contact lense
-
చత్వారకు చుక్కల మందు
న్యూఢిల్లీ: చత్వార (ప్రెస్బయోపియా–లాంగ్ సైట్) సమస్యకు రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండా తయారు చేసిన ఐ డ్రాప్స్‌ను తొలిసారి భారత్‌లోకి తీసుకురానున్నారు. ఈ ఔషధ తయారీ సంస్థ ఎన్టాడ్ ఫార్మా అక్టోబర్ తొలివారంలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఈమేరకు ప్రకటించింది.ఈ కంటి చుక్కల మందును దేశీయంగా మార్కెటింగ్ చేసేందుకు ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ నుంచి తుది అనుమతులు లభించినట్లు ఎన్టాడ్ ఫార్మా వెల్లడించింది. ప్రెస్వ్యూ ధర రూ.350గా ఉంటుందని సమాచారం. అక్టోబర్ తొలివారంలో ఈ ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీఈవో నిఖిల్ కె.మాసూర్కర్ తెలిపారు. ముందుగా భారత్‌తోపాటు ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో దీన్ని విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖసమీపంలో ఉన్న వస్తువులను సరిగా గుర్తించలేకపోవడం ప్రెస్బయోపియా లక్షణాల్లో ఒకటి. ఇది ఎక్కువగా 40 ఏళ్ల వయసు పైబడినవారిలో కనిపిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే ఈ లక్షణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారంగా కళ్లద్దాలు వాడుతున్నారు. అందులో భాగంగా రీడింగ్ గ్లాసెస్, బైఫోకల్స్, ప్రోగ్రెసివ్ లెన్స్, కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తున్నారు. ఇవేవీ లేకుండా త్వరలో కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం చుక్కల మందు వేసుకుంటే సరిపోతుంది. -
ఈ కాంటాక్ట్ లెన్స్‌లతో మెరుగైన చూపు!
కంటిచూపును ఎన్నోరెట్లు ఎక్కువ చేయగల అద్భుతమైన సరికొత్త కాంటాక్ట్ లెన్స్‌లను తయారు చేసింది ఫ్రాన్స్‌కు చెందిన ఐఎంటీ ఆట్లాంటిక్ సంస్థ!! కేవలం దృష్టి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. కంటిముందు ఉన్న దృశ్యాలను దూర ప్రాంతాలకు ప్రసారం చేసేందుకూ దీనిని ఉపయోగించవచ్చు. చిన్నసైజు ఫ్లెక్సిబుల్ బ్యాటరీ కూడా ఉన్న ఈ కాంటాక్ట్ లెన్స్‌లో సూక్ష్మస్థాయి ఎల్ఈడీ బల్బు ఒకటి ఉంటుంది. కొన్ని గంటలపాటు పనిచేయగలదు. ఈ కాంటాక్ట్ లెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యుద్ధరంగంలోని సైనికులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. ఈ కారణంగానే అమెరికాకు చెందిన రక్షణ, పరిశోధన సంస్థ డార్పా ఇలాంటి కాంటాక్ట్ లెన్స్‌ల కోసం దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ శతాబ్దపు పదార్థంగా భావిస్తున్న గ్రాఫీన్ ఆధారంగా ఇందులోని ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేశారని భావిస్తున్నారు. మరిన్ని పరిశోధనల ద్వారా లెన్స్ సామర్థ్యాన్ని పెంచవచ్చునని... సైనికులతోపాటు దృష్టి సమస్యలున్న డ్రైవర్లు, శస్త్రచికిత్సలు చేసే సమయంలో డాక్టర్లు కూడా ఈ లెన్స్‌లను వాడవచ్చునని ఐఎంటీ ఆట్లాంటీక్ అంటోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణంగానే ఒకవైపు అమెరికా రక్షణ పరిశోధన సంస్థ ఇంకోవైపు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఐఎంటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవలే తన హాలోలెన్స్ టెక్నాలజీని అమెరికా సైన్యానికి అమ్మడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. -
కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం ప్రమాదకరం
వాషింగ్టన్: నిద్ర పోయేటప్పుడు కాంటాక్ట్‌లెన్స్ తీయకుండా అలాగే ఉంచడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్‌లెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కార్నియాకు ఇన్ఫెక్షన్స్ సోకుతుందంటున్నారు అమెరికాలోని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ ఫెమ్లింగ్. ‘కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి.. శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, కళ్ల సంబంధ సమస్యలు రాకూడదంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం’అని ఆయన పేర్కొన్నారు. -
నీ కళ్లు బంగారం కాను!
అమ్మాయిల అందమైన కళ్ల గురించి ఎంతో మంది కవులు ఎన్నో విధాలుగా వర్ణించారు. పాటలతో కీర్తించారు. ఇక 'తళ తళ మెరిసే ఆ బంగారు కళ్లు' అంటూ అభినవ కవి కొత్త పాట అందుకోవాల్సిందే. ఎందుకంటే ముంబైకి చెందిన ఓ డాక్టర్ అచ్చమైన బంగారంతోనే కాంటాక్టు లెన్సులు తయారు చేసి అమ్మాయిల కళ్లకు కొత్త తళుకులు తీసుకొస్తున్నారు. ముచ్చట పడిన ముద్దు గుమ్మలు ఈ బంగారు లెన్సులు ధరించాలంటే రూ. 9.30 లక్షల నుంచి రూ. 11.16 లక్షల వరకు చెల్లించాలండోయ్! 24 కారెట్ల బంగారంతో తాను తయారు చేస్తున్న ఈ కాంటాక్టు లెన్సులకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోందని ముంబై నగరానికి చెందిన కంటి డాక్టర్ చంద్రశేఖర్ చౌహాన్ తెలిపారు. తాను తయారు చేస్తున్న బంగారు కంటి లెన్సులను చూసి కొంత మంది వాటిని ధరించేందుకు భయపడుతుండగా ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. కంటికి బంగారం అతుక్కుపోకుండా రెంటికి మధ్య తాను మరో పొరను ఏర్పాటు చేసే జాగ్రత్త తీసుకున్నానని చెప్పారు. తాను కొత్తగా వజ్రాలతో కూడా కాంటాక్ట్ లెన్సులను తయారు చేశానని, తనవద్దకొచ్చే అమ్మాయిలకు బంగారం లేదా వజ్రాల లెన్సులను ఎంచుకునే అవశాం కూడా ఉందంటున్నారు. వీటిని తాను అమెరికాలో కూడా విక్రయించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదు. ఈ లెన్స్‌ల వల్ల కంటి దృష్టికి ఎలాంటి హాని ఉండదని ముందుగా రుజువు కావాలని, ఆ తర్వాత అమెరికా ఫుడ్స్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ నుంచి అనుమతి పొందాలని నిపుణులు చెబుతున్నారు.