్లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు. సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి పచ్చళ్లు ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్‌కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల ముందు చూపు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్డౌన్ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు. నిరుపేదలకు ఉపాధి.. వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్ తెలిపాడు. లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు -
చుండ్రుకు ఉసిరి
కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి. ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను ఉసిరితో తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి నీళ్లలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మాడుకు పట్టించి, జుట్టును తడపాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. చుండ్రు కూడా తగ్గుతుంది. -
ఆమలకం అత్యుత్తమం
ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవటం ఆరోగ్యానికి అవసరం. శరదృతువులో వచ్చే కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వన భోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ క్రమంగా ఫలంగా మారి బలీయమైన గుణధర్మాలు కలిగి ఉంటుంది. సంస్కృతంలో ఆమలకీ, అమృతఫల, శ్రీఫల, శివ మొదలైన పేర్లతో పిలుస్తారు. గుణధర్మాలు: దీని రుచి షడ్రసాలలో ఉప్పు మినహా తక్కిన ఐదు (తీపి, పులుపు, కటు, తిక్త, కషాయ రసాలు) కలిగి ఉంటుంది. ప్రధానంగా నోటికి తగిలేది పులుపు, తీపి, వగరు, త్రిదోష (వాత, పిత్త, కఫ) శ్యామకం. వివిధ ఔషధ రూపాలు: పచ్చిగా రసం తీసినా, ఎండబెట్టి వరుగులు చేసినా, గింజలు తీసేసి, ఎండిన వరుగులను చూర్ణం చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా నిల్వ ఉండే ఊరగాయగా మలచినా, కొంచెం వేడి చేసినా, దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. విశిష్ట ఔషధ ప్రయోగాలు: వయస్థాపకం (ముసలితనాన్ని రానీయదు), వృష్యం (శుక్ర కరం), రసాయనం. (సప్త ధాతు పుష్టికరం): ప్రతిదినం రెండు చెంచాల ఉసిరిక రసం ఒక చెంచా తేనెతో సేవించాలి. ఇది మెదడుకి పదును పెట్టి తెలివితేటలు పెంచుతుంది. జ్వరాలు: ఉసిరికాయల రసాన్ని నేతితో వేడి చేసి సేవించాలి. ఆకలి కలగడానికి: ఉసిరికాయలకు నెయ్యి, జీలకర్ర, ఇంగువ చేర్చి, నేతితో ఉడికించి తినాలి. అర్శస్ (పైల్స్/మూల శంక): మజ్జిగలో తిప్ప తీగ, ఉసిరిక రసాలను కలిపి తాగాలి. ఉసిరిక చూర్ణానికి కరక్కాయ, తానికాయ చూర్ణాలను కూడా కలిపి సేవించాలి (త్రిఫల చూర్ణం) కామెర్లు (జాండిస్): ఉసిరిక రసం + ద్రాక్ష రసం ముక్కులోంచి రక్తస్రావం (ఎపిన్టాక్సిన్): ఉసిరి కాయల ముద్దను నేతితో కలిపి వేడి చేసి తలపై పట్టించాలి. బొంగురు గొంతు: ఉసిరిక రసం + పాలు ఎక్కిళ్లు (హిక్క): ఉసిరిక రసం + వెలగ కాయ, పిప్పళ్ల చూర్ణం + తేనె దగ్గు: ఆమలకీ చూర్ణం + పాలు, నెయ్యి మూర్ఛ: ఉసిరిక చూర్ణ కషాయం + తేనె హృదయ రోగాలు: చ్యవనప్రాశ, అగస్త్య లేహ్యాలు (వీటిలో – ఆమలకీ ప్రధాన ద్రవ్యం) వాంతులు: పెసరపప్పుతో జావ కాచి, చల్లార్చి, ఉసిరిక రసం కలిపి సేవించాలి. ఉసిరి వలన తగ్గే ఇతర రోగాలు: దద్దుర్లు, దురదలు, మచ్చల వంటి అనేక చర్మరోగాలు; తెల్లబట్ట వంటి స్త్రీ రోగాలు, మూత్ర రోగాలు (ప్రమేహ): శృంగార సమస్యలను తొలగించే వాజీకరణం కూడా. శిరోజాలకు మంచిది. కంటి చూపునకు చాలా మంచిది. ఆధునిక శాస్త్రం రీత్యా పోషక విలువలు: పీచు అధికంగా ఉండి శక్తి వర్ధక పోషకాలు కలిగి ఉంటుంది. విటమిన్ సి ప్రధానంగా అన్ని విటమినులూ ఉంటాయి. క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీసు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ వంటి లవణాలన్నీ పుష్కలంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు అతి తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి క్యాన్సరును దూరం చేస్తుంది. అతి ముఖ్య సారాంశం... అధిక పుష్టినొసగు అన్ని యంగములకు సర్వరోగ హరము వయస్థాపకంబు అన్ని వయసుల వారికిన్ అమృత సమము ఉత్తమోత్తమ ద్రవ్యంబు ఉసిరి ఫలము. డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
ఉసిరి కొసిరి కొసిరి వడ్డించండి
కార్తీక మాసం ఉత్సవ మాసం. ఒకవైపు నాలుకపై శివనామ స్మరణం.. మరోవైపు జిహ్వకు ఉసిరి భోజనం... ఆధ్యాత్మికత మానసిక ఆరోగ్యం ఇస్తుంది. ఉసిరి సిరి శారీరక ఆరోగ్యం ఇస్తుంది జిహ్వకు సరికొత్త సత్తాని కూడా ఇసు ్తంది... అందుకే కొసిరి కొసిరి వడ్డించండి... ఆమ్ల గోలీ కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; బెల్లం – 150 గ్రా.; వాము – పావు టీ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఆమ్చూర్ పొడి – అర టీ స్పూను; నల్ల ఉప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – కొద్దిగా. తయారీ: ►శుభ్రంగా కడిగిన ఉసిరికాయలకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ►రెండు విజిల్స్ వచ్చాక దింపి, చల్లారాక నీళ్లు వేరు చేయాలి ►ఉసిరికాయల నుంచి గింజలు వేరు చేసి, కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద పాన్ వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, ఉసిరికాయ ముద్దను వేసి కలపాలి ►బెల్లం పొడి జత చేసి సుమారు ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి ►వాము, ఇంగువ, వేయించిన జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, నల్ల ఉప్పు, ఉప్పు జత చేసి బాగా కలిపి దింపేయాలి ►కొద్దిగా చల్లారాక గోళీలుగా చేసి, పంచదార పొడిలో దొర్లించి, బాగా ఆరిన తరవాత గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ట్రెజర్ హంట్ కావలసినవి మైదా పిండి – 50 గ్రా.; జొన్న పిండి – 50 గ్రా.; ఉసిరికాయ తురుము – పావు కప్పు, బెల్లం తురుము – అర కప్పు; తేనె – పావు కప్పు ; వెనిగర్ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను; ఎగ్‌లెస్ కేక్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – పావు కప్పు; పాలు – అర కప్పు; నీళ్లు – అర కప్పు. తయారీ ►ఒక పాత్రలో అన్ని పదార్థాలను వేసి ఎక్కువసేపు బాగా కలపాలి ►ఈ మిశ్రమాన్ని కేక్ కంటెయినర్లో పోసి, సమానంగా పరవాలి ►అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ►కేక్ కంటెయినర్‌ను అందులో ఉంచి, సుమారు అర గంట సేపు బేక్ చేశాక తీసి, చల్లారాక కట్ చేసి అందించాలి. ఆమ్ల గ్రీన్ చిల్లీ పికిల్ కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; తాజా పచ్చి మిర్చి – పావు కేజీ; ఆవ పొడి – ఒక కప్పు; ఆవ నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత, పసుపు – 2 టీ స్పూన్లు ఇంగువ – ఒక టీ స్పూను. తయారీ: ► ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి ఉసిరికాయలు, పచ్చి మిర్చి కాయలను శుభ్రంగా కడగాలి ►పచ్చి మిర్చిని మధ్యకు కట్ చేయాలి (గుత్తి వంకాయ మాదిరిగా) ►కుకర్‌లో అర గ్లాసు నీళ్లు, ఉసిరి కాయలు వేసి మూత ఉంచి, స్టౌ మీద పెట్టి, ఒక విజిల్ వచ్చాక దింపేయాలి ►బాగా చల్లారాక ఉసిరి కాయలలోని గింజలను వేరు చేయాలి ►తరిగిన పచ్చి మిర్చి, ఉసిరి ముక్కలు, పసుపు, ఆవ పొడి, ఉప్పు ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ►స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపాక, సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడి మీద పోసి, బాగా కలియబెట్టాలి ►ఈ మిశ్రమాన్ని రెండు రోజులు ఎండబెట్టాలి ∙గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలో, కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఆమ్ల స్వీట్ అండ్ హాట్ పికిల్ కావలసినవి: ఉసిరి కాయ ముక్కలు – పావు కేజీ; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; నువ్వు పప్పు నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 10; కరివేపాకు – 3 రెబ్బలు; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – అర టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెల్లం పొడి, ఉసిరి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలపాలి ►తడి బయటకు వస్తుంటే, మంట బాగా తగ్గించి, మరో రెండు నిమిషాలు ఉడికించి, మరోపాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద మరో బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు, వెల్లుల్లి రేకలు వేసి బాగా కలపాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక, ఎండు మిర్చి జత చేసి కలిపి దింపేయాలి ►సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడిలో ఈ మిశ్రమం, ఉప్పు, మిరపకారం వేసి బాగా కలపాలి ►ఒక గంట తరవాత వేడి వేడి అన్నంలోకి తింటే రుచిగా ఉంటుంది ►రోటీలలోకి కూడా బాగుంటుంది. ఆమ్ల క్యారట్ జ్యూస్ కావలసినవి: క్యారట్ – పావు కేజీ; ఉసిరి కాయలు – 4, అల్లం తురుము – అర టీ స్పూను, తాజా నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; తేనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్ క్యూబ్స్ – తగినన్ని. తయారీ: ►క్యారట్లను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి, కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ►మిక్సీలో క్యారట్ ముక్కలు, అల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, వడ కట్టి, రసం వేరు చేయాలి ►ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, గింజలను వేరు చేసి, కాయలను సన్నగా తురమాలి ►తగినన్ని నీళ్లు, ఉసిరి కాయ తురుములను మిక్సీలో వేసి మెత్తగా చేసి, వడకట్టి, నీరు వేరు చేసి పక్కన ఉంచాలి ►ఒకపెద్ద పాత్రలో క్యారట్ రసం, ఉసిరి రసం పోసి, తేనె జత చేసి బాగా కలపాలి ►ఐస్ క్యూబ్స్ జత చేసి చల్లగా అందించాలి. -
సిగనిగలు
వైట్ హెయిర్ రావడానికి అనేక కారణాలు. అయితే ఈ సమస్యను నేచురల్ పద్ధతిలో శాశ్వతంగా నివారించుకోవచ్చట. అది కూడా మన వంటగదిలో చౌకగా లభించే వస్తువులతోనే. అందుకోసం ఈ టిప్స్ ఫాలో అయితే సరి... గోధుమలు: తెల్లజుట్టును నివారించడంలో గోధుమలు బెస్ట్ నేచురల్ క్యూర్. గోధుమపిండితో అల్లం మిక్స్ చేసి దానికి ఒక స్పూన్ తేనె కలిపి తలకు పట్టించాలి. ఒక వారంలో మార్పును గమనించండి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరపీలా పని చేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. ఆమ్లా: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని కొబ్బరి నూనెలో కలపాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. మెంతులు: తెల్లజుట్టును నివారించే మరో సహజమైన ఇంటి చిట్కా – మెంతులు. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. -
తెల్లజుట్టు సమస్యా.. ఇలా చేయండి!
ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపంజేసేది శిరోజాలే అంటారు. ఇక ఆడవాళ్లైతే శిరోజాలనే తమ అందానికి గుర్తుగా భావిస్తానరడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు. బ్లాక్ టీ తెల్లజుట్టు నివారణలో బ్లాక్ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని(పాలు కలపకుండా) దానిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లకు చేరేలా మర్దనా చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. సేజ్ ఆకులు ఎండిన సేజ్(జాజికాయ) ఆకులను తీసుకుని మరుగుతున్న నీటిలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం దీనికి నాలుగైదు చుక్కల గ్లిజరిన్ కలపాలి. తద్వారా జుట్టు పోషణకు అవసరమైన విటమిన్-ఇ అందుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం ద్వారా సహజ పద్ధతిలోనే నల్లని జుట్టు పొందవచ్చు. హెన్నా తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడేందుకు దాదాపుగా అందరూ పాటించే చిట్కా ఇది. మార్కెట్లో దొరికే నాణ్యమైన హెన్నా పౌడర్ తీసుకుని.. దానికి పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు నీటిలో మరగబెట్టాలి. 12 నుంచి 15 గంటల పాటు ఒక నానబెట్టిన తర్వాత.. జుట్టుకు పట్టించి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో కడిగేస్తే సరి. అయితే రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారి హెన్నా పెట్టుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ తలస్నానం చేసే ఇబ్బంది ఉండదు. ఉసిరి నల్లని శిరోజాలు పెంపొందించడంలో ఉసిరిది ప్రధాన పాత్ర. ఎండిన ఉసిరి కాయలను నీళ్లలో నానబెట్టాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఉసిరిని నానబెట్టిన నీళ్లలో హెన్నా పౌడర్, గ్రైండ్ చేసిన ఉసిరి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత దీనికి ఐదు చెంచాల నిమ్మకాయ రసం, కాఫీ, పచ్చి గుడ్డు తెల్లని సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి.. షాంపూ అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె, అల్లం కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను వేడి చేసి కాసేపు మరగబెట్టాలి. ఒక రాత్రంతా ఈ మిశ్రమాన్ని నానబెట్టి... దీనికి కాసింత తేనె కలిపి జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. మెరుగైన ఫలితం కోసం ఉసిరితో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. -
మేలైన కాంతి
చలికాలంలో చర్మం పొడిబారి, కళ తప్పి కనిపిస్తుంది. మృతకణాలు పెరుగుతాయి కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయకపోతే రంగు కాస్త తగ్గినట్టు కనిపిస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా..ఉదయం స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి అరగంటసేపు ఆగాలి. తర్వాత మరీ వేడిగా అలాగని చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్నానానికి సబ్బు ఉపయోగించేవారు క్రీమీగా ఉండేవాటిని చలికాలానికి ప్రత్యేకం అనేవాటిని ఎంచుకోవాలి. లేదంటే సొంతంగా తయారుచేసుకున్న సున్నిపిండిని వాడాలి.బాదంపప్పుల నూనె, అవిసెగింజల నూనె వంటివి మేనిపైకే కాదు లోపల కూడా కావాలి. అందుకని శరీరానికి మేలు చేసే బాదంపప్పులు, అవిసెగింజలు.. రోజూ కొన్ని తినాలి.ఈ కాలం ఉసిరికాయలు లభిస్తాయి. వీటిలో విటమిన్–సి సమృద్ధిగా లభిస్తుంది. ఏదో విధంగా రోజూ ఒక ఉసిరికాయ అయినా తినాలి. పొడిరూపంలోనూ ఉసిరిని తయారుచేసి, నిల్వచేసుకొని, కషాయం చేసుకొని సేవించవచ్చు. దీనివల్ల చర్మంలోపలి మలినాలు కూడా శుద్ధమవుతాయి.పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్లు బారి నలుపుగా అవడం వంటివి ఈ కాలంలో సహజంగా జరుగుతుంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యిని పెదవులపై రాసి, మృదువుగా మర్దన చేయాలి. పగలు కూడా రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారం సమస్య రాదు.చలికి చాలా మంది మంచినీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. దీని వల్ల కూడా చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరుగుతుంటుంది. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టాలి. ఈ జాగ్రత్తలు చర్మకాంతినే కాదు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. -
పుల్లన జిల్లున
ఉసిరిని సంస్కృతంలో ‘ధాత్రి’ అని అంటారు. ధాత్రి అంటే సంపదకు నిలయం. నిజంగానే ఉసిరి ఆరోగ్య సిరికి నిలయం. విటమిన్ ‘సి’ ఇందులో పుష్కలం. రోగనిరోధక శక్తికి ఇది సాధనం. ఈ సీజన్లో ఉసిరికి చింతకాయను, నిమ్మకాయను జతచేయండి. తుమ్ముకు, దగ్గుకు జల్ల కొట్టి కారం కారంగా జిల్లుమనిపించండి. ఉసిరి ఊరగాయ కావలసినవి: ఉసిరి కాయలు – అర కేజీ; మిరప కారం – పావు కప్పు; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; మెంతులు – అర టీ స్పూను; సోంపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఆ పైన రంధ్రాలున్న ప్లేట్ ఉంచి వాటి మీద ఉసిరికాయలను ఉంచి మూత పెట్టి, పది నిమిషాలు స్టౌ మీదే ఉంచి దింపేయాలి ∙ఉసిరికాయలలోని గింజలను వేరుచేయాలి ∙ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఆవాలు, మెంతులు, సోంపు వేసి దోరగా వేయించి దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి ∙ఉసిరి ముక్కలను జత చేసి వేయించాలి ∙మిరప కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పొడి చేసుకున్న ఆవాల పొడి మిశ్రమం జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. టొమాటో, పండు మిర్చి పచ్చడి కావలసినవి: టొమాటోలు – అర కేజీ; ఉప్పు – 1 + అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; పండు మిర్చి – అర కేజీ; చింతపండు – 50 గ్రా.; తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, గాలికి ఆరబెట్టాలి ∙ పూర్తిగా తడి పోయిన తరవాత పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి రెండు రోజులు అలాగే వదిలేయాలి ∙పండుమిర్చి తొడిమలు తీసి, నీళ్లలో శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, తడిపోయే వరకు గాలికి ఆరబెట్టాలి ∙మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి, కొద్దిగా మెత్తపడేవరకు మిక్సీ పట్టాలి ∙ సీసాలో ఉన్న టొమాటో ముక్కలను బయటకు తీయాలి ∙రసాన్ని వేరు చేయాలి ∙వేరు చేసిన రసంలో చింతపండు వేసి, ముక్కలను, రసాన్ని విడివిడిగా రెండు రోజుల పాటు ఎండబెట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో చింతపండు నానబెట్టిన టొమాటో రసం, ఎండ బెట్టిన టొమాటో ముక్కలు, పండు మిర్చి తొక్కు వేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి బయటకు తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నువ్వుల నూనె కాగిన తరవాత ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించి దింపి చల్లారనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ∙ఈ పచ్చడి సుమారు పదిహేను రోజులు నిల్వ ఉంటుంది. చింతకాయ పచ్చడి కావలసినవి: పండు చింతకాయలు – 10; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పచ్చి మిర్చి – తగినన్ని; ఎండు మిర్చి – 1 తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి గాలి చొరని సీసాలో ఉంచి మూత పెట్టి మూడు రోజుల తరవాత బయటకు తీసి, గింజలను వేరు చేయాలి ∙చింతకాయ తొక్కును మరోమారు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙వేయించిన పోపు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙కమ్మటి నేతితో అన్నంలో తింటే రుచిగా ఉంటుంది పచ్చి మిర్చి– నిమ్మరసం పచ్చడి కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – ఒక టీ స్పూను; ఆవాల పొడి – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – తగినంత; నిమ్మ రసం – అర కప్పు; ఇంగువ – కొద్దిగా తయారీ: ∙ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాక, రెండేసి ముక్కలుగా కట్ చేయాలి ∙జాడీలో పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, ఆవాల పొడి, మెంతులు వేసి బాగా కలిపి మూత పెట్టి, రెండు రోజులు వదిలేయాలి ∙మూడో రోజు, స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి కలిపి దింపేయాలి ∙çపచ్చి మిర్చి ఉంచిన జాడీ మూత తీసి, కాచిన నూనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి ∙ఇది చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. చింతకాయ పులుసు కావలసినవి: చింతకాయలు – 200 గ్రా.; వంకాయలు – 4 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటోలు – 2 (ముక్కలు చేయాలి); సొరకాయ ముక్కలు – 4; ములక్కాడ–1; క్యారెట్–1; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను. పేస్ట్ కోసం: బియ్యం – ఒక టేబుల్ స్పూను (గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి); ఆవాలు – అర టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; (ఈ పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి). పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. (స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఈ పదార్థాలన్నీ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకు జత చేసి వేయించి దింపేయాలి). తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, చింతకాయలు వేసి స్టౌ మీద ఉంచి చింతకాయలు మెత్తపడే వరకు ఉడికించి, దించి చల్లార్చాలి ∙బాగా చల్లారాక చింతకాయలను గట్టిగా పిండి, చెత్తను తీసేయాలి ∙మరొక పాత్రలో నీళ్లు, తరిగి ఉంచుకున్న కూర ముక్కలు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙ చింతకాయ రసం జత చేసి కలపాలి ∙ఉప్పు, పసుపు జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించాలి ∙ముద్ద చేసి ఉంచుకున్న బియ్యం మిశ్రమం, పోపు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ∙ పులుసు బాగా మరుగుతుండగా ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి ఉసిరి తొక్కు పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 20; నీళ్లు – తగినన్ని; నువ్వుల నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – 5 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద ఒక పాత్ర ఉంచి, అందులో నీళ్లు పోసి కాగాక, ఉసిరి కాయలు వేసి పావు గంట సేపు ఉడికించి తీసేయాలి ∙గింజలను వేరు చేసి, ఉసిరి కాయ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ముక్కలు బాగా చల్లారిన తరవాత మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి, మెత్తగా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, మెంతులు, ఆవాలు వేసి వేయించాలి ∙ మిరప కారం వేసి బాగా వేయించాలి ∙చివరగా మెత్తగా చేసి ఉసిరి ముద్ద వేసి బాగా దగ్గర పడే వరకు వేయించాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙బెల్లం పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. పండు మిర్చి నిమ్మకాయ నిల్వ పచ్చడి కావలసినవి: పండు మిర్చి – అర కేజీ; నిమ్మకాయలు – డజను (చిన్న సైజువి); ఉప్పు – తగినంత; ఆవాలు–ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; నూనె – 100 గ్రా.; ఇంగువ – అర టీ స్పూను; ఆవ పొడి–ఒక టేబుల్ స్పూను; మెంతి పొడి–పావు టేబుల్ స్పూను; మిరప కారం–రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా పండు మిర్చిని నీళ్లలో శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు ఆరబెట్టాలి మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాక, బయటకు తీసి, ఒక పాత్రలో రెండు రోజుల పాటు మూత పెట్టి ఉంచాలి నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, ఆరబెట్టాలి ∙తడి పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరిగి, తగినంత ఉప్పు జత చేసి బాగా కలిపి, జాడీలో రెండు రోజుల పాటు ఉంచాలి ∙మూడో రోజు పండు మిర్చి మిశ్రమం, నిమ్మకాయ ముక్కలను బయటకు తీసి, ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ∙మెంతి పొడి, ఆవ పొడి, మిరప కారం జత చేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ∙చల్లారాక పండుమిర్చి నిమ్మకాయ పచ్చడిలో వేసి కలపాలి ∙ ఈ పచ్చడి సుమారు పది రోజులు నిల్వ ఉంటుంది. (ఉప్పు సరిపడేలా చూసుకోవాలి). -
కలపకండి కలుసుకోండి
వనభోజనాలంటేనే ప్రకృతితో ఏకమవ్వడం... అన్నం పెట్టిన చెట్టుకు దండం పెట్టుకోవడం...కుటుంబంలో తను ఒక సభ్యులని గుర్తు చేసుకోవడం...తనతోపాటు కలిసి భోజనం చేయడం... వనభోజనం కృతజ్ఞతల ఘనభోజనం...ప్రకృతి మాత పిల్లలకు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు కదా!అందుకే ఈ వారం అన్నీ కలిపిన వంటలే... ముద్దలు చేసుకుని తినడం మాత్రమే!కలపకండి... కలుసుకోండి. క్యారట్ దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; మిరియాలు – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – ఒక కప్పు; జీడి పప్పులు – 15; కిస్మిస్ – గుప్పెడు; దానిమ్మ గింజలు – అర కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; మీగడ – పావు కప్పు ; ఉప్పు – తగినంత పోపు కోసం: పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; పచ్చి మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, మిరియాలు, కరివేపాకు వరుసగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కాగాక జీడి పప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక క్యారట్ తురుము వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి పల్చగా పరవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు, జీడిపప్పులు, కిస్మిస్, క్యారట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు, పాలు, మీగడ జత చేసి కింద నుంచి పైకి కలియబెట్టాలి ∙దానిమ్మ గింజలు వేసి మరోమారు కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. ఉసిరి రైస్ కావలసినవి బాస్మతి బియ్యం – ఒక కేజీ; పెద్ద ఉసిరి కాయల తురుము – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; మినప్పప్పు – పావు కప్పు; ఆవాలు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – రెండు టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 6; బెల్లం పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – తగినంత; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; జీడి పప్పులు – 50 గ్రా.; వేయించిన పల్లీలు – 100 గ్రా.; నువ్వుల నూనె/ నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి వెంటనే పెద్ద పళ్లెంలోకి తీసి ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙ఆవాలు, జీలకర్ర , పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఇంగువ వరుసగా వేసి బాగా కలపాలి ∙దోరగా వేగిన తరవాత ఉసిరి కాయ తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙చివరగా జీడి పప్పులు, వేయించిన పల్లీలు వేసి మరో సారి వేయించి దింపేయాలి ∙పళ్లెంలో ఉన్న అన్నం మీద ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి ∙వేయించి ఉంచుకున్న ఉసిరి + పోపు మిశ్రమం, బెల్లం పొడి చివరగా వేసి బాగా కలియబెట్టాలి ∙సుమారు గంట సేపు ఊరిన తరవాత దేవుడికి నివేదన చేసి సేవించాలి ∙వనభోజనాలలో ఉసిరి తప్పనిసరిగా తినాలంటారు కనుక, విడిగా ఉసిరి తినవలసిన అవసరం లేకుండా ఉసిరి రైస్ సిద్ధం చేసుకుంటే సరి. డ్రై ఫ్రూట్స్ క్షీరాన్నం కావలసినవి బియ్యం – ఒక కప్పు; చిక్కటి పాలు – 4 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; జీడి పప్పులు – 25 గ్రా.; కిస్మిస్ – 25 గ్రా.; పిస్తా – 25 గ్రా.; ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; గింజలు లేని ఖర్జూరాలు – 5; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙చిక్కటి పాలను బాగా మరిగించాలి ∙బియ్యంలోని నీళ్లను ఒంపేసి పాలలో వేసి కలియబెట్టాలి ∙బాగా మెత్తగా ఉడికేవరకు అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి (పాలు చాలకపోతే మరిన్ని పాలు కాని నీళ్లు కాని జత చేయాలి) ∙ఒక చెంచాడు నెయ్యి వేసి కలియబెట్టాలి ∙బెల్లం తురుము వేసి మరోమారు బాగా కలిపి దింపేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిçపప్పులు, కిస్ మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, పిస్తాలను విడివిడిగా వేయించి తీసి చక్ర పొంగలిలో వేసి కలపాలి ∙ఖర్జూరాలను కూడా జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి ∙క్షీరాన్నం బాగా చల్లారాక అందించాలి. నేతి బీరకాయ బజ్జీ కావలసినవి: నేతి బీరకాయలు – 2; సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; తినే సోడా–చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ముందుగా నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాల్లా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, మిరప కారం, అల్లం తురుము, పచ్చి మిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీల కర్ర పొడి, చిటికెడు సోడా వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, నేతి బీర కాయ చక్రాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీతో కాని, గ్రీన్ చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి. బిసిబేళ బాత్ కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్ – 1 (చిన్నది); బీన్స్ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10 తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి. -
బ్యూటిప్స్
టమాటాను మెత్తగా చేసి, అందులో టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి, మెడకు, చేతులకు రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే ఎండకు కమిలిన చర్మం సహజరంగుకు వస్తుంది. చర్మం బిగుతుగా మారి, ముడతలూ తగ్గుతాయి. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడిని నీళ్లలో వేసి నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ఆ నీటితో జుట్టును తడిపి, ఆరనివ్వాలి. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తలకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. జుట్టు నిగనిగలాడుతుంటుంది. -
ఆమ్లా వికెట్‌తోనే విజయానికి బాటలు
వాండరర్స్ పిచ్ స్పందించిన తీరు చూస్తోంటే 1969లో భారత్– ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఓ మ్యాచ్ గుర్తుకొస్తుంది. బిల్ లారీ సారథ్యంలోని ఆసీస్ ఆసమయంలో భారత్‌లో పర్యటించింది. ఫిరోజ్‌షా కోట్ల వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో పిచ్ ఇలాగే స్పందించడంతో మన స్పిన్నర్లు చెలరేగి కంగారూలను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ లక్ష్యం 190 పరుగులే. అయినప్పటికీ ఆసీస్ చేయితిరిగిన స్పిన్నర్లు ఆష్లే మల్లెట్, జాన్ గ్లెసన్... పేసర్లు డ్రాహం మెకంజి, అలన్ కొన్లీలను ఎదుర్కొని మ్యాచ్‌ను గెలవడం అంటే అద్భుతం చేయడమే అని భావించారు. కానీ తర్వాత పిచ్ సాధారణంగా మారిపోవడంతో భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అవలీలగా విజయాన్నందుకుంది. భారత స్పిన్నర్లు సులువుగా రాణించిన అదే పిచ్‌పై, ఆష్లే మల్లెట్ బంతిని తిప్పడానికి అష్టకష్టాలు పడ్డాడు. వాండరర్స్‌లో నాలుగోరోజు కూడా ఇదే జరిగింది. మూడో రోజు ప్రమాదకరంగా కనిపించిన పిచ్ నాలుగో రోజు అనూహ్యంగా తొలి సెషన్లో బ్యాటింగ్‌కు సహకరించింది. లంచ్‌కు ముందు వరకు కూడా వికెట్ తీయడం భారత బౌలర్లకు గగనమైంది. మన బ్యాట్స్‌మెన్ బంతి బంతికీ గాయపడ్డ పిచ్‌పై ఆమ్లా, ఎల్గర్ నింపాదిగా బ్యాటింగ్ చేశారు. వీరు పరుగులు చేస్తుంటే మన బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఇక్కడే ఆమ్లా గొప్పతనం కనిపిస్తుంది. పరుగే గగనంగా మారిన పిచ్‌పై అతను రెండు ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధసెంచరీలు చేశాడు. ఎల్గర్ కూడా మరోసారి తన విలువేంటో చూపించాడు. ఆమ్లాకు చక్కగా సహకరిస్తూ విలువైన పరుగుల్ని జోడించాడు. టీ విరామానికి ముందు డివిలియర్స్, ఆమ్లాలను అవుట్ చేయడంతోనే భారత విజయానికి బాటలు పడ్డాయి. -
ఆమ్ల – ఆరోగ్యం
ఉసిరి కాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కమలాపండులో లభించే సి విటమిన్ కంటే ఇరవై రెట్లు అధికంగా ఉసిరిలో ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా వాడితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కేశాల నుండి కాలి గోళ్ల వరకు శరీరమంతటికీ ఉసిరి అవసరమే. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజలవణాలు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరొటిన్, గార్లిక్ యాసిడ్, బి కాంప్లెక్స్, సి విటమిన్లు ఉంటాయి. ∙చర్మవ్యాధులను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది ∙ అజీర్తి, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది ∙లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది ∙ కొలెస్టరాల్‌ను కరిగిస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది నిస్సత్తువగా ఉన్న నరాలను శక్తిమంతం చేస్తుంది. పక్షవాతం వ్యాధిగ్రస్తులకు దీని అవసరం ఎక్కువ ∙ గాయాల నొప్పి, వాపును తగ్గిస్తుంది ∙ మెదడుకు టానిక్‌లా పనిచేసి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది ∙ కంటిచూపును మెరుగుపరుస్తుంది ∙ శరీరానికి శక్తినిస్తుంది, రోగనిరోధక శక్తి పెంచి అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. -
గెలిపించిన ఆమ్లా, పెరీరా
రెండో టి20లో వరల్డ్ ఎలెవన్ విజయం లాహోర్: పాకిస్తాన్‌తో రెండో టి20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ విజయ లక్ష్యం 175... చివరి 4 ఓవర్లలో గెలిచేందుకు 51 పరుగులు చేయాలి. హషీం ఆమ్లా (55 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాగానే ఆడుతున్నా, జట్టు విజయంపై సందేహాలు ఉన్నాయి. అయితే ఈ దశలో తిసార పెరీరా (19 బంతుల్లో 47 నాటౌట్; 5 సిక్సర్లు) ఒక్కసారిగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో విరుచుకుపడి చేయాల్సిన 51లో తానొక్కడే 43 పరుగులు చేసి ఒక బంతి మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (38 బంతుల్లో 45; 5 ఫోర్లు), అహ్మద్ షహజాద్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... షోయబ్ మాలిక్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. వరల్డ్ ఎలెవన్ బౌలర్లలో పెరీరా, బద్రీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఎప్పుడో ఆరున్నరేళ్ల క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ఈ సిరీస్ కారణంగా 41 ఏళ్ల వయసులో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగగా... పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ నిలిచాడు. -
ఇంగ్లండ్‌దే టెస్ట్ సిరీస్
మాంచెస్టర్: సొంతగడ్డపై అదరగొట్టిన ఇంగ్లండ్... దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. సోమవారం ముగిసిన చివరిదైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. నాలుగో రోజు 380 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైంది. ఆమ్లా (83), కెప్టెన్ డు ప్లెసిస్ (61) పోరాడినా లాభం లేకపోయింది. 39 పరుగుల వ్యవధిలోనే దక్షిణాఫ్రికా చివరి 7 వికెట్లు కోల్పోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ (5/69), అండర్సన్ (3/16) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ గడ్డపై 1998 తర్వాత మొదటిసారి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం సాధించడం విశేషం. 252 పరుగులు చేయడంతో పాటు 25 వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ, 19 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’లుగా నిలిచారు. -
గుజరాత్ లయన్స్ విజయం
-
ఆమ్లా శతకం వృథా
►కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు షాక్ ►డ్వేన్ స్మిత్ సూపర్ ఇన్నింగ్స్ ►గుజరాత్ లయన్స్ విజయం మొహాలీ: ప్లే ఆఫ్‌లో చోటు కోసం అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దూకుడుకు గుజరాత్ లయన్స్ బ్రేక్ వేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓపెనర్ డ్వేన్ స్మిత్ (39 బంతుల్లో 74; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈసారి సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీనికి తోడు కీలక సమయాల్లో క్యాచ్‌లను వదిలేయడంతో పంజాబ్ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైనా సేన 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు ఆమ్లా (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ సీజన్లో రెండో శతకంతో చెలరేగగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. షాన్ మార్‡్ష (43 బంతుల్లో 58; 6 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. అనంతరం గుజరాత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), రైనా (25 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్మిత్ జోరు... 190 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు) 9.2 ఓవర్ల పాటు పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా ఫామ్‌లో లేని స్మిత్ ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. ఆరో ఓవర్లో చేతుల్లోకి వచ్చిన స్మిత్ క్యాచ్‌ను మార్‡్ష వదిలేయగా తర్వాతి ఓవర్లో భారీ సిక్స్‌తో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఎనిమిదో ఓవర్లో ఇషాన్‌కు లైఫ్ లభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. స్మిత్ దూకుడుకు పదో ఓవర్లోనే జట్టు వంద పరుగులు దాటింది. అయితే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన తను క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగుతున్న రైనా జట్టును విజయంవైపు తీసుకెళుతుండగా 18వ ఓవర్లో సందీప్ శర్మ షాక్ ఇచ్చాడు. రైనాతో పాటు ఫించ్ (2) వికెట్‌ను తీయడంతో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి 13 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయితే దినేశ్ కార్తీక్ వరుసగా 6,4 బాది ఒత్తిడి తగ్గించాడు. చివరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉండగా రెండు బంతులు ఉండగానే జట్టు నెగ్గింది. ఆమ్లా, మార్ష్ దూకుడు... టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ తొలి ఓవర్లోనే గప్టిల్ (2) వికెట్‌ను కోల్పోయింది. తొలి రెండు ఓవర్లలో జట్టు చేసింది మూడు పరుగులే. ఐదు ఓవర్ల వరకు కూడా కనీసం ఓవర్‌కు ఆరు రన్‌రేట్ కూడా లేకుండా సాగుతున్న వీరి ఇన్నింగ్స్ చివరకు భారీ స్కోరు సాధించిందంటే ఆమ్లా మెరుపులే కారణం. అతనికి మార్‡్ష చక్కటి సహకారం అందించడంతో లయన్స్ బౌలర్లు ఇబ్బందిపడ్డారు. ఆరో ఓవర్లో ఆమ్లా సిక్స్, ఫోర్ బాదడంతో జట్టు పవర్‌ప్లేలో 44 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత రిస్కీ షాట్లకు వెళ్లకుండా ఈ జోడి అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచింది. -
హషీమ్ ఆమ్లా మళ్లీ బాదేశాడు..
మొహాలి: ఈ ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా మరో శతకాన్ని నమోదు చేశాడు. ఆదివారం రాత్రి గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ లో ఆమ్లా సెంచరీతో అదుర్స్ అనిపించాడు. 60 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 104 పరుగులు చేశాడు. తద్వారా ఈ ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఆమ్లా శతకం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలో ఆచితూచి ఆడింది. తొలి ఓవర్ ఐదో బంతికి గప్టిల్(2)అవుట్ కావడంతో కింగ్స్ కు ముందుగానే ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆమ్లా-షాన్ మార్ష్ ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 125 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. ఈ క్రమంలోనే తొలుత ఆమ్లా హాఫ్ సెంచరీ చేయగా, ఆపై మార్ష్ కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. కాగా, మార్ష్(58;43 బంతుల్లో6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసిన కొద్ది సేపటికి పెవిలియన్ చేరాడు. దాంతో స్కోరు పెంచే బాధ్యతను ఆమ్లాతో కలిసి మ్యాక్స్ వెల్ పంచుకున్నాడు. ఈ జోడి చివరి ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మ్యాక్స్ వెల్ చేసిన 20 పరుగుల్లో రెండు సిక్సర్లు ఉండగా, సిక్సర్ తో ఆమ్లా సెంచరీ సాధించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. -
ఆమ్లా అదుర్స్.. లయన్స్ లక్ష్యం 189
-
ఆమ్లా అదుర్స్.. లయన్స్ లక్ష్యం 189
►రాణించిన మాక్స్ వెల్, అక్షర్ పటేల్ రాజ్ కోట్: గుజరాత్ లయన్స్, కింగ్స్ పంజాబ్ లమధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ హాషీమ్ ఆమ్లా మరో సారి రెచ్చి పోయాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించిన ఆమ్లా తాజా మ్యాచ్ లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. దీంతో ఆమ్లా 299 పరుగులతో అగ్రస్ధానంలో నిలిచి ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఆమ్లా దూకుడుకు, మాక్స్ వెల్ తొడవ్వడంతో పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 189పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కు ఆదిలోనే ఓపెనర్ మనన్ ఓహ్ర (2) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన ఎస్ మార్ష్ తో మరో ఓపెనర్ ఆమ్లా దూకుడుగా ఆడాడు. వీరి దూకుడుకు పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. ఈ దశలో ఆమ్లా 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జంటను ఆండ్రూ తై విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంజాబ్ కెప్టెన్ మాక్స్ వెల్, ఆమ్లా తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 14 ఓవర్లకే 128 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న పంజాబ్ ఆమ్లా, మాక్స్ వెల్ వికెట్లు వరుసగా కోల్పోయింది. ఆమ్లాను అగర్వాల్ అవుట్ చేయగా, మాక్స్ వెల్ ను జడేజా పెవిలియన్ కు చేర్చాడు. దీంతో పంజాబ్ 132 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అక్సర్ పటేల్, స్టోయినిస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాలని ప్రయత్నించినా తై మరో సారి స్టోయినిస్ ను పెవిలియన్ కు పంపాడు. డెన్ స్మిత్ వేసిన 19 ఓవర్లో అక్సర్ పటేల్ వరుస బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది నాలుగో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివరి 2 ఓవర్లో 30 పరుగులు రావడంతో పంజాబ్ 188 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ తైకి 2 వికెట్లు పడగా, ఎన్.బి సింగ్, జడేజా, స్మిత్, అగర్వాల్ లకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ తో గుజరాత్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో 100 మందిని అవుట్ చేసిన తొలి వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశాడు. -
యువతి అనుమానాస్పద మృతి
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో దారుణం వెలుగుచూసింది. స్థానిక జయశంకర్ పార్క్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆదివారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు రాజీవ్‌నగర్‌కు చెందిన బానోతు అమల(19)గా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమ్లా, డుమిని సెంచరీలు
• దక్షిణాఫ్రికా 338/3 • శ్రీలంకతో మూడో టెస్టు జొహన్నెస్‌బర్గ్: శ్రీలంకతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే దక్షిణాఫ్రికా భారీ స్కోరుతో చెలరేగింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న హషీం ఆమ్లా (221 బంతుల్లో 125 బ్యాటింగ్; 16 ఫోర్లు) సెంచరీ సాధించగా, మరో బ్యాట్స్‌మన్ జేపీ డుమిని (221 బంతుల్లో 155; 19 ఫోర్లు) కూడా శతకం అందుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 292 పరుగులు జోడించడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తక్కువ వ్యవధిలో ఓపెనర్లు కుక్ (10), ఎల్గర్ (27) వికెట్లు కోల్పోయింది. అయితే ఆమ్లా, డుమిని కలిసి లంక బౌలర్లపై చెలరేగారు. ఈ క్రమంలో డుమిని 140 బంతుల్లో కెరీర్లో ఆరో సెంచరీని, ఆమ్లా 169 బంతుల్లో కెరీర్లో 26వ సెంచరీని అందుకున్నారు. 100వ టెస్టులో సెంచరీ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు. గతంలో కౌడ్రీ, మియాందాద్, గ్రీనిడ్జ్, స్టివార్ట్, ఇంజమామ్, పాంటింగ్ (రెండు ఇన్నింగ్స్‌లలోనూ), గ్రేమ్ స్మిత్ ఈ ఘనత సాధించారు. లహిరు కుమారకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆమ్లాతో పాటు ఒలివర్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. -
సిరిభోజనం
ఇది కార్తికమాసం. వనభోజన మాసం. ఇంటిల్లపాదీ వనభోజనం చేయాలి. ఆ వనంలో ఉసిరిచెట్టు ఉండాలి. భోజనంలో ఉసిరి వంట ఉండాలి. ఇది సంప్రదాయం. అది ఎందుకంటారా...? ఆగండాగండి... ఉసిరి అంటే... ‘సి’ విటమిన్ రిచ్. ఆరోగ్యం వెరీ మచ్. అందుకే... ఉసిరి ఉన్న భోజనం... సిరిభోజనం. ఆమ్లా షర్బత్ కావలసినవి: ఉసిరికాయలు- 500 గ్రా, చక్కెర- 200 గ్రా, జీలకర్ర పొడి- అర టీ స్పూన్, ఉప్పు - అర టీ స్పూన్, పుదీన ఆకులు - మూడు, ఐస్- పది క్యూబ్‌లు తయారీ: ఉసిరికాయలను కడిగి తగినంత నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత చేత్తో చిదిమి గింజలను తీసి వేయాలి. ఉసిరిక గుజ్జులో చక్కెర, పుదీన ఆకులు, ఒక కప్పు చన్నీరు పోసి, మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అందులో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఐస్‌క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. దీనిని నిల్వ చేసుకోవచ్చు. గది వాతావరణంలో రెండు రోజులు, ఫ్రిజ్‌లో వారం తాజాగా ఉంటుంది. గమనిక: ఎప్పటికప్పుడు తాజాగా కావాలంటే ఉసిరి కాయలను తరిగి, గింజలు తీసి మిక్సీలో గుజ్జు చేయాలి. పలుచటి వస్త్రంలో వేసి రసం తీయాలి. ఆ గుజ్జుకు కొంత నీటిని చేరుస్తూ, మరలా మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. తేనె కలిపి సర్వ్ చేయాలి. ఆమ్లా మురబ్బా కావలసినవి: ఉసిరికాయలు- 100 గ్రా, చక్కెర- 100 గ్రా, నీరు- 125 మి.లీ, కుంకుమ పువ్వు- ఐదు రేకలు, ఏలకుల పొడి- పావు టీ స్పూన్ తయారీ: ఉసిరికాయలను కడిగి, తురమాలి. గింజలు లేకుండా మొత్తం కోరుకోవాలి. ఒక పాత్రలో చక్కెర, నీరు కలిపి కరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ కోరు వేసి, సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికి దగ్గరయ్యే వరకు అడుగు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. మిశ్రమం తీగలాగ సాగిన తర్వాత దించేసి కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలిపితే మురబ్బా రెడీ. ఇది చల్లారిన తర్వాత తడిలేని గాజు జాడీలోకి తీసుకోవాలి. దీనిని తేమ తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.ఉసిరి మురబ్బాను అలాగే తినవచ్చు. బ్రెడ్, చపాతీల మీద పలుచగా రాసి తినవచ్చు. ఉసిరి పులిహోర కావలసినవి: బియ్యం- ఒక కప్పు, ఉసిరికాయ తురుము- ఒక కప్పు, కొత్తిమీర- రెండు రెమ్మలు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత పోపు కోసం: ఆవాలు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- ఒక టీ స్పూన్, అల్లం తరుగు- అర టీ స్పూన్, ఎండు మిర్చి- రెండు, పచ్చి మిర్చి- రెండు (తరగాలి), కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె - ఒక టేబుల్ స్పూన్ తయారీ: అన్నం వండి చల్లారబెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేయాలి. అవి వేగిన తర్వాత ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి, రెండు నిమిషాల సేపు సన్న మంట మీద మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.మిశ్రమం చల్లారాక అన్నంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లాలి. ఉసిరి పప్పు కావలసినవి: కందిపప్పు- ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, ఉసిరికాయ ముక్కలు- అరకప్పు, మిరప్పొడి- ఒక టీ స్పూన్, పసుపు- చిటికెడు పోపు కోసం: నూనె- రెండు టీ స్పూన్లు, ఆవాలు- అర టీ స్పూన్, సెనగపప్పు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, జీలకర్ర- అర టీ స్పూన్, వెల్లుల్లి రేకలు- మూడు, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు- ఒక టీ స్పూన్ తయారీ: కందిపప్పును కడిగి ప్రెషర్‌కుకర్‌లో వేయాలి. అందులో టొమాటో, ఉల్లిపాయ, ఉసిరిముక్కలు, మిరప్పొడి, పసుపు, ఒకటిన్నర కప్పు నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పప్పులో ఉప్పు వేసి పప్పు గుత్తితో మెదపాలి. ఒక పాత్రలో నూనె వేడి చేసి, ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నింటినీ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు పోపులో మెదిపి పక్కన ఉంచిన పప్పు వేసి కలపాలి. గమనిక: మిరప్పొడి బదులు పచ్చి మిర్చి వేసుకోవచ్చు. ఉసిరి ఊరగాయ కావలసినవి: ఉసిరికాయలు- పావు కిలో, ఆవాల పొడి - 50 గ్రా, కారం - 50 గ్రా, పసుపు - ఒక టీ స్పూన్, ఉప్పు - 50 గ్రా, వెల్లుల్లి రేకలు - పది, నూనె - రెండు టేబుల్ స్పూన్లు పోపుదినుసులు ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తయారీ: ఉసిరికాయలను కడిగి తుడవాలి. బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉసిరికాయలను వేసి సన్నమంట మీద మెత్తగా మగ్గనివ్వాలి. ఈ ఊరగాయకు ఉసిరి గింజలను తీయాల్సిన అవసరం లేదు. మెత్తగా మగ్గిన కాయలను మరొక పాత్రలోకి తీసి అదే బాణలిలో పోపు దినుసులు వేయించాలి. అందులో ముందుగా వేయించి పక్కన ఉంచిన ఉసిరికాయలను వేసి పైన కారం, పసుపు, ఆవాల పొడి, ఉప్పు , వెల్లుల్లి రేకలు వేయాలి. పైన మిగిలిన నూనె వేసి కలిపి చల్లారని వ్వాలి. తర్వాత తేమలేని గాజు లేదా పింగాణి జాడీలో తీసుకోవాలి. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తేమ తగలకుండా వాడితే ఆరు నెలలు తాజాగా ఉంటుంది. ఈ ఊరగాయ చేసిన రోజు పైకి నూనె కనిపించదు. రెండు రోజులకు కాయల్లోని నూనె పైకి తేలుతుంది. -
ధోని ‘బ్రాండ్’ ముగింపు
చివరి బంతికి పుణే విజయం పంజాబ్‌కు ఆఖరి స్థానం ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం నుంచి ధోనికి అనేక సమస్యలు. కీలక ఆటగాళ్లకు గాయాలు... ఫామ్‌లో లేని సహచరులు... దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి ఎప్పుడో వెనుదిరిగింది. ఇక ఆఖరి మ్యాచ్‌లో గెలవకపోతే చివరి స్థానంతో అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది. ఐపీఎల్లో తిరుగులేని కెప్టెన్‌గా పేరున్న ధోని దీనిని జీర్ణించుకోలేకపోయాడేమో... తన అసలు సిసలు ఆటతీరుతో ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం చేశాడు. సంచలన ఇన్నింగ్స్‌తో పుణేను ఒంటిచేత్తో గెలిపించి... ఇటీవల తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. సాక్షి, విశాఖపట్నం: 3 బంతుల్లో 16 పరుగులు... ఆఖరి మ్యాచ్‌లో పుణే విజయానికి అవసరమైన సమీకరణం ఇది. ఈ దశలో ధోని దుమ్మురేపాడు. తన బ్రాండ్ షాట్లతో... చాలాకాలం తర్వాత తనదైన శైలిలో మ్యాచ్‌ను ‘ఫినిష్’ చేశాడు. ఓ బౌండరీ, రెండు సిక్సర్లతో పుణేకు చిరస్మరణీయ విజయాన్ని అందించి... లీగ్‌లో ఆఖరి స్థానం బాధ నుంచి జట్టును తప్పించాడు. కెప్టెన్ ధోని (32 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో పుణే జట్టు నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. పుణే ఏడోస్థానంతో, పంజాబ్ ఆఖరి స్థానంతో సీజన్‌ను ముగించాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్... 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. మురళీ విజయ్ (41 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గురుకీరత్ సింగ్ (30 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించగా... హషీమ్ ఆమ్లా (27 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. అశ్విన్ 4 వికెట్లు తీశాడు. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు కేవలం 62 పరుగులు మాత్రమే చేసిన ధోని... ఇన్నింగ్స్‌లో చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు చేయడం విశేషం. విజయానికి 49 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని... పెరీరా (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్సర్) సహాయంతో ధాటిగా ఆడాడు. చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సి ఉండగా మోహిత్ శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి పుణేను కట్టడి చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు అవసరం కాగా... ధోని సింగిల్స్ కూడా తీయకుండా ఈ ఓవర్లో మొత్తం మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి పుణేను గెలిపించడం విశేషం. స్కోరు వివరాలు: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) బెయిలీ (బి) అశ్విన్ 30; విజయ్ (బి) అశ్విన్ 59; సాహా (సి) అశ్విన్ (బి) జంపా 3; గురుకీరత్ (సి) చాహర్ (బి) అశ్విన్ 51; మిల్లర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 7; బెహర్డీన్ (సి) రహానే (బి) దిండా 5; అక్షర్ పటేల్ (సి) తివారీ (బి) పెరీరా 1; రిషి ధావన్ (నాటౌట్) 11; అబాట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-60; 2-65; 3-123; 4- 150; 5-154; 6-160; 7-160. బౌలింగ్: పఠాన్ 4-0-37-0; దిండా 3-0-16-1; చాహర్ 3-0-28-0; పెరీరా 2-0-24-1; అశ్విన్ 4-0-34-4; జంపా 4-0-32-1. పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) సాహా (బి) సందీప్ 19, ఖవాజా (సి) మిల్లర్ (బి) గురుకీరత్ 30; బెయిలీ (స్టం) సాహా (బి) పటేల్ 9; తివారీ (సి) బెహర్డీన్ (బి) గురుకీరత్ 17; ధోని నాటౌట్ 64; ఇర్ఫాన్ (సి) సాహా (బి) ధావన్ 2, పెరీరా (సి) సాహా (బి) మోహిత్ 23; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1-35, 2-47, 3-78, 4-80, 5-86, 6-144. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-29-1; మోహిత్ శర్మ 4-0-39-1; అబాట్ 3-0-25-0; అక్షర్ 4-0-43-1; గురుకీరత్ 2-0-15-2; రిషి ధావన్ 3-0-21-1. -
విజయంతో ముగించారు
► శ్రీలంకపై దక్షిణాఫ్రికా గెలుపు ► రాణించిన ఆమ్లా ► టి20 ప్రపంచకప్ న్యూఢిల్లీ: బౌలర్లు రాణింపు.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ విజృంభణతో టి20 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ముగించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డు ప్లెసిస్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. హషీమ్ ఆమ్లా (52 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.3 ఓవర్లలో 120 పరుగులు చేసింది. దిల్షాన్ (40 బంతుల్లో 36; 4 ఫోర్లు; 1 సిక్స్), చండిమాల్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు; 1 సిక్స్) వీరిద్దరు తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. అయితే ఫంగిసో వరుస బంతుల్లో చండిమాల్, తిరిమన్నెలను అవుట్ చేయడంతో లంక పతనం ప్రారంభమైంది. చివర్లో షనక (18 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) పోరాడినా సహకారం కరువైంది. అబాట్, ఫంగిసో, బెహర్డీన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. రెండో ఓవర్లోనే డి కాక్ (9) రనౌట్ అయినా ఆమ్లా, డు ప్లెసిస్ (36 బంతుల్లో 31; 3 ఫోర్లు) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అటు 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఆమ్లా టి20ల్లోనూ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. చివర్లో మెరిసిన డి విలియర్స్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ భారీ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను విజయంతో ముగించాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: చండిమాల్ (బి) ఫంగిసో 21; దిల్షాన్ ఎల్బీడబ్ల్యు (బి) బెహర్డీన్ 36; తిరిమన్నె (బి) ఫంగిసో 0; సిరివర్దన (రనౌట్) 15; జయసూరియ (సి) డు ప్లెసిస్ (బి) బెహర్డీన్ 1; కపుగెడెర (బి) తాహిర్ 4; పెరీరా (సి) బెహర్డీన్ (బి) స్టెయిన్ 8; షనక నాటౌట్ 20; హెరాత్ (సి) డి కాక్ (బి) అబాట్ 2; వాండర్సే (బి) అబాట్ 3; లక్మల్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1-45, 2-45, 3-75, 4-78, 5-85, 6-85, 7-96, 8-109, 9-120, 10-120. బౌలింగ్: స్టెయిన్ 4-0-33-1; అబాట్ 3.3-0-14-2; ఫంగిసో 4-0-26-2; తాహిర్ 4-0-18-1; వీస్ 1-0-8-0; బెహర్డీన్ 3-0-15-2. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా నాటౌట్ 56; డి కాక్ (రనౌట్) 9; డు ప్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) లక్మల్ 31; డి విలియర్స్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-15, 2-75. బౌలింగ్: జయసూరియ 1-0-9-0; లక్మల్ 3.4-0-28-1; హెరాత్ 4-0-21-0; వాండర్సే 4-0-25-0; షనక 2-0-17-0; పెరీరా 2-0-15-0; సిరివర్ధన 1-0-5-0. -
ఇమేజ్ అంటూ ఎంత కాలం సినిమాలు చేస్తాను! - నాగార్జున
‘ఊపిరి’ సినిమాను నేను, అమల, అఖిల్, నాగచైతన్య కలిసి చూశాం. సినిమా అయ్యేంతవరకు అమల నా వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఇక సినిమా అయ్యాక మాత్రం అందరూ నన్ను రెండు నిమిషాల పాటు హత్తుకున్నారు. అంతకు మించిన ప్రశంస లేదనిపించింది’’ అని హీరో నాగార్జున అన్నారు. పీవీపి పతాకంపై నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్య తారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు ప్రశంసలు లభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో మీకన్నా కార్తీ పాత్రకే స్పాన్ ఎక్కువ ఉందని చాలా మంది అన్నారు. అయినా అలా ఫీలవ్వడానికి కార్తీ ఎవరో కాదు. నా తమ్ముడే కదా. నిజంగా మా ఇద్దరి మధ్యా అలాంటి అనుబంధం ఉంది కాబట్టే సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ఎప్పుడూ ఇమేజ్ను నమ్ముకుంటే ఒకే రకమైన కథలే వస్తాయి. కొత్తవి పుట్టవు. రొటీన్ సినిమాల్లో నన్ను నేను చూసుకుంటే నాకే బోర్ కొట్టేస్తోంది. పైగా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాల కారణంగా చెంపదెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతకాలం ఇమేజ్ను పట్టుకుని వేలాడతాం. ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాల జాబితాలో ‘ఊపిరి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మా వదిన (జ్యోతిక) ఇంతకు ముందే ఫోన్ చేసి, నన్ను అభినందించారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆమె అన్నారు’’ అని కార్తీ చెప్పారు. ‘‘ఇప్పుడు నన్నందరూ బాలచందర్‌గారితో పోలుస్తున్నారు. ఆయనతో పోల్చుకునేంత అర్హత నాకైతే లేదు. మొదటి నుంచి ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ముందు ఈ కథ నాగార్జునగారితో చెప్పడానికి భయపడ్డాను. కానీ తర్వాత ఆ భయం పోయింది’’ అని వంశీ పైడిపల్లి అన్నారు. ‘‘విజయా వాహిని సంస్థకు ‘మాయాబజార్’, జగపతి సంస్థకు ‘దసరా బుల్లోడు’ ఎలానో మీ సంస్థకు ‘ఊపిరి’ అలా అని ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశారు. అది మాకు దక్కిన గొప్ప ప్రశంసగా భావిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచీ ‘సెన్సేషనల్ ఫిలిమ్’ అని రెస్పాన్స్ వస్తోంది. ఈ విషయాన్ని నాగార్జునగారు రెండేళ్ల క్రితమే చెప్పారు’’ అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. -
విండీస్ విహారం
► వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలుపు ► పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ► రాణించిన చార్లెస్, శామ్యూల్స్ జట్టు మొత్తం టి20 స్టార్స్‌తో నిండిన వెస్టిండీస్ టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. తొలి రెండు మ్యాచ్‌లతో పోలిస్తే దక్షిణాఫ్రికాపై కాస్త కష్టపడ్డా హ్యాట్రిక్ విజయంతో నాకౌట్‌కు అర్హత సాధించింది. గేల్, బ్రేవో ఈసారి బంతితో మెరిస్తే.. శామ్యూల్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కరీబియన్లను గట్టెక్కించాడు. ఈ గ్రూప్‌లో శ్రీలంకతో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఇంటికి వెళుతుంది. నాగ్‌పూర్: భారీ హిట్టర్లున్న దక్షిణాఫ్రికాను అద్భుతమైన బౌలింగ్‌తో కట్టడి చేసిన వెస్టిండీస్ జట్టు.. టి20 ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా మూడు వికెట్లతో సఫారీలపై గెలిచింది. వీసీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. డికాక్ (46 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్), వీస్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తొలి మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు పడటంతో సఫారీలు కోలుకోలేకపోయారు. భారీగా ఆశలు పెట్టుకున్న డివిలియర్స్ (12 బంతుల్లో 10; 1 ఫోర్), మిల్లర్ (1) కూడా ఒత్తిడికి లోనుకావడంతో ప్రొటీస్ 47 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. అయితే డికాక్, వీస్‌లు ఆరో వికెట్‌కు 7.2 ఓవర్లలో 50 పరుగులు జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. రస్సెల్, గేల్, బ్రేవోలు తలా రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు చేసి గెలిచింది. శామ్యూల్స్ (44 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా.. ఇన్నింగ్స్ ఐదో బంతికి ‘డేంజర్ బ్యాట్స్‌మన్’ క్రిస్ గేల్ (4)ను అవుట్ చేసి ప్రొటీస్ పట్టుబిగించే ప్రయత్నం చేసింది. తర్వాత ఫ్లెచర్ (11) అనూహ్యంగా రనౌటైనా.. చార్లెస్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), శామ్యూల్స్ సమయోచితంగా ఆడారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 32 పరుగులు జత చేశారు. అయితే చార్లెస్, డ్వేన్ బ్రేవో (8) వరుస ఓవర్లలో అవుట్‌కావడంతో విండీస్ విజయ సమీకరణం 24 బంతుల్లో 24 పరుగులుగా మారింది. ఈ దశలో స్పిన్నర్ తాహిర్ ‘మ్యాజిక్’ చేశాడు. 17వ ఓవర్లో వరుస బంతుల్లో రస్సెల్ (4), స్యామీ (0)లను అవుట్ చేస్తే.. 18వ ఓవర్‌ను వీస్ మూడు పరుగులే ఇవ్వడంతో ప్రొటీస్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. తర్వాతి ఓవర్లో మోరిస్ రెండు ఫోర్లు సమర్పించుకున్నా శామ్యూల్స్‌ను అవుట్ చేయడంతో విండీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో రబడ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ (10 నాటౌట్) భారీ సిక్సర్ బాదడంతో సఫారీల పోరాటం వృథా అయ్యింది. తాహిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. శామ్యూల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా రనౌట్ 1; డికాక్ (బి) రస్సెల్ 47; డు ప్లెసిస్ (సి) బెన్ (బి) రస్సెల్ 9; రోసోవ్ (సి) రస్సెల్ (బి) గేల్ 0; డివిలియర్స్ (బి) బ్రేవో 10; మిల్లర్ (బి) గేల్ 1; వీస్ (సి) స్యామీ (బి) బ్రేవో 28; మోరిస్ నాటౌట్ 16; ఫాంగిసో రనౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-1; 2-13; 3-20; 4-46; 5-47; 6-97; 7-112; 8-122. బౌలింగ్: బద్రీ 3-0-22-0; రస్సెల్ 4-0-28-2; గేల్ 3-0-17-2; బ్రాత్‌వైట్ 2-0-11-0; బెన్ 4-0-20-0; బ్రేవో 4-0-20-2. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) డుప్లెసిస్ (బి) వీస్ 32; గేల్ (బి) రబడ 4; ఫ్లెచర్ రనౌట్ 11; శామ్యూల్స్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 44; బ్రేవో (సి) వీస్ (బి) ఫాంగిసో 8; రస్సెల్ (సి) మిల్లర్ (బి) తాహిర్ 4; స్యామీ (బి) తాహిర్ 0; బ్రాత్‌వైట్ నాటౌట్ 10; రామ్‌దిన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1-5; 2-34; 3-66; 4-87; 5-100; 6-100; 7-113. బౌలింగ్: రబడ 3.4-0-38-1; మోరిస్ 4-0-33-1; తాహిర్ 4-0-13-2; వీస్ 4-0-19-1; ఫాంగిసో 4-0-19-1. -
సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచినా...
కేప్ టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. సఫారీలతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో కంగారూ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 179 పరుగుల టార్గెట్ ను ఛేదించి గెలుపు అందుకుంది. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఖాజా 33, వాట్సన్ 42, స్మిత్ 44, వార్నర్ 33, మ్యాక్స్ వెల్ 19 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ 2 వికెట్లు తీశాడు. రబడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. చెలరేగి ఆడిన హషిమ్ ఆమ్లా సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 62 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టీ20ల్లో అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు. సఫారీ టీమ్ ఓడిపోవడంతో ఆమ్లా వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయింది. మిల్లర్ 30, డీ కాక్ 25 పరుగులు చేశారు. ఆమ్లా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వార్నర్' 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యారు. -
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
డికాక్, ఆమ్లా సెంచరీలు సెంచూరియన్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన సఫారీలు మూడో వన్డేలో 319 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్లతో ఘన విజయం సాధించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. రూట్ (113 బంతుల్లో 125; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేయగా... హేల్స్ (65), స్టోక్స్ (53) అర్ధసెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడ రెండేసి వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు 46.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డికాక్ (117 బంతుల్లో 135; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆమ్లా (130 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 239 పరుగులు జోడించడం విశేషం. డు ప్లెసిస్ (29 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది. వన్డేల్లో వేగంగా పది సెంచరీలు (55 ఇన్నింగ్స్ లో) చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆమ్లా (57 ఇన్నింగ్స్) రికార్డును అతను అధిగమిం చాడు. దక్షిణాఫ్రికా జట్టు 319 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది మూడోసారి మాత్రమే.: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన సఫారీలు మూడో వన్డేలో 319 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్లతో ఘన విజయం సాధించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. రూట్ (113 బంతుల్లో 125; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేయగా... హేల్స్ (65), స్టోక్స్ (53) అర్ధసెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడ రెండేసి వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు 46.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డికాక్ (117 బంతుల్లో 135; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆమ్లా (130 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 239 పరుగులు జోడించడం విశేషం. డు ప్లెసిస్ (29 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది.వన్డేల్లో వేగంగా పది సెంచరీలు (55 ఇన్నింగ్స్ లో) చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆమ్లా (57 ఇన్నింగ్స్) రికార్డును అతను అధిగమిం చాడు. దక్షిణాఫ్రికా జట్టు 319 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది మూడోసారి మాత్రమే. -
కుక్, ఆమ్లా సెంచరీలు
* దక్షిణాఫ్రికా 329/5 * ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సెంచూరియన్: ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ ఆడుతున్న స్టీఫెన్ క్రెయిగ్ కుక్ (115; 14 ఫోర్లు), హషీం ఆమ్లా (109; 19 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. కుక్, ఆమ్లా రెండో వికెట్‌కు 202 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే 36 పరుగుల వ్యవధిలో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. బవుమా (32 బ్యాటింగ్), డి కాక్ (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సెంచరీల ‘సెంచరీ’... సెంచూరియన్ టెస్టులో ఆసక్తికర రికార్డు నమోదైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెరీర్ తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 100వ ఆటగాడిగా కుక్ నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడు అతను. స్టీఫెన్ తండ్రి జేమ్స్ కుక్ 1992లో తన తొలి టెస్టులో మ్యాచ్ తొలి బంతికే డకౌట్ కాగా... దాదాపు పాతికేళ్ల తర్వాత అతని కొడుకు తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం మరో విశేషం. -
ఎంత తక్కువ తిన్నా పొట్ట తగ్గడం లేదు...
ఆయుర్వేదం కౌన్సెలింగ్ ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. అది తింటే జలుబు చేస్తుందని కొంతమంది అంటున్నారు. ఆయుర్వేదశాస్త్రం ప్రకారం ఏది నిజం? వివరాలు తెలియజేయగలరు. - మృదుల, హైదరాబాద్ ఆయుర్వేద శాస్త్రానుసారం శరీరానికి ఆరోగ్యప్రదాయకమైన ఓషధులలో అత్యంత శ్రేష్ఠమైనది ‘ఉసిరికాయ’. దీనికి సంస్కృతంలో అనేక పర్యాయపదాలున్నాయి. ఉదాహరణకు ఆమలకీ, ధాత్రీ, అమృతా, పంచరసా, శ్రీఫలీ, వయస్యా, శివాచ, రోచని మొదలైనవి. ఉసిరికాయ తింటే జలుబు చేస్తుందనడం కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి అది జలుబును తగ్గిస్తుంది. షడ్రసాలలో ఒక్క లవణరసం (ఉప్పు) మినహాయించి మిగిలిన ఐదు రసాలూ ఉసిరికాయకు ఉంటాయి. అవి... మధుర (తీపి), ఆమ్ల (పులుపు), తిక్త (చేదు), కటు (కారం), వగరు (కషాయరసం). దీనికి కరక్కాయకూ (హరితకీ) సమాన గుణధర్మాలు ఉంటాయి. కానీ కరక్యాయ ఉష్ణవీర్యం. ఉసిరికాయ శీతవీర్యం. గుణధర్మాలు: ఉసిరికాయ అత్యంత శ్రేష్ఠమైన ‘రసాయనం’. అంటే సప్తధాతువులకు పుష్టిని కలిగించి ఓజస్సును వృద్ధి చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శుక్రవృద్ధిని చేసి సంతానప్రాప్తికి కారకమవుతుంది. శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకలిని పుట్టించి, అరుగుదలను పెంచుతుంది. కడుపులోని మంటను, వాయువుని, పుల్లటి తేన్పుల్ని తగ్గిస్తుంది. వాంతిని పోగొడుతుంది. ఉదరశూలను కూడా తగ్గిస్తుంది. పొట్టలోని పురుగులను నశింపజేస్తుంది అనీమియాను, పచ్చకామెర్లను, మొలలను హరిస్తుంది. ఉసిరితో కంఠస్వరం మెరుగుపడుతుంది. ఎక్కిళ్లు తగ్గుతాయి. దగ్గు, జ్వరాలు, కళ్లెపడటం, శిరోజాలు నెరవడం, చర్మం పొడిబారడం, దద్దుర్లు, మచ్చలు తగ్గుతాయి. హృదయానికి పుష్టికరం. మధుమేహవ్యాధి నియంత్రణలో దీన్ని పసుపుతో కలిపి వాడుతారు. మూత్రంలో మంట, మూత్రం కష్టంగా వెడలడం, అతిమూత్రవ్యాధులలో గుణం కనిపిస్తుంది. మంచి ఫలితాల కోసం: వాడేవారి వయసును బట్టి, కోరుకున్న ఫలితాన్ని బట్టి తీసుకోవాల్సిన మోతాదును ఆయుర్వేద వైద్యుడు నిర్ణయిస్తారు. ఏ రూపంలో సేవించాలి: స్వరసం: అంటే పండినకాయలోంచి గింజను తీసి, దంచి, రసం తీస్తారు. కల్కం: అంటే పిక్కను తొలగించిన పిదప మిగిలిన గుజ్జు, చూర్ణం: పిక్కలు తొలగించి ఆ ముక్కలను బాగా ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఔషధశాలలు ప్రత్యేకంగా తయారు చేసే విధానాలు: ఆమలకీఘృతం బ్రహ్మరసాయనం (లేహ్యం) అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం) చ్యవనప్రాశలేహ్యం. మోతాదు: ఉసిరికాయలో ‘విటమిన్ సి’ చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా, పైన పేర్కొన్న వివిధ రూపాలలోకి మార్చినప్పటికీ చాలా తక్కువ శాతం మాత్రమే ఆ విటమిన్ తగ్గుతుంది. ఎక్కువ శాతం అలాగే ఉంటుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 28 ఏళ్లు. నన్ను పొట్ట సమస్య బాధిస్తోంది. నేను ఎంత తక్కువ మోతాదులో తింటున్నా పొట్ట మాత్రం తగ్గడం లేదు. ఎందుకు ఇలా? - సుధాకర్, ధర్మవరం పొట్ట పెరగడం అనేది సాధారణంగా శరీర తత్వాన్ని బట్టి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎంత తక్కువ ఆహారం తీసుకున్నా పొట్ట తగ్గక పోవడం జరగవచ్చు. అయితే ఇందులో కొవ్వు కాకుండా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో చూడటానికి మీరు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎలాంటి లోపాలు లేకపోతే మీరు భయపడనవసరం లేదు. ఇది మన శరీరతత్వాన్ని బట్టి వస్తుంది. కానీ మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకొని, సమయానికి భోజనం చేయడం వంటివి పాటించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మీరు మీ దగ్గరలోని డాక్టర్‌ను కలిసి ఇతర రక్త పరీక్షలు కూడా చేయించుకుంటే మంచిది. సాధారణంగా మన ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో నిర్ణయించుకోడానికి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎంత ఆహారం తీసుకుంటాం, ఎంత ఖర్చవుతోంది, ఈ రెండు సమంగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా చూసుకోవాలి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే పొట్ట వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి మీరు మీ దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి ఆహార నియమాలు పాటించి చూడండి. నాకు 37 ఏళ్లు. కడుపులో నొప్పి, బరువు తగ్గడం ఉంటే డాక్టర్‌ను కలిస్తే చిన్న పేగులో క్షయ ఉందన్నారు. ఆరు నెలలపాటు మందులు వాడాను. ఇది పూర్తిగా తగ్గుతుందో లేదో తెలుపగలరు. - రామమోహన్‌రావు, శ్రీకాకుళం సాధారణంగా చిన్న పేగు క్షయ వల్ల పేగులో పుండ్లు తయారవుతాయి. ఇది టీబీ మందుల వల్ల పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అలా కాకుంటే చిన్న పేగుల్లో స్ట్రిక్చర్ మాదిరిగా వస్తే టీబీ నియంత్రణలోకి అప్పుడప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాని ప్రస్తుతం లభించే క్షయ మందులు వ్యాధిని పూర్తిగా తగ్గించగలవు. మీరు వెంటనే దగ్గరలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మందులు వాడుతుంటే మీ సమస్య పరిష్కారమవుతుంది. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. నాకు గత ఏడాదిగా తరచుగా తలనొప్పి వస్తుంది. సాధారణ తలనొప్పే కదా అంతగా పట్టించుకోలేదు. తలనొప్పి మళ్లీ మళ్లీ వస్తుండటంతో మాకు దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాను. డాక్టర్ రాసిచ్చిన మందులు వాడితే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తోంది. రెండు మూడు రోజుల తర్వాత తలనొప్పి పునరావృతం అవుతోంది. అసలు నొప్పి ఎందుకు వస్తుంది? దయచేసి నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలరు. - భవాని, కొత్తపేట తరచుగా తలనొప్పి వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్త ప్రసరణలో మార్పులు చేటు చేసుకోవడం, మెదడులో కణుతులు ఏర్పడటం వంటి కారణాలతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తలలోకి రక్తనాళాలు ఒత్తిడికి గురికావడం వల్ల మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్‌లో తలకు ఒక పక్కభాగంలో నొప్పి ఉంటుంది. స్త్రీలలో ఈ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తలలోకి రక్తనాళాలు ఒత్తిడికి గురికావడం వల్ల మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్‌లో తలకు ఒక పక్కభాగంలో నొప్పి ఉంటుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తరచుగా తలనొప్పి వస్తుందని తెలిపారు కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరో ఫిజీషియన్‌ను సంప్రదించండి. ముందుకు మీకు ఏ కారణంతో తలనొప్పి వస్తుందో తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు, సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పరీక్షలు వచ్చిన ఫలితం ఆధారంగా చికిత్స అందిస్తారు. సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. మీకు ఏదైనా వ్యాధి నిర్థారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం తలనొప్పి సంబంధించిన అన్ని వ్యాధులకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సను కొనసాగిస్తూ వైద్యుల సూచన మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఏమైనా ఒత్తిడికి గురవుతుంటే ముందుగా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించండి.. డాక్టర్ జి. రాజశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ -
ఈ సీజన్ సిరి ఉసిరి
వేడి అన్నంలో ఉసిరి ఆవకాయ... ఆహా. కాసింత ఉసిరి పచ్చడికి కూసింత నేతి చుక్క... ఓహో.దోసెల్లోకి ఇడ్లీల్లోకి ఉసిరిపొడి... సాహో. ఇది కార్తీక మాసం. మార్కెట్లో ఉసిరి సిరి దొరికే మాసం. ఆరోగ్యమే ఐశ్వర్యం అనుకునేవారికి ఉసిరికి మించి ఔషధి లేదు. పిల్లలూ పెద్దలూ నిర్భయంగా దీని రక్షణలోకి వెళ్లొచ్చు. పట్రండి. పచ్చడి పెట్టండి. భలేగా రుచి చూడండి. ఉసిరి పొడి కావలసినవి: ఉసిరి కాయలు - 6, ఉల్లిపాయ - 1 (చిన్నది), వెల్లుల్లి రేకలు - 3, నూనె - 3 టేబుల్ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంతపోపుకోసం: ఆవాలు - పావు టీ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి పోయే వరకు నీడలో ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేయాలి ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి మిక్సీలో... ఉసిరికాయ ముక్కలు, ఉల్లి తరుగు వేసి కచ్చాపచ్చాగా తిప్పాలి బాణలిలో మూడు టీ స్పూన్ల నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ఉసిరి మిశ్రమం జత చేసి బాగా కలపాలి కారం, ఉప్పు జత చేసి మరోమారు కలిపి మిశ్రమం విడివిడిలాడే వరకు ఉంచి, దింపేయాలి చల్లారాక గాలి చొరని డబ్బాలో వేసి, ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి అన్నంలో కాని, ఇడ్లీలతో కాని తింటే బావుంటుంది. ఉసిరికాయ పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు - 12, సెనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 8, కరివేపాకు - 3 రెమ్మలు, ఎండు మిర్చి - 8, పచ్చి మిర్చి - 6, కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - 2 టీ స్పూన్లు, పంచదార లేదా బెల్లం - టీ స్పూను, నూనె - 4 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను తయారీ: బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించి తీశాక, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి. అదే బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక ఉసిరికాయలు (శుభ్రంగా కడిగి తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి) వేసి, పైన కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టాలి ఐదు నిమిషాలయ్యాక చింతపండు గుజ్జు వేసి ఉసిరికాయలు మెత్తబడే వరకు ఉడికించాలి ఉసిరికాయలు బాగా చల్లారాక కాయలను చేతితో జాగ్రత్తగా నొక్కి, గింజలు వేరు చేయాలి మిక్సీలో ముందుగా వేయించి ఉంచుకున్న పోపు వేసి మెత్తగా పొడి చేయాలి పచ్చి మిర్చి, ఎండు మిర్చి జత చేసి మరోమారు తిప్పాలి కారం, ఉప్పు, పంచదార లేదా బెల్లం, వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు తిప్పాలి చివరగా ఉసిరికాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, తీసేయాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి తీసి, పచ్చడిలో పైన వేసి కలపాలి వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఉసిరికాయ నల్ల పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు - పావు కేజీ, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను తయారీ: ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, నీడలో ఆరబోసి తడిపోయాక, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా అయ్యాక తీసేసి, గింజలను వేరు చేయాలి పసుపు జత చేసి ఉసిరికాయ ముక్కలను గాలిచొరని డబ్బాలో రెండు రోజులు ఉంచాలి మూడవ నాడు బయటకు తీసి చేతితో మెత్తగా మెదిపి, ఉప్పు జత చేసి బాగా కలిపి జాడీలో ఉంచాలి వారం రోజుల తర్వాత వాడుకోవాలి ప్రతిరోజూ వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో ఉసిరికాయ పచ్చడి, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యం. మెంతి ఉసిరికాయ కావలసినవి: ఉసిరి కాయలు - 10, మెంతులు - టీ స్పూను (దోరగా వేయించి మెత్తగా పొడి చేయాలి), కారం - 2 టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - కొద్దిగా, ఇంగువ - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఎండు మిర్చి - 6 (ముక్కలు చేయాలి) తయారీ: ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి తడి పోయే వరకు నీడలో ఆరబెట్టి, చిన్న ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఉసిరికాయ ముక్కలు వేసి దోరగా వేయించి తీసేయాలి అదే బాణలిలో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి తీసేయాలి ఒక పాత్రలో ఉసిరికాయ ముక్కలు, మెంతి పొడి, ఉప్పు, నూనె, పసుపు వేసి బాగా కలపాలి చివరగా పోపు వేసి బాగా కలిపి రెండు రోజులు ఊరనిచ్చాక వాడుకోవాలి. ఉసిరి ఆవకాయ కావలసినవి ఉసిరి కాయలు - అర కేజీ, కారం - 100 గ్రా., ఉప్పు - 100 గ్రా., ఆవపొడి - 150 గ్రా., నూనె - అర కేజీ, మెంతులు - టీ స్పూను. తయారీ: ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి నీడలో తడిపోయే వరకు ఆరబెట్టి, కాయలకు చిన్న చిన్న గాట్లు పెట్టాలి బాణలిలో నూనె కాగాక ఉసిరి కాయలను వేసి దోరగా వేయించి దింపేయాలి ఒక గిన్నెలో ఉప్పు, కారం, ఆవ పొడి వేసి కలపాలి ఉసిరికాయ ముక్కలను జతచేసి బాగా కలిపి రెండు రోజుల తర్వాత మరింత నూనె పోసి బాగా కలపాలి వారం రోజుల తర్వాత వాడుకుంటే రుచిగా ఉంటుంది. -
అమ్మానాన్న ఆట!
ఇటీవలే ‘చీకటిరాజ్యం’లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్‌హాసన్ అప్పుడే మరో కొత్త చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు. ‘అమ్మా నాన్న ఆట’పేరుతో ఓ ఫ్యామలీ రొమాంటిక్ డ్రామా చేయను న్నారు. గతంలో కమల్‌తోనే ‘చాణక్యన్’ (తెలుగులో ‘చాణక్య’) సినిమా చేసిన రాజీవ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న చిత్రంలో అమల అతిథి పాత్ర పోషించనున్నారు. మరో పాత్రను ఒకప్పటి కథానాయిక జరీనా వహాబ్ చేయనున్నారు. అమెరికాలో చిత్రీకరణ జరగనుంది. సినిమా చూసి థ్రిల్లయ్యా! - అమల ‘‘ ‘చీకటిరాజ్యం’ చాలా డిఫరెంట్‌గా ఉంది. సినిమా చూసి థ్రిల్ ఫీలయ్యా’’ అని అమల వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ‘చీకటిరాజ్యం’ థ్యాంక్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ-‘‘పదేళ్లకొకసారి మాత్రమే ఇలాంటి సినిమా చేయడం సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజేశ్ ఎం సెల్వా, నటి మధుశాలిని, రచయిత అబ్బూరి రవి, ‘మల్టీ డెమైన్షన్’ వాసు తదితరులు మాట్లాడారు. -
వనాలలో... వెరైటీగా!
పసిరిక తొక్కడం, ఉసిరిక నమలడం రెండూ ఆరోగ్యమే. ఉసిరిచెట్టు కింద సహపంక్తి అంటేనే స్నేహాలు పురివిప్పడం. సిరి నాథుడినీ, హర దేవుడినీ విరివానతో తడపడం. లాలాజలాభిషేకంతో పరబ్రహ్మస్వరూపాన్ని పూజించడం. ఆరోగ్యప్రదాతలూ, అశ్వనీదేవతల అనుగ్రహం పొందడం. రండి... ఈ కార్తికంలో స్నేహామృతాలను ఆస్వాదిద్దాం. రుచులతో పాటు ఆరోగ్య సిరుల మూట విప్పుదాం. సెసేమ్ వెజ్ టోస్ట్ కావలసినవి: క్యారట్ తురుము - పావు కప్పు, ఫ్రెంచ్ బీన్స్ తరుగు - పావు కప్పు, బంగాళదుంప - 1, క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు, ఉల్లి తరుగు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, అల్లం తురుము - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, కార్న్ స్టార్చ్ - టేబుల్ స్పూను, సోయా సాస్ - అర టేబుల్ స్పూను, నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, బ్రెడ్ స్లైసులు - 5 (బ్రౌన్ లేదా గోధుమ బ్రెడ్), నూనె - డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, తొక్క తీసి మెత్తగా మెదపాలి క్యారట్, బీన్స్ ముక్కలను కూడా ఉడకబెట్టి, గరిటెతో మెత్తగా మెదపాలి ఒక పాత్రలో బంగాళదుంప ముద్ద, క్యార ట్, బీన్స్ ముద్ద వేసి కలపాలి అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కార్న్‌ఫ్లోర్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, పూర్తిగా చల్లారేవరకు పక్కన ఉంచాలి వేరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌కి తగినన్ని నీళ్లు జత చేసి ముద్దలా చేసి పక్కన ఉంచాలి బ్రెడ్ స్లైసులను త్రికోణాకారంలో కట్ చేయాలి బ్రెడ్ మీద ముందుగా కార్న్‌ఫ్లోర్ ముద్దను కొద్దిగా పూసి, ఆ పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వీటి మీద సమానంగా పరిచి, చేతితో కొద్దిగా ఒత్తి ఆ పైన మళ్లీ కార్న్‌ఫ్లోర్ ముద్దను ఉంచాలి పైన నువ్వులను చల్లి తేలికగా ఒత్తాలి. ముద్ద మీద చల్లడం వల్ల బాగా అతుక్కుంటాయి బాణలిలో నూనె కాగాక, నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. ఖజూర్ హల్వా కావలసినవి: బాదం తరుగు-టేబుల్ స్పూను, ఖర్జూరం తరుగు-పావు కేజీ, నెయ్యి-2 టేబుల్ స్పూన్లు, పాలు-అర లీటరు, మిల్క్ మెయిడ్-200 గ్రా. తయారీ: ఖర్జూరం తరుగును పాలలో సుమారు గంటసేపు నానబెట్టి, మిక్సీలో వేసి ముద్దలా చేయాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక, మిల్క్‌మెయిడ్, మెత్తగా చేసిన ఖర్జూరం ముద్ద వేసి ఆపకుండా కలుపుతూ, సన్నని మంట మీద ఉడి కించాలి బాదం తరుగుతో అలంకరించి అందించాలి. పనీర్ మంచూరియన్ డ్రై కావలసినవి: పనీర్ - 250 గ్రా., కార్న్ స్టార్చ్ - 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, పంచదార - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 3 టేబుల్ స్పూన్లు, సాస్ కోసం, టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ - అర టేబుల్ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను, రైస్ వెనిగర్ - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, నీళ్లు - పావు కప్పు, ఉల్లి తరుగు - కప్పు, క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, అల్లం తురుము - టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, ఉప్పు - తగినంత. తయారీ: పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి, పొడిగా ఉన్న కిచెన్ టవల్ మీద సుమారు అరగంట సేపు ఆరబెట్టి, ఆ తరవాత పెద్ద పాత్రలోకి తీసుకోవాలి కారం, మిరియాల పొడి, ఉప్పు, కార్న్ స్టార్చ్ జత చేసి జాగ్రత్తగా కల పాలి బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, పనీర్ ముక్కలు వేసి గోధుమ వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి పావు కప్పు నీళ్లకి, కార్న్‌స్టార్చ్, మసాలా దినుసులు జత చేసి బాగా కలిపి, ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి అర టేబుల్ స్పూను సోయా సాస్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ జత చేయాలి ఉప్పు, కారం, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి మిశ్రమ మంతా పనీర్‌కి బాగా పట్టి, చిక్కబడే వరకు కలపాలి వెనిగర్ జత చేసి, రెండు నిమిషాలు ఉంచి దించేయాలి ఉల్లి కాడల తరుగుతో అలంకరించి అందించాలి. షెజ్వాన్ పొటాటో చిల్లీ కావలసినవి: బంగాళదుంపలు - 3 (మీడియం సైజువి), కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తరుగు - టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, అల్లం తురుము - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, ఎండు మిర్చి - 4 (కొద్దిగా నీళ్లు జత చేసి పేస్ట్ చేయాలి), ఎండు మిర్చి - 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి), సోయాసాస్ - 2 టీ స్పూన్లు, నీళ్లు - 4 టేబుల్ స్పూన్లు, తెల్ల వెనిగర్ - అర టీ స్పూను, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను (2టేబుల్ స్పూన్ నీళ్లలో చిక్కగా కలపాలి), ఉప్పు, పంచదార, మిరియాల పొడి - తగినంత, కొత్తిమీర తరుగు - టీ స్పూను. తయారీ: బంగాళదుంపలను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి, చన్నీళ్లలో అరగంట సేపు ఉంచి, నీళ్లు వడకట్టి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేడయ్యాక, ఈ ముక్కలను అందులో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు డీప్ ఫ్రై చేసి, పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి వేరొక బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి తురుము వేసి బాగా కలపాలి మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి సోయాసాస్, ఎండు మిర్చి ముద్ద, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలపాలి నీళ్లు జత చేసి సన్నని మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లలో టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న మిశ్రమానికి జత చేయాలి కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి, మిశ్రమం చిక్కబడేవరకు బాగా క లపాలి తయారుచేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు జత చేసి బాగా కలిపి దింపేయాలి కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. బనానా స్ట్రాబెర్రీ స్వీట్ కావలసినవి: అరటిపండు - 1 (చిన్నది), పెరుగు - అర కప్పు, వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను, స్ట్రాబెర్రీ పండ్లు - 10, బాదం తరుగు - టేబుల్ స్పూను తయారీ: ముందుగా ఒక పాత్రలో పెరుగు బాగా గొలక్కొట్టాలి స్ట్రాబెర్రీ పండ్ల పై ఉన్న తొడిమల్ని తీసేయాలి అరటిపండు తొక్క తీసి మెత్తగా మెదపాలి ఒక పాత్రలో పెరుగు, వెనిలా, బాదం తరుగు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని స్ట్రాబెర్రీల మీద ఉంచి, అందించాలి. ధాపా దహీ కావలసినవి: మిల్క్‌మెయిడ్ - 200 గ్రా., కిస్మిస్, జీడిపప్పులు - 25 గ్రా., పెరుగు - 3 కప్పులు, ఏలకుల పొడి - కొద్దిగా తయారీ: పెరుగును పల్చటి వస్త్రంలో గట్టిగా మూట గట్టి, అరగంట సేపు వేలాడదీయాలి (నీరంతా పోతుంది) మిల్క్‌మెయిడ్, ఏలకుల పొడి జత చేసిపైన వస్త్రంతో కప్పి ఉంచాలి మరిగించిన నీటి పాత్రలో ఈ పాత్రను సుమారు 20 నిమిషాలు ఉంచి, తీసి చల్లారనివ్వాలి కిస్మిస్, జీడిపప్పులతో అలంకరించి చల్లగా అందించాలి. గమనిక: కార్న్ స్టార్చ్ తయారీ కోసం... 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌కి 3 టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి బాగా కలిపితే స్టార్చ్ రెడీ. -
ఆమ్లా, తాహిర్‌లపై దృష్టి
నేటి నుంచి రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో దక్షిణాఫ్రికా ఢీ భారత యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం ముంబై: దక్షిణాఫ్రికా జట్టు టి20, వన్డే సిరీస్‌లు గెలుచుకున్నా... ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఆమ్లాతో పాటు స్పిన్నర్ తాహిర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే టెస్టుల్లో దక్షిణాఫ్రికా అవకాశాలు బాగుండాలంటే కచ్చితంగా ఈ ఇద్దరే కీలకం. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌పై ఈ ఇద్దరూ దృష్టి సారించారు. టెస్టుల్లో జట్టు సారథిగానూ వ్యవహరించే ఆమ్లా ఓ భారీ ఇన్నింగ్స్‌తో గాడిలో పడటం కీలకం. వన్డే జట్టుతో పోలిస్తే జట్టులో కొద్దిగా మార్పులు ఉన్నాయి. డుఫ్లెసిస్, డివిలియర్స్‌లకు పెద్దగా సమస్య లేదు. బావుమా, హార్మర్, ఎల్గర్లాంటి క్రికెటర్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా పరిస్థితులకు అలవాటు పడొచ్చని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఇక బౌలింగ్‌లో పేసర్ మోర్నీ మోర్కెల్ కోలుకున్నా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియని సందిగ్దత. స్టెయిన్, ఫిలాండర్, రబడ కూడా ప్రాక్టీస్ కోసం ఆడొచ్చు. ఆఫ్ స్పిన్నర్లు హార్మర్, పిడిట్లను కూడా ఈ మ్యాచ్ ద్వారా పరీక్షించే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆక ర్షించాలని భారత యువ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ జట్టుకు పుజారా సారథ్యం వహిస్తుండగా... లోకేశ్ రాహుల్‌తో పాటు కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, నామన్ ఓజాలాంటి బ్యాట్స్‌మెన్ సత్తా చూపించాలని తహతహలాడుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మీద కూడా అందరి దృష్టి ఉంది. బౌలింగ్‌లో కరణ్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లతో పాటు ఠాకూర్, జాక్సన్ కూడా కీలకం. సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో సఫారీలు భారత యువ జట్టు చేతిలో ఓడిపోయారు. అయితే అసలు సిరీస్‌లో మాత్రం భారత్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితం కంటే... టెస్టులకు సన్నాహకంగా ఉపయోగించుకోవడం దక్షిణాఫ్రికా లక్ష్యం. -
ఇద్దరూ ఇద్దరే...
వాళ్లిద్దరూ ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా ‘క్లాసికల్’ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు ‘రాక్‌స్టార్’లా చిందేయిస్తాడు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రస్తుత క్రికెట్లో నిలకడకు మారుపేరుగా మారారు. ఈసారి గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం. * పోటాపోటీగా సాగుతున్న కోహ్లి, ఆమ్లాల కెరీర్ * గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం సాక్షి క్రీడావిభాగం: ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల పేర్లు చెప్పమంటే ఎవరైనా ముందుగా కోహ్లి, ఆమ్లాల పేర్లు చెప్పాల్సిందే. ఈ ఇద్దరూ తమ జట్లకు ఎన్నో సంచలన విజయాలు అందించారు. 50కి పైగా సగటుతో పరుగులు చేయడం, తరచూ సెంచరీలు సాధించడం, చిరస్మరణీయ విజయాలు అందించడం ద్వారా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే దక్షిణాఫ్రికా జట్టు ఆడుతుందంటే అటు అభిమానుల దృష్టి, ఇటు ప్రత్యర్థుల లక్ష్యం ఆమ్లానే. అలాగే భారత్ తరఫున కోహ్లిది కూడా అదే పాత్ర. అతను ఒక్కసారి కుదురుకుని ఆడాడంటే పరుగుల ప్రవాహమే. ఈసారి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్‌కు బాగా క్రేజ్ పెరిగింది. జాతీయ నేతల పేర్లతో సిరీస్ ఏర్పాటు కావడం, ఇటీవల కాలంలో రెండు జట్లు కూడా బలమైన ప్రత్యర్థులతో ఆడకపోవడం వల్ల ఈ సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సహజంగానే ఈ సిరీస్ సందర్భంగా కోహ్లి, ఆమ్లాల గురించి చర్చ మొదలైంది. ఇద్దరి ఆటశైలి భిన్నం... దక్షిణాఫ్రికా స్టార్ ఆమ్లా ఆటతీరు పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. క్రికెట్ పుస్తకాల్లో ఉండే షాట్లు ఆడి చూపిస్తాడు. అధికంగా ప్రయోగాలు చేయడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధిస్తాడు. అతను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఇక అవుట్ చేయడం చాలా కష్టం. అన్ని ఫార్మాట్లలో కలిపి 13 వేలకు పైగా పరుగులు చేసినా... ఇప్పటివరకూ కెరీర్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 56 మాత్రమే. అటు కోహ్లి ఆట దీనికి భిన్నం. షాట్లలో ప్రయోగాలు చేయడానికి వెనుకాడడు. అదే విధంగా బలమైన షాట్లతో బౌండరీలు, సిక్సర్లతో పరుగులు సాధిస్తాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేలకుపైగా పరుగులు చేస్తే అందులో 91 సిక్సర్లు ఉన్నాయి. ఆమ్లా కెరీర్ అంతటా టాప్ ఆర్డర్‌లోనే ఆడాడు. కోహ్లి మాత్రం ఫార్మాట్‌ను బట్టి టాప్ ఆర్డర్‌తో పాటు మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్లోనూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. నిలకడ విషయంలో ఇద్దరూ సమానంగా ఉన్నా... ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విరాట్ కోహ్లి ముందుంటాడు. ఆమ్లానే సీనియర్... ఇద్దరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి ముందుగా వచ్చింది మాత్రం ఆమ్లానే. 2004లో భారత్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు ద్వారా ఆమ్లా అరంగేట్రం చేశాడు. టెస్టు స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన అతను... వన్డేల్లో 2008లో అరంగేట్రం చేశాడు. దీనికి భిన్నంగా కోహ్లి తొలుత 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసి ... మూడేళ్ల తర్వాత 2011లో టెస్టు జట్టులో స్థానం సంపాదించగలిగాడు. ఇద్దరూ వన్డేల్లో ఒకే ఏడాది అరంగేట్రం చేసినా కోహ్లి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడేళ్ల కాలంలో భారత్ ఎక్కువగా వన్డేలు ఆడటం వల్ల సహజంగానే కోహ్లి ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఇద్దరి కెరీర్ అప్పటి నుంచి కూడా పోటాపోటీగానే సాగుతోంది. కోహ్లి 22 సెంచరీలు చేస్తే... ఆమ్లా 21 శతకాలు కొట్టాడు. కోహ్లి అనేక రికార్డులు సాధించాడు. అయితే వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి కోహ్లి ఘనతలన్నింటినీ ఆమ్లా అధిగమిస్తూ వస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ... ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో అనేక మంది క్రికెటర్లు ఏదో ఒక ఫార్మాట్‌కు లేదా రెండు ఫార్మాట్లకు పరిమితమవుతున్నారు. ప్రతి జట్టులోనూ అన్ని రకాల ఫార్మాట్లలో ఆడే నైపుణ్యం ఉన్న క్రికెటర్ల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ ఇద్దరూ మాత్రం మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అలాగే తమ తమ టెస్టు జట్లకు ఈ ఇద్దరూ ప్రస్తుతం కెప్టెన్లు. ఆమ్లా వయసు 33 ఏళ్లు. కోహ్లి తనకంటే ఆరేళ్లు చిన్నోడు. కాబట్టి ఆమ్లాతో పోలిస్తే విరాట్ ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగుతాడు. కాబట్టి భవిష్యత్తులో ఆమ్లా కంటే కోహ్లి ఎక్కువ రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. అయితే ఆమ్లా రిటైరయ్యే వరకు మాత్రం కోహ్లికి గట్టి పోటీయే ఉంటుంది. ఎందుకు కీలకమంటే... ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు తమ జట్లకు ప్రధాన బలం. దక్షిణాఫ్రికా జట్టు ఒకప్పుడు స్పిన్ ఆడటానికి చాలా ఇబ్బంది పడేది. ముఖ్యంగా ఉపఖండం పిచ్‌లపై స్పిన్నర్లు ఆ జట్టును కకావికలు చేసేవారు. ఆమ్లా రంగప్రవేశం తర్వాత ఈ పరిస్థితి మారింది. మిగిలిన క్రికెటర్లు కూడా స్పిన్ ఆడటంలో మెరుగుపడ్డా... ఆమ్లా మాత్రం స్పిన్నర్లకు గోడలా నిలబడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఇన్నింగ్స్‌కు యాంకర్ పాత్ర పోషించే ఆమ్లా... ప్రస్తుత సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు కీలకం. ఇక కోహ్లి విషయానికొస్తే స్వదేశంలో అతను తిరుగులేని క్రికెటర్. వన్డేల్లో అతను చేసిన 22 సెంచరీల్లో 14 భారత్, బంగ్లాదేశ్‌లలో చేసినవే. మందకొడి పిచ్‌ల మీద విరాట్ జోరుకు ఈ గణాంకాలు నిదర్శనం. దక్షిణాఫ్రికా జట్టులో ఇమ్రాన్ తాహిర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ ఉన్నా... స్టెయిన్ నేతృత్వంలోని పేసర్లు కూడా చాలా కీలకం. కొత్త బంతితో బౌన్స్‌ను, పాత బంతితో రివర్స్ స్వింగ్నూ రాబడతారు. ఈ రెండింటిని ఎదుర్కొనే సత్తా కోహ్లిలో ఉంది. ఇటీవల కాలంలో ఒకట్రెండు ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే ఏడాది కాలంగా కోహ్లి ఆటతీరు అతని స్థాయికి తగ్గట్లుగా లేదు. మళ్లీ దక్షిణాఫ్రికాతో సిరీస్ ద్వారా తన ముద్రను చూపించాలని విరాట్ పట్టుదలతో ఉన్నాడు. -
సెప్టెంబర్ 12న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అమల (నటి); ప్రాచీ దేశాయ్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన శక్తి, సౌందర్య పోషణ అలవడతాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. అయితే ఆత్మవిశ్వాసం తరుగుతూ పెరుగుతూ, ఆలోచనలలో అస్థిరత వల్ల ఒడుదొడుకులు ఉండచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. వీరి పుట్టినతేదీ 12 గురు సంఖ్య కావడం వల్ల విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. విజయాలు వరిస్తాయి. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాల వల్ల లబ్ధి పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. మీ మాటకు విలువ వస్తుంది. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: తెలుపు, క్రీమ్, శాండల్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: సోమ, బుధ, గురు; శుక్రవారాలు; సూచనలు: దక్షిణామూర్తికి, శివుడికి అభిషేకం, ఆలయాలు, ప్రార్థనామందిరాలు, మదరసాలలో భోజన సదుపాయాలు కల్పించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
నాగ్ నా నగ
అమల ప్రేమకు నిర్వచనం చెప్పలేం. ఆమె అనుబంధానికి పేరు పెట్టలేం. అనురాగానికి వెల కట్టలేం. అభిమానానికి తూకం వెయ్యలేం. ఆత్మీయతకు కొలమానం కనిపెట్టలేం. ఆరాధనకు అంచులు కుట్టలేం. ఆప్యాయతలకు ఆదిని అన్వేషించలేం. అన్యోన్యతకు అంతం వెతకలేం. ఈ ఏడు వారాల నగలు ఉండగా... వేరే ఆభరణాలెందుకు? అలంకారాలెందుకు? ► పెళ్లయ్యి ఈ జూన్‌కి ఇరవైమూడేళ్లయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాకుంటే, కొన్నేళ్ళు మీరు నం.1గా ఉండేవారేమో. కానీ, కెరీర్‌ని త్యాగం చేసేశారే? అమల: పెళ్లి చేసుకుందామని నాగ్ నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను కలలో కూడా ఊహించనంత అందమైన జీవితాన్నిచ్చాడు. నన్ను సినిమాలు చేయొద్దని తను చెప్పలేదు. పెళ్లయిన తర్వాత కూడా నేను వర్క్ చేస్తున్నాను. కాకపోతే సినిమాలు కాదు.. సామాజిక కార్యక్రమాల కోసం పని చేస్తున్నాను. సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నది నేనే. త్యాగం లాంటి పెద్ద మాటలు మాట్లాడను. కథానాయికగా ఎందుకు కొనసాగలేదని ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ► సినిమాలకు దూరంగా ఉండాలని ఎందుకనుకున్నారు? పెళ్లయ్యాక పదిహేనేళ్ల వరకూ కెరీర్ గురించి ఆలోచించేంత తీరిక లేదు. పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లి అవసరం ఉంటుంది. అఖిల్ ఆలనాపాలనా చూసుకునేదాన్ని. ఇంటి బాధ్యతలతో పాటు బ్లూ క్రాస్ కృషితోనే నాకు సరిపోయేది. ఇప్పుడు అఖిల్ సొంత నిర్ణయాలు తీసుకునేంత ఎదిగాడు. అందుకని, నాకు ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేసేంత, నాకు నచ్చిన పనులు చేసేంత వీలు చిక్కింది. అందుకే, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి శేఖర్ కమ్ముల అడిగినప్పుడు చేశా. తమిళ సీరియల్ ‘ఉయిర్‌మై’లో నటించా. ► సినిమాల్లోకి వచ్చినప్పటిలానే ఇప్పుడూ ఉన్నారే? ఒకప్పుడు బొద్దుగానే ఉండేదాన్ని. ఆ తర్వాత సన్నబడ్డా. సినిమా తారలంటే మరీ సన్నగా, చాలా లావుగా... కాకుండా మధ్యస్తంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇన్నేళ్లూ సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆరోగ్యం కోసం చేస్తున్న వ్యాయామాలు, యోగా, మంచి డైట్.. నేనిలా ఉండడానికి కారణం అయ్యాయి. ► డైట్ అంటే గుర్తొచ్చింది మీరు ‘వేగన్’ కదా. వేగన్ అంటే తెలియనివారికి కొన్ని విషయాలు చెబుతారా? ‘వేగన్’ అంటే మూగజీవాల నుంచి వచ్చే దేన్నయినా ఆహారంలో చేర్చుకోకపోవడం. నేను పాలు తాగను. తేనెకి దూరం. మాంసం జోలికెళ్లను. పదకొండేళ్ల వయసులోనే మాంసాహారం మానేశా. ఎనిమిదేళ్ల క్రితం వేగన్‌గా మారా. పాలు మానేసినప్పట్నుంచీ ఆరోగ్యం ఇంకా బాగుంటోంది. ► వయసు పెరిగాక, ఎముకలు బలహీనమవుతాయనీ, క్యాల్షియమ్ కోసం లేడీస్ పాలు తాగాలనీ డాక్టర్లు చెబుతారే? చాలామందికి తెలియని విషయం ఏంటంటే... పాలల్లోకన్నా నువ్వులలో క్యాల్షియమ్ ఎక్కువుంటుంది. గ్లాసుడు పాలల్లో 10 మిల్లీగ్రాములు కాల్షియమ్ ఉంటే.. 100 గ్రాముల నువ్వులలో వెయ్యి మిల్లీగ్రాములుంటుంది. కానీ, పాలలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉంటుందని డైరీ ఫామ్స్ ప్రకటనలిచ్చి, ఆకర్షిస్తుంటాయి. నువ్వులు మంచివని ప్రకటించుకోవడం పాపం వాటిని పండించే రైతులకు తెలియదుగా. అలాగే వేరుసెనగపప్పు కూడా మంచిదే. ఇవాళ మనందరం ఏదైనా కొనాలంటే ప్రకటనలు చూసే కొంటున్నాం కానీ, నిజంగా అవి మంచివేనా? అనేది ఆలోచించలేకపోతున్నాం. భారీ ప్రకటనలతో చాలామంది వ్యాపారస్థులు ప్రలోభపెట్టేస్తున్నారు. ► నాగార్జున మీ సొంతం కావడంపై చాలామంది అసూయపడతారు. హ్యాండ్సమ్గా కనిపించే నాగార్జున ఎలాంటి వ్యక్తి? నాగ్ చాలా చాలా స్పెషల్. తనను పెళ్లి చేసుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదం. వ్యక్తిగా నాగ్ మంచి హ్యూమన్ బీయింగ్. అందుకే తనంటే ప్రేమ, ఆరాధన, గౌరవం. ► భర్త అందగాడైతే వేరే అమ్మాయిల దృష్టి పడకుండా కాపాడుకోవాల్సొస్తుంది. ఈ విషయంలో మీకు టెన్షన్ తప్పదేమో? మానసిక పరిణతి లేని, సున్నితమైన మనస్కులైతే టెన్షన్ పడతారేమో. నేను అభద్రతాభావానికి గురయ్యేలా నాగ్ ఎప్పుడూ ప్రవర్తించలేదు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళను నేనే అనే నమ్మకాన్ని కలిగించాడు. ఎంతమంది అందమైన అమ్మాయిలు చుట్టూ ఉన్నా, ‘నువ్వంటే నాకు చాలా ప్రేమ’ అనే విధంగా ప్రవర్తించడంతో పాటు ‘నువ్వు మాత్రమే నాకు ప్రత్యేకం’ అనే ఫీల్‌ని కలగజేస్తాడు. నేను నెగటివ్ ఎమోషన్స్‌కి విలువ ఇవ్వను. ఇస్తే అసూయ, అభద్రత, కోపం... కలుగుతాయి. ► మీరెక్కువగా చేనేత చీరలే వాడతారెందుకని? ఖర్చు తక్కువ కాబట్టి షాపింగ్‌లో నాగ్‌కి ఇబ్బంది ఉండదేమో? అది నిజమే. నా డ్రెస్‌ల ఖర్చు తక్కువే అయినప్పటికీ... ప్రయోజనాత్మక కార్యక్రమాల కోసం నాగ్ ఇచ్చే భారీ చెక్స్‌ని కాదనను. నాగ్‌ది చాలా పెద్ద మనసు. కాదనుకుండా ఇచ్చేస్తాడు. చేనేత చీరలు బాగుంటాయి. మనం కనుక నెలకు రెండు చేనేత చీరలు కొంటే.. దాని చేనేతనే నమ్ముకున్న తయారీదారుల కుటుంబం నెలసరి ఖర్చులకు దాదాపు సరిపోతుంది. పైగా అవి మెత్తగా ఉంటాయి, హాయిగా ఉంటుంది. ► నగలు కూడా పెద్దగా వాడరనిపిస్తోంది. మరి... నాగార్జున మీకిచ్చిన మొదటి ఆభరణం గురించి? నాకో అందమైన ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చాడు. అయితే నీళ్లల్లో డైవింగ్ చేస్తున్నప్పుడు నా చేతి మీద ట్యాంక్ పడింది. దాంతో ఆ ఉంగరానికి ఉన్న రాయి పగిలిపోయింది. అది పగిలినందువల్ల నా వేలికి ఏమీ కాలేదు. సో.. నాగ్ ఇచ్చిన ఆ ఉంగరం నా వేలును కాపాడినట్లుగా నేను భావిస్తాను. ఓ బర్త్‌డేకి నాకు మంచి ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత నాకు నగలేవీ వద్దని చెప్పడంతో మానేశాడు. ► బలమైన కుటుంబం ఏ స్త్రీకైనా కొండంత అండ. ‘అక్కినేని’ మీ ఇంటి పేరుగా మారినందుకు ఎలా అనిపిస్తోంది? అక్కినేని కుటుంబంలో ఉండడం నా అదృష్టం.. ఆ దేవుడి ఆశీర్వాదం. ఎక్కడికెళ్లినా ప్రేమాభిమానాలు, గౌరవం దక్కుతున్నాయి. మారుమూల ప్రజలను కలవడానికి వెళ్లినప్పుడు పెద్దవాళ్లందరూ మా మావయ్య సంగతులు, తర్వాతి తరంవారు నాగ్‌ను, యూత్ ఏమో నాగచైతన్య, అఖిల్ గురించి అడుగుతుంటారు. మా పట్ల వాళ్ల ప్రేమకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ► మీ అత్తగారు స్వర్గీయ అన్నపూర్ణ గురించి రెండు మాటలు? ఆమెలో నేను అమ్మను చూసుకున్నా. పెళ్లయిన కొత్తలో తెలుగు సంప్రదాయాల గురించి ఆమే చెప్పింది. తెలుగు నేర్పిందీ అత్తగారే. ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ► పెళ్లయిన కొత్తలో అక్కినేనితో మూవ్ కావడానికి ఏమైనా...? మావయ్యగారు చాలా గొప్ప వ్యక్తి. చాలా పద్ధతిగా ఉండేవారు. క్రమశిక్షణ గల వ్యక్తి. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి, అందర్నీ అర్థం చేసుకుంటారు. కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించలేదు. మావయ్యగారి ప్రేమాభిమానాల్ని మర్చిపోలేను. ఆయన మా మనసుల్లో ఉన్నారు. ► మీ అమ్మానాన్నలతో, బ్రదర్, సిస్టర్‌తో నాగ్ ఎలా...? నాకు మా అమ్మా, నాన్న, బ్రదర్, సిస్టర్ మాత్రమే కాదు.. ఓ స్టెప్ మామ్ కూడా ఉంది. మా వాళ్లతో నాగ్ చాలా బాగుంటాడు. వాళ్లెప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు చాలా కేరింగ్‌గా ఉంటాడు. మా వాళ్ల నుంచి ఏమీ ఎదురుచూడడు. ఎలాంటి నిబంధనలూ లేకుండా స్వచ్ఛంగా అభిమానిస్తాడు. ► నాగచైతన్యకు మీరు తల్లి స్థానాన్ని ఇచ్చారా? అలా ఎదురు చూడటం తప్పు. ఎందుకంటే, తనకో అమ్మ ఉంది. ఆ అమ్మ స్థానాన్ని నేను లాక్కోలేను. చైతన్య మా కుటుంబ సభ్యుడే. తనంటే నాకు చాలా ఇష్టం. ‘వండర్ఫుల్ బాయ్’. ► మీ స్టెప్ మదర్ మీతో ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. నాకు మా అమ్మగారు ఉన్నారు కాబట్టి నా స్టెప్ మామ్‌ని నేను అమ్మగా అంగీకరించలేదు. అవిడ కూడా మా అమ్మ స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నించలేదు. ఆమె మా కుటుంబ సభ్యురాలే. ఆమె అంటే నాకిష్టమే. మా మధ్య మంచి అనుబంధం ఉంది. ► అఖిల్‌ని తెరపై చూడడానికి ఓ తల్లిగా...? ఎస్.. తనను హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై చూసుకోవాలనే కోరిక ఉంది. ► మరో జన్మ అంటూ ఉంటే... మీరేం అడుగుతారో తెలుసు.. అవును.. నాగ్‌కి భార్యగానే ఉండాలని కోరుకుంటున్నాను. - డి.జి. భవాని ఫోటో: శివ మల్లాల లవ్ లైఫ్, మ్యారీడ్ లైఫ్... నాగ్ చాలా రొమాంటిక్. నా దగ్గర తన ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు చాలా కేర్ తీసుకున్నాడు. ఎంతో ప్లాన్ చేసుకుని, ఆ ఫీలింగ్‌ను చాలా అందంగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఆ సమయంలో తను చెప్పిన మాటలు పూర్తిగా నా వ్యక్తిగతం. నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయే ఆ మాటలను బయటికి చెప్పను. పెళ్లనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులిస్తాయి. కొన్ని కలుపు మొక్కలు మంచి చెట్లను నాశనం చేస్తాయి. పెళ్లి కూడా అంతే. మన బంధం ఇతరుల కారణంగా నాశనం కానివ్వకూడదు. ‘నువ్వు నాకు చాలా ప్రత్యేకం.. నువ్వంటే నాకు ప్రేమ’ అనే నమ్మకాన్ని జీవిత భాగస్వామికి కలిగించాలి. లేకపోతే ఆ బంధంలో జీవం ఉండదు. మా ప్రతి పెళ్లి రోజునాడు మా ప్రమాణాలను పునరుద్ధరించుకుంటాం. అలాగే.. ప్రతి ఏడాదీ మాకు కొత్తగా ఉంటుంది. రామ్ ఎడిటర్, ఫీచర్స్ -
నాటి బ్యూటీస్ నేటి ఆంటీస్‌గా...
పాత్రల ప్రాముఖ్యత, పరిధిల్లో ట్రేడ్ ఉండవచ్చునేమో గానీ సినిమాల్లో నాయికానాయకులు లేని చిత్రాలు అరుదే. కమర్షియల్ అంశాలకు హీరో ఎంత అవసరమో కనువిందు చేయడానికి హీరోయిన్ అంతే అవసరం. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అలా అందం, అభినయంతోను తమ సత్తా చాటి ప్రముఖ కథానాయికలుగా రాణించిన పలువురు తరువాత వివాహ బంధాలతో సంసార జీవితంలోకి వెళ్లిపోయూరు. కొంతకాలం పాటు మాతృత్వ మాధుర్యాన్ని చవిచూశారు. పిల్లా పాపలతో సుఖ సంతోషాలను అనుభవించి, మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఏదేమైనా నాడు బ్యూటీస్‌గా వెలుగొందిన భామలు నేడు ఆంటీస్‌గా రాణిస్తున్నారు. మరి కొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వీరిని ఒక్కసారి పరిశీలిస్తే అతిలోక సుందరి బిరుదు సొంతం చేసుకున్న శ్రీదేవితోపాటు నదియ, మనీషా కొయిరాలా, గౌతమి, మధుబాల, అమల, తులసి, జ్యోతిక, అభిరామి, కిరణ్రాథోడ్, ప్రియా ఆనంద్, లైలా తదితరులు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రల్లో అలరించడానికి రెడీ అయ్యారు. గౌతమి పునరాగమనం పదహారణాల తెలుగమ్మాయి గౌతమి తమిళంలో వర్ధమాన నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ కమలహాసన్ వరకు జోడి కట్టి ప్రముఖ హీరోయిన్గా రాణించారు. ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా వున్న గౌతమి తాజాగా తాను సహజీవనం చేస్తున్న నటుడు కమలహాసన్‌తోనే. పాపనాశం చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటిస్తున్నారు. ఇంకా తెలుగు బుల్లితెరపై కొన్ని నృత్య సంగీత కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అతిలోక సుందరి సీనియర్ నటి శ్రీదేవి విషయానికొస్తే ఇద్దరు పిల్లల తల్లి. ఆమె పెద్ద కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుదీర్ఘ విరామం తరువాత ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఆ చిత్రానికి ఆమె ప్రధానం అయినా ఆంటీ పాత్రనే పోషించి మెప్పించారు. ఆ తరువాత చిన్న గ్యాప్ తీసుకుని, తాజాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న గరుడ చిత్రంలో ముఖ్యపాత్ర చేస్తున్నారు. అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసిన నటి నదియ ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం ద్వారా ఆ చిత్ర హీరో జయం రవికి తల్లిగా నటించారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తరువాత వరుసగా అమ్మగా, అత్తగా, అక్కగా పలు చిత్రాల్లో నటి స్తున్నారు. బుల్లి తెరపై మెరుపులు అమలా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతోపాటు తెలుగులోను క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. నాగార్జునను వివాహమాడిన తరువాత నటనకు దూరంగా ఉన్నారు. ఈమె కొడుకు అఖిల్ ఒక పక్క హీరోగా పరిచయం అవుతుంటే అమల మళ్లీ నటిగా పునఃప్రవేశం చేయడం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించిన ఈమె తాజాగా తమిళంలో ఒక మెగా సీరియల్లో నటిస్తున్నారు. అదే విధంగా అజిత్ సరసన కాదల్‌మన్నన్ చిత్రంలో నటించిన మాను కొంతకాలం చిత్రాలకు దూరంగా సింగపూరులో నివసించారు. మళ్లీ ఇటీవల ఎన్న సత్తం ఇంద నేరం చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయ్యారు. మాళవిక, లైలా, ప్రియారామన్ తదితరులు బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. వీరంతా సినిమానే లోకంగా జీవిస్తున్న తారలు. వీరి పునః ప్రవేశానికి సంపాదన ఒక్కటే కారణం కాదు. దానిని మించి నటనపై మమకారం అని చెప్పవచ్చు. ఏడేళ్ల తరువాత... కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్గా వెలిగిన జ్యోతిక నటుడు సూర్యతో కలిసి ఏడు చిత్రాలు చేసి ఏడేళ్లు ఆయనతో ప్రేమబంధాన్ని పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల విరామం తరువాత జ్యోతిక నటిగా రీ ఎంట్రీ అయ్యారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్ర తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఇది వివాహానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు కథనాయికిగా విజయ విహారం చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం ఆంటీ పాత్రలతో అలరిస్తున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న దేవయాని ఆ తరువాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం నగరంలోనే ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తాజాగా సహాబ్దం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు కమలహాసన్ సరసన విరుమాండి చిత్రంతోపాటు ప్రభు తదితర ప్రముఖ హీరోలతో డ్యూయెట్లు పాడిన అభిరామి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: అమ్మా అని కొత్తగా... మళ్లీ పిలవాలనీ... తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ అతడు: నింగి నేల నిలిచే దాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా... నను వీడొద్దే అమ్మా... బంగారం నువ్వమ్మా... అమ్మా అని కొత్తగా... మళ్లీ పిలవాలననీ... తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ చరణం : 1 అ: నిదురలోని కల చూసి తుళ్లి పడిన ఎదకి ఏ క్షణం ఎదురౌతావో జోలపాటవై ఆ కలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై నింగి నేల నిలిచే దాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా... నను వీడొద్దే అమ్మా.. బంగారం నువ్వమ్మా... చరణం : 1 అ: చిన్ని చిన్ని తగవులే మాకు లోకమైన వేళ నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా రెప్పలా కాచిన నీకు కంటి నలుసులాగ వేదనలు పంచిన మాకు వేకువున్నదా నింగి నేల నిలిచే దాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా... నను వీడొద్దే అమ్మా... బంగారం నువ్వమ్మా... చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) రచన : వనమాలి సంగీతం : మిక్కీజె. మేయర్ గానం : శశికిరణ్, శ్రావణభార్గవి