
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్ను పొడిబారడం వంటి సమస్యలకు పరిష్కారంగా సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ సెక్వా పేరుతో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు పరిమితులను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది.
నానోమిసెల్లార్ టెక్నాలజీతో భారత్‌లో అందుబాటులో ఉన్న మొదటి ఔషధం ఇదేనని సన్ ఫార్మా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తి కంటే భారతదేశంలో ఈ సమస్య ప్రాబల్యం ఎక్కువగా ఉంది. సమస్య ఉత్పన్నమైతే కంట్లో దురద, నలుసు పడ్డట్టు అనిపించడం, ఎరుపెక్కడం, మంట, నొప్పి, ఒత్తిడి, నీరు కారడం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment