నైనిటాల్: పాములను చూస్తే మీరు భయంతో వణికిపోతారా? అయితే ఉత్తరాఖండ్‌లోని ఒక ఇంటిలో పామును బంధిస్తున్న ఈ వీడియో కచ్చితంగా మిమ్మలి భయానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో నైనిటాల్‌లోని ఓ ఇంటి నుంచి అటవీ శాఖ రాపిడ్ రెస్పాన్స్ టీం విషపూరిత పామును ఎలా బంధించిందో ఉంది. ఒక భారీ పాము ఇంటిలోని టేబుల్ కింద దాక్కుంది. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు దానిని బంధించారు. ఈ క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఆకాష్ కుమార్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
పామును బంధించడానికి అటవీశాఖ సిబ్బంది ఒకరు టేబుల్ కిందకు వెళ్లాల్సి వస్తుంది. పామును పట్టుకొని దానిని ఇంటి టెర్రస్ పైకి తీసుకువచ్చి ఒక సంచిలో వుంచుతారు. ఒకానొక సమయంలో ఆ పాము అతడి మెడ చుట్టూ కూడా చుట్టుకుంటుంది. ఇది చాలా భయంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూస్తే ఒళ్లు జలదరిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, చాలా మంచి పని చేశారని మరో నెటిజన్ అటవీ శాఖ అధికారులను అభినందించాడు. పామును సంచిలో నుంచి బయటకు వదిలినప్పుడు అది అడవిలోకి వెళ్లడం కూడా చూపించారు. ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కంటే కింగ్ కోబ్రా చాలా విషపూరితమైనది.
చదవండి: డేంజర్ గేమ్: 23వ అంతస్తు చివరి నుంచి..
A #King Cobra rescued by Forest Department's Rapid Response Team from a house at Nainital! 🎥DFO Nainital. @moefcc @ndtv @CentralIfs @AnimalsWorId @Uttkhand_Forest @nature @Discovery @MadrasCrocBank @REPTILESMag @mygovindia @MygovU @uttarakhandpost @ndtvindia @ZeeNews @dodo @IUCN pic.twitter.com/kXWameDNzf
— Akash Kumar Verma, IFS. (@verma_akash) August 11, 2020
Release of the #King #Cobra in it's natural habitat. @moefcc @UttarakhandIFS @uttarakhandpost @CentralIfs @dodo @UNBiodiversity @MadrasCrocBank @REPTILESMag pic.twitter.com/kfmECfLLFT
— Akash Kumar Verma, IFS. (@verma_akash) August 11, 2020
Comments
Please login to add a commentAdd a comment