cooldrinks
-
అందరికీ ఎండాకాలం, మాకిదే మంచి కాలమంటున్న ఆ కంపెనీలు.. ఎందుకంటే?
వేసవి కాలం మొదలైపోయింది.. భానుడి వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ తరుణంలో ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాల డిమాండ్ ఎక్కువవుతోంది. కావున అమ్మకాలు మునుపటికంటే దాదాపు రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఎమ్‌సిజి అండ్ డెయిరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీల అమ్మకాలు మరింత వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్లో తమ ఉత్పత్తులకు డిమాండ్‌ని పెంచుకోవడానికి తగిన ఆఫర్స్ కూడా తీసుకురానున్నట్లు సమాచారం. పాలు, పాల పానీయాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్‌ల విక్రయదారులలో ఒకటైన మదర్ డైరీ ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అంచనా వేస్తూ ఉత్పత్తులను వేగవంతం చేయడానికి, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగటానికి తగిన విధంగా సిద్ధమవుతోంది. కోల్డ్-చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిఫర్ వెహికల్స్, షెల్ఫ్ స్ట్రెంగ్త్ నిర్ధారించడానికి కన్స్యూమర్ టచ్ పాయింట్లలో అసెట్ డిప్లాయ్మెంట్లో పెట్టుబడి పెట్టామని మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బండ్లీష్ తెలిపారు. మదర్ డెయిరీ ఈ సమ్మర్ సీజన్లో మరో 15 కొత్త ఉత్పత్తులు లేదా రుచులను ప్రారంభించడం ద్వారా వినియోగదారులను ఆకర్శించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే సీజన్లో ఐస్‌క్రీం వర్గం దాదాపు 25 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు కూడా బండ్లీష్ చెప్పుకొచ్చారు. శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సికో వేసవి ప్రారంభంమే చాలా ఉత్సాహంగా ఉందని, 2023 పానీయాల రంగానికి తప్పకుండా కలిసొస్తుందని ఆశాభావాలను వ్యక్తం చేసింది. అంతే కాకుండా స్వదేశీ ఎఫ్‌ఎమ్‌సిజి మేజర్ డాబర్ ఇండియా తన వేసవి ఉత్పత్తులు తప్పకుండా ఆశాజనకంగా అమ్ముడవుతాయని ప్రకటించింది. -
కూల్‌డ్రింక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా?
కూల్‌డ్రింక్స్‌లో సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇది విటమిన్ ’సి’తో కలిసినప్పుడు క్యాన్సర్ కారకం (కార్సినోజెన్) గా మారుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానవుల డీఎన్ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం వల్ల కలిగే ఫలితాలు వయస్సు పెరగడంతోనూ, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లాగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరింత ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలకు, పిల్లలకు కూల్‌డ్రింక్స్‌లో ఈ ప్రిజర్వేటివ్ ఉంటుందనీ, దాన్ని తీసుకోకూడదనే అవగాహన ఉండదు. అందుకే వీలైనంతవరకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా తాజా పళ్లరసాలు, ఇతర ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిది. ( చదవండి: పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..? ) -
ఓ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నానని..
-
గర్భంతో ఉంటే నో కూల్‌డ్రింక్స్!
గర్భంతో ఉన్నప్పుడు చక్కెర ఎక్కువగా ఉన్న కూల్‌డ్రింక్స్ తాగితే పుట్టే పిల్లలకు భవిష్యత్తులో ఊబకాయం వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు అంటున్నారు. చక్కెర ఎక్కువగా ఉన్న కూల్‌డ్రింక్స్ ప్రభావం గర్భంలో ఉన్న బిడ్డపై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఓ అధ్యయనం నిర్వహించింది. దాదాపు 1,078 మంది గర్భిణులను వారి రెండో త్రైమాసికం నుంచి పరిశీలించామని, వాళ్లు తీసుకుంటున్న పానీయాలపై దృష్టి పెట్టామని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన రిఫాస్ షిమన్ తెలిపారు. వీరి పిల్లలు ప్రాథమిక పాఠశాలలో ఉండగా వారి బరువులను పరిశీలించగా దాదాపు 25 శాతం మంది అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గర్భిణులుగా ఉన్నపుడు వీరు రోజుకు రెండు సార్లు కూల్‌డ్రింక్స్ తాగినట్లు గుర్తించారు. అయితే ఈ రెండింటికీ ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అన్నది స్పష్టం కాకపోయినా గర్భం దాల్చినపుడు కూల్‌డ్రింక్స్‌ను తగ్గించడం మేలని, వీలైనంత ఎక్కువగా నీరు తీసుకోవాలని రిఫాస్ సూచిస్తున్నారు. -
డీఎస్పీ గన్మెన్లను చితకబాదారు..
కడప: కడప జిల్లా డీఎస్పీ గన్మెన్లు దౌర్జన్యానికి పాల్పడగా స్థానికులు వారిని పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన జిల్లాలోని పుల్లంనేట మండలం రెడ్డిపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. పుల్లంనేట మండలం రెడ్డిపల్లిలో డీఎస్పీ గన్మెన్లు ఓ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ కూల్ డ్రింక్ తీసుకుని తాగారు. అయితే డబ్బులు ఇవ్వకుండా వెళ్తోన్న వాళ్లను ఆ షాపు అతను డబ్బులు చెల్లించమని అడిగాడు. ఆగ్రహించిన గన్మెన్లు మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ కూల్ డ్రింక్స్ తాగిన షాపును ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు డీఎస్పీ గన్మెన్లను పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
శీతల పానీయాలు వద్దు - కొబ్బరి బోండాలే ముద్దు
-
పిల్లలూ.. ఆరోగ్యం పదిలం
- చిన్నారులను ఎండలో తిరగనివ్వొద్దు - ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి సూర్యాపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్, వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఒక్కటే ఉక్కపోత.. వడగాలులు. పెద్దలే.. ‘వామ్మో ఏం ఎండలు బాబోయ్’ అంటున్నారంటే.. ఇక చిన్నారుల పరిస్థితి ఎలాఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈకాలంలో పిల్లలు అనారోగ్యంబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా. వడదెబ్బ.. వడదెబ్బ తగిలితే మూర్చపోతారు. జ్వరం తీవ్రమవుతుంది. అప్పుడు తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. తేలికపాటి దుస్తులు వేయాలి. అవసరాన్ని బట్టి వైద్యుడిని సంప్రదించాలి. విష జ్వరం.. ఎండలో తిరిగితే విషజ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల నుంచి 104 డిగ్రీలకు చేరుతు ంది. జ్వరం తగ్గకపోతే ఐస్ ముక్కలను పిల్లల చంక మధ్యలో పెట్టాలి. చల్లని నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని ప్రతి పది నిమిషాలకోసారి తుడవాలి. వదులుగా ఉండే దుస్తులు వేయాలి. చికెన్ ఫాక్స్.. జ్వరంతో ఒళ్లంతా దురదగా ఉంటుంది. ఇలాంటి పిల్లలను వారం పాటు ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి. పొంగు.. ఒళ్లంతా చిన్నచిన్న దద్దుర్లు.. కళ్లు ఎర్ర బడడం.. ఈ వ్యాధి లక్షణాలు. తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జాగ్రత్తలు పాటించాలి పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉంచాలి. గుడ్లు, మాంసాహారం తగ్గిం చాలి. కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు ఎక్కువగా అందించాలి. నిమ్మరసం కలిపిన ద్రావణాన్ని చిన్నాపెద్దా తేడా లేకుండా తీసుకోవడం మంచిది. చంటి పిల్లలకు తల్లిపాలే పట్టించాలి. రోజూ గ్లాస్ నీటిలో రెండు చెంచాల చక్కెర, పావు చెంచా ఉప్పు కలిపిన నీటి ని అందించాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం నాలుగు గం టల వరకు ఎండలో తిరగకుండా చూడాలి. ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. జ్యూస్, కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి అంత గా మంచివి కావు. నీటి ని వేడిచేసి చల్లార్చి తాగించడం చాలా మంచిది. - పి.నారాయణరావు, పిల్లల వైద్యనిపుణులు, సూర్యాపేట -
ఉడికిపోతున్న జనం భగ్గుమంటున్న ఎండలు
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ‘‘ఒరేయ్ శ్రీను ఏటిరా ఈ ఎండలు, ఉదయం 9 గంటలకే నెత్తి సుర్రుమంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎలా ఉం టుందోరా’’ అంటూ మండే ఎండల గురించి జనం చర్చించుకుంటూ వగరుస్తున్నారు. ఓవైపు సెగలుకక్కుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్‌కోతతో అల్లాడిపోతున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ ఉదయం తొమ్మిది గంటల తర్వాత నిర్మూనుష్యమవుతున్నాయి. మే,జూన్ నెలలను తలపించే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. వేడి గాలులు కూడా తోడవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, రోగులు, గర్భిణులు, శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, బాలింతలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదాలకు గురై, చికిత్స పొందతున్న వారిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులు, టోపీలు ధరించకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కూలీలు అయితే 10 గంటలకే పనిముగించేసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. శీతలపానీయాలను ఆశ్రయిస్తున్న జనం: ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. పళ్లరసాలు, కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, ఫ్రూట్ సలాడ్ వంటి వి తీసుకుంటున్నారు. దీంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైయితే తప్ప బయటకు వెళ్లకూడదు. గొడుగు లేదా టోపీ, కళ్లద్దాలు ధరించి వెళ్లాలి. చర్మవ్యాధిగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు ఎండలోకి వెళ్లరాదు. - బి.వెంకటేష్, పిల్లలు వైద్యుడు, కేంద్రాస్పత్రి 2012 తేదీ గరిష్టం కనిష్టం 15 33 25 16 35 27 17 37 29 18 39 30 19 36 29 2013 15 35 27 16 34 30 17 38 30 18 38 30 19 37 28 2014 15 37 28 16 37 27 17 37 29 18 36 20 19 37 29