- చిన్నారులను ఎండలో తిరగనివ్వొద్దు
- ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి
సూర్యాపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్, వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఒక్కటే ఉక్కపోత.. వడగాలులు. పెద్దలే.. ‘వామ్మో ఏం ఎండలు బాబోయ్’ అంటున్నారంటే.. ఇక చిన్నారుల పరిస్థితి ఎలాఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈకాలంలో పిల్లలు అనారోగ్యంబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా.
వడదెబ్బ..
వడదెబ్బ తగిలితే మూర్చపోతారు. జ్వరం తీవ్రమవుతుంది. అప్పుడు తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. తేలికపాటి దుస్తులు వేయాలి. అవసరాన్ని బట్టి వైద్యుడిని సంప్రదించాలి.
విష జ్వరం..
ఎండలో తిరిగితే విషజ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల నుంచి 104 డిగ్రీలకు చేరుతు ంది. జ్వరం తగ్గకపోతే ఐస్ ముక్కలను పిల్లల చంక మధ్యలో పెట్టాలి. చల్లని నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని ప్రతి పది నిమిషాలకోసారి తుడవాలి. వదులుగా ఉండే దుస్తులు వేయాలి.
చికెన్ ఫాక్స్..
జ్వరంతో ఒళ్లంతా దురదగా ఉంటుంది. ఇలాంటి పిల్లలను వారం పాటు ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి.
పొంగు..
ఒళ్లంతా చిన్నచిన్న దద్దుర్లు.. కళ్లు ఎర్ర బడడం.. ఈ వ్యాధి లక్షణాలు. తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
జాగ్రత్తలు పాటించాలి
పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉంచాలి. గుడ్లు, మాంసాహారం తగ్గిం చాలి. కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు ఎక్కువగా అందించాలి. నిమ్మరసం కలిపిన ద్రావణాన్ని చిన్నాపెద్దా తేడా లేకుండా తీసుకోవడం మంచిది. చంటి పిల్లలకు తల్లిపాలే పట్టించాలి. రోజూ గ్లాస్ నీటిలో రెండు చెంచాల చక్కెర, పావు చెంచా ఉప్పు కలిపిన నీటి ని అందించాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం నాలుగు గం టల వరకు ఎండలో తిరగకుండా చూడాలి. ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. జ్యూస్, కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి అంత గా మంచివి కావు. నీటి ని వేడిచేసి చల్లార్చి తాగించడం చాలా మంచిది.
- పి.నారాయణరావు,
పిల్లల వైద్యనిపుణులు, సూర్యాపేట
పిల్లలూ.. ఆరోగ్యం పదిలం
Published Mon, May 5 2014 1:33 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
Advertisement
Advertisement