ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్‌లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్‌లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు.
"మనం ఈ టీ బ్యాగ్‌లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్‌ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు.
ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్‌లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్‌లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు.
(చదవండి: భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..)
Comments
Please login to add a commentAdd a comment