Watch: King Cobra And Mongoose Massive Fight Shocking Video Goes Viral - Sakshi
Sakshi News home page

కింగ్ కోబ్రా, ముంగీస భీకర పోరు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌..

Published Sat, Oct 15 2022 3:48 PM | Last Updated on Sat, Oct 15 2022 5:08 PM

King Cobra Mongoose Massive Fight Viral Video - Sakshi

కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ముంగీసకు కోబ్రా అంటే అసలు భయమే ఉండదు. ఎప్పుడూ దాంతో విరోచితంగా పోరాడుతుంది. ఎక్కువ సందర్భాల్లో కోబ్రాపై పైచేయి సాధిస్తుంది. ఈ రెండు భీకరంగా తలపడిన వీడియోలు అరుదుగా లభిస్తాయి. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది తెగ వైరల్‌గా మారింది. లక్షల వ్యూస్, వేల లైక్స్‌తో దూసుకుపోతుంది.

ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే.. కింగ్ కోబ్రా, ముంగీస నేలపై కాకుండా బురద నీటిలో తలపడ్డాయి. కోబ్రా ఎన్నిసార్లు కాటేసేందుకు ప్రయత్నించినా.. ముంగీస మాత్రం చురుగ్గా తప్పించుకుంది. అంతేకాదు దాని వెంటపడి మరీ కయ్యానికి కాలుదువ్వింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి ఫైట్ తాము ఎప్పుడూ  చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. నీటిలో దాచుకోవడం ఎలాగో కోబ్రా నేర్చుకోవాలి, ఇలాంటి పోరాటల్లో ఎప్పుడూ ముంగీసదే విజయం అని మరో జూయర్ కామెంట్ చేశాడు. ఆ వీడియో మీరు చూసేయండి.


చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement