కూల్‌డ్రింక్స్‌లో సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇది విటమిన్ ’సి’తో కలిసినప్పుడు క్యాన్సర్ కారకం (కార్సినోజెన్) గా మారుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానవుల డీఎన్‌ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం వల్ల కలిగే ఫలితాలు వయస్సు పెరగడంతోనూ, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లాగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరింత ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలకు, పిల్లలకు కూల్‌డ్రింక్స్‌లో ఈ ప్రిజర్వేటివ్ ఉంటుందనీ, దాన్ని తీసుకోకూడదనే అవగాహన ఉండదు. అందుకే వీలైనంతవరకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా తాజా పళ్లరసాలు, ఇతర ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిది.
( చదవండి: పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..? )
Comments
Please login to add a commentAdd a comment