వారి సేవలు అభినందనీయం
► విశ్రాంత ఉద్యోగులకు ఎస్పీ శ్వేతారెడ్డి కితాబు
► ఇండోర్ క్రీడల పరికరాలు ప్రారంభం
కామారెడ్డి క్రైం(కామారెడ్డి) : కామారెడ్డిలో విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయమని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గురువారం జిల్లా కలెక్టర్‌తో అందించిన యోగా, వెల్‌నెస్ కేం ద్రం, ఇండోర్ క్రీడా పరికరాలైన టేబుల్ టెన్నిస్, మల్టీజిమ్, సిట్‌అప్ చైర్‌లను ఎస్పీ శ్వేతారెడ్డి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడారు. డీఎస్పీ కార్యాలయంలో ప్రతివారం నిర్వహించే కుటుంబ స్నేహిత్ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి విశ్రాంత ఉద్యోగులు సహకారం అందిస్తున్నారని తెలిపారు.
వృద్ధుల సంక్షేమం కోసం 2007 చట్టంపై విస్తృత ప్రచారం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డీఎస్పీ కే.ప్రసన్నరాణి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి వెంకటి, గౌరవ అధ్యక్షుడు భద్రయ్య, ప్రతినిధులు సాయాగౌడ్, యాదగిరి, నర్సయ్య, గంగాగౌడ్, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.