‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు(Zerodha co-founder) నిఖిల్ కామత్(Nikhil Kamath)కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. ముఖ్యంగా భోజనం విషయంలో తన ఆహార వ్యవహారంకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
ఆ ఇంటర్వ్వూలో కామత్ ఇటలీలో జరిగిన G7 సమ్మిట్(G7 Summit) గురించి మాట్లాడుతూ ఇటలీ గురించి మోదీకి బాగా తెలుసనని ప్రజలు అంటున్నారని నవ్వుతూ అన్నారు. ఇంటర్నెట్‌లలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేరుతో వచ్చిన మెలోడి మీమ్‌లు గురించి కూడా ప్రస్తావించారు. వాటన్నింటిని తోసిపుచ్చుతూ..తనకు ఇటలీ నుంచి తనకెంతో ఇష్టమైన పిజ్జా వచ్చిందని చెప్పారు.
ఆ నేపథ్యంలోనే ఆహారం విషయంలో తాను ఎలా ఉంటాననే దాని గురించి వివరించారు. తాను స్వతాహాగా ఫుడ్డీని కాదన్నారు. ఏదేశంలోనైనా తనకు ఏది వడ్డించినా సంతోషంగా తింటా. ప్రత్యేకంగా ఇది అని నియమం లేదు. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలనేది షరతు. ఇప్పటికీ తనికి రెస్టారెంట్‌లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మెనూ ఇవ్వగానే ఏం తినాలో తెలియదని, అదసలు తనకు అర్థం కాదని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో తన తొలినాళ్ల నాటి కథను గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో తనకు దివంగత అరుణ్ జైట్లీ తరచుగా తనకు ఆహారం ఆర్డర్ చేయడంలో ఎలా సహాయం చేశారో చెప్పారు. తనకు కూడా ఫుడ్‌ని ఆర్డర్ చేయమని కోరేవాడిని. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలని షరతు విధించేవాడినని నాటి రోజులని గుర్తు చేసుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ శ్రోతలకు ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని మరింతగా పరిచయం చేసింది.
(చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు.. )
Comments
Please login to add a commentAdd a comment