infections spread
-
జబ్బులు బాబోయ్!
సాక్షి, అమరావతి: దేశంలో జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 37 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. 75వ జాతీయ నమూనా సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో, వివిధ రాష్ట్రాల్లో అనారోగ్య ప్రాబల్యంపై 75వ జాతీయ నమూనా సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక రూపంలో విడుదల చేసింది. దేశంలో ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు జీవనశైలి జబ్బులు.. అంటే బీపీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు, నలుగురు గుండె, రక్తనాళాల జబ్బుల బారిన పడుతున్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు వైకల్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కేరళ, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువ శాతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు వారు ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. బిహార్, అస్సోం, గోవా, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారు బిహార్, ఉత్తరాఖండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. జీవనశైలి జబ్బులతో పాటు గుండె, రక్తనాళాల జబ్బులు, అంటువ్యాధులతో బాధపడుతున్న వారు కేరళలో అత్యధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
ఇన్ఫెక్షన్ రానీయొద్దు..!
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీ (హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ –హెచ్ఐసీసీ)లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా అధిపతి కమిటీకి చైర్ పర్సన్‌గా.. మైక్రో బయాలజీ హెడ్ లేదా సీనియర్ మైక్రోబయోలజిస్ట్ లేదా సీనియర్ డాక్టర్ సభ్య కార్యదర్శిగా, ఆర్ఎంవో లేదా నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా ఆపరేషన్ థియేటర్, ఐసీయూ ఇన్చార్జి, ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్, హౌస్ కీపింగ్, శానిటేషన్, లాండ్రి, ఇంజనీరింగ్, ఫార్మకాలజీ, ఫార్మసీ, స్టోర్స్, మెటీరియల్ సప్లై విభాగాల నుంచి తదితరులు సభ్యులుగా ఉంటారు. సర్జికల్, మెడికల్, అనస్తీషియా తదితర విభాగాలకు చెందిన అధిపతులు ప్రతినిధులుగా ఉంటారు. 100 పడకల వరకు ఉన్న ఆస్పత్రుల్లో ఒకరు, ఆపైన పడకలు ఉన్న ఆస్పత్రుల్లో ఇద్దరు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సులు ఉంటారు. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోయిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీల విధులివీ.. కనీసం వారానికోసారి సమావేశమై ఆస్పత్రిలో నిబంధనల మేరకు ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారా లేదా సమీక్షించాలి పరికరాల స్థితి, రసాయనాలు, డిస్పోజబుల్స్, లాండ్రీ మొదలైన వాటిని సమీక్షించాలి. ఇన్ఫెక్షన్ నియంత్రణకు సంబంధించి స్టెరిలైజేషన్ కెమికల్స్, పీపీఈల నిల్వలను పరిశీలించాలి. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో బయో మెడికల్, వైద్య వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉందా లేదా చూడాలి. వివిధ రకాల గదులు, ఐసీయూఎస్, పోస్ట్ ఆపరేటివ్ వార్డుల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణలను సమీక్షించాలి. అంటు వ్యాధులకు కారణాలు, వ్యాప్తి నియంత్రణ ప్రోటోకాల్‌లలో ఏమైనా లోపాలున్నాయా గుర్తించాలి. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో యాంటీ బయాటిక్ పాలసీ, యాంటీ బయాటిక్ స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రామ్‌ను సమీక్షించాలి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్లపై నిఘా ఉంచాలి. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, ఇతర గదుల్లో శస్త్రచికిత్స అనంతరం వార్డుల్లో ప్రామాణిక స్టెరిలైజేషన్ పద్ధతులను పాటించాలి. అన్ని ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఇన్చార్జి నర్సులు సూక్ష్మజీవుల విశ్లేషణ కోసం స్వాబ్స్/గాలి నమూనాలను పరీక్షలకు పంపాలి. బయో మెడికల్ వ్యర్థాలను పారవేసే ఆస్పత్రి సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలి. నిరీ్ణత ప్రొటోకాల్ ప్రకారం వైద్య పరికరాలను సరిగా క్రిమిరహితం చేయాలి. కొత్తగా చేరిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్లు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సులకు విడతల వారీగా నిమ్స్‌లో శిక్షణ ఇప్పించాలి. శిక్షణ పొందినవారు ఆస్పత్రి స్థాయిలో ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ఆస్పత్రుల్లో స్టెరిలైజేషన్ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా అవసరమైతే వాటిని వెంటనే తెప్పించుకోవాలి. -
ఐహెచ్ఐపీతో అంటువ్యాధులకు చెక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు వైద్య శాఖ చర్యలు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాం(ఐహెచ్ఐపీ)ను వినియోగించడం ద్వారా అంటువ్యాధులు విస్తరించకుండా చూస్తోంది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, డయేరియా తదితర 33 రకాల కేసుల వివరాలను ఐహెచ్‌ఐపీలో నమోదు చేయించి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోని 7,305 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 1,956 ప్రభుత్వాస్పత్రులు, 1,910 ప్రభుత్వ ల్యాబ్‌లను ఐహెచ్ఐపీ పోర్టల్‌కు మ్యాపింగ్ చేశారు. తొలుత ఏఎన్ఎం స్థాయిలో అనుమానిత లక్షణాలున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. రెండో స్థాయిలో ఆస్పత్రిలో, మూడో స్థాయిలో ల్యాబ్‌లో నిర్ధారణ అయిన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. గత వారం రోజుల్లో విలేజ్ క్లినిక్ స్థాయిలో 94 శాతం, ఆస్పత్రుల్లో 98 శాతం, ల్యాబ్‌లలో 97 శాతం కేసుల వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ వివరాల ఆధారంగా అధికంగా అంటు వ్యాధులు నమోదైన ప్రాంతాలను వైద్య శాఖ హాట్ స్పాట్లుగా గుర్తిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతోంది. సచివాలయాల మ్యాపింగ్కూ చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంలను నియమించింది. వీరి ద్వారా ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలను మరింత చేరువ చేసింది. ఈ క్రమంలో ఐహెచ్‌ఐపీలో సచివాలయాలను కూడా మ్యాపింగ్ చేస్తే.. ఆ స్థాయిలోనే అంటువ్యాధుల వ్యాప్తిని గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని వైద్య శాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యాధికారులు ఇటీవల కేంద్ర వైద్య శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కేంద్ర వైద్య శాఖ నుంచి సానుకూల స్పందన లభించినట్లు అధికారులు చెప్పారు. వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ.. ఐహెచ్ఐపీ వల్ల అంటువ్యాధులు విస్తరించకుండా అరికట్టవచ్చన్నారు. అలాగే ప్రస్తుత సీజన్లో నమోదైన కేసుల ఆధారంగా.. వచ్చే సీజన్లో వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కార్యాచరణ కూడా రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!
Doctors amputate teen's legs, fingers: సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ అంటే సాధారణంగా వాంతులవడం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి జరుగుతాయి. ఫుడ్ పాయిజినింగ్ కారణంగా ఒక్కొసారి కొన్ని కేసుల్లో ప్రాణంతకం కూడా కావచ్చు కానీ చాలావరకు సురక్షితంగా బయటపడతారు. కానీ ఇక్కడొక వ్యక్తికి ఫుడ్ పాయిజినింగ్ అతని జీవితాన్ని అత్యంత విషాదమయంలోకి నెట్టేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని వేడిచేసుకుని తినడం అతనికి అలవాటు. ఎప్పటిలాగానే రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఫ్రిజ్‌లోంచి తీసి వేడిచేసుకుని తిన్నాడు. అయితే అతను తిన్నవెంటనే వాంతులు చేసుకుని తీవ్ర అశ్వస్థకు గురైయ్యాడు. దీంతో అతని స్నేహితుడు ఆసుపత్రితో జాయిన్ చేశాడు. ఆసుపత్రికి వెళ్లిన కొద్ది సేపట్లోనే అతని బీపీ పడిపోయి పరిస్థితి క్రిటికల్ అయిపోయింది. దీంతో వైద్యులు అతనికి వైద్యా పరీక్షలు నిర్వహించారు. కానీ అతనికి ఏమైందో అసలు అర్థం కాలేదు. కాసేపటకికి అతని శరీరం దద్దుర్లుగా మారి ఎర్రగా గాయాలు ఏర్పడటం తీవ్ర నోప్పి రావడం జరిగింది. దీంతో అతన్ని హెలికాప్టర్ సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం యూఎస్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ వైద్యులు మెనింగోకాకల్ అనే అంటు వ్యాధి వచ్చినట్లు తెలిపారు. అయితే మెనింగోకాకల్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది కానీ టీకాతో నివారించవచ్చు. మెనింగోకోకల్ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారని డాక్టర్లు తెలిపారు. కానీ రోగికి అతని మిడిల్ స్కూల్ వయసులో మెనింగోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్నాడని అయితే అతను 16 ఏళ్ల ప్రాయంలో తీసుకోవల్సిన రెండు డోసుల వ్యాక్సిన్‌ని తీసుకోలేదని వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా అతని శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కి గురవ్వడంతో కాలి వేళ్లను చేతి వేళ్లను తీసేశారు. ప్రమాదవశాత్తు ఆ ఇన్ఫెక్షన్ మెదడుకి వ్యాపించలేదు. అయితే ఆ టీనేజర్ ఇప్పుడు కోలుకున్నాడు గానీ ఆ వ్యాధి కారణంగా ఇప్పుడు చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించండి. అలాగే ఏదైనా ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం వేడి చేసితినేటప్పుడూ కాస్త ఆలోచించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్ అయిన డాక్టర్లు!) -
కరోనాకు ముగింపు లేదా!?
‘కరోనా కార్చిచ్చులాంటిది.. అడవి మొత్తం తగలబడే వరకు కార్చిచ్చు ఆరదు, అలాగే మానవాళి మొత్తానికి ఒక్కసారైనా సోకే వరకు కరోనా ఆగదు’ అంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు. మానవాళి మరికొన్ని సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందిపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇమ్యూనిటీ పెరగడం కన్నా టీకాలతో ఇమ్యూనిటీ పెంచడం మంచిదంటున్నారు. వ్యాక్సినేషన్‌తోనే దీన్ని అరికట్టడం సాధ్యమని మరోమారు గుర్తు చేస్తున్నారు. సంవత్సరన్నరకు పైగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనాకు నిజంగా ముగింపు ఉందా? ఉంటే ఎప్పుడు? ఎలా? అనేవి ప్రతిఒక్కరిలో తలెత్తే ప్రశ్నలు. కానీ ఇంతవరకు సైంటిస్టులు దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. తాజాగా వచ్చే 3–6 నెలల్లో పరిస్థితులు ఎలా ఉండొచ్చన్న అంశంపై సైంటిస్టులు పరిశోధన జరిపారు. అయితే వచి్చన సమాధానాలు ఏమంత ఆశాజనకంగా లేవని చెప్పారు. రాబోయే కాలంలో మరలా కరోనా ప్రబలవచ్చని, దీనివల్ల స్కూళ్లు మూతపడడం, టీకాలు తీసుకున్నవారిలో కొత్త ఇన్ఫెక్షన్ భయాలు పెరగడం, ఆస్పత్రులు కిటకిటలాడటం జరగవచ్చని హెచ్చరించారు. కరోనాకు నిజమైన ముగింపు వచ్చే లోపు ప్రపంచంలో ప్రతిఒక్కరూ దీని బారిన ఒక్కసారైనా పడటం లేదా టీకా తీసుకోవడం జరుగుతుందన్నారు. కొందరు దురదృష్టవంతులకు రెండుమార్లు కరోనా సోకే ప్రమాదం కూడా ఉండొచ్చన్నారు. అందరికీ కరోనా సోకేవరకు వేవ్స్ రాకడ ఆగకపోవచ్చని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, తిరిగి తగ్గడం గమనించవచ్చని అమెరికా సైంటిస్టు మైకేల్ ఓస్టర్ హామ్ అభిప్రాయపడ్డారు. మ్యుటేషన్లతో ప్రమాదం వైరస్‌ల్లో వచ్చే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణమవుతాయన్నది తెలిసిందే! కరోనాలో మ్యుటేషన్ మెకానిజం ఇతర వైరస్‌లతో పోలిస్తే మెరుగ్గాఉంది. గత వేరియంట్లలో లోపాలను దిద్దుకొని కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇందువల్ల రాబోయే కాలంలో ఫ్లూలాగానే ఎప్పటికప్పుడు కరోనాకు టీకా (బూస్టర్ డోస్‌లు) టాప్అప్లు తీసుకోవాల్సిరావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. కొన్ని మ్యుటేషన్ల అనంతరం ఫస్ట్‌జనరేషన్ వ్యాక్సిన్లను తట్టుకునే వేరియంట్ రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేకాకుండా కొత్త రకం ఫ్లూ వైరస్ మానవాళిపై దాడి చేసే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ శాస్త్రవేత్త కంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా 5,6 నెలల్లో మాత్రం కరోనా మాయం కాకపోవచ్చని సైంటిస్టుల ఉమ్మడి మాట. ప్రపంచ జనాభాలో 95 శాతం వరకు ఇమ్యూనిటీ(కరోనా సోకి తగ్గడం వల్ల లేదా టీకా వల్ల) వస్తేనే కోవిడ్ మాయం అవుతుందని చెబుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీకి అత్యుత్తమ మార్గం వ్యాక్సినేషనేనని చెప్పారు. కరోనా ముగింపు ప్రపంచమంతా ఒకేదఫా జరగకపోవచ్చని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో(టీకా కార్యక్రమం పూర్తికావడం బట్టి) కరోనా మాయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏం జరగవచ్చు ఒకపక్క కోట్లాదిమందికి టీకా అందలేదు, మరోపక్క ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా మారుతున్నాయి. ఈ రెండింటి సమ్మేళనంతో మరలా కేసులు పెరగవచ్చని మైకేల్ అంచనా వేశారు. టీకా కార్యక్రమాల వేగం పెరిగినా, వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నవారు(ఉదాహరణకు పసిపిల్లలు, టీకా అందని వారు, బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ బారిన పడేవారు) ఎప్పుడూ ఉంటారన్నారు. రాబోయే కొన్ని నెలలు ప్రమాదమని, ముఖ్యంగా టీకా నిరోధక వేరియంట్ వస్తే మరింత ప్రమాదమని సైంటిస్టుల అంచనా. 130 ఏళ్ల క్రితం మనిíÙని ఐదుమార్లు వణికించిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ఉదంతాన్ని గమనిస్తే కరోనా భవిష్యత్‌పై ఒక అంచనా రావచ్చని భావిస్తున్నారు. వీటిలో ఒక దఫా సుమారు ఐదేళ్లు మానవాళిని పీడించింది. ఆ ఐదేళ్లలో 2–4 వేవ్స్ వచ్చాయి. దీనికన్నా కరోనా ప్రమాదకారని, కనుక థర్డ్‌వేవ్ తప్పదని లోనే సిమన్సన్ అనే సైంటిస్టు అభిప్రాయపడ్డారు. అధిక వ్యాక్సినేషన్లు, ఆధునిక సౌకర్యాలున్న అగ్రరాజ్యాల్లో సైతం మరలా కేసులు పెరుగుతున్న సంగతి గుర్తు చేశారు. టీకాల వల్ల మరణాలు తగ్గవచ్చని, కానీ కేసులు పెరగడం ఆగకపోవచ్చని చెప్పారు. ముఖ్యంగా టీకాలు పెద్దగా కనిపించని మెక్సికో, ఇరాన్ లాంటి దేశాల్లో డెల్టాతో డేంజర్ పెరగవచ్చని చెప్పారు. టైమ్ గడిచేకొద్దీ వైరస్లు బలహీనపడతాయన్న అపోహ వద్దన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఈ వేగం సరిపోదు
నిరుడు సెప్టెంబర్‌లో తగ్గుముఖం పట్టడం మొదలెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఫిబ్రవరిలో మళ్లీ అక్కడక్కడ తలెత్తుతూ చాలా తక్కువ వ్యవధిలోనే ఉగ్రరూపం దాల్చింది. గత 24 గంటల్లో కొత్తగా 53,480 కేసులు బయటపడగా 354 మంది మరణించారు. మొత్తం 84 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో... అంటే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్య ప్రదేశ్లలో వున్నాయని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా రెండో దశ మొదలైనప్పుడు మన దేశంలోనూ ఆ పరిస్థితి తలెత్తవచ్చునని అంటు వ్యాధుల నిపుణులు పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలూ సకాలంలో మేల్కొనలేదు. పౌరులను అవసరమైనంతగా అప్రమత్తం చేయలేదు. మళ్లీ ఉత్సవాలు, వేడుకలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు మొదలుకావటం... అన్నీ మరిచి వాటిల్లో భారీయెత్తున ప్రజానీకం పాల్గొనటం ఎక్కువైంది. అదృష్టవశాత్తూ నిరుటితో పోలిస్తే మనం నిరాయుధంగా లేం. వైరస్ బారిన పడినవారికి ఏఏ పరీక్షలు జరపాలో, ఎలాంటి చికిత్స చేయాలో గతంతో పోలిస్తే మరింత స్పష్టత వచ్చింది. అంతకుమించి ఆ మహమ్మారి బారిన పడకుండా వుండేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. అయితే అనేక కారణాల వల్ల వ్యాక్సిన్లిచ్చే ప్రక్రియ మందకొడిగానే వుంది. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అత్యధికంగా పౌరులకు టీకాలు వేస్తున్న దేశం మనదే. కానీ తలసరి సగటు చూస్తే చాలా తక్కువే. ఇప్పుడిప్పుడు వైరస్ విజృంభణ గమనించాక 45 ఏళ్ల వయసు పైబడినవారికి కూడా టీకాలివ్వటం మొదలుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా కేసుల డేటాను పరిశీలిస్తే ఆ మహమ్మారి వ్యాప్తి ఎంత వేగంగా వుందో అర్థమవుతుంది. నాలుగైదు నెలల క్రితం అమెరికా, యూరప్‌లలో రెండో దశ మొదలైనప్పుడు సైతం దాని వ్యాప్తి ఇదే వేగంతో వుంది. సాధారణంగా ఏ దేశంలోనైనా వైరస్ వ్యాపిస్తున్న తీరు వెల్లడికాగానే ఆ వైరస్ తాలూకు జన్యు అనుక్రమణికను ఆరా తీసే పని చురుగ్గా మొదలవుతుంది. అయితే ఆ విషయంలో మనం బాగా వెనకబడివున్నాం. వెల్లడైన మొత్తం కేసుల్లో కనీసం అయిదు శాతం మేర ఈ ప్రక్రియ పూర్తి చేయగలిగితే ఆ వైరస్ ఆనుపానులన్నీ స్పష్టంగా వెల్లడవుతాయి. కానీ మన దేశంలో అది కేవలం 0.01 శాతం మాత్రమే. 2019 డిసెంబర్లో తొలిసారి చైనాలోని వుహాన్‌లో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచం నలుమూలలా విస్తరించే క్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది. ఒక రోగి నుంచి మరొక రోగికి వ్యాపించే సమయంలో ఆ వైరస్ ఎన్ని రకాల ఉత్పరివర్తనాలకు లోనయిందో, ఆ క్రమంలో అది ఏవిధమైన మార్పులకు గురవుతున్నదో తెలుసుకోవాలంటే రోగుల నుంచి నమూనాలు సేకరించి, వైరస్ అనుక్రమణికను తెలుసుకోవటం ఒక్కటే మార్గం. ఒక వైరస్‌లోని జన్యువులను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే దాని నిర్మాణ స్వరూపంపై అవగాహన కలుగు తుంది. అది క్షీణ దశకు చేరుకుందా, ప్రమాదకరంగా పరిణమించిందా అన్నది తేలుతుంది. అది తెలిస్తే ప్రజారోగ్య రంగంలో అనుసరించాల్సిన వ్యూహాలకు రూపకల్పన చేయటం, అందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయటం, వైరస్ వ్యాప్తిని అరికట్టడం సులభమవుతుంది. అలాగే వైరస్ ఏ ప్రాంతంలో అధికంగా వుందో, అది ఎక్కువగా ఎవరి ద్వారా వ్యాపిస్తున్నదో గుర్తించ గలుగుతారు. దాంతోపాటు వైరస్‌పై పరిశోధనలు చేస్తున్నవారికి సరైన వ్యాక్సిన్లను రూపొం దించటంలో, ఇతరత్రా చికిత్సలను సూచించటంలో తోడ్పడుతుంది. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయంతో తప్పనిసరిగా అమలు చేయల్సివచ్చిన లాక్డౌన్లు, వాటి పర్యవసానంగా అన్ని రంగాలూ స్తంభించిపోవటం కారణంగా సాధారణ ప్రజానీకం ఎన్నో అగచాట్లు పడింది. మరోసారి ఆ పరిస్థితి తలెత్తకూడదనుకుంటే టీకాలిచ్చే కార్యక్రమం మాత్రమే కాదు...ఇలా వైరస్ జన్యు అనుక్రమణికను తెలుసుకోవటం కూడా ముఖ్యం. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన వైరస్ రకం 18 రాష్ట్రాల్లో 736మందికి సోకిందని గుర్తించారు. మరో 34మందికి దక్షిణాఫ్రికా రకం వైరస్ సోకిందని తేల్చారు. ఒకరికి బ్రెజిల్ రకం వైరస్ ఉందట. ఇవన్నీ వారంక్రితంనాటి లెక్కలు. ఇప్పుడు ఈ సంఖ్య మరిన్ని రెట్లు పెరిగివుంటుంది. ఇలా వివిధ రకాల కరోనా వైరస్ల వల్ల రోగ లక్షణాలను నిర్ధారించటంలో, దాన్ని నివారించటానికి ఇవ్వాల్సిన ఔషధాలను, వ్యాక్సిన్లను నిర్ణయించటంలో ఇబ్బందులెదురవుతాయి. మన దేశంలో ప్రజారోగ్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, అందులోని లోటు పాట్లేమిటో కరోనా మహమ్మారి ప్రభావవంతంగా ఎత్తిచూపింది. అయితే దాన్నుంచి అవస రమైనమేర గుణపాఠాలు తీసుకోవటంలో విఫలమయ్యామని మనకెదురవుతున్న అనుభవాలు రుజువు చేస్తున్నాయి. వ్యాధి నిరోధకత మన దేశంలో ఎక్కువని సంబరపడే పరిస్థితులు లేవని కరోనా రెండో దశ తాజాగా రుజువు చేస్తోంది. పాశ్చాత్య దేశాల్లో మాదిరే ఇక్కడా వేగంగా వైరస్ వ్యాపిస్తున్న తీరు మనం తక్షణం మేల్కొనాలని తెలియజెబుతోంది. నిరుడు కరోనా తీవ్రతను సకాలంలో గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో విఫలమైన బ్రిటన్, అమెరికాలు టీకాలివ్వటంలో మాత్రం అందరికన్నా ముందున్నాయి. ఆ చురుకుదనాన్ని మనం సైతం అందు కోగలగాలి. -
10 రెట్లు ప్రమాదకరంగా మారిన వైరస్!
కౌలాలంపూర్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లో 26 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 50 వేలకు పైగా మరణించారు. మహమ్మారిని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను ప్రకటించడమే కాక ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మలేషియాలో వెలుగు చూసిన కొన్ని కరోనా కేసులు ప్రపంచ దేశాలకు మరో నూతన సవాలు విసురుతున్నాయి. తాజాగా మలేషియాలో కరోనా వైరస్ కొత్త జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదిగా వెల్లడించారు. మలేషియాలో తాజాగా వెలుగు చూసిన కొన్ని కేసుల్లో వేగంగా వ్యాప్తి చెందేలా కరోనా వైరస్ మార్పుకు గురయినట్లు సంకేతాలు వెలువడుతున్నాయని అమెరికా అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. (కరోనా పడగ నీడలో 200 రోజులు) ఇలా పరివర్తనం(మార్పు) చెందిన కరోనా వైరస్‌కు ‘డీ614జీ’గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి బ్లూమ్‌బర్గ్ ఓ నివేదిక విడుదల చేసింది. మలేషియాలోని ఓ రెస్టారెంట్ యజమాని నుంచి ప్రారంభైన క్లస్టర్లో 45 కేసులు వెలుగు చూడగా.. వాటిలో మూడు కేసులలో ఈ ‘డీ614జీ’గా పిలవబడే పరివర్తన కరోనా వైరస్‌ను గుర్తించారు. సదరు రెస్టారెంట్ యజమాని ఇండియా నుంచి మలేషియా వచ్చి.. 14 రోజుల క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించాడు. అతడి రెస్టారెంట్ కేంద్రంగా 45 కేసులు వెలుగు చూడటంతో మలేషియా ప్రభుత్వం అతడికి ఐదు నెలల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించింది. ఇక బ్లూమ్‌బర్గ్ నివేదికలో హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషమ్ అబ్దుల్లా ‘కరోనా వైరస్ పరివర్తనానికి(మ్యూటేషన్) గురవుతుంది. ఫలితంగా వ్యాక్సిన్ల అభివృద్ధికై ఇప్పటి వరకూ ఉన్న అధ్యయనాలు అసంపూర్తిగా లేదా అసమర్థంగా ఉండవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘ఎందుకంటే పరివర్తనానికి గురైన కరోనా వైరస్ ప్రస్తుతం మలేషియాలోనే వెలుగు చూసింది. ఈ సంక్రమణ గొలుసును విచ్ఛిన్న చేయాలంటే ప్రజల సహకారం చాలా అవసరం’ అని హిషామ్ ఆదివారం ఫేస్బుక్ వేదికగా జనాలను కోరారు. అంతేకకా ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న మరో క్లస్టర్లో కూడా ఈ జాతి కనుగొనబడిందన్నారు. (వైరస్ గుట్టు తెలిసింది!) గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ మొదటిసారిగా వెలుగుచూసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కరోనావైరస్ జన్యు పదార్ధంలో ఉత్పరివర్తనలు, మార్పులను గుర్తించారు. ఐరోపా, అమెరికాల్లో వైరస్ మ్యుటేషన్‌కు గురైనప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాతి మరింత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అదేవిదంగా సెల్ ప్రెస్‌లో ప్రచురితమైన ఒక పత్రిక, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ల పనితీరుపై మ్యుటేషన్ పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నివేదించింది. (సగం పనిచేసే వ్యాక్సిన్ వచ్చినా చాలు) -
కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం ప్రమాదకరం
వాషింగ్టన్: నిద్ర పోయేటప్పుడు కాంటాక్ట్‌లెన్స్ తీయకుండా అలాగే ఉంచడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్‌లెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కార్నియాకు ఇన్ఫెక్షన్స్ సోకుతుందంటున్నారు అమెరికాలోని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ ఫెమ్లింగ్. ‘కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి.. శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, కళ్ల సంబంధ సమస్యలు రాకూడదంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం’అని ఆయన పేర్కొన్నారు. -
సెల్ఫోన్లతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి!
ఆస్పత్రులంటే అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. లోపలున్న పేషెంట్లకు ఏమాత్రం ఇన్ఫెక్షన్లు సోకకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ తీసుకుంటూ, ప్రతి గంటలకు ఫ్లోరింగును సైతం శుభ్రం చేస్తూ అప్రమత్తంగా ఉంటున్నా కూడా సెల్ఫోన్ల వాడకం వల్ల 81.8 శాతం బ్యాక్టీరియల్ పాథోజెన్లు వ్యాప్తి చెందుతున్నాయట. ఈ విషయం తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. మొబైల్ ఫోన్ల వల్ల 81.8 శాతం, హ్యాండ్ స్వాబ్‌ల వల్ల 80 శాతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నట్లు ఆ సర్వే తెలిపింది. ఒకే మొబైల్ ఫోన్‌ను పలువురు ఉపయోగించడం వల్లే ప్రధానంగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయట. ఒకరు వాడినప్పుడు వాళ్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుందని, చేతులను ఏమాత్రం శుభ్రం చేసుకోకుండానే అదే ఫోన్‌ను వేరొకరు వాడితే వారికి కూడా ఆ ఇన్ఫెక్షన్ వస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. దాంతో ఆస్పత్రులలో ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి పాటించాల్సిన సూత్రాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. ఇవి ఐసీఎంఆర్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు.