పామును పట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ | Two persons arrested in Coimbatore for illegal handling of Indian rat snake | Sakshi
Sakshi News home page

పామును పట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌

Published Wed, May 29 2024 7:43 AM | Last Updated on Wed, May 29 2024 7:43 AM

Two persons arrested in Coimbatore for illegal handling of Indian rat snake

అన్నానగర్‌: కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు. 

పాములు పట్టే ఉమామహేశ్వరి, సంజయ్‌ ఘటనా స్థలానికి చేరుకుని  8 అడుగుల పొడవున్న పామును పట్టుకుని అడవిలోకి పంపించారు. అంతకుముందు స్నేక్‌ క్యాచర్‌ ఉమా మహేశ్వరి పాము పట్టుకున్న వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అనుమతి లేకుండా పామును పట్టుకుని, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.     
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement