ఇంట్లోనే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండే టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకాల హెర్బల్ టీలు విని ఉంటారు. ఈ టీ గురించి అస్సలు విని ఉండరు. గ్రీన్ టీకి మించి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టీ ఏంటనే కదా..మనం ఎంతో ఇష్టంగా పచ్చళ్లు పట్టుకునే తినే ఉసిరితో ఈ టీ తయారు చేస్తారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కావాల్సినవి:
ఉసిరి, చూర్ణం
పుదీనా ఆకులు-4
అల్లం-1 అంగుళం -
క్యారమ్ విత్తనాలు
తయారు చేయు విధానం..
ఒక గ్లాస్ నీటిని మరిగించి..అందులో పైన చెప్పిన పదార్థాన్నీ వేసి కాసేపు తిరగబడనివ్వాలి. ఆ తర్వాత వడకట్టండి అంతే అదే ఉసిరి టీ.
ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో మొత్తం పది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందట. వివిధవ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.
గ్రీన్ టీ కంటే ఇదే మంచిదా..?
పులుపు పడని వాళ్లు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. తీసుకునే మోతాదును బట్టి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..)
Comments
Please login to add a commentAdd a comment