Food Poisoning: Teen Had His Fingers and Legs Amputated After Eating Leftovers In Restaurant - Sakshi
Sakshi News home page

Food Poisoning: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!

Published Wed, Feb 23 2022 9:32 PM | Last Updated on Thu, Feb 24 2022 9:30 AM

19 Year Old Food Poisoning After Eating Restaurant Leftovers - Sakshi

Doctors amputate teen's legs, fingers:  సాధారణంగా ఫుడ్‌ పాయిజనింగ్‌ అంటే సాధారణంగా వాంతులవడం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి జరుగుతాయి. ఫుడ్‌ పాయిజినింగ్‌ కారణంగా ఒక్కొసారి కొన్ని కేసుల్లో ప్రాణంతకం కూడా కావచ్చు కానీ చాలావరకు సురక్షితంగా బయటపడతారు. కానీ ఇక్కడొక వ్యక్తికి ఫుడ్‌ పాయిజినింగ్‌ అతని జీవితాన్ని అత్యంత విషాదమయంలోకి నెట్టేసింది.

అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని వేడిచేసుకుని తినడం అతనికి అలవాటు. ఎప్పటిలాగానే రెస్టారెంట్‌ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఫ్రిజ్‌లోంచి తీసి వేడిచేసుకుని తిన్నాడు. అయితే అతను తిన్నవెంటనే వాంతులు చేసుకుని తీవ్ర అశ్వస్థకు గురైయ్యాడు. దీంతో అతని స్నేహితుడు ఆసుపత్రితో జాయిన్‌ చేశాడు. ఆసుపత్రికి వెళ్లిన కొద్ది సేపట్లోనే అతని బీపీ పడిపోయి పరిస్థితి క్రిటికల్‌ అయిపోయింది. దీంతో వైద్యులు అతనికి వైద్యా పరీక్షలు నిర్వహించారు. కానీ అతనికి ఏమైందో అసలు అర్థం కాలేదు. కాసేపటకికి అతని శరీరం దద్దుర్లుగా మారి ఎర్రగా గాయాలు ఏర్పడటం తీవ్ర నోప్పి రావడం జరిగింది. దీంతో అతన్ని హెలికాప్టర్‌ సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం యూఎస్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కి తరలించారు.

అక్కడ వైద్యులు మెనింగోకాకల్ అనే అంటు వ్యాధి వచ్చినట్లు తెలిపారు. అయితే మెనింగోకాకల్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది కానీ టీకాతో నివారించవచ్చు. మెనింగోకోకల్ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారని డాక్టర్లు తెలిపారు. కానీ రోగికి అతని మిడిల్ స్కూల్ వయసులో మెనింగోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్నాడని అయితే అతను 16 ఏళ్ల ప్రాయంలో తీసుకోవల్సిన రెండు డోసుల వ్యాక్సిన్‌ని తీసుకోలేదని వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా అతని శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్‌కి గురవ్వడంతో కాలి వేళ్లను చేతి వేళ్లను తీసేశారు.

ప్రమాదవశాత్తు ఆ ఇన్ఫెక్షన్‌ మెదడుకి వ్యాపించలేదు. అయితే ఆ టీనేజర్‌ ఇప్పుడు కోలుకున్నాడు గానీ ఆ వ్యాధి కారణంగా ఇప్పుడు చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏదైనా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించండి. అలాగే ఏదైనా ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం వేడి చేసితినేటప్పుడూ కాస్త ఆలోచించండి అంటున్నారు వైద్యులు.

(చదవండి: ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్‌ అయిన డాక్టర్లు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement