ఓ ఇంటిలోని కారుకింద భారీ కింగ్ కోబ్రా దాగి ఉంది. భయంతో పాములు పట్టుకునే వారికి సమాచరం అందిచడంతో..వారు రంగంలోకి దిగి వెతకగా.. ఏకంగా 15 ఏడుగుల భారీ కింగ్ కోబ్రా బయటపడింది. పాములు పట్టే నిపుణుడిని సైతం ముచ్చమటలు పట్టేలా జరజర పాకి వెళ్లిపోయేందుకు యత్నించింది. పాపం అతను చివరికి ఎంతో చాకచక్యంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు.
దాని చాలా జాగ్రత్తగా దారి మళ్లించి ముందుగా ఏర్పాటు చేసుకున్న సంచిలోకి వెళ్లేలా చేశాడు. అందుకుసంబంధించిన వీడియోని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఆ పాముని అడవిలో ఒదిలేసినట్లు పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి అత్యంత విషపూరిత పాములను అతను మాదిరి పట్టుకునే యత్నం ఎవరూ చేయొద్దని సుశాంత్ హెచ్చరించారు కూడా.
వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా.. ఇళ్లలోకి విషపూరిత పాములు చొరబడుతున్నట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి పాములే భారత్‌కి గర్వకారణమని, అతను చాలా స్కిల్‌ఫుల్‌గా పట్టుకున్నాడంటూ సదరు వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించారు.
(చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment