Eye disease
-
కంటి సమస్యకు సన్ ఫార్మా ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్ను పొడిబారడం వంటి సమస్యలకు పరిష్కారంగా సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ సెక్వా పేరుతో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు పరిమితులను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. నానోమిసెల్లార్ టెక్నాలజీతో భారత్‌లో అందుబాటులో ఉన్న మొదటి ఔషధం ఇదేనని సన్ ఫార్మా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తి కంటే భారతదేశంలో ఈ సమస్య ప్రాబల్యం ఎక్కువగా ఉంది. సమస్య ఉత్పన్నమైతే కంట్లో దురద, నలుసు పడ్డట్టు అనిపించడం, ఎరుపెక్కడం, మంట, నొప్పి, ఒత్తిడి, నీరు కారడం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. -
Dry Eye Irritation: కంట్లో దురదా.. ఇలా చేస్తే సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
మీ కళ్లు ఎర్రబడి, తరచు దురదతో బాధిస్తున్నాయా? ఐతే మీరు డ్రై ఐ సిండ్రోమ్ తో బాధపడుతున్నారన్నమాట. మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో ఇది సహజంగా కనిపించేదే అయినప్పటికీ ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లల్లో, యుక్తవయసువారు కూడా ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. సాధారణంగా కన్నీటి గ్రంథులు పొడిబారితే డ్రై ఐ సిండ్రోమ్ సమస్య తలెత్తుతుంది. ఇది విపరీతంగా చికాకును, బాధను కలిగిస్తుంది. నిపుణులు సూచించిన ఈ కింది పద్ధతుల ద్వారా ఈ సిండ్రోమ్ నుంచి ఏ విధంగా బయటపడొచ్చో తెలుసుకుందాం.. ఎందుకు వస్తుందంటే.. వెలుతురు సరిగాలేని ప్రదేశాల్లో, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో నివసించడం, ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్లపై పనిచేయడం వంటి కారణాల రిత్యా ఈ సమస్యతలెత్తవచ్చు. అంతేకాకుండా కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్, హార్మోన్ల అసమతుల్యత, అలర్జీలు, వృద్ధాప్యం కూడా కళ్లు పొడిబారడానికి కారణం అవుతాయి. దీర్ఘకాలంపాటు పొడి కళ్ళ సమస్య ఉంటే మీ దృష్టికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సహజ పద్ధతుల్లో చికిత్స ఇలా.. ►నీరు అధికంగా తాగాలి కంటి ఉపరితలం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మొత్తంలో నీరు అవసరం అవుతుంది. కంటిని శుభ్రపరచి, రక్షించడానికి ఉపయోగపడే ద్రవాలు విడుదల కావడానికి, లాక్రిమల్ గ్రంధులు సమర్థవంతంగా పనిచేయడానికి నీరు అధికంగా తాగడం ఉత్తమం. హైడ్రేటెడ్‌గా ఉండడం వలన ఆరోగ్యకరమైన సహజ కన్నీళ్లు, నూనెలు ఉత్పత్తి అవుతాయి. అయితే డీహైడ్రేటెడ్ వల్ల కంటి ఉపరితలం పొడిబారి చికాకు, దురద కలిగేలా చేస్తాయి. కాఫీ, ఆల్కహాల్.. వంటి ఇతర కెఫిన్ అధిరంగా ఉండే పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది. పుచ్చకాయ, పీచ్ పండ్లు, దోసకాయ, స్ట్రాబెర్రీ.. వంటి నీటి శాతం పుష్కలంగా ఉండే పండ్లు తినడం వల్ల కళ్లు పొడిబారకుండా నిరోధించవచ్చు. ►ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అనేక అధ్యయనాల ప్రకారం ఫ్యాటీ ఆమ్లాలు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కళ్లు పొడిబారకుండా నిరోధించి కళ్లకవసరమైన నూనెలు సమృద్ధిగా అంది మృదువుగా ఉండేలా చేస్తాయని వెల్లడించాయి. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాల్లో ఈపీఏ, డీహెచ్ఏ నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఇది కళ్లు పొడిబారడం వల్ల కలిగే మంటను నిరోధిస్తుంది. అవిసె గింజలు, గుడ్లు, చియా విత్తనాలు, చేపలు, వాల్‌నట్స్‌లలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు నిండుగా ఉంటాయి. ►రెప్పవాల్చక పోవడం కంప్యూటర్ వంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్లను రెప్పవేయకుండా తదేకంగా చూడటం వల్ల కూడా కళ్లు పొడిబారిపోతాయి. దీనినే డిజిటల్ ఐ స్ట్రైన్ అని కూడా అంటారు. ఏదిఏమైనప్పటికీ నిముషానికి కనీసం 15 నుంచి 30 సార్లైనా కనురెప్పలు ఆడించాలి. ప్రతి 20 నిముషాలకు ఒకసారి మీ కళ్లకు విశ్రాంతినివ్వడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ నుంచి కాపాడుకోవచ్చు. మీరు ఒకవేళ ఎలక్ట్రిక్ స్క్రీన్ ముందు గంటలకొద్దీ సమయం గడపవలసి వస్తే బ్లూ లైట్ ఫిల్టరింగ్ స్పెటికల్స్ (కళ్లద్దాలు) వాడటం మంచిది. ►కళ్లను శుభ్రపరచాలి ప్రతిరోజూ కళ్లకు మేకప్చేసే అలవాటుంటే.. తప్పనిరిగా కను రెప్పలను, కను బొమ్మలను, కంటి చుట్టు పక్కల చర్మాన్ని బేబీ షాంపూ లేదా మిల్డ్ సోప్‌లతో శుభ్రపరచుకోవాలి. తర్వాత వేడి నీటిలో ముంచిన గుడ్డను కళ్లపై కనీసం నిముషంపాటైనా ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కంటి పై మూసుకుపోయిన నూనె గ్రంథులు విచ్చుకోవడానికి, మంటను తగ్గించి చికాకును తొలగించడానికి ఉపయోగపడుతుంది. ►సన్ గ్లాసెస్ ధరించాలి కాలుష్యం, ధుమ్ము, ధూళి కూడా మీ కళ్లు పొడిబారేలా చేస్తాయి. సన్ గ్లాసెస్ వీటి నుంచి మీ కళ్లను కాపాడటమేకాకుండా సూర్యుడి నుంచి ప్రసరించే ప్రమాదకర యూవీ కిరణాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇది కంటిలోని నల్ల గుడ్డును, కటకాన్ని, రెటీనాను, మాక్యులర్ డీజనరేషన్ ప్రమాదంలో పడకుండా కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ! -
'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్
doctor uses iPhone 13 Pro Max camera for eye treatment. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.అతి సున్నితమైన కంటి చూపును మెరుగు పరిచేందుకు ఓ డాక్టర్ యాపిల్ ఐఫోన్13ను ఉపయోగించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఫోన్లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని జోడించి కంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు సైతం 'డాక్టర్ బాబు'..కార్నియా రాపిడి నయమైందని అంటున్నారు.వినడానికి వింతగా ఉన్న ఇది మెడికల్ మిరాకిల్ అని అంటున్నారు వైద్య నిపుణులు. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందిన టామీ కార్న్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 21 సంవత్సరాలుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్ మెమోరియల్ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్ ఇన్నోవేటర్(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఈయన,ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి'ఐ'ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్ తరువాత వచ్చే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సాధారణ ట్రీట్మెంట్తో పరిష్కరించలేని ఎన్నో సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్ ఫీచర్ తో కంటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో లింక్డిన్లో పోస్ట్ చేశారు. మ్యాక్రోమోడ్ ఫీచర్ అంటే? ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సిన అవసరం లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. సినిమాటిక్ మోడ్, మ్యాక్రోమోడ్ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్ టామీ కార్న్ కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్ ఉన్నా..మ్యాక్రోమోడ్ చాలా ప్రత్యేకం. ఉదాహరణకు కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని సైతం అడ్వాన్స్డ్ మ్యాక్రోమోడ్ టెక్నాలజీతో హెచ్డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు. ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌తో ట్రీట్మెంట్.. కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఇది చాలా పలచగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి కార్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్ చేశారు. అనంతరం ఆ సమస్య గురించి డాక్టర్ టామీకార్న్ పేషెంట్‌ను అడగ్గా..తన కంటి చూపు మెరుగుపడిందని సంతోషంగా చెప్పాడు. ఆ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది -
పాపకు మెల్లకన్ను ఉన్నట్లు అనిపిస్తోంది...
మా పాప వయసు మూడున్నర ఏళ్లు. వచ్చే ఏడాది స్కూల్లో వేయడం కోసం... ఇప్పట్నుంచే అలవాటు చేయడానికి తనను ప్లే స్కూల్‌కు పంపుతున్నాం. ఈ క్రమంలో ఆమెకు మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించాను. పాప దేనినైనా తదేకంగా చూస్తున్నప్పుడు మెల్లకన్ను పెడుతోంది. మాకు తెలిసిన కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే ఆమెకు కళ్లజోడు అవసరమని చెప్పారు. ఇంత చిన్న పాపకు కళ్లజోడు అవసరమా? ఆమెకు ఇంకేదైనా చికిత్స అందుబాటులో ఉందా? మీరు చెప్పిన వివరాల ప్రకారం బహుశా మీ పాపకు అకామడేటివ్ ఈసోట్రోపియా అనే కండిషన్ ఉండవచ్చునని తెలుస్తోంది. మెల్లకన్ను దూరదృష్టి (హైపర్‌మెట్రోపియా)ని సరిచేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్ వస్తుంది. ఈ సమస్య సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో మొదలవుతుంది. ఏదైనా చదివే సమయంలో సరిగా కనిపించనప్పుడుగానీ లేదా తదేకంగా చూస్తూ తనకు కనిపిస్తున్నదాన్ని స్పష్టంగా చూసేందుకు అకామడేట్ చేసుకునే ప్రయత్నంలో గానీ ఈ కండిషన్ మొదలవుతుంది. అదే క్రమంగా మెల్లకన్నుకు దారితీస్తుంది. మీ పాప కంటి సమస్యను చక్కదిద్దడానికి ప్లస్ పవర్ ఉన్న లెన్స్‌లను (అద్దాలను) కంటివైద్యనిపుణులు సూచిస్తారు. ఈ కంటి అద్దాలను ఆరు నెలల పాటు వాడాక అప్పుడు మళ్లీ మెల్లకన్ను ఏ మేరకు ఉందో పరీక్షించి చూస్తారు. ఈ క్రమంలో వయసు పెరిగేకొద్దీ ప్లస్ పవర్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మెల్లకన్ను సమస్య దానంతట అదే నయమవుతుంది. అప్పుడు ఆమెకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ప్లస్ పవర్ ఉన్నంతకాలం ఆమెకు కళ్లజోడు తప్పనిసరి. ఇంత చిన్న వయసులో కళ్లజోడు ఎందుకు అంటూ మీరు గనక నిర్లక్ష్యం చేసే, అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు దారితీసి, ఆమె ఒక కంట్లోగానీ, లేదా రెండు కళ్లలోగానీ చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మీ పాపకు తగిన అద్దాలు ఇప్పించండి. కళ్లద్దాలు ఇష్టం లేదు...ప్రత్యామ్నాయం ఉందా? నా వయస్సు 20 ఏళ్లు. నేను నాలుగేళ్లుగా కళ్లద్దాలు వాడుతున్నాను. నాకు మైనస్ 3 పవర్ ఐసైట్ ఉంది. నాకు కళ్లద్దాలు వాడటం ఇష్టం లేదు. నా వయసుకంటే పెద్దగా కనిపిస్తున్నాను. అందుకే వాటికి బదులుగా వాడదగిన కాంటాక్ట్ లెన్స్‌లు వాడటమో లేదా లాసిక్ సర్జరీయో చేయించుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఆ రెండింటి గురించి వివరాలు చెప్పండి. మొదట కాంటాక్ట్ లెన్సెస్ గురించి తెలుసుకుందాం. అవి కంటి నల్లపొర (కార్నియా పొర) మీద వాడే ప్లాస్టిక్ లెన్సెస్ అన్నవూట. ఇందులో సాఫ్ట్ లెన్స్, సెమీ సాఫ్ట్ లెన్స్, గ్యాస్ పర్మియబుల్ లెన్స్, రిజిడ్ లెన్స్ అని వెరైటీస్ ఉన్నాయి. దీన్ని పేషెంట్ కార్నియాను బట్టి వాళ్లకు ఏది ఉపయుక్తంగా ఉంటుందో డాక్టర్లు సూచిస్తారు. కాంటాక్ట్ లెన్స్‌ను ఉదయం పెట్టుకొని, రాత్రి నిద్రపోయే వుుందు తొలగించాలి. వాటిని అలా పెట్టుకొనే నిద్రపోకూడదు. కాంటాక్ట్ లెన్స్ ఉన్నప్పుడు కన్ను నలపకూడదు. కాంటాక్ట్ లెన్స్ ఉన్నవాళ్లు ఎక్కువగా డస్ట్, పొగ, వేడిమి ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇక లాసిక్ సర్జరీ అంటే కార్నియా పై పొర ఒంపు (కర్వేచర్)ను అడ్జెస్ట్ చేసి దూరదృష్టి (ప్లస్), హ్రస్వ దృష్టి (మైనస్) లోపాలను సరిచేస్తారు. రిఫ్రాక్షన్ స్టేబుల్‌గా ఉంటే లేజర్ చికిత్స కూడా చేయించుకోవచ్చు. లేజర్ అయినా వారం నుంచి పది రోజుల్లో చూపు నార్మల్‌గా ఉంటుంది. ఈ చికిత్సతో సాధారణ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే ఈ ఆపరేషన్‌ను సూచిస్తుంటాం. మీ వయసు 20 ఏళ్లు కాబట్టి మీరు ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకొని, అర్హులైతే లాసిక్కు తప్పక వెళ్లవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డికంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
గ్లూకోమాకు ముందస్తు చికిత్స..
కంటి వ్యాధి అయిన గ్లూకోమాను ముందుగానే నిరోధించేందుకు కాలిఫోర్నియా, టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న చికిత్స విధానాన్ని ఆవిష్కరించారు. సహజసిద్ధంగా లభించే లిపిడ్ మీడియేటర్స్ అనే కణాల ద్వారా గ్లూకోమాను నిరోధించవచ్చని గుర్తించారు. ఈ వ్యాధి వల్ల ఏటా కొన్ని లక్షల మంది చూపును కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కార్స్టెన్ గ్రోనెర్ట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఎలుకలపై ప్రయోగాలు చేసింది. శరీరంలోని ఆస్ట్రోసైట్స్ కణాలు స్రవించే లిపోక్సిన్ అనే రసాయనం కంటిలోని గాంగ్లియన్ కణాలు నాశనమైపోవడాన్ని అడ్డుకుంటున్నట్లు తెలుసుకున్నారు. లిపోక్సిన్లు వాపు/మంటలను తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని ఇప్పటివరకూ అనుకునే వారు. ఇవే కణాలు గ్లూకోమా నివారణకూ ఉపయోగపడుతున్నాయని తమ ప్రయోగాల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. లిపోక్సిన్ ద్వారా ఇతర నాడీ సంబంధిత వ్యాధుల్లోనూ మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
సాయానికి ఎదురు‘చూపు’
♦ చదువుల తల్లికి అరుదైన కంటి వ్యాధి ♦ చూపు కోల్పోయిన ప్రతిభావంతురాలు ♦ వైద్యం చేయించని పేద కుటుంబం ♦ దాతలు కరుణించాలని వినతి పసివాడో ఏమిటో ఆ పైవాడు.. తను చేసిన బొమ్మలతో తలపడతాడు.. అని రాశాడో సినీకవి. విజ్ఞానంతో విరిసిన ఆ నయనాలు నల్ల కలువలవుతుంటే ఈ గీతమే గుర్తొస్తోంది. బంగారు స్వప్నాల్ని కన్న కనులను అంధకారం కమ్మేస్తుంటే ప్రతి కన్ను చెమర్చుతోంది. అరుదైన కంటి జబ్బు అభం శుభం తెలియని చిన్నారిని కాటేస్తుంటే పాషాణుల్ని సైతం కరిగిస్తుంది. ఆ దురదృష్టవంతురాలు.. కొత్తవలస మండలం కంటకాపల్లికి చెందిన విద్యార్థిని శ్రావణి. ఈ ప్రతిభావంతురాలి బతుకులో ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి నిప్పులు పోసింది. కంటిచూపును కబళించేసింది. అత్యంత ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప చూపు దక్కదని తెలిసిన ఆమె ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తోంది. కొత్తవలస రూరల్: కంటకాపల్లి ఎస్సీ కాలనీలో నివసిస్తున్న మాడుగుల సూర్యనారాయణ, వెంకటలక్ష్మికి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె శ్రావణి ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. సూర్యనారాయణ శారదా కంపెనీలో కాంట్రాక్ట్ వర్కర్. శ్రావణి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎనిమిదో తరగతి వరకూ స్కూల్ టాపర్. చదువుల్లోనే కాదు ఆటపాటలు, వ్యాసరచన, అన్నింటిలోనూ ప్రథమస్థానమే. పోటీలకు వెళ్తే పతకం రావలసిందే. ఇంతటి ప్రతిభావంతురాలు ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి ప్రభావంతో కంటిచూపును కోల్పోయింది. ఇంజక్షన్ ఖరీదు రూ.70 వేలు శ్రావణికి ఈఏడాది వేసవి సెలవుల్లో చూపు తగ్గటంతో విశాఖపట్నం వైద్యుల్ని సంప్రదించారు. వారు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు సిఫార్సు చేశారు. అక్కడి వైద్యులు శ్రావణిని పరీక్షించి లక్షమందిలో వచ్చే వ్యాధిగా గుర్తించారు. దీంతో ఈమెకు నెలకు రూ.70 వేల విలువైన ఇంజక్షన్ (స్టెరాయిడ్స్), రూ.2వేల విలువైన మాత్రలను ఆరు డోసులు ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు అతి కష్టంమీద 3 డోసులు వేయించారు. ఆర్థిక స్తోమత చాలక పోవటంతో దాతలు కరుణించాలని కన్నీటితో ప్రాధేయపడుతున్నారు. దాతలు 94910601931 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. మనసున్న నేస్తాలు శ్రావణి సహ విద్యార్థులు తమ ఇంటి వద్ద, దాచుకున్నవి, గ్రామంలో మొత్తం సుమారు రూ.లక్ష సేకరించి స్నేహితురాలి కంటిచూపు మెరుగుకు కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. వెలుగు ప్రసాదించండి చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలుస్తుండటంతో మా కుమార్తె ఉన్నత విద్య చదువుతుందని మురిసిపోయాం. కానీ భగవంతుడు ఇలా చేస్తాడని అనుకోలేదు. నరాల్లో ఎర్ర రక్తకణాలు స్పందించటం లేదని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దాతలు స్పందించి మా కుమార్తె బతుకులో వెలుగు ప్రసాదించాలి. – సూర్యనారాయణ, తండ్రి ప్రభుత్వం ఆదుకోవాలి అప్పులు చేసి ఇప్పటి వరకూ మూడు డోసులు వేయించాం. ఇంకా మూడు డోసులు వేయించాల్సి ఉంది. ఆ తరువాత వైద్యులు ఏం చెబుతారో భయంగా ఉంది. ప్రభుత్వం సాయం చేసి నా చిట్టి తల్లికి చూపు తెప్పించాలి. – వెంకటలక్ష్మి, తల్లి -
అతి అనర్థమే...
వీడియోగేమ్స్‌కు అతుక్కుపోతున్న చిన్నారులు కంటి జబ్బులు వచ్చే అవకాశం చదువుపైనా తీవ్ర ప్రభావం సాగర్‌నగర్ : అతి అనర్దదాయకమే అని పెద్దలు ఊరకే అనలేదు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్, వీడియో, కంప్యూటర్ గేమ్స్‌పై పిల్లలు చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఫలితంగా చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చిన్నారులు మారాం చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్, కిడ్స్ బొమ్మలు ఆన్ జేసి వారికెదురుగా పెడుతున్నారు. దీంతో వాటికి అలవాటుపడుతున్నారు. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో పనులు సులువుగా చక్కబెట్టుకుంటున్నాం. అయితే ఈ ఆధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా లేకుంటే అనర్ధాలు కొని తెచ్చుకున్నట్టవుతుంది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఆటలపై ఆసక్తి చూపుతారు. గతంలో క్రికెట్, వాలీబాల్, వంటి క్రీడల ద్వారా శారీరక శ్రమతో ఆరోగ్యానికి మేలు జరిగేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్సెఫోన్లు, టీవీలు, కంప్యూటర్ తప్పనిసరి అవసరంగా మారడం, పిల్లలను బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోవడం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లలు ఆటపాటలకు పక్కన పెట్టి వీడియో, కంప్యూటర్ గేమ్స్‌ను అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రుల గారాబం కంప్యూటర్ల ముందు పిల్లలు గంటల సేపు గడపడాన్ని చాలా గొప్ప విషయంగా తల్లిదండ్రులు బావిస్తున్నారు. అందుకే వారు కూర్చున్న చోటకే అన్నం, పాలు వంటి ఆహార పదార్థాలను అందిస్తూ మురిసిపోతున్నారు. అలాగే ఏడ్చే పిల్లోడికి స్మార్ట్పోన్లో గేమ్స్ నొక్కితుంటే తల్లిదండ్రులు సంబర పడుతున్నారు. కానీ దీని వల్ల దీర్ఘకాలంలో అనార్దలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగితా శరీర అవయవాల మీద శ్రమ తగ్గడం వల్ల ఆ మేరకు కళ్ల మీద అధిక ప్రభావం పడుతుంది. దీంతో 15 ఏళ్ల వయస్సులోనే చిన్నారులు లేనిపోని ఆనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. చదువులోనూ వెనకడుగే గేమ్స్ ఆడే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గేమ్స్‌లో ఒక్కో స్టేజ్ దాటుకుంటూ ముందుకు పోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో అడ్రినల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుందని, అధిక మోతాదుల్లో అడ్రినల్ శరీరంలో విడుదల కావడం మంచిది కాదని కేజీహెచ్ వైద్యనిపుణుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి తోడు టీవీలు కంప్యూటర్లలో ఆడే వీడియో గేమ్స్‌పై ఆసక్తి ఎక్కువైతే తరగతి గదుల్లో చెప్పే పాఠాలు బోర్ కొడతాయి. పాఠాల్లో ఉండే విషయాలు కంటే గేమ్స్‌లో ఉండే అడ్వెంచర్స్ వారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వారు రానురాను చదువులో వెనకబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలు పరిమిత సమయం కన్నా ఎక్కువ సేపు వీడియో గేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అదే విధంగా నెట్ సర్ఫింగ్‌లో ఎక్కువ సమయం గడిపే అలవాటును మాన్పిస్తే మంచిదని సూచిస్తున్నారు. కళ్లపై అధిక భారం : సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.. అయితే పిల్లలు రోజులో ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ మానిటర్లకు అతుకుపోవడం వల్ల కళ్లపై అధిక భారం పడుతుంది. దాంతో కంటి సంబంధిత జబ్బులు, తలనొప్పి వంటి రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితులో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇటు ఉపాధ్యాయులు, అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయస్సులోచూపుపై ప్రభావం పడితే విమానయాన, సైనికరంగాల్లో ఉపాధి అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది. సైట్ వచ్చే అవకాశం ఎక్కువ అతిగా టీవీ చూడడం, గేమ్స్ ఆడడం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా కళ్లకు సంబంధించి సమస్య ఎక్కువగా కనబడుతుంది. చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వినియోగించాల్సిన వస్తోంది. ఎవరైనా సరే కాస్తై శరీరక శ్రమ చేయాలి. పిల్లలు ఈ పనిని ఆటల ద్వారా చేస్తారు. శరీరక శ్రమకు దూరమైన పిల్లల్లో క్రమంగా రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. పిల్లల ఎదుగదలపై ప్రభావం చూపుతుంది. - శ్రీకుమార్, కంటి వైద్య నిపుణుడు ఆసక్తి తగ్గించాలి పిల్లలు టీవీని చూసి ఆనందిస్తారు. అయితే అతిగా చూడడం వల్ల అనర్ధాలు వస్తాయని పిల్లలు బలవంతంగా టీవీకి దూరంగా చేయకూడదు. అలా చేస్తే తల్లిదండ్రుల పట్ల వారు శత్రుత్వం పెంచుకుంటారు. వారి మనస్సు మారే విధంగా ఎక్చర్సైజులు చేయించాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల అభిరుచిని బట్టి సంగీతం, క్రీడలు, ఆర్ట్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. - డాక్టర్ రమణమూర్తి, సైకాలజిస్ట్