వాషింగ్టన్: నిద్ర పోయేటప్పుడు కాంటాక్ట్‌లెన్స్ తీయకుండా అలాగే ఉంచడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్‌లెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కార్నియాకు ఇన్‌ఫెక్షన్స్ సోకుతుందంటున్నారు అమెరికాలోని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ ఫెమ్లింగ్. ‘కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చి.. శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కళ్లకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్, కళ్ల సంబంధ సమస్యలు రాకూడదంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం’అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment