సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో అరుదైన కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. తొలుత గ్రామంలోని ఓ చెట్టుపై 15 అడుగుల పొడవు ఉన్న పాము ఉండటాన్ని స్థానికులు గమనించారు. అది అరుదైన కింగ్ కోబ్రా కావడంతో.. పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్తులు కింగ్ కోబ్రా గురించి విశాఖ వైల్డ్ లైఫ్ అదికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న విశాఖ అటవీశాఖ అధికారులు బృందం.. కింగ్ కోబ్రాను బంధించి తీసుకెళ్లిపోయారు. కాగా, కింగ్ కోబ్రా చెట్టుపై తిరుగుతున్న దృశ్యాలను పలువురు తమ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment