indoor games
-
వేడుక సమయం: ఇంట్లోనే వెల్కమ్ చెప్పండి
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. రేపు అర్ధరాత్రిపాత కేలండర్‌కి టాటా చెప్పి కొత్త కేలండర్ అడుగు పెడుతుంది. కొత్తగా వస్తున్న అతిథికి సంతోషంగా స్వాగతం చెప్పాలి. హగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి. బయట ఈవెంట్స్ హడావిడి అక్కర్లేదు. భారీ ఖర్చు పెట్టక్కర్లేదు. రోడ్డు మీద చలిలో తిరగక్కర్లేదు. ఆత్మీయులతో కలిసి సింపుల్‌గా, వెరైటీగా ఇంట్లోనే న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పొచ్చు. మరి ఆ టైమ్‌లో ఏమేం చేయొచ్చు? ఇవిగో సలహాలు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్నాడో కవి. ముందు ఉన్నది మంచి కాలమే అని నమ్మక΄ోతే ముందుకు సాగలేరు ఎవరూ. తాము, తమ కుటుంబం రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, మంచే తేవాలని కోరుకుంటూ అది అడుగు పెట్టే వేళలో వీలైనంత సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆ క్షణంలో సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉండొచ్చనే సెంటిమెంట్. ఆ సమయంలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే సంవత్సరమంతా అలాగే గడిచి΄ోతుందని నమ్మకం. అందుకే డిసెంబర్ 31 రాత్రి అందరం ఉత్సాహంగా గడపడానికి చూస్తారు. తోచిన రీతిలో సంబరం చేసుకుంటారు. బయట అందుకోసమే భారీ ఈవెంట్స్ ఉంటాయి. పబ్బులు, రిసార్టులు, స్టార్ హోటళ్లు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. ఆకర్షిస్తాయి. ఖర్చు పెట్టదలచుకుని, హంగామాగా గడపాలనుకునేవారికి అదంతా బాగానే ఉంటుంది. కాని ఇళ్లల్లో ఉంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికే ఎక్కువ ఫ్యామిలీలు ఇష్టపడతాయి. మీది అలాంటి ఫ్యామిలీ అయితే ఇంటి నుంచే కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి. మిత్రులను ఎంచుకోండి ఇంట్లో మనం మాత్రమే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ గాని బంధువులుగాని ఉండాలా అనేది తేల్చుకోండి. మనం మాత్రమే ఉంటే బోర్ అనుకుంటే నచ్చిన ఫ్రెండ్స్‌ను వారి కుటుంబాలతోపాటు (మరీ ఎక్కువమంది వద్దు) పిలవండి. లేదా ఇష్టమైన బంధువుల్లో ఒకటి రెండు కుటుంబాలను ఆహ్వానించండి. ఇప్పుడుపార్టీకి సిద్ధమైనవారు స్పష్టంగా లెక్క తేల్తారు. ఇల్లు సర్దుకోండి పార్టీకి వచ్చిన అందరూ లివింగ్ ఏరియాలో ఉంటారు కాబట్టి అక్కడ కూచునే వ్యవస్థను సరి చేసుకోండి. సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోండి. రెండో ప్లేస్‌గా ఇంటి ముంగిలిగాని పెరడుగాని డాబా గానీ ఎంచుకోండి. ఇంటి ముంగిలి లేదా పెరడు చలిమంటకు ఉపయోగపడుతుంది. డాబా మీదపార్టీ బాగుంటుంది. వంట ఏమిటి? పార్టీకి తిండి రెండు పద్ధతులు. సరదాగా వంట చేసుకోవాలంటే అందరూ కలిసి చేయండి. బార్బెక్యూ ఒక అట్రాక్టివ్ ఆలోచన. అలా కాదంటే మంచి రెస్టరెంట్ నుంచి తిండి తెప్పించుకోవాలి. ఏ తిండి అయినా పిలిచి వడ్డించే పద్ధతి వద్దు. డైనింగ్ ఏరియాలో అన్నీ పెట్టేయండి. బఫెలాగా కావాల్సినవి కావాల్సినవారు తింటారు.పార్టీకి ముందు డైనింగ్ సామాగ్రి చెక్ చేసుకోండి. సరిపడా ప్లేట్లు, స్పూన్లు సిద్ధం చేసుకోండి. హోమ్ బార్ ఉంటే గనక ఎవరు ‘ఎంత’ తీసుకుంటున్నారో నిఘా అవసరం... ఆరోగ్య రీత్యా... అపశృతులు దొర్లకుండా. ఆటలు రెడీయా? ఇండోర్ గేమ్స్ సరదాగా ఉంటాయి. పరమ పద సోపాన పటం దగ్గరి నుంచి అలనాటి ఆటలు ఎన్నో బయటకు తీయవచ్చు. గుర్తు చేసుకోవచ్చు. పులిజూదం, వామనగుంటలు, తొక్కుడుబిళ్ల... ఇవన్నీ కొత్త ఉత్సాహం ఇస్తాయి. కళ్లు మూసి ఎదుటివారి ముఖం తాకి గుర్తు పట్టే ఆట తమాషాగా ఉంటుంది... పిల్లల కోసం చాక్లెట్లు, కొద్దిపాటి కాయిన్లు ఇంట్లోనే రకరకాల చోట దాచి ట్రెజర్ హంట్ ఆడొచ్చు. ఇక కార్డ్స్, వీడియో గేమ్స్ ఉండనే ఉంటాయి. థీమ్పార్టీ ఏదో ఒక థీమ్ అందరూపాటిస్తే అదో సరదా.పార్టీకి 1970ల కాలం నాటి స్టయిల్ బట్టలు ధరించాలి... లేదంటే బెల్బాటమ్స్లో రావాలి... స్త్రీలైతే ‘ప్రేమ్‌నగర్’లో వాణిశ్రీలా కట్టు, బొట్టుపాటించాలి... ఇలా సరదాగా అనుకోవచ్చు. అచ్చ తెనుగు ఆహార్యం పంచె, లాల్చీ, చీర, జడకుప్పెలు ఇలా కూడా అనుకోవచ్చు. వాల్ ఆఫ్ మెమొరీస్ గత సంవత్సరంలోని మంచి జ్ఞాపకాలను తలచుకుంటే వచ్చే సంవత్సరం కూడా మంచి జ్ఞాపకాలు దక్కుతాయి. అందుకనిపార్టీ జరిగే ఇంటిలో ఒక గోడను ‘వాల్ ఆఫ్ మెమొరీస్’గా పెట్టి ఫోన్లలోని మంచి ఫొటోలను ప్రింట్స్ తీసి అంటించండి. వచ్చిన అతిథులను కూడా వారి బెస్ట్ మెమొరీస్‌ను ప్రింట్స్‌గా తెమ్మనండి. వాల్ ఆఫ్ మెమొరీస్ దగ్గర నిలబడి ఫొటోలు దిగండి. మూవీ నైట్ సాయంత్రం నుంచి జమ అవుతారు గనుక మూవీలను ఎంచుకోండి. ఒక వైపు టీవీ స్క్రీన్ మీదో, హోమ్ థియేటర్లోనో సినిమా నడుస్తూ ఉంటే మరోవైపు కబుర్లతోపార్టీ నడవడం బాగుంటుంది. కరోకి నైట్ పాటలు లేనిపార్టీయా?పార్టీలు ఎవరు ఎలాపాడినా బాగానే ఉంటుంది. నవ్వుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రాక్స్‌ను ప్లే చేసి అభినవ మంటసాలగానో, జాలి సుబ్రహ్మణ్యంగానో, జానశీలగానో రెచ్చి΄ోవచ్చు. పిల్లలతో కలిసి అంత్యాక్షరి ఎలానూ ఆడొచ్చు.పాటలు రికార్డు చేసిపార్టీకి రాని వారికి పంపి వారి మీద కసి తీర్చుకోవచ్చు. దంపతులకు మాత్రమే ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటే మీరిద్దరే కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఉంటే అది కూడా బాగుంటుంది. ఏ రాత్రి పదకొండుకో మంచి కాఫీ పెట్టుకుని, రగ్గు కప్పుకుని కూచుని గడచిన జీవితంలోని మంచి ఘట్టాలను నెమరు వేసుకోవచ్చు. కలిసి టీవీలో ఏదైనా న్యూ ఇయర్ ఈవెంట్ చూస్తూ గడపవచ్చు. లేదా పక్క పక్కనే కూచుని నిశ్శబ్దంగా పుస్తకం చదువుకోవచ్చు. పన్నెండు కాగానే ప్రేమగా ఒకరినొకరు దగ్గరకు తీసుకుని శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. -
ఆటలను మింగేసిన కరోనా..
టీవీలో నిస్తేజంగా కార్టూన్స్ చూసేప్పుడల్లా.. స్కూల్లో స్నేహితులతో సరదా కబుర్లు చెబుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఆనందించిన రోజులే గుర్తుకొస్తాయి.. క్లాసులో మాస్టారు ఏ ప్రశ్న అడిగినా నేను చెబుతానంటూ ఠక్కున లేచి నిల్చుని, సమాధానం చెప్పి, ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయి ఎన్ని దినాలయిందో.. ఇంట్లో క్యారమ్ కాయిన్స్ సర్దేటప్పుడల్లా మా స్కూల్ గ్రౌండ్ గుర్తుకురావాల్సిందే.. గ్రౌండ్ అంతా కలియతిరుగుతూ, పరుగెత్తుతూ పడిలేస్తూ, అలసిసొలసేలా ఆటలు ఆడి ఎన్ని రోజులయిందో.. మళ్లీ ఆ ఆనందక్షణాలు ఎప్పుడొస్తాయో. ఇంట్లో అమ్మానాన్నలు టీవీ చూస్తూ అక్కడ అన్ని మరణాలంట.. ఇక్కడ ఇన్ని కేసులంట అని మాట్లాడుకుంటుంటే భయంతో ఆ మాటలు వినలేక ఇంటి కిటికీలోనుంచి రోడ్డుపైన తాండవించే ఆ నిశ్శబ్ద వాతావరణం చూస్తుంటే అసలు ఆ పాత రోజులు మళ్లీ వస్తాయో రావో.. అనే దిగులు. కరోనా విజృంభణ నేపథ్యంలో స్కూల్‌కు, ఆటపాటలకు దూరమైన ఒక చిన్నారి ఆవేదన ఇది.. వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ఉదయమే తుళ్లిపడి లేవడం, గబగబ కాలకృత్యాలు తీర్చుకోవడం.. రెడీ అయి స్కూల్‌కు వెళ్లడం.. అక్కడ పాఠాలు అనంతరం తోటి విద్యార్థులతో సరదా సరదా కబుర్లు.. అనంతరం స్కూల్ గ్రౌండ్లో ఆటపాటలతో సందడి.. సాయంత్రం ఇంటికి రాగానే హోం వర్క్ చేసుకోవడం.. మళ్లీ రీఫ్రెష్ అయి.. ఇళ్ల దగ్గర స్నేహితులతో కలిసి కాసేపు ఒళ్లు అలిసిపోయేలాగా ఆడిరావడం. వచ్చాక కాసేపు టీవీ చూడ్డం, పుస్తకాలు చదవడం, భోజనం అయిపోయాక కునుకేయడం.. ఇదీ లాక్డౌన్ ముందు చిన్నారుల షెడ్యూల్. కానీ కరోనా చిన్నారుల సరదా ఆటలను మింగేసింది. ఈ మహమ్మారి వల్ల చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతూ క్రీడామైదానాలకు, ఆటపాటలకు పూర్తిగా దూరమై శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇండోర్ ఆటలతో బోర్.. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులు బయటకు వెళ్లలేక, ఇంట్లో ఆడే ఇండోర్ గేమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. క్యారమ్స్, చెస్, లూడో, పజిల్స్ వంటి వాటిని ఆడుతున్నా, ఇవి మైదానాల్లో ఆడేటప్పుడు ఇచ్చే హుషారును, శారీరక శ్రమను ఇవ్వలేకపోతున్నాయి. దీంతో చిన్నారులు శారీరక, మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. గడిచిన ఐదు మాసాలుగా ఇదేరీతిలో కొనసాగుతున్న వారి జీవన శైలి వారికే విసుగు పుట్టిస్తుందని పలువురు చిన్నారులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యాసంస్థలకు దూరం.. రాష్ట్రంలో చిన్నారులు ఐదు మాసాలుగా విద్యాసంస్థలకు దూరంగా ఉంటున్నారు. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. అందులో భాగంగా మార్చి రెండో వారంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం వారం రోజుల పాటు తాత్కాలిక సెలవులను ప్రకటించింది. ఆ తరువాత మార్చి 24 నుంచి ఆ నెలాఖరు వరకూ లాక్డౌన్ మొదటి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆ తరువాత కరోనా తీవ్రత దృష్ట్యా అంచెలంచెలుగా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తుండటంతో అవి అమలవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మాసాంతం వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటంతో మరో నెల పాటు చిన్నారులు తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావటం తప్పనిసరిగా మారింది. దాంతో చిన్నారులు మరో నెల పూర్తిగా ఆటస్థలాలకు దూరంగా ఉండాల్సిందే. శారీరక శ్రమలేని వైనం.. చిన్నారులు రోజూ కొద్దిసేపు ఆడుతూ పాడుతూ సరదాగా పరుగులు తీస్తూ, శారీరక శ్రమతోపాటు, ఆరోగ్యం కూడా పొందుతుంటారు. కానీ కరోనా పుణ్యమా చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతూ నాలుగు గోడల మధ్యలోనే గడుపుతున్నారు. క్రీడలు లేదా ఏదైనా శారీరక శ్రమ ఉన్నప్పుడే మానసికంగా, శారీరకంగా కూడా చిన్నారులు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారని, వారు ఎటూ కదలకుండా ఉంటే వ్యాధి నిరోధక శక్తికూడా సన్నగిల్లుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఫిజికల్ ఎక్సర్సైజ్ దూరమైంది కరోనా నేపధ్యంలో పిల్లలకు ఫిజికల్ ఎక్సర్సైజ్ దూరమైంది. విద్యాసంస్థల్లో ఆటస్థలాల్లో తమకిష్టమైన ఆటలాడుతూ కొంత శారీరక శ్రమ చేయటం వలన ఆరోగ్యాన్ని పొందేవారు. ఆట స్థలాలు లేని విద్యాసంస్థల్లోనూ చిన్నారులు కొద్దిగా యాక్టివ్‌గా ఉంటూ అటుఇటు పరుగులు తీయటం చేస్తుంటారు. అది కూడా శరీరానికి కొంత ఉపకరిస్తుంది. కరోనాతో ఏదీ లేకుండా పోయింది. అంతేకాకుండా చిన్నారులు ఎటు కదలకుండా ఉండటం వలన కూడా వారిలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. – డాక్టర్ ప్రసాద్‌బాబు, ఇగ్నో సహాయ సంచాలకులు ఆటలకు దూరమైతే ఆరోగ్యానికి దూరమైనట్లే.. పిల్లలు ఆటలకు దూరమైతే ఆరోగ్యానికి కూడా దూరమైనట్లే. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితుల నేపధ్యంలో చిన్నారులు విద్యాసంస్థలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. కనుక మైదానాల్లో ఆటలు లేవు. దాంతో పిల్లలకు వ్యాయామం లేకుండా పోయింది. ఇళ్లకే పరిమితం కావటం వలన కొంత ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. పిల్లలు సాధ్యమైనంత వరకూ కొంత సమయం వ్యాయమంలో నిమగ్నమయ్యే విధంగా తల్లిదండ్రులు చూడాలి. దాని వలన కొంతమేలు జరుగుతుంది. – డాక్టర్ మాజేటి మాధవి, చిన్న పిల్లల వైద్యనిపుణురాలు -
వారి సేవలు అభినందనీయం
► విశ్రాంత ఉద్యోగులకు ఎస్పీ శ్వేతారెడ్డి కితాబు ► ఇండోర్ క్రీడల పరికరాలు ప్రారంభం కామారెడ్డి క్రైం(కామారెడ్డి) : కామారెడ్డిలో విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయమని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గురువారం జిల్లా కలెక్టర్‌తో అందించిన యోగా, వెల్నెస్ కేం ద్రం, ఇండోర్ క్రీడా పరికరాలైన టేబుల్ టెన్నిస్, మల్టీజిమ్, సిట్అప్ చైర్లను ఎస్పీ శ్వేతారెడ్డి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడారు. డీఎస్పీ కార్యాలయంలో ప్రతివారం నిర్వహించే కుటుంబ స్నేహిత్ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి విశ్రాంత ఉద్యోగులు సహకారం అందిస్తున్నారని తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం 2007 చట్టంపై విస్తృత ప్రచారం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డీఎస్పీ కే.ప్రసన్నరాణి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి వెంకటి, గౌరవ అధ్యక్షుడు భద్రయ్య, ప్రతినిధులు సాయాగౌడ్, యాదగిరి, నర్సయ్య, గంగాగౌడ్, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకండి
పిల్లలూ జాగ్రత్త మెదక్ : స్కూల్ లేదు.. హోంవర్క్ గోలలేదు.. అసైన్మెంట్ల లొల్లిలేదు.. ఏడతిరుగుతున్నావురా... పుస్తకాలు ముందేసుకుని చదువుకోవచ్చుగా...ఇలాంటి అరుపులు లేవు...ఈ సమ్మర్ హాలీడేస్లు పిల్లలకు జాలీడేసే. ఎంచక్కా టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుని కూర్చుందామనుకునే పిల్లలపై పెద్ద లు లుక్కేయ్యాల్సిందే. లేకుంటే మీ పిల్లల్ని అందరూ ‘లడ్డూ’ అని పిలవాల్సి వస్తుందండి బాబు. రోజుకు మూడు నాలుగు గంటలు టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, సరైన వ్యాయా మం లేకపోడంతో...బెలూన్లలా ఉబ్బిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రెండు గంటల కంటే ఎ క్కువగా టీవీ చూస్తే కంటి జబ్బులు వస్తాయని వైద్యులు అంటున్నారు. ఒంటికి వ్యాయామం అవసరం... ఎలాగూ సెలవులే కదా అని అస్తమానం రిమోట్ పట్టుకుని వీడియో, ఇండోర్ గేమ్స్ ఆడటం... విసుగనిపిస్తే నెట్‌బ్రౌజింగ్ చేయడం, సినిమా సీడీలతో కాలక్షేపం మితిమీరితే ఇబ్బందే మరి. ఇరవై నాలుగ్గంటలూ కుర్చీలు, సోఫాల కు అత్తుక్కుపోయి టీవీలు, కంప్యూటర్ల ఆటలకే పరి మితం కావొద్దు. ఒంటికి కాస్త వ్యాయామం కూడా ఇవ్వాలి. ఫ్రిజ్‌నిండా వేసవి రుచులు నింపుకుని, టీవీ, కంప్యూటర్లతో ఆటలాడు తూ మధ్యమధ్యలో ఎం చక్కా చిరుతిళ్లు లాగించేస్తే ఆరోగ్యం పాడవడంతోపాటు లావెక్కిపోతారు.స్కూళ్లు తెరవగానే లావెక్కిన పిల్లలను ‘లడ్డొడా..’ అంటూ ఎగతాలిచేసే ప్రమాదం ఉంది. శరీరానికి శ్రమఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పరగెత్తాలి, నడవాలి.. ఆడుకోవాలి. -
పరిశోధన బయట ఆడిస్తే... భక్తిపరులౌతారు!
పిల్లల్ని తరచు బయటికి తీసుకు వెళుతుంటే వారి మనసు వికసిస్తుంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఇది. అయితే ఇప్పుడు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మరొక మంచి విషయాన్ని కూడా కనిపెట్టారు. వారానికి కనీసం 5 నుంచి 10 గంటల పాటు పార్కులో, మైదానాలలో ఆడుతుండే పిల్లల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయట! ప్రకృతితో పిల్లలకు ఏర్పడే అనుబంధం వారిలో ఆత్మసంతృప్తిని, భక్తి ప్రపత్తులను కలిగిస్తుందని; పరిపూర్ణమైన మానవులుగా వారు ఎదుగుతారని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఆధ్యాత్మిక అధ్యయనాల విభాగం సహాయ ఆచార్యులు గ్రెటెల్ వాన్ వియరన్ చెబుతున్నారు. ‘‘ఆధునిక జీవితం మనిషికి, ప్రకృతికి మధ్య దూరాన్ని పెంచుతూ పోతోంది. దీని పర్యవసానం ఏమిటి? ముఖ్యంగా మన పిల్లలపై ఈ దూరం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్నలకు జవాబు వెతుక్కునే ప్రయత్నంలో మాకు ఒక పెద్ద అధ్యయనమే అవసరమైంది. తరచూ ఆరు బయట ఆటలాడే పిల్లలకు, ఇండోర్ గేమ్స్‌కు మాత్రమే పరిమితమైపోయి, ఎప్పుడోగాని బయటికి వెళ్లని పిల్లలకు మధ్య వ్యత్యాసాలను మా అధ్యయనంలో సునిశితంగా గమనించాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న పిల్లల్లో ప్రశాంతత, విధేయత; ప్రకృతిలోని విశేషాల పట్ల గౌరవభావం వంటివి మాకు కనిపించాయి’’ అని విరయన్ వెల్లడించారు. పిల్లల్ని, వారి పెద్దల్ని ఇంటర్వ్యూ చేయడం, పిల్లలు గీసిన బొమ్మల్ని శ్రద్ధగా పరిశీలించడం, వారి డైరీలను విశ్లేషించడం వంటి పద్ధతులను వియరన్ బృందం తమ అధ్యయనానికి అవలంభించింది. వీరి అధ్యయన ఫలితాలను బట్టి మనం ఒక విషయాన్ని గమనించాలి. భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రార్థనా స్థలాలు ఎలాగో, ప్రకృతి కూడా అలాగేనని! కనుక పిల్లల్ని వీలైనప్పుడల్లా రమణీయమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం పెద్దల బాధ్యత. -
పిల్లలూ.. ఆరోగ్యం పదిలం
- చిన్నారులను ఎండలో తిరగనివ్వొద్దు - ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి సూర్యాపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్, వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఒక్కటే ఉక్కపోత.. వడగాలులు. పెద్దలే.. ‘వామ్మో ఏం ఎండలు బాబోయ్’ అంటున్నారంటే.. ఇక చిన్నారుల పరిస్థితి ఎలాఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈకాలంలో పిల్లలు అనారోగ్యంబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా. వడదెబ్బ.. వడదెబ్బ తగిలితే మూర్చపోతారు. జ్వరం తీవ్రమవుతుంది. అప్పుడు తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. తేలికపాటి దుస్తులు వేయాలి. అవసరాన్ని బట్టి వైద్యుడిని సంప్రదించాలి. విష జ్వరం.. ఎండలో తిరిగితే విషజ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల నుంచి 104 డిగ్రీలకు చేరుతు ంది. జ్వరం తగ్గకపోతే ఐస్ ముక్కలను పిల్లల చంక మధ్యలో పెట్టాలి. చల్లని నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని ప్రతి పది నిమిషాలకోసారి తుడవాలి. వదులుగా ఉండే దుస్తులు వేయాలి. చికెన్ ఫాక్స్.. జ్వరంతో ఒళ్లంతా దురదగా ఉంటుంది. ఇలాంటి పిల్లలను వారం పాటు ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి. పొంగు.. ఒళ్లంతా చిన్నచిన్న దద్దుర్లు.. కళ్లు ఎర్ర బడడం.. ఈ వ్యాధి లక్షణాలు. తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జాగ్రత్తలు పాటించాలి పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉంచాలి. గుడ్లు, మాంసాహారం తగ్గిం చాలి. కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు ఎక్కువగా అందించాలి. నిమ్మరసం కలిపిన ద్రావణాన్ని చిన్నాపెద్దా తేడా లేకుండా తీసుకోవడం మంచిది. చంటి పిల్లలకు తల్లిపాలే పట్టించాలి. రోజూ గ్లాస్ నీటిలో రెండు చెంచాల చక్కెర, పావు చెంచా ఉప్పు కలిపిన నీటి ని అందించాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం నాలుగు గం టల వరకు ఎండలో తిరగకుండా చూడాలి. ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. జ్యూస్, కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి అంత గా మంచివి కావు. నీటి ని వేడిచేసి చల్లార్చి తాగించడం చాలా మంచిది. - పి.నారాయణరావు, పిల్లల వైద్యనిపుణులు, సూర్యాపేట