king cobra
-
Video: కింగ్ కోబ్రాను చంపి పిల్లలను రక్షించిన పిట్ బుల్
పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కలను ప్రమాదకరమైనవి పేర్కొంటారు. అనేకసార్లు మానవులపై ఇవి దాడికి పాల్పడటమే ఇందుకు కారణం. పెంచుతున్న యజమానులతో పాటు ఇతరులపై సైతం ఉన్నట్టుండి దాడి చేసి గాయపర్చుతుండటంతో వీటిని పెంచుకోవడంపై భారత్‌లో నిషేధం కూడా విధించారు. అయితే తాజాగా ఓ పిట్ బుల్ కుక్క.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దాడి నుంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాన్సీలో జరిగింది. శివగణేష్ కాలనీలో ఇంటి ముందు తోటలో పనిమనిషి పిల్లలు ఆడుకుంటుండా ఒక్కసారిగా పాము ప్రవేశించింది. కోబ్రాను గుర్తించిన పిల్లలు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. చిన్నారుల అరుపులు విన్న పిట్ బుల్ జెన్నీ.. వెంటనే దాన్ని కట్టేసిన తాడును తెంచుకొని వారిని రక్షించేందుకు వచ్చింది.కుక్క దాని దవడల మధ్య కింగ్ కోబ్రాను బంధించి ముప్పుతిప్పలు పెట్టింది. తలతో వేగంగా తప్పుతూ దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. దాదాపు అయిదు నిమిషాలపాటు పాముతో పోరాడింది. చివరికి పామును వేగంగా కొట్టడం ద్వారా అది చనిపోయింది. पिटबुल ने बचाई बच्चों की जान: झाँसी के एक घर के गार्डन में बच्चे खेल रहे थे, तभी एक साँप आ गया और देखते ही देखते पिटबुल डॉग साँप से भिड़ गया। पिटबुल ने साँप को पटक पटक कर मार डाला।#Pitbull #Jhansi pic.twitter.com/fqB77XW3Q6— Aviral Singh (@aviralsingh15) September 25, 2024ఇక ఈ ఘటనపై జెన్నీ యజమాని పంజాబ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పిట్ బుల్ పామును చంపి ప్రాణాలను రక్షించడం ఇది మొదటిసారి కాదని తెలిపారు. తమ ఇల్లు పొలాల మధ్య ఉండటం వల్ల తరచుగా పాములు వస్తుంటాయిని, అయితే జెన్నీ ఇప్పటివరకు ఎనిమిది నుంచి, పది పాములను చంపినట్లు ఆయన తెలిపారు. -
పడక గదిలో కింగ్ కోబ్రా
శివమొగ్గ: ఇంటిలో ఒక చిన్న ఎలుక సంచరిస్తేనే మనకు రాత్రంతా భయంగా ఉంటుంది. అలాంటిది పడకగదిలోనే మహాసర్పం ఒకటి తిష్ట వేస్తే ఇక ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తీర్థహళ్లి తాలూకా ఆగుంబె సమీపంలోని సిగువ సోమేశ్వర గ్రామంలో ఎదురైంది. అక్కడి ఇంటి పడకగదిలోకి సుమారు 9 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ఒకటి చేరింది. ఒక పాత్రలో చేరి దర్జాగా పడకేసింది. ఇంటివారు చూసి వణికిపోయారు. అటవీసిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలుచుకొచ్చి సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. 12 అడుగుల కింగ్ కోబ్రా పట్టివేత
బెంగుళూరు: కర్నాటకలో సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రానుఅటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అగుంబే గ్రామంలో ఓ ఇంటి ముందున్న పొదల్లో సంచరిస్తూ కనిపించిన ఆ భారీ నల్లత్రాచు పామును వన్యప్రాణి అధికారులు చాలా చాకచక్యంగా బంధించి.. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఈ మేరకు అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసర్చ్ స్టేషన్లో ఫీల్డ్ డైరెక్టర్‌గా చేస్తున్న అజయ్ గిరి పామును రెస్యూ చేసిన వీడియోను ఎస్స్లో పోస్టు చేశారు. దీనిని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా కూడా ఆ షేర్ చేశారు.కాగా అగుంబే గ్రామంలో ఇంటి కాంపౌండ్‌లోని పొదల్లో నక్కిన నాగుపాము.. రోడ్డు దాటుతుండగా గ్రామస్థులు గుర్తించారు. వెంటనే ఇంటి యజమాని కి తెలియజేయగా.. ఆయన అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వచ్చే సరికి పాము ఓ చెట్టుపైకి ఎక్కి దాక్కుంది. అక్కడకు వచ్చిన వన్యప్రాణి సంరక్షణ అధికారి గిరి, టీమ్‌తో కలిసి పామును పట్టుకున్నారు.. ఓ రాడ్డు సాయంతో చెట్టు మీద నుంచి పామును కిందకు దించి, ఆ తర్వాత రెస్క్యూ బ్యాగ్‌లోకి పంపించారు. అనంతరం దానిని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. View this post on Instagram A post shared by Ajay Giri (@ajay_v_giri) అయితే పామును పట్టుకుంటున్న వీడియోను గిరి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చెట్టుమీద నెమ్మదిగా కదులుతున్న నల్లత్రాచు పాము ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పడుకు గురిచేస్తున్నాయి. ఇక పోతే కింగ్ కోబ్రాను పట్టుకున్న అజయ్ గిరిపై ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ప్రశంసలు వ్యక్తం చేశారు. -
శ్రీశైలంలో అద్భుతం..
-
పాతికేళ్ల అనుభవం.. పాముకాటుకే బలి
సాక్షి, బెంగళూరు: కాఫీనాడు చిక్కమగళూరులో వందలాది పాములను పట్టుకుని ప్రజలకు సహాయకారిగా ఉండే స్నేక్ నరేశ్ (55) చివరికి పాము కాటుకే మరణించాడు. చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా స్నేక్ నరేశ్‌గా పేరు గడించారు. ప్రత్యేకించి భారీ సైజులో ఉండే కింగ్ కోబ్రాలను ఆయన అలవోకగా పట్టుకుని బంధించేవాడు. వృత్తిపరంగా టైలర్ అయినప్పటికీ పాములను పట్టుకోవడంలో నేర్పరి అయ్యాడు. 2013 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా. జిల్లావ్యాప్తంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాముల సంరక్షణపై అవగాహన కల్పించేవాడు. పాములు మన స్నేహితులని, వాటిని చంపరాదని బోధించేవాడు. ఏం జరిగిందంటే కొద్దిరోజుల క్రితం చిక్కమగళూరులో హౌసింగ్ బోర్డులో ఒక నాగుపామును పట్టుకుని స్కూటీ వాహనంలో పెట్టి మరో పామును పట్టుకునేందుకు వెళ్లాడు. ఈ సమయంలో స్కూటీ సీటు తెరిచి పామును సంచి లోపలికి వేస్తుండగా చేతిపై నాగుపాము కాటు వేసింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. అయితే పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూశాడు. -
కర్ణాటక బీజేపీ ఆఫీస్‌లో కింగ్ కోబ్రా.. సీఎం బసవరాజ్ బొమ్మై పక్కనే..
బెంగళూరు: కర్ణాటక శిగ్గావ్లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్‌లో కింగ్ కోబ్రా కన్పించడం కలవరపాటుకు గురిచేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆఫీస్‌లో ఉన్న సమయంలో కోబ్రా కన్పించడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. అయితే కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. #WATCH Karnataka CM Basavaraj Bommai reaches the BJP camp office in Shiggaon, a snake found in the building compound slithers away The snake was later captured and the building compound secured pic.twitter.com/FXSqFu0Bc7 — ANI (@ANI) May 13, 2023 #WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM's presence pic.twitter.com/1OgyLLs2wt — ANI (@ANI) May 13, 2023 కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 60-65 స్థానాలకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మంచి 130 స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. అటు కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్ కేవలం 22 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
వైరల్ వీడియో: ఈ కోబ్రా కాటేస్తే అంతే సంగతి
-
మూడు కింగ్ కోబ్రాలు.. ఒకే చోట తారసపడితే..
అనకాపల్లి: కింగ్ కోబ్రా(రాచనాగు).. ఒకటి ఎదురుపడితేనే గుండెల్లో దడదడ మొదలవుతుంది. అలాంటిది ఒకేసారి మూడు కింగ్ కోబ్రాలు.. ఒకే చోట తారసపడితే.. చెప్పేందుకేముంది..? హడలెత్తుతూ పరుగులు తీయడమే..! దేవరాపల్లి మండలంలోని తారువ గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తున్న ఏటి బాడవ గెడ్డలో మంగళవారం మధ్యాహ్నం స్థానికులకు ఇదే పరిస్థితి ఎదురయింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన యువకులకు మూడు కింగ్ కోబ్రాలు బుసలు కొడుతూ కనిపించాయి. దీంతో వారు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని చోడవరం అటవీశాఖ రేంజర్ బి.వి.వర్మకు ఫోన్లో తెలిపారు. ఆయన విశాఖపట్నానికి చెందిన ఈస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు కంఠిమహంతి మూర్తికి సమాచారం అందించారు. అటవీశాఖకు చెందిన బీట్ ఆఫీసర్ పి.శివకుమార్, ఎఫ్‌డీవో ఎం.నారాయణ తదితరులతో కలిసి పాములు ఉన్న ప్రాంతానికి మూర్తి చేరుకున్నారు. నీరు ప్రవహిస్తున్న గెడ్డకు ఆనుకుని పొదల్లో ఉన్న మూడు రాచ నాగులను సుమారు మూడు గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వీటిలో రెండు ఆడ జాతి పాములు కాగా ఒకటి మగ జాతికి చెందినదిగా నిర్ధారించారు. ఒక్కొక్కటి 13 నుంచి 15 అడుగుల పొడవు ఉన్నాయి. వీటిని చింతలపూడి పంచాయతీ సమ్మెద సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. -
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
వీడియో: అర్ధరాత్రి దుప్పట్లో దూరిన నాగుపాము.. తెల్లారి లేచేసరికి..
సాధారణంగా మనం సడెన్‌గా పామును చూడగానే ఒక్కసారిగా షాకై.. భయంతో దూరంగా పరుగుతీస్తాము. ఈ క్రమంలో ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా మన దుప్పట్లోనే ఉంటే.. ఇకేంముంది దాదాపు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అనుకుంటారు కదా. పాపం ఓ యువకుడికి ఇలాంటి ఘటనే ఎదురైంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సిరోజం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాత్రి వేళ తన రూమ్‌లోకి వెళ్లి నిద్రపోవడానికి రెడీ అయ్యాడు. కింద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. ఇంతలో ఓ నాగుపాము.. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. అతడి దుప్పట్లో దూరిపోయింది. కానీ, అతడిని మాత్రం కాటు వేయలేదు. అలా రాత్రంతా దుప్పట్లోనే ఉండిపోయింది. తీరా.. మరుసటి రోజు ఉదయం సదరు యువకుడికి మెలకువ వచ్చింది. బుసలు కొడుతున్న శబ్దం వినిపించడంతో ఎంటబ్బా అని నిద్రలోనే ఒక్కసారిగా అటువైపు తిరిగిచూశాడు. పడగవిప్పిన నాగుపాము కనిపించడంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. సడెన్ షాక్ నుంచి వెంటనే తేరుకుని పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో, అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ దుప్పట్లో దూరిన నాగుపామును పట్టేశాడు. -
కింగ్ కోబ్రా, ముంగీస ఫైట్.. వీడియో వైరల్
కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ముంగీసకు కోబ్రా అంటే అసలు భయమే ఉండదు. ఎప్పుడూ దాంతో విరోచితంగా పోరాడుతుంది. ఎక్కువ సందర్భాల్లో కోబ్రాపై పైచేయి సాధిస్తుంది. ఈ రెండు భీకరంగా తలపడిన వీడియోలు అరుదుగా లభిస్తాయి. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది తెగ వైరల్‌గా మారింది. లక్షల వ్యూస్, వేల లైక్స్‌తో దూసుకుపోతుంది. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే.. కింగ్ కోబ్రా, ముంగీస నేలపై కాకుండా బురద నీటిలో తలపడ్డాయి. కోబ్రా ఎన్నిసార్లు కాటేసేందుకు ప్రయత్నించినా.. ముంగీస మాత్రం చురుగ్గా తప్పించుకుంది. అంతేకాదు దాని వెంటపడి మరీ కయ్యానికి కాలుదువ్వింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి ఫైట్ తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. నీటిలో దాచుకోవడం ఎలాగో కోబ్రా నేర్చుకోవాలి, ఇలాంటి పోరాటల్లో ఎప్పుడూ ముంగీసదే విజయం అని మరో జూయర్ కామెంట్ చేశాడు. ఆ వీడియో మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Animalia - Animal (@wildanimalia) చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
ఇదెక్కడి వింత.. వ్యక్తిని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా!
ప్రపంచములో చాలా ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా(నల్లత్రాచు) ఒకటి. ఇవి అత్యంత విషపూరితమైనవి కూడా. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 15- 20 నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కింగ్ కోబ్రా మనిషిని కాటేసి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. బాగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషీనగర్ జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. వైద్యుల వద్దకు వెళ్లి కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయిందని తెలిపాడు. వైద్యులను నమ్మించేందకు ఆ వ్యక్తి చనిపోయిన కింగ్ కోబ్రాను పాలిథిన్ కవర్లో వేసి తన వెంట హాస్పిటల్‌కు తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. దీంతో పామును చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అనంతరం సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ మీమ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తాగిన వ్యక్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకొని వైద్యులతో మాట్లాడటం కనిపిస్తోంది. తన పాదంపై ఉన్న పాము కాటుని చూపించి అవసరమైన వైద్యం చేయాలని వైద్యులను కోరాడు. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shivam Kashyap (@kashyap_memer) -
నాగుపాము నుదుట ముద్దు! రివర్స్‌లో..
వైరల్: విషం ఉందని తెలిసి కూడా ప్రేమతో ఆ నాగుపాముకు ముద్దు పెట్టబోయాడు ఆ వ్యక్తి. కానీ, ఆ నాగుకి అతగాడి ప్రేమ నచ్చలేదేమో!. అందుకే ఒక్కపెట్టున మూతి మీద కాటుతో ఆ ప్రేమను అదే రేంజ్లో తిప్పి కొట్టింది. పాముల్ని పట్టి సురక్షితంగా వదిలేసి ఓ వ్యక్తి.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకుని ఓ నాగుపామును ఒడిసి పట్టేసుకున్నాడు. అయితే.. అందరూ వీడియో తీస్తున్నారనే అత్యుత్సాహంలో అతగాడు.. ఆ పాము తల మీద ముద్దు పెట్టబోయాడు. కర్ణాటక శివమొగ్గ జిల్లా భద్రావతి బొమ్మనకట్టేలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాము అతని మూతిపై కాటేసింది. దీంతో అతగాడు పామును వదిలేశాడు. ఆపై ఒకతను ఆ పామును పట్టే యత్నం చేయగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. కాటేయించుకున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. పాము చిన్నది కావడం, విషం మోతాదు తక్కువగా ఉండడం, సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ లిప్ టు లిప్ ఘాటు ముద్దుపై సోషల్ మీడియాలోనూ అంతే రేంజ్లో ‘అలా జరగాల్సిందే..’ అంటూ సెటైర్లు పేలుతున్నాయి. -
కింగ్ కోబ్రా బుసలు.. రోషిణి ధైర్యానికి నెటిజన్లు ఫిదా
Kerala Lady Forest Officer: సాధారణంగా మనం పామును చూడగానే భయంతో వణికిపోతాం. మనకు దూరంగా పాము వెళ్తున్నా ఆగిపోతాం. అలాంటిది ఓ మహిళ ఎంతో చాకచక్యంగా ఓ పామును పట్టుకొని శభాష్ అనిపించుకుంది. ఆమె ధైర్యం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం జిల్లాలోని ఉన్న కట్టక్కడ గ్రామంలోని ఓ ఇంటి వద్ద స్థానికులు పామును గుర్తించారు. దీంతో వారు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ ఉద్యోగి రోషిణి తన బృందంతో అక్కడికి చేరుకుంది. పామును కింగ్ కోబ్రాగా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆమె ఆ పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సందర్భంగా రోషిణి ధైర్యాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. ఇదిలా ఉండగా రోషిణి పామును పట్టిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామేన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రోషిణి తిరువనంతపురంలోకి పారుతిపల్లి రేంజ్ ఆఫీసులో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లో ఉద్యోగం చేస్తోందన్నారు. ఆమె పాములను పట్టడంతో శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అయిపోయి.. ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. A brave Forest staff Roshini rescues a snake from the human habitations at Kattakada. She is trained in handling snakes. Women force in Forest depts across the country is growing up in good numbers. VC @jishasurya pic.twitter.com/TlH9oI2KrH — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) February 3, 2022 -
ఒకే చోట మూడు నాగుపాములు.. బహుశా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా!
సాధారణంగా పాములను టీవీలో చూడటం తప్ప నేరుగా చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. కొందరైతే పాము పేరు విన్నా వణికిపోతారు. ఎందుకంటే అవి ప్రాణాంతకం కాబట్టి. అలాంటి పాముల జాతులలో నాగుపాముల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి అత్యంత విషపూరితమైనవి, పడగ విప్పి కాటేశాయంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనడంతో ఎలాంటి సందేహం లేదు. అందుకే అవి ఉండే చోట కనీసం కిలోమీటర్ దూరం ఉంటుంటాం. అలాంటిది ముడు నాగుపాములు ఒకే చోట చూస్తే... ఇంకేమైనా ఉందా ఆ సన్నివేశాన్ని చూడాలంటే గుండె జారిపోయినంత పని అవుతుంది. కానీ ఓ వ్యక్తి ధైర్యంగా చూడటమే కాకుండా చిత్రీకరించాడు కూడా. ప్రస్తుతం అలాంటి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..మూడు నాగుపాములు ఓ చోటకి చేరి పడగ విప్పి మనకి కనిపిస్తాయి. వాటిని చ్తూస్తుంటే సరిగ్గా అవి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనట్లు అనిపిస్తుంది. అందులో ఒక పాము మాత్రం బుసులు కొడతూ ఏదో చెబుతోంది. మిగిలిన రెండు పాములు శ్రద్ధగా వింటున్నాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెట్టింట దీనిపై.. మూడు నాగుపాములు అలా కలవడం చూస్తే ట్రయాంగిల్ లవ్‌స్టోరీలా ఉందని ఒకరు, సమావేశం జరుగుతుందెమోనని మరొకరు, బహుశా టాప్ సీక్రెట్స్ అయ్యుండచ్చని ఇంకో నెటిజన్ కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by SACHIN AWASTHI (@helicopter_yatra_) -
Dangerous Snake: అమ్మో ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ..
మాడుగుల: నాగ జాతిలో అత్యంత ప్రాణాంతకర పాము గిరి నాగు విశాఖ జిల్లా మాడుగుల మండలం కృష్ణంపాలెం గ్రామంలో బుధవారం కనిపించింది. ఓ ఇంటి నుంచి పాము పామాయిల్ తోటలోకి వెళ్తుండగా స్థానికులు వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి 14 అడుగుల గిరి నాగును పట్టుకున్నారు. దాన్ని వంట్లమామిడి మహా అడవిలో వదిలారు. వన్యప్రాణి సంరక్షణ అధికారి కంఠిమహంతి మూర్తి, మాడుగుల గ్రామానికి చెందిన స్నేక్ కేచర్ పి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
మీడియాతో ఎస్పీ మాట్లాడుతుండగా... ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షం
సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ఎస్పీ కార్యాలయంలో 12 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న విలేకరి స్వధీన్ పండా పామును గుర్తించి అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం కిరండమల్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
Viral Video: దాహంగా ఉంది.. కొంచెం నీళ్లు ఇస్తారా.. వామ్మో కోబ్రా..!!
మీకు పాములంటే చచ్చేంత భయమా? ఏమడుగుతున్నారండి.. పాములంటే భయపడనివారెవరన్నా ఉంటారా? ఇదేనా మీ సమాధానం.. ఐతే ఈ వీడియోను మీరు చూడాల్సిందే.. అట్లాంటి ఇట్లాంటి పాము కాదు కింగ్ కోబ్రా.. జంతువులు మనుషులకు సహాయం చేసే వీడియోలు వందలకొద్దీ చూసుంటారు. కానీ ఈ వీడియోలో మనిషే కింగ్ కోబ్రాకి హెల్ప్ చేస్తున్నాడు. అంత కష్టమేమొచ్చిందా పాముకు..! అసలేంజరిగిందంటే.. వాతావరణం బాగా వేడిగా ఉండటంతో దాహమేసిన కోబ్రా ఒక కాలనీలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు. ఐతే ఒకతను మాత్రం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బకెట్‌తో నీళ్లు నింపి కోబ్రాకి స్నానం చేయించాడు. అంతేకాకుండా తాగడానికి నీళ్లు కూడా అందించడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్ల రూపంలో అతన్ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. పాముకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత యేడాది జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు. మానవత్వం ఇంకా బతికేఉందని దీనిని చూసిన వారంతా అంటున్నారు. ఐతే ఇటువంటి విషపూరిత జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే వ్యవహారం బెడిసికొట్టి మొదటికేమోసం వస్తుందనేది వాస్తవం. మీ అభిప్రాయమేమిటి..!! చదవండి: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే! View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) -
వైరల్ వీడియో: వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము
-
వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్చల్
సాక్షి, తూర్పు గోదావరి: టీవీ, సినిమాల్లో పాముతో కనిపించే భయానక దృశ్యాలను చూస్తేనే జడుసుకుంటాం. ఇక పాము ఇంట్లో కనిపిస్తే సరేసరి. భయంతో వణికిపోయి పరుగులు పెడతాం. అలాంటిది పామును చాలా దగ్గరగా అంటే.. అలవాటుగా ఇంటి పనులు చేస్తున్న సమయంలో.. సరాసరి అది మీద దూకే పరిస్థితే ఉంటే.. వామ్మో!.. తలుచుకుంటేనే అదోలా ఉంది కదా. (చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి) జిల్లాలోని ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో కుంచే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంట్లోని వాషింగ్ మెషీన్లో దూరిన ఓ పొడవాటి నాగుపాము ఆ ఇంటి మహిళను హడలెత్తించింది. వాషింగ్ మెషీన్లో బట్టలు వేద్దామని దాని డోర్ తెరవగా.. అక్కడే తిష్ట వేసిన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి దానిని చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. (చదవండి: నిమజ్జనాలకు అనుమతి లేదనడంతో హైదరాబాద్‌లో ఆగమాగం..) -
King Cobra: 13 అడుగుల గిరినాగు
-
కింగ్ కోబ్రా కలకలం: అమ్మో ఎంత పెద్దదో..
ప్రత్తిపాడు రూరల్: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చింతలూరులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన ఈ పాము గ్రామంలో బొడ్డు లోవరాజు, సూరిబాబుకు చెందిన సరుగుడు తోటలో సంచరిస్తుంది. ఈ పాము మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళ్తూ భయాందోళనకు గురిచేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు పాము ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. తమకు ఎటువంటి అనవాళ్లు లభించలేదని తెలిపారు. -
తూర్పు గోదావరి జిల్లాలో 12 అడుగుల కింగ్ కోబ్రా
-
భయానకం: పామును మరో పాము తినడం చూశారా?
సాధారణంగా పాముకు ఆకలేస్తే.. ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. . కానీ ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్న.. నిజంగానే ఓ పాము మరో పాముని గబుక్కున తినేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. పర్వీన్ పోస్టు చేసిన ఈ ఫోటోలో అడవుల్లోని ఓ కోబ్రా ఇంకో కోబ్రాను అమాంతం నోటిలో కరుచుకొని మింగుతోంది. ఇది చూడటానికి తీవ్ర భయంకరంగా కనిపిస్తోంది. ‘ అద్భుతమైన కోబ్రా ఓఫియోఫాగస్ హన్నా.. మరో కింగ్ కోబ్రాను తింటోంది’. అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా మరో పోస్టులో పర్వీన్ కశ్వాన్ ఒఫియోఫాగస్ హన్నా అర్థాన్ని వివరించారు. ఈ కింగ్ కోబ్రా యొక్క శాస్త్రీయ నామం; ఓఫియోఫాగస్ హన్నా. ఓఫియోఫాగస్ గ్రీకు భాషా పదం ఉద్భవించింది, దీని అర్థం ‘పాము తినడం’. అలాగే గ్రీకు పురాణాలలో చెట్టు, నివాస వనదేవతల పేరు నుంచి హన్నా ఉద్భవించింది. కాబట్టి కింగ్ దాని పేరుకు తగట్టు ఉంటుంది. ఇది గూళ్ళు నిర్మించే ఏకైక పాము.’ అని పేర్కొన్నారు. పాము ఇంకో పామును మింగటాన్ని చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. The scientific name of this king cobra is; Ophiophagus hannah. “Ophiophagus” is derived from Greek, meaning “snake-eating” and hannah is derived from the name of tree-dwelling nymphs in Greek mythology. So king living true to its name. The only snake which build nests. — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 Ophiophagus hannah. A king cobra eating a spectacled cobra. They feed on lesser mortals. pic.twitter.com/LL8xzQoIww — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 -
అమ్మో...! ఎంత పెద్ద పాముతో..
బెంగళూరు: ఇదేదో సినిమా కోసం ఇచ్చిన పోజు కాదు. ముమ్మాటికి వాస్తవ సంఘటనే. భారీ సర్పాన్ని అలవోకగా ఎత్తిపట్టుకున్న ఈ యువకుడు ఏ సినిమా హీరోగా తక్కువ కాడనే చెప్పాలి. గురువారం కర్ణాటకలోని కాఫీసీమ కొడగు జిల్లా మూర్నాడులో చోటుచేసుకుంది. ఒక కాఫీ తోటలోకి 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా పాము చొరబడడంతో యజమాని స్థానిక పాముల నిపుణుడు సూర్యకీర్తికి కాల్ చేశాడు. అక్కడకు చేరుకున్న సూర్యకీర్తి కొంతసేపటికే దానిని వట్టి చేతులతో పట్టుకుని చూపరుల కోసం ఇలా ఆడించాడు. తరువాత సమీప భాగమండల అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశాడు.