Man Try To Kiss King Cobra Got Reverse Lip Lock, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: నాగుపాము నుదుట ముద్దు పెట్టబోయాడు.. రివర్స్‌లో ‘లిప్‌లాక్‌’ పడింది!

Published Sat, Oct 1 2022 9:22 PM | Last Updated on Sat, Oct 8 2022 11:42 PM

Man Try To Kiss King Cobra Got Reverse Lip lock Viral - Sakshi

వైరల్‌: విషం ఉందని తెలిసి కూడా ప్రేమతో ఆ నాగుపాముకు ముద్దు పెట్టబోయాడు ఆ వ్యక్తి. కానీ, ఆ నాగుకి అతగాడి ప్రేమ నచ్చలేదేమో!. అందుకే ఒక్కపెట్టున మూతి మీద కాటుతో ఆ ప్రేమను అదే రేంజ్‌లో తిప్పి కొట్టింది. 

పాముల్ని పట్టి సురక్షితంగా వదిలేసి ఓ వ్యక్తి.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకుని ఓ నాగుపామును ఒడిసి పట్టేసుకున్నాడు. అయితే.. అందరూ వీడియో తీస్తున్నారనే అత్యుత్సాహంలో అతగాడు.. ఆ పాము తల మీద ముద్దు పెట్టబోయాడు. కర్ణాటక శివమొగ్గ జిల్లా భద్రావతి బొమ్మనకట్టేలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దీంతో ఆ పాము అతని మూతిపై కాటేసింది. దీంతో అతగాడు పామును వదిలేశాడు. ఆపై ఒకతను ఆ పామును పట్టే యత్నం చేయగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. కాటేయించుకున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. పాము చిన్నది కావడం, విషం మోతాదు తక్కువగా ఉండడం, సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ లిప్‌ టు లిప్‌ ఘాటు ముద్దుపై సోషల్‌ మీడియాలోనూ అంతే రేంజ్‌లో ‘అలా జరగాల్సిందే..’ అంటూ సెటైర్లు పేలుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement