Snake Catcher
-
స్నేక్ ఫ్రెండ్స్..
పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. ఎక్కడైనా కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడుతుంటాం. ఇక ఇంట్లోకి వచి్చందంటే కథ వేరేలా ఉంటుంది. భయానికి చెమటలతో సగం తడిచిపోతుంటాం. ఇంకొందరైతే తెగ హడావుడి చేసి ఎలాగైనా చంపేయాలని చూస్తుంటారు. కానీ వీరు మాత్రం పాములు కనిపిస్తే చాలు ప్రేమగా వాటిని పట్టుకుంటారు. వాటికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి దగ్గర్లోని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇంతకీ వాళ్లెవరా అని ఆలోచిస్తున్నారా? వాళ్లే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్.. వీరి గురించి మరిన్ని విశేషాలు.. ఎవరి ఇంటికైనా పాములు వచ్చాయని ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోయి.. పాములను చాలా జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతారు. ఏటా దాదాపు 10 వేల నుంచి 12 వేల వరకూ పాములను పట్టి.. వేరే ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు. ఇటు మనుషుల ప్రాణాలతో పాటు పాములను కూడా కాపాడుతూ రియల్ హీరోలుగా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు. వర్షాకాలంలో ఎక్కువ..సాధారణంగా పాములు బొరియల్లో తలదాచుకుంటాయి. వర్షాకాలంలో ఆ బొరియల్లోకి వరద నీరు చేరుతుండటంతో బయటకు వస్తాయి. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక అప్పుడప్పుడూ ఇళ్లల్లోకి వస్తుంటాయి. అంతేకాకుండా నాళాల పక్కన ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి కూడా పాములు చేరుతుంటాయి. అంతేకానీ మనకు ఎలాంటి హానీ తలపెట్టబోవని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. వాటికి మనం హాని చేస్తున్నామని అనిపిస్తేనే అవి కాటేస్తాయని పేర్కొంటున్నారు. స్వచ్ఛందంగా సేవలు.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను 1995లో రాజ్‌కుమార్ కానూరి స్థాపించారు. పాములు జీవవైవిధ్యానికి ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెబుతుండేవారు. ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ సంస్థలో.. ఇప్పుడు ఏకంగా 150 మంది వలంటీర్లు ఉన్నారు. పాములపై ప్రేమ.. పాములను పట్టుకోవాలని ఆసక్తి ఉన్న ఉద్యోగులు, స్టూడెంట్స్ తమకు ఉన్న ఖాళీ సమయాల్లో స్నేక్ క్యాచింగ్ చేసేందుకు ముందుకు వస్తుంటారు. స్నేక్ క్యాచింగ్ అంటే ఆసక్తి ఉన్న వారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను సంప్రదిస్తే.. వారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడైనా పాము గురించి సమాచారం అందగానే దగ్గరలో ఉన్న వలంటీరు అక్కడికి వెళ్లి వాటిని రక్షిస్తారు. జీవ వైవిధ్యానికి ముఖ్యం.. ప్రకృతిలో అన్ని జీవులకూ సమాన హక్కులు ఉంటాయని, ఏ ప్రాణినీ చంపే అధికారం ఎవరికీ లేదని ఈ సంస్థ వాళ్లు చెబుతున్నారు. కాకపోతే పట్టణీకరణ కారణంగా భవన నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతుండటంతో పాములు, ఇతర జంతువుల ఆవాసాలైన అడవులను నరికేస్తున్నారని, ఈ నేపథ్యంలో వాటికి ఆవాసం లేకపోవడంతో ఇళ్ల్లల్లోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇక, పాములు జీవవైవిధ్యానికి, మనిషి జాతి మనుగడకు చాలా కీలకమని, వాటిని కాపాడుకుంటే భవిష్యత్తు తరాలు సుస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఆహార భద్రతలో కూడా పాములు కీలక పాత్ర పోషిస్తాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అందుకే పాములపై తాము పరిశోధనలు చేస్తున్నామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకోసం సంస్థలో పరిశోధనా విభాగం ఉందని, వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పాముల గురించి పరిశోధనలు చేస్తుంటామని వివరించారు. ఈ విషయంలో అటవీ శాఖ, జూపార్కు అధికారులు తమకు ఎంతో మద్దతు ఇస్తుంటారని చెబుతున్నారు.అవగాహన అవసరం..పాములన్నీ విషపూరితం కాదు.. ఎవరికీ హాని చేయని పాములు కూడా ఉంటాయి. వాటిని చూసి అనవసరంగా భయపడి వాటిని చంపొద్దని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వలంటీర్లు చెబుతున్నారు. పాముల గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాలనే ఉద్దేశంతో ఏటా దాదాపు 200 నుంచి 300 వరకూ అవగాహనా కార్యక్రమాలు చేస్తుంటామని వివరించారు. పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కలి్పస్తుంటామని పేర్కొంటున్నారు. దీంతో పాటు అడవుల్లో అరుదైన జాతి పాములను కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. ఔషధ గుణాలున్నాయంటూ కొన్ని పాములను అనవసరంగా చంపి, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని, ఇలాంటి వారి గురించి తమ దృష్టికి వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి.. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ తృప్తి వేరు.. పాములు పట్టాలంటూ రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. రెస్క్యూ చేసిన పాముల్లో దాదాపు 50 శాతం విషపూరితమే. కొన్నిసార్లు వాటిని పట్టే సమయంలో వలంటీర్లు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఎంతగా శిక్షణ తీసుకున్నా.. ఫీల్డ్‌లోకి వచ్చేసరికి కొన్ని సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ.. సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంటాం. పాములను జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత.. ఇంటి యజమానుల కళ్లల్లో కృతజ్ఞతాభావం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మేం చేస్తున్న పనిలో ఆ క్షణం తృప్తినిచ్చే క్షణం. – అవినాష్ విశ్వనాథం, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ -
పాముకాటు వీరులు
1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం. మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి. పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు. నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన. పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి! -రచయిత, ఫోటోలు : జానకి లెనిన్-అనువాదం : చంద్ర శేఖర్ బండి -
పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
అన్నానగర్: కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు. పాములు పట్టే ఉమామహేశ్వరి, సంజయ్ ఘటనా స్థలానికి చేరుకుని 8 అడుగుల పొడవున్న పామును పట్టుకుని అడవిలోకి పంపించారు. అంతకుముందు స్నేక్ క్యాచర్ ఉమా మహేశ్వరి పాము పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అనుమతి లేకుండా పామును పట్టుకుని, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. #Coimbatore Forest Department arrested two individuals for illegally handling an Indian rat snake and posting a video of it on social media, which went viral on May 25. The snake, listed under Schedule I of the Wildlife Protection Act, 1972, is a protected species.@THChennai📽️:… pic.twitter.com/WCenHD66Sf— Avantika Krishna (@AvantikaKrish) May 28, 2024 -
అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం..!
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లోని సాయి ఎలైట్ అపార్ట్‌లోని పార్కింగ్ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు అంకిత్ శర్మకు ఫోన్ చేయడంతో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్‌లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
నాగుల పంచమి నాడు నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు
శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మాసంలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణమాసం ప్రారంభం కాగానే నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతాయి. ఇక నిన్న శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగపంచమి అంటే పుట్టలో పాలుపోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ పామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసే వ్యక్తులు ఉంటారన్న విషయం మీకు తెలుసా? ఇది ఏంటో తెలియాలంటే స్టోరీ చదివేయండి. నాగ పంచమి రోజున నాగపామునే నట్టింట్లోకి తీసుకొచ్చి పూజ చేసింది ఓ కుటుంబం. చక్కగా పూలు, పాలతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ప్రశాంత్ హులేకర్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగులపంచమికి కుటుంబంతో కలిసి పాములకు ప్రత్యేకంగా పూజలు చేస్తారట. అది కూడా ఇంటికి తీసుకొచ్చి మరీ. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాగుల పంచమి సందర్భంగా ఓ పామును తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టారు. తనకు పాములంటే ఇష్టమని పాముల సంరక్షణ కోసం కృషి చేస్తుంటానని ప్రశాంత్ తెలిపాడు. అతని తండ్రి సురేష్ కూడా పాముల సంరక్షణ కోసం చాలా చేశాడట. ఇక ప్రతీ ఏడాది నాగుల పంచమి నాడు ఇలా పాముని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని అడవిలో వదిలివేయడం చేస్తామని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా ఇలా చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుందని, ఇప్పటివరకు దీని వల్ల కుటుంబంలో ఎవరికి హానీ జరగలేదని తెలిపాడు. పాముల పట్ల తమకు ప్రత్యేక భక్తి ఉందని, అందుకే ఇలా చేస్తానని వెల్లడించాడు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. ఆడ జెర్రిపోతు!
మహబూబ్‌నగర్: పట్టణంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపర్చిన ఆడ జెర్రిపోతు పాము శుక్రవారం పది గుడ్లను పెట్టిందని వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్య శనివారం విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. సాధారణంగా కొన్ని పాములు గుడ్లను పెడతాయి. మరికొన్ని ప్రత్యక్షంగా పిల్లలను కంటాయి. అయితే ప్రజలు జెర్రిపోతును మగదిగాను నాగుపామును ఆడదిగాను అపోహపడుతుంటారన్నారు. కానీ జెర్రిపోతు పాముల్లో ఆడ, మగ ఉంటాయని తెలియజేశారు. ఐదు రోజుల క్రితం పట్టణంలోని ఓ ఇంట్లో పట్టుకు వచ్చిన ఆడ జెర్రిపోతును కళాశాల వృక్షశాస్త్రవిభాగంలో భద్రపరిచారు. శుక్రవారం రాత్రి పాము పది గుడ్లను పెట్టిందని తెలిపారు. గుడ్లను పొదిగించేందుకు సరైన పరికరాలు కళాశాలలో లేనందున హైదరాబాద్ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలలోని జీవ వైవిధ్య పరిశోధన విద్యా కేంద్రంలో ఇప్పటికే మూడు సార్లు గుడ్లను హైదరాబాద్ పంపగా అవి పిల్లలు తీశాయని ప్రిన్సిపాల్ డా. అప్పియాచిన్నమ్మ తెలిపారు. సాధారణంగా జెర్రిపోతు పాములు జూలై, ఆగస్టు నెలల్లో ఒక్కో పాము 6 నుంచి 22 వరకు గుడ్లు పెడతాయన్నారు. -
పాతికేళ్ల అనుభవం.. పాముకాటుకే బలి
-
కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..
ఓ ఇంటిలోని కారుకింద భారీ కింగ్ కోబ్రా దాగి ఉంది. భయంతో పాములు పట్టుకునే వారికి సమాచరం అందిచడంతో..వారు రంగంలోకి దిగి వెతకగా.. ఏకంగా 15 ఏడుగుల భారీ కింగ్ కోబ్రా బయటపడింది. పాములు పట్టే నిపుణుడిని సైతం ముచ్చమటలు పట్టేలా జరజర పాకి వెళ్లిపోయేందుకు యత్నించింది. పాపం అతను చివరికి ఎంతో చాకచక్యంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దాని చాలా జాగ్రత్తగా దారి మళ్లించి ముందుగా ఏర్పాటు చేసుకున్న సంచిలోకి వెళ్లేలా చేశాడు. అందుకుసంబంధించిన వీడియోని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఆ పాముని అడవిలో ఒదిలేసినట్లు పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి అత్యంత విషపూరిత పాములను అతను మాదిరి పట్టుకునే యత్నం ఎవరూ చేయొద్దని సుశాంత్ హెచ్చరించారు కూడా. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా.. ఇళ్లలోకి విషపూరిత పాములు చొరబడుతున్నట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి పాములే భారత్‌కి గర్వకారణమని, అతను చాలా స్కిల్‌ఫుల్‌గా పట్టుకున్నాడంటూ సదరు వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్) -
పాములు పట్టే వారికి పద్మశ్రీ.. వీరిద్దరూ వరల్డ్ ఫేమస్!
సాక్షి, చెన్నై: తమిళనాడు నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికైన వారిని గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ గురువారం అభినందించారు. వివరాలు.. 2023 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి పురస్కారాలు లభించాయి. వీరిలో గాయని వాణీ జయరాంకు పద్మ విభూషణ్ దక్కింది. మిగిలిన ఐదుగురిని పద్మశ్రీ వరించింది. అలాగే, కల్యాణ సుందరం పిళ్లై (కళ) వడివేల్ గోపాల్, మాసి సడయన్ (సామాజిక సేవ), పాలం కల్యాణ సుందరం (సామాజిక సేవ), గోపాల్ స్వామి వేలుస్వామి (వైద్యం) ఉన్నారు. ప్రస్తుతం పద్మశ్రీతో ఇద్దరు వ్యక్తులు తమిళనాడు ప్రముఖులుగా తెర మీదకు వచ్చారు. ఆ ఇద్దరు పాములు పట్టడంలో దిట్టగా ఉండటం విశేషం. పాములను పట్టే ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం చెంగల్పట్టు నుంచి అమెరికా వరకు విషపూరిత పాములను పట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెనుక బడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని పద్మశ్రీ వరించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన వడివేల్ గోపాల్, మాసి సడయన్ పాములు పట్టాడాన్నే వృత్తిగా కొనసాగిస్తున్నారు. వంశ పారంపర్యగా వస్తున్న నేర్చుకున్న విద్యతో ఈ ఇద్దరు అమెరికా వరకు తమ సేవలను అందించారు. ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికై ఉండడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో పాములు పట్టే శిక్షణ ఇచ్చే స్థాయికి వీరు ఎదిగి ఉన్నారు. అమెరికా ఫ్లోరిడాలో కొండ చిలువలను పట్టే ప్రముఖ నిపుణుడు రోమ్లస్ విక్టోరికర్ బృందంలో ఈ ఇద్దరు సభ్యులుగా ఉండడం వెలుగులోకి వచ్చింది. కాగా తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై వడివేల్ గోపాల్ మాట్లాడుతూ ఈ ఘనత అందుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. అమెరికా, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలలో తాము పాములు పట్టామని, అధిక విషం కలిగిన పాములు ఎన్ని పట్టామో తనకే తెలియదని పేర్కొన్నారు. మాసి సడయన్ మాట్లాడుతూ పద్మశ్రీ రావడం గొప్ప ఘతన అని ఈ ఆనందానికి మాటలు లేవని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: వైద్యంలో అతడి సేవలు అమోఘం.. వరించిన పద్మశ్రీ