Cobra Eating Another Cobra Pic Viral On Social Media: పామును మరో పాము తినడం చూశారా? - Sakshi
Sakshi News home page

భయానకం: పామును మరో పాము తినడం చూశారా?

Published Wed, Jul 21 2021 3:12 PM | Last Updated on Wed, Jul 21 2021 6:20 PM

Viral: Rare Pic Of King Cobra Eating Another Cobra - Sakshi

సాధారణంగా పాముకు ఆకలేస్తే.. ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. . కానీ ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్న.. నిజంగానే ఓ పాము మరో పాముని గబుక్కున తినేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

పర్వీన్‌ పోస్టు చేసిన ఈ ఫోటోలో అడవుల్లోని ఓ కోబ్రా ఇంకో కోబ్రాను అమాంతం నోటిలో కరుచుకొని మింగుతోంది. ఇది చూడటానికి తీవ్ర భయంకరంగా కనిపిస్తోంది. ‘ అద్భుతమైన కోబ్రా ఓఫియోఫాగస్ హన్నా.. మరో కింగ్‌ కోబ్రాను తింటోంది’. అంటూ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా మరో పోస్టులో పర్వీన్ కశ్వాన్‌ ఒఫియోఫాగస్ హన్నా అర్థాన్ని వివరించారు. ఈ కింగ్‌ కోబ్రా యొక్క శాస్త్రీయ నామం; ఓఫియోఫాగస్ హన్నా. ఓఫియోఫాగస్ గ్రీకు భాషా పదం ఉద్భవించింది, దీని అర్థం ‘పాము తినడం’. అలాగే గ్రీకు పురాణాలలో చెట్టు, నివాస వనదేవతల పేరు నుంచి హన్నా ఉద్భవించింది. కాబట్టి కింగ్‌ దాని పేరుకు తగట్టు ఉంటుంది. ఇది గూళ్ళు నిర్మించే ఏకైక పాము.’ అని పేర్కొన్నారు. పాము ఇంకో పామును మింగటాన్ని చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement