Wild animal
-
పులి మీ ఎదురుగా ఉంటే.. ఇలా తప్పించుకోండి!
పులి మనకు ఎదురొచ్చినా.. మనం పులికి ఎదురెళ్లినా.. ‘పోయేది’ మనమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఒకవేళ మన టైం బాగోక పులిని మనం చూసినా లేదా అది మనల్ని చూసినా ఏం చేయాలిమీరు పులిని చూశారు.. అది మిమ్మల్ని చూడలేదు. అలాంటప్పుడు ఎక్కడున్నారో అక్కడే కదలకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. శ్వాస వేగంగా తీసుకోకూడదు. చెప్పడం ఈజీగానీ.. పులిని చూశాక.. ఎవరైనా గాబరా పడటం సహజం, అయితే.. ఇక్కడ మీరు ఎంత కామ్‌గా ఉంటారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది వెళ్లేంతవరకూ ఆగండి. వెళ్లాక.. అది వెళ్లిన దిశకు వ్యతిరేక దిశలో వెంటనే వెళ్లిపోండి. ఇక్కడ తప్పించుకుపోవడం ఒక్కటే మీ లక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప.. ఏదైనా కొత్తగా చేసి హీరోయిజం చూపిద్దాం అనుకుంటే.. అడవిలో అదే హీరో అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోండి. ఈసారి పులే మిమ్మల్ని చూసింది. మొట్టమొదట చేయకూడని పని పరుగెత్తడం. మీరు ఉసేన్ బోల్ట్ కాదు.. అదైతే కన్ఫర్మ్. పైగా వెంటాడుతూ.. వేటాడటంలో పులులు స్పెషలిస్టులు. అందుకే అలా చేయొద్దు.. ఒకవేళ మీరు కూర్చునే పొజిషన్లో ఉంటే.. ముందుగా లేచి నిల్చొండి. ఎందుకంటే.. పులులు సాధారణంగా జింకల్లాంటి వాటిపై వెనుక నుంచి దాడి చేస్తాయి.. ముఖ్యంగా అవి కూర్చునే పొజిషన్లో ఉన్నప్పుడు వేటాడతాయి. పైగా.. అవి తాము వేటాడే జంతువులకు, మనుషులకు మధ్య తేడాను గుర్తించలేవు. అందుకే లేచి నిల్చోవడం ద్వారా మీరు పులి వేటాడే జంతువు కాదన్న విషయాన్ని తెలియజేయాలి. గతంలో కూడా మన దేశంలో అడవుల్లో వంగి.. కట్టెలు ఏరుకుంటున్న వారు లేదా వంగి పనిచేసుకుంటున్న మనుషులపై వెనుక నుంచే అత్యధిక శాతం పులి దాడులు జరిగాయి. లేచి నిల్చున్నారు సరే.. తర్వాతేం చేయాలి? పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి.. దాన్ని అడిగి కాదు.. దాన్ని గమనించడం ద్వారా.. సాధారణంగా పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉంటే.. అది ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది.. మీ మీదే దృష్టి పెడుతుంది.. కాళ్లను వంచుతుంది.. దాని చెవులు ఇలా వెనక్కి వెళ్లినట్లుగా అవుతాయి. ఆగ్రహంగా గాండ్రించి.. ముందుకు దూకుతుంది. ఆగండాగండి.. ఇక్కడో విషయం చెప్పాలి. కుక్కల చెవులు కూడా వెనక్కి వెళ్తాయి మనపట్ల స్నేహభావంతో.. ఇక్కడ కూడా చెవులు వెనక్కి వెళ్లాయి కదా.. ఫ్రెండే అని అనుకోకండి.. బాలయ్య బాబు ఏదో సినిమాలో చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోండి. పులి చెవులు వెనక్కి వెళ్లాయంటే.. అది వార్నింగ్ కిందే లెక్క.. నువ్వక్కడ ఉండటం దానికి ఇష్టం లేదన్నమాట.ఉన్నచోట ఉన్నట్లే ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ.. వెళ్లండి. వీపు చూపొద్దు. చూపితే వెంటనే దాడి తప్పదు. గతంలో మధ్యప్రదేశ్‌లోని భాందవ్గఢ్ నేషనల్ పార్కులో మూడు పులులు రావడంతో ఓ ఏనుగు భయపడి.. మావటిని కిందన పడేసి వెళ్లిపోయింది. దాంతో ఆ మావటి వెనక్కి తిరిగి పరిగెట్టకుండా.. ఇలాగే ఒక్కో అడుగూ నెమ్మదిగా వెనక్కి వేసుకుంటూ.. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాడట. ఒకవేళ దగ్గర్లో చెట్టు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది. మీకు చెట్లెక్కడం బాగా వస్తే.. వెంటనే ఎక్కేయండి. కనీసం 15 అడుగుల ఎత్తు ఎక్కేదాకా ఆగొద్దు. చాన్స్ ఉంటే ఇంకా పైకి ఎక్కండి. మీకు వేగంగా చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే వద్దు. పులులు 15 అడుగుల ఎత్తు దాకా ఎగరగలవు. పులులు చెట్లెక్కడంలో స్పెషలిస్టులు కావు. ఒకవేళ దగ్గర్లో చెరువు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది.. అయినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలో దూకొద్దు.. మీకు ఒలింపిక్స్‌లో గోల్డ్ వచ్చి ఉంటే మాత్రం దూకండి. ఎందుకంటే.. పులులు మనకన్నా బాగా ఈదగలవు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బాగా సౌండ్ చేయగల మెటల్ వస్తువులు ఉంటే.. హోరెత్తించేయండి. చేతిలో ఏం లేదు.. పులి దాడి చేయడానికి వస్తుంటే.. అప్పుడు చాలా గట్టిగా అరవండి. ఎంతలా అంటే.. దాని చెవులకు చిల్లులు పడేలా.. ఇలాంటి టైంలో అది కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని ఆప్షన్లు అయిపోయాయి.. ఇక చేసేదేమీ లేదంటే మాత్రం పోరాడాల్సిందే. దగ్గర్లో ఏది దొరికితే.. అది పట్టుకోండి. రాయి, కర్ర ఏదైనా సరే. పులి శరీరంలో కళ్లు, ముక్కు బలహీన ప్రదేశాలు. అక్కడే బలంగా దాడి చేయాలి. పులి బలం దాని పంజా, కోరలు.. వాటి నుంచే తప్పించుకోవాలి. అది దాడి చేయడానికి వచ్చినప్పుడు పులికి ఎంత దగ్గరగా అయితే.. అంత దగ్గరగా ఉండి పోరాడాలి. దాని పీకను పట్టుకొని.. గట్టిగా హత్తుకోవాలి. ధృతరాష్ట్ర కౌగిలిలాగ.. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకూడదు.చదవండి: ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథగట్టిగా అదిమి పట్టుకుంటే.. అది ఆశ్చర్యపోతుంది. పులులు సాధారణంగా దాన్ని ఇష్టపడవు. అవి ప్రేమలో ఉన్నప్పుడు లేదా వేరే పులులతో పోరాడుతున్నప్పుడు కూడా బాగా దగ్గరగా అలముకున్నట్లు ఉండవు. మెడ జాగ్రత్త. పులికి దొరికితే అంతే. పోరాడుతున్నంత సేపు.. గట్టిగా అరుస్తూనే ఉండాలి. పులులు సాధారణంగా పోరాటాలను ఇష్టపడవు. కానీ అది పోరాటానికి దిగిందంటే మాత్రం చంపడానికే దిగుతుంది. అది తప్పించుకోవాలని అనుకుంటేనో.. లేదా మనం చేసిన ఏ పనితోనైనా అది ఆశ్చర్యపోతేనో తప్ప.. చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. పైన చెప్పినవన్నీ చేస్తున్న సమయంలో దేవుడిని ప్రార్థించడం మాత్రం మరువద్దు. ఈ టిప్స్ ఫెయిలయినా.. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడవచ్చు. అల్ ది బెస్ట్ మరి.. ఓ పులి రేపు రా.. -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
అయ్యో.. ఆరేళ్లకే నూరేళ్లు!
తిరుమల/కోవూరు: తిరుమల కొండపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకదారిలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ వన్యమృగం చేసిన దాడిలో మృత్యువాత పడింది. నరసింహస్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డిపాళేనికి చెందిన దినేష్ కుమార్, తన భార్య శశికళ, కుమార్తె లక్షిత (6), కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వారంతా అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల కంటే ముందుగానే ఆ చిన్నారి నడుస్తుండడంతో వేరే భక్తుల గుంపులో కలిసి వెళ్లి ఉంటుందని తల్లిదండ్రులు తొలుత భావించి వెతకడం ప్రారంభించారు. ఎంతకూ కనపడకపోవడంతో చివరికి భద్రతా సిబ్బందికి తెలిపారు. రాత్రి 10.30కు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. రాత్రి నుంచి 70 మంది టీటీడీ, అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం సమీపంలోని నడకదారి నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పూర్తిగా ముఖాన్ని జంతువు తినడంతోపాటు కాలిని తీవ్రంగా గాయపర్చింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. చిరుత లేదా ఎలుగుబంటి దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కలిచివేసింది: ఈఓ ధర్మారెడ్డి చిన్నారి మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి టీటీడీ నుంచి రూ.5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించామన్నారు. బాలిక నరసింహస్వామి ఆలయానికి సమీపంలో నడకదారి నుంచి పక్కకు అటవీ ప్రాంతంలోకి ఆడుకుంటూ వెళ్లినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఎందుకంటే.. బాలిక ఆటవస్తువులు అటవీ ప్రాంతంలోనే దొరికాయని తెలిపారు. ఈ సమయంలో వన్యమృగం దాడిచేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. భద్రత విషయంలో రాజీలేదు: భూమన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆయన అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యంలేదని చెప్పారు. పోతిరెడ్డిపాళెంలో విషాదఛాయలు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి వన్యమృగం దాడిలో మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న పోతిరెడ్డిపాళెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలిక మృతి వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దినేష్ ఇంటి వద్దకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెంటనే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డికి ఫోన్‌చేసి బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతో అత్యవసర సమావేశం అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మరింత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో జరిపిన అత్యవసర సమావేశంలో ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటుకు సమగ్ర నివేదిక అందించాలని డీఎఫ్ఓను ఆదేశించామన్నారు. వన్యమృగాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ 100 మంది భక్తుల గుంపునకు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారుల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలతో నడకమార్గాల్లో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బోన్ల ద్వారా నడక మార్గాల్లో సంచరించే వన్యమృగాలను బంధిస్తామన్నారు. -
పులి ఎదురొచ్చినా.. తగ్గేదే లే!
ప్రకాశం(పెద్దదోర్నాల) : హనీ బ్యాడ్జర్... తెలుగులో రైలు ఎలుగు.. నల్లమల అభయారణ్యంలో ఉన్న అరుదైన వన్యప్రాణుల్లో ఇది ఒకటి. ఎత్తు కేవలం 12 అంగుళాలు. దాని పంజాకు గోళ్లు మూడు అంగుళాల పొడవు ఉంటాయి. బరువు సుమారు పది కిలోలు మాత్రమే. చూసేందుకు ఎలుగుబంటికి జిరాక్స్ కాపీలా మరగుజ్జుగా ఉంటుంది. కానీ, పౌరుషంలో దీనికి మరొక వన్యప్రాణి సాటిరాదు. పులి ఎదురొచ్చినా వెనక్కి తగ్గదు. ఇంత పౌరుషం, దైర్యం ఉన్న ఈ వన్యప్రాణి జీవితకాలం ఏడేళ్లు మాత్రమే. ఈ జీవికి అత్యంత ఇష్టమైన ఆహారం తేనె తుట్టెల్లోని లార్వా. అందుకే దీనిని హనీ బ్యాడ్జర్ అని పిలుస్తారు. అతి చిన్నది... ఒళ్లంతా ముళ్లున్నది... నల్లమల అభయారణ్యంలో సంచరించే వన్యప్రాణుల్లోకెల్లా చిన్నదిగా కనిపించే హనీబ్యాడ్జర్ అత్యంత తెగువను ప్రదర్శిస్తుంది. పది కిలోల బరువు ఉండే దీని చర్మం మందంగా, ఒదులుగా ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉంటాయి. అందువల్ల దీనిపై ఏ జంతువు దాడి చేసినా వాటికి పట్టు చిక్కదు. ముళ్ల పందులు దాడి చేసినా హనీ బ్యాడ్జర్లను ఏమీ చేయలేవు. పెద్ద పులులకు సైతం ఎదురు తిరిగి భీకరంగా అరుస్తూ పోట్లాటకు సిద్ధపడతాయి. ఏడాదికి ఒక సంతానానికి జన్మనిచ్చే ఈ హనీ బ్యాడ్జర్లు మాంసాహారులు. వీటి ఆహారంలో 25 శాతం పాములే ఉంటాయి. పాములు దీని కంట పడితే వేటాడి వెంటాడి చంపి తినేంత వరకు వెనక్కి వెళ్లవు. వాసన పసిగట్టటంలో స్నిపర్ డాగ్‌ను మించిన నేర్పరితనం హనీ బ్యాడ్జర్ల సొంతం. భూమి లోపలి పొరల్లో ఏ రకమైన ఆహారం ఉందో వాసన పసిగట్టే శక్తి వీటి సొంతం. తమ పంజాకున్న పదునైన గోళ్లతో క్షణాల వ్యవధిలో గోతులు తవ్వి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కందిరీగలు, తేనెటీగలు, విషకీటకాలు కుట్టినా ఏ విధమైన అపాయం లేకుండా దీని టాక్సిన్లు దృఢంగా ఉంటాయి. పెద్దపులిని ధైర్యంగా ఎదుర్కొంటాయి నీబ్యాడ్జర్లు చాలా ధైర్యం కలిగిన వన్యప్రాణులు. వాసన పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నిపర్ డాగ్‌ను మించిన నైపుణ్యాన్ని కనబరుస్తుంటాయి. అటవీ ప్రాంతంలో సంచరించే క్రమంలో పులి వచ్చినా ఎదురు తిరుగుతాయి. నల్లమలలోని అన్ని ప్రాంతాల్లో ఇవి సంచరిస్తుంటాయి. ఇవి పాములను అత్యంత ఇష్టంగా తింటాయి. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పెద్దదోర్నాల -
కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. ఫోటో వైరల్..
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న అరుదైన చిరత ఒకటి కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోను ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట్టర్లో షేర్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్ల వావ్ అంటున్నారు. రాత్రివేళ అడవిలో సంచరిస్తున్న వన్యమృగం అత్యద్భుతంగా కన్పిస్తోంది. ఈ అరుదైన చిరుతను క్లౌడెడ్ లీపార్డ్ అంటారు. దీని చారలు మేఘాల్లా కన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది. ఈ వన్యప్రాణులు అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయి. భారత్, నేపాల్ హిమాలయ పర్వత ప్రాంతం, ఇండోనేసియాలో మాత్రమే వీటి ఉనికి ఉంది. A fast, arboreal and one of the rare big cat species found in #India. Very less studied and understood. The range is also limited. Clouded leopards are beautiful creatures. See the amazing patterns. pic.twitter.com/dlJz0CoWNP — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 18, 2022 ఈ క్లౌడెడ్ లీపార్డ్ల ఆహారపు అలవాట్లు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీని జీవన విధానం మిస్టరీగానే ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే ఇవి కన్పిస్తుంటాయి. దీని గోర్లు చాలా పదునుగా ఉంటాయి. ఇవి ఎత్తు తక్కువే అయినప్పటికీ అత్యంత శక్తమంతంగా ఉంటాయి. బ్యాలెన్స్ మెయింటెన్ చేయడానికి పొడవాటి తోకను కలిగిఉంటాయి. ఆడ క్లౌడెడ్ లీపార్డ్.. ఏడాదికి ఐదు పిల్లల వరకు జన్మనివ్వగలదు. పుట్టిన 10 నెలల వరకు మాత్రమే ఈ చిరుతలు తల్లిపై ఆధారపడతాయి. ఆ తర్వాత స్వయంగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చదవండి: 6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..! -
కింగ్ కోబ్రా, ముంగీస ఫైట్.. వీడియో వైరల్
కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ముంగీసకు కోబ్రా అంటే అసలు భయమే ఉండదు. ఎప్పుడూ దాంతో విరోచితంగా పోరాడుతుంది. ఎక్కువ సందర్భాల్లో కోబ్రాపై పైచేయి సాధిస్తుంది. ఈ రెండు భీకరంగా తలపడిన వీడియోలు అరుదుగా లభిస్తాయి. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది తెగ వైరల్‌గా మారింది. లక్షల వ్యూస్, వేల లైక్స్‌తో దూసుకుపోతుంది. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే.. కింగ్ కోబ్రా, ముంగీస నేలపై కాకుండా బురద నీటిలో తలపడ్డాయి. కోబ్రా ఎన్నిసార్లు కాటేసేందుకు ప్రయత్నించినా.. ముంగీస మాత్రం చురుగ్గా తప్పించుకుంది. అంతేకాదు దాని వెంటపడి మరీ కయ్యానికి కాలుదువ్వింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి ఫైట్ తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. నీటిలో దాచుకోవడం ఎలాగో కోబ్రా నేర్చుకోవాలి, ఇలాంటి పోరాటల్లో ఎప్పుడూ ముంగీసదే విజయం అని మరో జూయర్ కామెంట్ చేశాడు. ఆ వీడియో మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Animalia - Animal (@wildanimalia) చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...
థాయిలాండ్‌లో ఒక అపరిచిత వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి జూలో హల్చల్ చేశాడు. చివరికి ఒక పెద్ద ఫిషింగ్ నెట్ వలకి చిక్కుతాడు. అసలు ఇదంతా ఏంటి? ఎందుకిలా సంచరించాడనే కదా! వివరాల్లోకెళ్తే...ఆ వ్యక్తి యానిమల్ ఎస్కేప్ డ్రిల్‌లో భాగంగా ఇలా చేశాడు. ఆస్ట్రిచ్ పక్షులు చాలా వైల్డ్‌గా ఉంటుంది. పైగా అది ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో జూ నుంచి తప్పించుకుంటే జూ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టుకోవాలి లేదంటే అది ఎవరిపైన ఐనా దాడి చేస్తే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే జూ అధికారులు వైల్డ్ యానిమల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే డ్రిల్‌ని నిర్వహించారు. అందులో భాగంగా ఆ వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిమాదిరిగా దుస్తులు ధరించి జూలో అటు నుంచి ఇటూ పరిగెడుతుంటాడు. మిగతా ముగ్గురు జూ సిబ్బంది అప్రమత్తమై ఒక పెద్ద వలతో సదరు ఆస్ట్రిచ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు. పక్షులలో అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ని పట్టుకోవాలంటే జూ పరిసరాలను సిబ్బంది తమ నియంత్రణలోనికి తెచ్చుకుని మరీ పట్టుకునేందుకు యత్నించాలి. పైగా ఆ పక్షి గంటకు 70 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఆ విపత్కర సమయంలో ఏ మాత్రం భయపడినా చాలు మన పని అయ్యిపోతుంది. అది సింహం వంటి పెద్ద పెద్ద జంతువులనే దాడి చేసి హతమార్చగలదు. (చదవండి: ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు) -
పాపం ఆ పెద్దాయన చేసింది నేరమా? నెటిజన్స్ ఫైర్
Charged with unlawfully feeding wildlife: నేరాలు సైతం విచిత్రంగా ఉండొచ్చు. వాటి గురించి విన్నప్పుడు.. అసలు అది ఒక నేరమేనా అని సందేహం కలుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాగే విచిత్రమైన ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. యూఎస్‌లోని 71 ఏళ్ల డోనాల్డ్ అంటాల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొన్ని పక్షుల కోసం ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే వేరుశనక్కాయలు, కొన్ని గింజలను ఆహారంగా పెడుతుంటాడు. ఐతే ఇదంతా నచ్చని పొరిగింటివారు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. పైగా వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ అభియోగాలు మోపీ మరీ అరెస్టు చేశారు. పక్షుల కోసం చాలా ఆహార ట్రైలు పెడుతున్నాడు ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆరోపణల చేసి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఆరోపణలతోటి ఆ వృద్ధుడిని ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు మంచి చేసేవారిని అరెస్టు చేయాలనుకుంటున్నారంటూ.. మండిపడుతున్నారు నెటిజన్స్. (చదవండి: అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి ఆసుపత్రిలో చేరిక) -
మెడలో 16 కిలోల బరువు.. రెండేళ్లుగా ‘దుప్పి’ తిప్పలు.. నాలుగుసార్లు మిస్
కొలరాడో: మెడలో టైర్‌తో పరుగెడుతున్న ఈ దుప్పిని పట్టుకోవడానికి కొలరాడో వన్యప్రాణి సంరక్షణ అధికారులకు చుక్కలు కనబడ్డాయి. కొండల ప్రాంతంలో తిరిగే ఆ దుప్పి మెడలోకి టైర్ ఎలా వచ్చిందో తెలియదు గానీ రెండేళ్లుగా అధికారులు దాని కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి దుప్పిని గత శనివారం పట్టుకుని టైర్‌ని తొలగించారు. నాలుగున్నర ఏళ్ల వయసు.. 270 కిలోల బరువున్న ఆ దుప్పి గత వారం రోజుల్లో నాలుగుసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిందని పార్క్ అధికారి స్కాట్ ముర్దోచ్ తెలిపారు. తొలుత దుప్పిని పట్టుకుని టైర్‌ని కట్ చేద్దామని అనుకున్నప్పటికీ సాధ్య పడలేదని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో ఐదోసారి దుప్పిని టైర్ మోత నుంచి రక్షించామని అన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) మట్టి, రాళ్లతో నిండిన ఆ టైర్ బరువు సుమారు 16 కిలోల వరకు ఉంటుందని, దాని వల్ల దుప్పి ఆరోగ్యంపై ప్రభావం పడేదని వెల్లడించారు. అయితే, రెండేళ్లుగా అంత బరువు మోసినా దుప్పి మెడ ఎప్పటిలా మామూలుగా ఉండటం మంచి విషయమని పేర్కొన్నారు. మెడపై చిన్న గాయం మాత్రం ఉందని తెలిపారు. Here is some video of this bull elk over the past two years. pic.twitter.com/R6t9nNPOyb — CPW NE Region (@CPW_NE) October 11, 2021 (చదవండి: వైరల్: అరటి గెల మీద పడటంతో కోర్టుకు.. ఐదేళ్లు పోరాడి విజయం.. రూ.4 కోట్ల నష్ట పరిహారం) -
74 ఏళ్ల తర్వాత భారత్‌కి వస్తున్న చిరుత
భోపాల్:వేగానికి మారు పేరైన చిరుత పులులు త్వరలో ఇండియా అడవుల్లోకి రానున్నాయి. 74 ఏళ్ల క్రితమే మన దేశంలో అంతరించిపోయాయి చిరుత పులులు. అయితే ఇప్పుడు ఆఫ్రికా నుంచి చిరుత పులులను రప్పించి మన అడవుల్లో వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవవైవిధ్యాన్ని కాపాడే యత్నంలో భాగంగా ప్రాజెక్ట్ చీతాని చేపట్టింది. పది చిరుతలు దక్షిణ ఆఫ్రికా నుంచి మొత్తం పది చిరుతలను ఇండియాకు తీసుకురానున్నారు. ఇందులో ఐదు మగవి, ఐదు ఆడవి తేవాలని నిర్ణయించారు. వీటి కోసం మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయలో ఉన్న కునో నేషనల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే అక్టోబరు లేదా నవంబరులో దక్షిణాఫ్రికా నుంచి ఈ చిరుతలు ఇక్కడికి చేరుకోనున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇండియా అడవుల్లో చిరుతలను ప్రవేశ పెట్టేందుకు వైల్డ్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ముమ్మరం చేయగా ... ప్రభుత్వం అంగీకరించి రూ. 14 కోట్ల నిధులు కేటాయించింది. గతంలో చిరుతలు ఎక్కువగా నివసించిన మధ్యప్రదేశ్‌లోనే వాటికి ఆవాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను పరిశీలించిన సౌతాఫ్రికా అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. చివరగా జీవవైవిధ్యానికి నెలవైన భారత్‌లో పెద్ద పులులతో పాటు చిరుతలు పెద్ద ఎత్తున ఉండేవి. అయితే స్వాతంత్రానికి పూర్వం రాజులు, బ్రిటీషర్లు వేట పేరుతో వందల కొద్ది చిరుతలను సంహరించారు. దీంతో క్రమంగా చిరుతల సంఖ్య తగ్గిపోయింది. భారత్‌లో చిట్టచివరి చిరుతని 1947లో చత్తీస్‌గడ్‌లో చూసినట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఐదేళ్లపాటు దేశంలో ఎక్కడా చిరుత జాడలు కనిపించలేదు. దీంతో దేశంలో చిరుతలు అంతరించి పోయాంటూ ప్రభుత్వం 1952లో ప్రకటించింది. చదవండి: పద నాన్నా... దేశం చూద్దాం -
వైల్డ్ ఇన్నొవేటర్ అడవి కూన
అడవిలో జాడలైన వాళ్లకు, అన్వేషణలో అడుగులు వీడని వాళ్లకు ‘వైల్డ్ ఇన్నొవేటర్ అవార్డు’ వస్తుంది! వన్య పరిశోధకుల వినూత్న దృష్టికి గొప్ప అభినందన వంటి ఈ అంతర్జాతీయ అవార్డుకు తొలిసారి ఒక భారతీయ మహిళ ఎంపికయ్యారు. యు.ఎస్. నుంచి ముగ్గురు, కెన్యా నుంచి ఇద్దరు, యు.కె., ఆస్ట్రేలియా కొలంబియా, మొజాంబిక్ నుంచి ఒక్కొక్కరు ఈ అవార్డును గెలుపొందగా.. ఇండియా నుంచి డాక్టర్ కృతి కారంత్ విజేత అయ్యారు. బహుమతి 75 లక్షల రూపాయలు. గౌరవం గగనమంత. విలువ భూగోళమంత. కృతి మాత్రం పుట్టినప్పటి నుంచీ అడవి కూనే! అరణ్యంలో వృక్షాలెన్నో, కృతి కెరీర్లో అవార్డులు అన్ని. అయితే ఇప్పుడొచ్చింది ప్రత్యేకమైన అవార్డు. ఒక విలక్షణమైన వృక్షంతో పోల్చదగిన పురస్కారం. యు.ఎస్. లోని ‘వైల్డ్ ఎలిమెంట్స్ ఫౌండేషన్’ ఈ అవార్డు ఇస్తుంది. బెంగళూరులోని ‘సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్’ (సి.డబ్లు్య.ఎస్.)లో కృతి చీఫ్ కన్సర్వేషన్ సైంటిస్ట్. వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి, పరిశోధించి వాటి సంరక్షణకు వినూత్న విధానాలను కనిపెడుతుంటే శాస్త్రవేత్త. 42 ఏళ్ల కృతి ఎప్పటికప్పుడు అప్పుడే కొత్తగా అడవిని, అడవిలో పులులు, సింహాలను చూస్తున్నంత ఉల్లాసంగా ఉంటారు. నిజానికి ఆమె తనకు ఊహ తెలుస్తున్నప్పుడే అరణ్యమార్గంలోకి వచ్చేశారు! నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో ఒక సాయంత్రం తాతగారి తెల్ల అంబాసిడర్ కారులో తండ్రి పక్కన కూర్చొని మెల్లిగా వెళుతున్నప్పుడు ఒక కందకంలో పులి ఆ చిన్నారి కంట పడింది. ఆ కొద్దిసేపటికే చిరుత దర్శనమిచ్చింది. ‘‘నాకది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది’’ అంటారు కృతి. క్రమంగా కర్ణాటక లోని అటవీ ప్రాంతాలన్నీ ఆమె ఆట మైదానాలు అయ్యాయి. అందుకు తగిన కారణమే ఉంది. తండ్రి డాక్టర్ ఉల్లాస్.. టైగర్ బయాలజిస్ట్! తాతగారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల వారితో కలిసి కృతి వన్య జీవన అధ్యయనం తర్వాతి కాలంలో జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత. ప్రకృతిని ప్రేమించే ఇద్దరు వ్యక్తుల దగ్గర పెరిగిన అమ్మాయి ప్రకృతినే కదా ప్రేమిస్తుంది. అయితే వన్యప్రాణుల సంరక్షణ శాస్త్రవేత్త అవుతానని అప్పుడు ఆమెక్కూడా తెలీదు. తల్లిలా, తండ్రిలా, తాతయ్యలా పీహెచ్డీ చేయాలని మాత్రమే అనుకుంది. నార్త్ కరోలీనా వెళ్లి అక్కడి డ్యూక్ యూనివర్శిటీలో పర్యావరణంపై పీహెచ్.డీ చేశారు కృతి. ఆ ముందు వరకు, ఆ తర్వాతా ఆమె చదివిన చదువులు, జరిపిన పరిశోధనలు, చేసిన ఉద్యోగాలు.. దేశంలో, విదేశాల్లో.. అన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినవే. చివరికి తను పుట్టిన రాష్ట్రంలోనే పెద్ద సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ అవార్డు! 2011లో ‘నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల రిసెర్చ్ గ్రాంట్ రావడం, తర్వాతి ఏడాదే ‘ఎమర్జింగ్ ఎక్స్‌ప్లోరర్’గా గుర్తింపు పొందడం కృతి కెరీర్‌ని విస్తృతం చేశాయి. పది దేశాలు తిరిగి, పది సంస్కృతుల మనుషులతో కలిసిమెలిసి తిరగడం సాధ్యం అయింది. సాధారణంగా సైంటిస్టులు మనుషులతో కలవడానికి ఇష్టపడరు. కృతి మాత్రం ఎక్కడి మనుషులతో అక్కడి మనిషిలా కలిసిపోయారు. కర్ణాటక అరణ్య ప్రాంతాల చుట్టూ కనీసం రెండు వేల ఇళ్లకైనా వెళ్లి వాళ్లతో మాట్లాడి ఉంటారు కృతి! మాట వరకు పైన పది దేశాలను అన్నాం కానీ.. 40 దేశాలకు పైగానే ఆమె పర్యటించారు. అన్ని దేశాలు తిరిగిన ఆమె ఇండియా మొత్తం తిరగకుండా ఉంటారా! దేశంలోని అభయారణ్యాలన్నిటిలో ఒక అడుగు వేసి వచ్చారు. పరిశోధన అవసరమైన చోట అక్కడే కొన్నాళ్లు నివాసం ఉన్నారు. ఆమె పరిశోధనలు బి.బి.సి.లో, ఇంకా అనేక ప్రసిద్ధ చానళ్లలో సీరీస్‌గా వచ్చాయి. కృతి రియల్ లైఫ్ హీరోలు తండ్రి, తాత, తల్లి ప్రతిభ. ఇప్పుడు ఆమె తన కుటుంబంలోని ముగ్గురికి హీరో అయ్యారు. భర్త అవినాశ్ సొసలే, ఇద్దరు కూతుళ్లు.. ఆమె సెలవు రోజుల్లో ఆమెతో పాటు అడవిలో విహరించే వన్యప్రాణులు అయిపోతారు! వాళ్లతో పాటు ఇంట్లో నల, బఘీర అనే రెండు పిల్లులు వినిపించీ వినిపించనంతగా మ్యావ్ మ్యావ్ మంటూ పులుల్లా సోఫాలు ఎక్కి దిగుతుంటాయి. కృతి సాధించిన పరిశోధనల్లో ఒకటి.. ధ్వని, వాయు కాలుష్యాల నుంచి వన్య జీవులను సంరక్షించడం. -
అలుగును అప్పగించిన వ్యక్తికి చుక్కలు
సాక్షి, మందమర్రి: తనకు పట్టుబడిన అలుగును ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన సింగరేణి కార్మికుడు చుక్కలు చూడాల్సి వచ్చింది. విచారణ పేరుతో అతడిని మంగళవారం రాత్రంతా మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో ప లుచోట్లకు తిప్పడంతో సదరు వ్యక్తి అస్వస్థతకు గురయ్యా డు. దీంతో బుధవారం ఉదయం అతడిని మంచిర్యాల ప్ర భుత్వాసుపత్రిలో చేర్పించి.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా సస్పెక్ట్ వచ్చిందని, ఆర్టీపీసీఆర్ కోసం హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి సింగరేణి ఉద్యోగి కావడంతో కుటుంబ సభ్యులు అతడిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అసలేం జరిగింది..? బాధితుడు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సింగరేణి కార్మికుని లైన్లోకి ఆదివారం అలుగు (వన్యప్రాణి) రావడంతో ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామనే ఉద్దేశంతో సింగరేణి కార్మికుడు పట్టుకున్నాడు. సోమవారం ఉదయం విధులకు హాజరై ఇంటికొచ్చే సరికి చీకటి పడింది. ఫారెస్ట్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం విధులకు హాజరై ఇంటికొచ్చి తెల్సినవారి ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చి అలుగుతోపాటు సదరు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా తిప్పిన అధికారులు సదరు వ్యక్తిని విచారణ పేరిట రాత్రంతా రెండుజిల్లాల్లో తిప్పినట్లు సమాచారం. ఉదయం మందమర్రికి తీసుకురాగా.. సదరు వ్యక్తి అస్వస్థతకు లోనయ్యాడని, దీంతో గుచప్పుడు కాకుండా ఆసుపత్రిలో చేర్పించారని కుటుంబసభ్యులు అంటున్నారు. అతడికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారని ప్రశ్నిస్తున్నారు. సదరు వ్యక్తికి కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి పరీక్షలు చేయాలని పలువురు పేర్కొంటున్నారు. -
అప్పుడే పుట్టిన బిడ్డను లాక్కెళ్లిన అడవి జంతువు
ఆగ్రా: ఇదో విషాద ఘటన. ఓ నిండు గర్భిణి(26) బహిర్భుమికి వెళ్లి నొప్పులు ఎక్కువ అవ్వడంతో అక్కడే బిడ్డను ప్రసవించి స్పృహ కోల్పోయింది. ఆ శిశువును ఓ అడవి జంతువు లాక్కెంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా జిల్లాలో చోటు చేసుకుంది. యూపీలోని ఫిన్ హట్ పోలీసు స్టేషన్ పరిధిలోని జోధపురా గ్రామానికి చెందిన నెలలు నిండిన గర్భిణి శిల్పి.. ఇంటి సమీపంలోని పొలాల్లోకి బహిర్భుమికి వెళ్లింది. ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడి వెతకడం మొదలు పెట్టారు. వారికి పొలాల్లో ప్రసవించి స్పృహ కోల్పోయిన మహిళను కుటుంబసభ్యులు గుర్తించారు. కానీ బిడ్డ కనిపించపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏదో జంతువు పసిబిడ్డను లాక్కెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. (చదవండి : బిడ్డను విసిరి.. తనూ దూకి) ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో సగానికిపైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు శిల్పి మాట్లాడుతూ.. ‘మంగళవారం ఉదయాన్ని బహిర్భుమి కోసమని సమీప పొలాల్లోకి వెళ్లాను. ఆ సమయంలోనే తనకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో అక్కడే బిడ్డను ప్రసవించాను. తదనంతరం స్పృహ కోల్పోయాను’ అని చెప్పింది. -
కుక్కల దాడిలో దుప్పి మృతి
కల్లూరు: చిత్తూరుజిల్లా పులిచెర్ల(కల్లూరు) తోటలో దుప్పిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అది మృతిచెందింది. కల్లూరు ఘాట్ రోడ్డులో ఉన్న ఓ మామిడి తోపులో దుప్పి సంచరిస్తుండగా గుర్తించిన కుక్కలు దానిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇది గమనించిన సమీపంలోని ప్రజలు ఘాట్ రోడ్డులో వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై తన సిబ్బందితో అక్కడికి వెళ్ళి జీపులో దుప్పిని తీసుకొని కల్లూరు స్టేషన్‌కు వచ్చారు. పశు వైద్యులను రప్పించి ప్రాథమిక చికిత్స చేయిస్తుండగా అది మృతిచెందింది. పీలేరు ఫారెస్టు రేంజ్ అధికారికి సమాచారం తెలుపగా ఆయన సమాచారం మేరకు దామల్‌చెఱువు బీట్ అధికారి బి. మునస్వామి నాయక్ వచ్చి దుప్పి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
దుప్పిపై కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో పునాదుల్లో పడిపోయిన ఓ దుప్పిని స్థానికులు రక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు భవనాల నిర్మాణానికి తీసిన పునాదుల గుంటల్లో ఆదివారం రాత్రి ఓ దుప్పి పడిపోయింది. దీనిపై కుక్కుల దాడి చేసి గాయపరిచాయి. అయితే, కుక్కల అరుపులతో ఇందిరమ్మ కాలనీకి చెందిన కొందరు యువకులు అక్కడికి చేరుకుని దుప్పిని కాపాడి సోమవారం ఉదయం అటవీ అధికారులకు అప్పగించారు. -
వేగం.. సొంతం
చెట్లను అవలీలగా ఎక్కడం, పాకడంతో పాటు నీటిలో ఈదడంలో ఆరితేరిన జంతువు చీతా (చిరుత పులి). ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు ఇది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తే ఈ చిరుతలు రెండు మూడు నిమిషాల్లోనే ఆహారాన్ని వేటాడతాయి. వేటాడిన ఆహారాన్ని వెంటనే తినకుండా 15 నిమిషాల పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుని భుజిస్తాయి. చీతాలు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రస్తుతం ఏడు చిరుత పులులున్నాయి. - బహదూర్‌పురా జీవితకాలం 23 ఏళ్లు చిరుతలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని మైదానాల్లో నివసిస్తాయి. చీతాల పొడవు 120-150 సెం.మీ. మధ్య ఉంటుంది. 50-80 కిలోల బరువుంటాయి. ఎంతో దూరాన ఉన్న జంతువులను సైతం గుర్తించి ఒడుపుగా వేటాడే సత్తా వీటి సొంతం. జీవిత కాలం 20-23 సంవత్సరాలు ఒకేసారి 15-20 కిలోల ఆహారాన్ని తీసుకుంటాయి. మన జూలో ఏడు జూపార్కులో సల్మాన్, సులేమాన్,సుచీ, లవ, కుశ, పూజారి,రోహన్ అనే చిరుతలు ఉన్నాయి. రోజూ ఆరు కిలోల చికెన్ చిరుతలకు జూలో రోజూ 6-8 కేజీల మాం సాన్ని ఆహారంగా అందిస్తారు. ఇందులో 2 కేజీల చికెన్, ఒక కేజీ బీఫ్, అర లీటర్ పాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో అంది స్తారు. వీటితో పాటు విటమిన్స్‌తో కూడిన మినరల్స్‌ను నీటి ద్వారా అందిస్తారు. మీరు చూడాలంటే.. నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ ద్వారం వద్ద నుంచి నేరుగా చిట్టి రైలు వద్దకు వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి నేరుగా వెళితే రాయల్ బెంగాల్ టైగర్ ఎన్‌క్లోజర్ పక్కనే ఈ చిరుతల ఎన్‌క్లోజర్ ఉంటుంది.