బెంగుళూరు: కర్నాటకలో సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రానుఅటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అగుంబే గ్రామంలో ఓ ఇంటి ముందున్న పొదల్లో సంచరిస్తూ కనిపించిన ఆ భారీ నల్లత్రాచు పామును వన్యప్రాణి అధికారులు చాలా చాకచక్యంగా బంధించి.. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఈ మేరకు అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసర్చ్ స్టేషన్లో ఫీల్డ్ డైరెక్టర్‌గా చేస్తున్న అజయ్ గిరి పామును రెస్యూ చేసిన వీడియోను ఎస్స్లో పోస్టు చేశారు. దీనిని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా కూడా ఆ షేర్ చేశారు.
కాగా అగుంబే గ్రామంలో ఇంటి కాంపౌండ్‌లోని పొదల్లో నక్కిన నాగుపాము.. రోడ్డు దాటుతుండగా గ్రామస్థులు గుర్తించారు. వెంటనే ఇంటి యజమాని కి తెలియజేయగా.. ఆయన అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వచ్చే సరికి పాము ఓ చెట్టుపైకి ఎక్కి దాక్కుంది. అక్కడకు వచ్చిన వన్యప్రాణి సంరక్షణ అధికారి గిరి, టీమ్‌తో కలిసి పామును పట్టుకున్నారు.. ఓ రాడ్డు సాయంతో చెట్టు మీద నుంచి పామును కిందకు దించి, ఆ తర్వాత రెస్క్యూ బ్యాగ్‌లోకి పంపించారు. అనంతరం దానిని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు.
అయితే పామును పట్టుకుంటున్న వీడియోను గిరి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చెట్టుమీద నెమ్మదిగా కదులుతున్న నల్లత్రాచు పాము ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పడుకు గురిచేస్తున్నాయి. ఇక పోతే కింగ్ కోబ్రాను పట్టుకున్న అజయ్ గిరిపై ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ప్రశంసలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment