Charged with unlawfully feeding wildlife: నేరాలు సైతం విచిత్రంగా ఉండొచ్చు. వాటి గురించి విన్నప్పుడు.. అసలు అది ఒక నేరమేనా అని సందేహం కలుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాగే విచిత్రమైన ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు.
యూఎస్‌లోని 71 ఏళ్ల డోనాల్డ్ అంటాల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొన్ని పక్షుల కోసం ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే వేరుశనక్కాయలు, కొన్ని గింజలను ఆహారంగా పెడుతుంటాడు. ఐతే ఇదంతా నచ్చని పొరిగింటివారు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. పైగా వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ అభియోగాలు మోపీ మరీ అరెస్టు చేశారు.
పక్షుల కోసం చాలా ఆహార ట్రైలు పెడుతున్నాడు ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆరోపణల చేసి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఆరోపణలతోటి ఆ వృద్ధుడిని ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు మంచి చేసేవారిని అరెస్టు చేయాలనుకుంటున్నారంటూ.. మండిపడుతున్నారు నెటిజన్స్.
(చదవండి: అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి ఆసుపత్రిలో చేరిక)
Comments
Please login to add a commentAdd a comment