భిక్కనూరులో కార్డన్ సర్చ్ నిర్వహించిన అనంతరం మాట్లాడుతున్న ఎస్పీ శ్వేత
భిక్కనూరు: ప్రతీ ఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ శ్వేత అన్నారు. గురువారం వేకువజామున భిక్కనూరు మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసన్నరాణి, సీఐలు శ్రీధర్‌కుమార్, కోటేశ్వర్‌రావ్, భిక్షపతి, ఎస్సైలు రాజుగౌడ్, రవిగౌడ్, సంతోష్‌కుమార్, కృష్ణమూర్తి, నరేందర్, శోభన్‌బాబు, సురేశ్‌తోపాటు 75 మంది సిబ్బంది కార్డన్ సర్చ్‌లో పాల్గొన్నారు. ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పలువురి ఆధార్ కార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ శ్వేత మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడిపించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని గ్రామాలు, వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు జరగవని, ఒకవేళ జరిగితే దొంగలు సులువుగా చిక్కుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింహారెడ్డికి పలు సూచనలు చేశారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, ఉన్నవాటిని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment