harmful
-
టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్‌లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్‌లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్‌ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్‌లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..) -
'టీ'లో బిస్కెట్స్ ముంచుకుని తింటున్నారా..?
మనం కొన్ని రకాల ఆహార పదార్థాలని పలు కాంబినేషన్స్‌లో తింటుంటాం. అయితే ఇలా తినడం అన్ని రకాల ఆహార పదార్థాలకు మంచిది కాదు. ఒక్కోసారి ఇలా తినడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కూడా. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. చాలామందికి విరామ సమయంలో 'టీ' తాగే అలవాటు ఉంటుంది. దీంతోపాటు బిస్కెట్లు తీసుకుంటుంటారు. ఇలా 'టీ'లో బిస్కెట్లు ఇముంచుకుని తినడం అలవాటు లేదా ఇష్టంగా ఉంటుంది కొందరికి. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో స్నాక్స్‌గా ఇలా తింటుంటారు కూడా. అయితే ఇది అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు ఎందుకంటే..మనం ఇలా చాయ్‌లో బిస్కెట్లు ముంచుకుని తినడం వల్ల అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందులోనూ ఈ బిస్కెట్లు ప్యాక్ చేయబడి ఉంటాయి. వీటిని శుద్ధి చేసిన మైదాపిండి, చక్కెరలతో తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తింటామో రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఫలితంగా శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత తదితర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు.అంతేగాదు ఇది గట్ మైక్రోబయోమ్‌కు అంతరాయం కలిగిస్తుంది. పైగా మనం ఇలా తెలయకుండానే అధిక మొత్తంలో మైదా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది కాస్తా అధిక బరువుకి, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అలాగే అనేక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో పామ్ ఆయిల్ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ బిస్కెట్లు కూడా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాల్లోకే వస్తాయి. ఇందులో ఉపయోగించే పామాయిల్ గుండె సంబంధిత సమ్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. దీనికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ హెర్బల్ టీలను వినయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అవేంటంటే..హార్మోన్ బ్యాలెన్స్ 'టీ'లు..కొత్తిమీర సీడ్స్‌తో చేసే 'టీ' అదేనండి ధనియాలతో చేసే టీ. ఇది హైపోధైరాయిడజంతో సమర్థవంతంగా పోరాడుతుంది. మేతి సీడ్స్ 'టీ' మధుమేహం ఉన్నవారికి మంచిది. ఫెన్నెల్ అజ్వెన్ 'టీ' జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కరివేపాకు 'టీ' జుట్టు పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ హెర్బల్ 'టీ'లు హార్మోన్ల సముతుల్యత తోపాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలాంటి పెర్ఫ్యూమ్స్ కొంటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!) -
ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్. పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి. దుబాయి చెట్టుగా పిలువబడుతున్న ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! శంకురూపంలో ఉండే కోకో కార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని అంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఏడారినుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచి, వేడిగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు. మనదేశంలోకి ప్రవేశించిందిలా.. వేగంగా పెరుగుతూ అధిక పచ్చదనాన్ని కలిగిన కోనోకార్పస్‌పై మనదేశంలోని నర్సరీ పెంపకం దారులు, ల్యాండ్‌స్కేప్ ఎక్స్‌పర్ట్‌ల దృష్టిపడింది. పచ్చదనంతో వెంచర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారులు ఈ మొక్కలను తీసుకొచ్చారు. అలా ఈ మొక్క మనదేశంలో ప్రవేశించింది. అనంతరం నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు మొదలు సాధారణ నగర పంచాయతీల వరకు ఈ మొక్కలను డివైడర్లపై, రహదారుల్లో విరివిగా నాటడం మొదలు పెట్టారు. తూర్పుకనుమల్లో భాగమైన నల్లమల అడవుల కేంద్రీయ స్థానమైన నంద్యాల జిల్లాలో కూడా దుబాయ్ మొక్క ప్రభంజనం తక్కువేమి కాదు. ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ తదితర మున్సిపాలిటీలలో దుబాయ్ మొక్కలను రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెద్ద ఎత్తున నాటుతున్నారు. జీవవైవిధ్యానికి మారు పేరైన నల్లమల సమీప ప్రాంతాల్లో ఈ ఖండాంతర మొక్క ప్రవేశంతో పర్యావరణ పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కోనోకార్పస్‌ను నిషేధించిన తెలంగాణ సర్కారు పలు పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనోకార్పస్ మొక్కలను నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. హరితవనం కార్యక్రమంలో తొలుత ఈ మొక్కలనే ఎక్కువగా వినియోగించిన ప్రభుత్వం త్వరలోనే వీటి దుష్ప్రభావాలను గుర్తించడం గమనార్హం. వన్యప్రాణులకు సంకటం వేరే ఖండాలనుంచి తెచ్చి పెంచే మొక్కలతో పర్యావరణ సమతుల్యతకు విఘాతమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాంటి వాటిని ఎక్సోటిక్ వీడ్ గా పిలుస్తుంటారు. ఇవి ప్రపంచంలో ఒక ప్రాంతం నుంచి సహజంగా అవి ఉండని మరో ప్రాంతంలో ప్రవేశ పెట్టబడినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వీడ్స్(కలుపు మొక్కలు)తో స్థానిక వృక్ష, గడ్డి జాతుల విస్తరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో హెర్బీవోర్స్(గడ్డితినే జంతువులు)కు ఆహార కొరత ఏర్పడి అది కార్నీవోర్స్( మాంసాహార జంతువులు)ఉనికికే ప్రమాదకారణమవుతుంది. కోనోకార్పస్‌తో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తనున్నాయి. ఇది వేగంగా పెరిగే నిత్య పచ్చదనం మొక్క కావడంతో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఇతర స్థానిక జాతి మొక్కలను, గడ్డిని ఎదగనీయదు.అలాగే పక్షులకు తమ జీవావరణంలో వచ్చిన ఈ కొత్త మొక్క గందరగోళానికి గురి చేయడంతో సహజ రక్షణలో గూళ్లు కట్టుకోవడంలో వైఫల్యం చెంది పునరుత్పత్తి అవకాశాలను తగ్గించుకుంటాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలకూ కారణం కోనోకార్పస్‌మొక్కపర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుందని పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో తేల్చింది. గా లిలో ఎక్కువ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి చేటు అని మరికొన్ని అరబ్‌దేశాలు గుర్తించాయి. దుబాయ్ మొక్కలతో పలు సమస్యలు దుబాయ్ మొక్కలు స్థానిక పర్యావరణ పరిస్థితులకు ముప్పుగా మారుతున్నాయి. చాలా మంది ఈ మొక్క గురించి తెలుసుకోకుండా పెంచుతున్నారు. ఆకురాల్చు అడవులున్న మన ప్రాంతంలో నిత్య పచ్చదనం కలిగిన దుబాయి మొక్కలు ఇతర వృక్షజాతుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి. వీటి పుష్పాలు వెదజల్లె పుప్పొడి వల్ల పలు శ్యాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. – విష్ణువర్ధన్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి,ఆత్మకూరు ఈ మొక్కలను నిషేధించాలి మహారాష్ట్రలోని పూణే, మన పొరుగున ఉన్న తెలంగాణలో దుబాయి మొక్కలను నాటడాన్ని నిషేధించినట్లుగానే మన రాష్ట్రంలో కూడా నిషేధించాలి. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ అంశానైనా ప్రభుత్వాలు అడ్డుకోవాలి. – సుబ్బయ్య ఆచారి, పర్యావరణ ప్రేమికుడు, ఆత్మకూరు -
ఇన్‌స్టాగ్రామ్‌తో ప్రమాదం.. చిక్కులో ఫేస్బుక్
టీనేజీ అమ్మాయిలపై ఇన్స్టాగ్రామ్ చెడు ప్రభావం చూపుతోందంటూ అమెరికాలో చెలరేగిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. బలమైన ఆధారాలు ఉన్నందునే ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌పై విమర్శలు వస్తున్నాయనే అంశం తేటతెల్లమవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఫేస్బుక్ ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వాట్సాప్, ఇన్స్టావంటి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ రన్ అవుతున్నాయి. తమ వినియోగదారుల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఫేస్బుక్ నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు తమ ప్లాట్‌ఫామ్స్‌పై తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నామని చెబుతుంది. అయితే ఇప్పుడవన్నీ కట్టుకథలేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తప్పుడు ప్రచారం ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావం చూపుతోందంటూ ఇటీవల అమెరికాకు చెందని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల కొందరు టీనేజీ అమ్మాయిలు సూసైడ్ దిశగా ఆలోచనలు చేస్తున్నారనేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. అయితే ఫేస్బుక్ స్పందిస్తూ.. ఇన్‌స్టా గ్రామ్ వల్ల టీనేజర్లపై ఎటువంటి ప్రభావం లేదని, పైగా టీనేజీ యూజర్లకు ఎంతో మేలు చేస్తుందంటూ తెలిపింది. అవన్ని నిజాలే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం, ఫేస్బుక్ స్పందన మీద చర్చ నడుస్తుండగానే ఆదివారం నాడు మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేస్తోన్న ఫ్రాన్సెస్ హౌగెన్ అనే మహిళా ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ తన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు సమాచారం, సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న వైనానికి సంబంధించిన వివరాలను తానే మీడియాకు అందించినట్టు చెప్పుకున్నారు. జరగిన పొరపాటు సరిదిద్దుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నించకుండా మరిన్ని తప్పులు చేస్తోందని, అందుకే తాను బయటకు వచ్చినట్టు వెల్లడించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సెనేట్ ముందుకు ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై ఎటువంటి దుష్పరిణామాలు కలిగిస్తుందో సవివరింగా తెలియజేస్తూ ఫ్రాన్సెస్ హౌగెన్ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరుతో సమగ్ర నివేదికను రూపొందించారు. మంగళవారం ఆమె ఈ నివేదికను సెనెట్ సభ్యులకు అందించే అవకాశం ఉంది. ఇందులో వివరాలు కనుక పక్కా ఆధారాలతో ఉంటే ఫేస్బుక్ చిక్కుల్లో పడటం ఖాయం. లాభాలే ముఖ్యం టెలివిజన్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్సెస్ మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలా ? లేక ఫేస్‌బుక్‌కి మంచి జరగాలా అనే విషయంలో అక్కడ సందిగ్ధం నెలకొందని, చివరకు ఫేస్బుక్ లాభాల వైపే మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ఫేస్బుక్ వ్యవహార శైలి వివాస్పదమైంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయంటూ ట్విట్టర్ పేర్కొనగా ఆ పని ఫేస్బుక్ చేయలేదు. పైగా అలా చేయడాన్ని సమర్థించుకుంది కూడా. ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఫేస్బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. చదవండి: కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
కూల్‌డ్రింక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా?
కూల్‌డ్రింక్స్‌లో సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇది విటమిన్ ’సి’తో కలిసినప్పుడు క్యాన్సర్ కారకం (కార్సినోజెన్) గా మారుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానవుల డీఎన్ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం వల్ల కలిగే ఫలితాలు వయస్సు పెరగడంతోనూ, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లాగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరింత ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలకు, పిల్లలకు కూల్‌డ్రింక్స్‌లో ఈ ప్రిజర్వేటివ్ ఉంటుందనీ, దాన్ని తీసుకోకూడదనే అవగాహన ఉండదు. అందుకే వీలైనంతవరకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా తాజా పళ్లరసాలు, ఇతర ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిది. ( చదవండి: పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..? ) -
బ్లాస్టింగ్‌తో.. కంపిస్తున్న భూమి
సాక్షి, వనపర్తి/కొత్తకోట: గత కొన్నేళ్ల క్రితం మైనింగ్ అనుమతి పొందిన ఓ కంపెనీ.. జనావాసాలకు అతి సమీపంలో బ్లాస్టింగ్ చేస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి సమీపంలో డ్రిల్లింగ్ మిషన్‌కు బదులుగా బోరు డ్రిల్లింగ్ చేస్తుండటంతో భూమి దద్దరిల్లడంతో పాటు గ్రా మంలోని పదుల సంఖ్యలో ఇళ్లు నెర్రెలు బారాయి. ఏడాది క్రితం ఈ సమస్యపై గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి బ్లాస్టింగ్‌ను బంద్ చేయించారు. ఇటీవల బ్లాస్టింగ్ తిరిగి ప్రారంభమవడంతో గ్రామస్తులు ఖంగుతిన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. మాకు అధికారుల నుంచి అనుమతి లభించిందని చెప్పుకొస్తున్నారు. ఎండుతున్న బోర్లు కంకర కొరకు రోజు బ్లాస్టింగ్ చేస్తుండటంతో సమీపంలో గల వ్యవసాయ బోర్లు పూడిపోయి నీళ్లు రాకపోవడంతో పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ పనులు నిలిపేయాలని కోరితే.. క్వారీ యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కలెక్టరేట్లో ఫిర్యాదు గుట్టలో అనుమతులకు మించి బ్లాస్టింగ్ చేస్తున్న తీరుపై, ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని, భారీ శబ్దాలతో ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఫొటోలతో సహా మండల, జిల్లా స్థాయి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్లో బ్లాస్టింగ్ బంద్ చేయించాలని ఫిర్యాదు చేసి వెళ్లారు. అయినా అ«ధికారుల నుంచి స్పందన లేకపోవటం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాన్ని సందర్శించి బ్లాస్టింగ్‌ను పూర్తిగా నిషేధించాలని గ్రామస్తులు కోరారు. కంపిస్తున్న భూమి సంకిరెడ్డిపల్లి సమీపంలో ‘గొట్టెతేనా’ అనే గుట్ట ఉంది. దీని నుంచి కంకర మిషన్‌కు రాయి సరఫరా కోసం అధికారులు అనుమతులిచ్చారు. ఈమేరకు బ్లాస్టింగ్‌తో చుట్టూ కిలోమీటర్ దూరం వరకు భూమి కంపించడంతో పాటు సమీపంలో గల పంట పొలాల రైతులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రతి రోజు బ్లాస్టింగ్ చేస్తుండటంతో గ్రామంలో దాదాపు 30ఇళ్లకు పైగా పాక్షికంగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. బ్లాస్టింగ్ తిరిగి ప్రారంభమవడంతో నూతనంగా ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం వెనకాడే పరిస్థితి నెలకొంది. పరిశీలిస్తాం సంకిరెడ్డిపల్లి సమీపంలోని క్రషర్లో బ్లాస్టింగ్ చేసేందుకు అనుమతుల విషయం మాకు తెలియదు. పాత అనుమతులు ఉన్నట్లుగా తెలుసు. మరొకసారి ఈ విషయంపై దృష్టి సారించి అనుమతుల వివరాలను తెలుసుకుంటాం. – మల్లిఖార్జున్‌రెడ్డి, సీఐ, కొత్తకోట క్వారీ అనుమతి రద్దు చేయాలి కాసులకు కక్కుర్తి పడి గ్రామ శివారులోని గుట్టపై రాళ్లు తీయడానికి అనుమతులిచ్చారు. బ్లాస్టింగ్‌తో ఇళ్ల గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని క్వారీ అనుమతి రద్దు చేసి తమకు న్యాయం చేయాలి. – గీత, సంకిరెడ్డిపల్లి ఇంట్లో ఉండలేకపోతున్నాం ప్రతి రోజు బ్లాస్టింగ్ చేయడంతో పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. ఇళ్లు పగుళ్లు ఇచ్చాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తుంది. ఇలాగే ఉంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలి. – భారతమ్మ, సంకిరెడ్డిపల్లి -
విశాఖ బీచ్‌లో ప్రమాదకరంగా మారిన వ్యాయామ పరికరాలు
-
కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం ప్రమాదకరం
వాషింగ్టన్: నిద్ర పోయేటప్పుడు కాంటాక్ట్‌లెన్స్ తీయకుండా అలాగే ఉంచడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్‌లెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కార్నియాకు ఇన్ఫెక్షన్స్ సోకుతుందంటున్నారు అమెరికాలోని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ ఫెమ్లింగ్. ‘కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి.. శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, కళ్ల సంబంధ సమస్యలు రాకూడదంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం’అని ఆయన పేర్కొన్నారు. -
ఈ సిగరెట్లతో నోటి సమస్యలు
న్యూయార్క్: ఎలక్ట్రానిక్ సిగరెట్లు సైతం ఇతర సిగరెట్ల మాదిరిగానే నోటి సమస్యలకు కారణమౌతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ-సిగరెట్ల ద్వారా వచ్చే పొగ నోటిలోని కణాలను ప్రేరేపించడం వలన.. వాటిలో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని.. ఇది అనేక నోటి సమస్యలకు కారణమౌతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని రోచెస్టర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇర్ఫాన్ రహ్మాన్ వెల్లడించారు. ఈ-సిగరెట్లలో.. బ్యాటరీ సహాయంతో కాట్రిడ్జ్లోని లిక్విడ్ వేడెక్కడం ద్వారా పొగ వెలువడుతుంది. దీనిలో సాధారణంగా కొన్ని ఫ్లేవర్స్, రసాయనాలు, నికోటిన్ ఉంటాయి. ఎంత తరచుగా ఈ సిగరెట్లను ఉపయోగిస్తున్నారనే దానిపై అది నోటిపై చూపించే దుష్ప్రభావాల తీవ్రత ఆధారపడి ఉంటుందని రహ్మాన్ వెల్లడించారు. ఈ-సిగరెట్‌లోని ఫ్లేవర్స్ సైతం చిగుళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని 3-డీ టెక్నాలజీ సహాయంతో నిర్వహించిన పరిశీలనలో తేలిందని ఆయన తెలిపారు.