న్యూఢిల్లీ: చత్వార (ప్రెస్‌బయోపియా–లాంగ్ సైట్) సమస్యకు రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండా తయారు చేసిన ఐ డ్రాప్స్‌ను తొలిసారి భారత్‌లోకి తీసుకురానున్నారు. ఈ ఔషధ తయారీ సంస్థ ఎన్‌టాడ్ ఫార్మా అక్టోబర్ తొలివారంలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఈమేరకు ప్రకటించింది.
ఈ కంటి చుక్కల మందును దేశీయంగా మార్కెటింగ్ చేసేందుకు ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ నుంచి తుది అనుమతులు లభించినట్లు ఎన్‌టాడ్ ఫార్మా వెల్లడించింది. ప్రెస్‌వ్యూ ధర రూ.350గా ఉంటుందని సమాచారం. అక్టోబర్ తొలివారంలో ఈ ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీఈవో నిఖిల్ కె.మాసూర్కర్ తెలిపారు. ముందుగా భారత్‌తోపాటు ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో దీన్ని విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ
సమీపంలో ఉన్న వస్తువులను సరిగా గుర్తించలేకపోవడం ప్రెస్‌బయోపియా లక్షణాల్లో ఒకటి. ఇది ఎక్కువగా 40 ఏళ్ల వయసు పైబడినవారిలో కనిపిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే ఈ లక్షణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారంగా కళ్లద్దాలు వాడుతున్నారు. అందులో భాగంగా రీడింగ్ గ్లాసెస్, బైఫోకల్స్, ప్రోగ్రెసివ్ లెన్స్, కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తున్నారు. ఇవేవీ లేకుండా త్వరలో కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం చుక్కల మందు వేసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment