ప్రపంచములో చాలా ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా(నల్లత్రాచు) ఒకటి. ఇవి అత్యంత విషపూరితమైనవి కూడా. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 15- 20 నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కింగ్ కోబ్రా మనిషిని కాటేసి చనిపోయింది.
వివరాల్లోకి వెళితే.. బాగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషీనగర్ జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. వైద్యుల వద్దకు వెళ్లి కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయిందని తెలిపాడు. వైద్యులను నమ్మించేందకు ఆ వ్యక్తి చనిపోయిన కింగ్ కోబ్రాను పాలిథిన్ కవర్‌లో వేసి తన వెంట హాస్పిటల్‌కు తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. దీంతో పామును చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అనంతరం సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను ఓ మీమ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తాగిన వ్యక్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకొని వైద్యులతో మాట్లాడటం కనిపిస్తోంది. తన పాదంపై ఉన్న పాము కాటుని చూపించి అవసరమైన వైద్యం చేయాలని వైద్యులను కోరాడు. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment