Nainital
-
విహంగ విహారం : నైనితాల్ కేబుల్ కారు, బోట్ షికారు!
నైనితాల్... ఎనభైల నాటి సినిమాల్లో చూసిన ప్రదేశం. కథానుగుణంగా కొన్ని సీన్లను ఇక్కడ చిత్రీకరించేవారు. పాత్రలన్నీ మంకీ క్యాప్, ఉలెన్ స్వెటర్, ఫుల్ షూస్, షాల్‌తో ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పకనే చెప్పే దృశ్యాలుండేవి. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది. ఆధ్యాత్మికతకు, అడ్వెంచర్‌కి, ప్రశాంతంగా గడపడానికి, నేచర్‌ను ప్రేమించేవారికి అందరికీ, అన్ని వయసుల వారికీ అనువైన టూరిస్ట్ ప్రదేశం ఇది. అయితే పెద్దవాళ్లు మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లడం బాగుంటుంది. హనీమూన్ కపుల్‌కి ఈ నెల మంచి సమయం. రెండు వేల మీటర్ల ఎత్తులో కుమావ్ పర్వత శ్రేణుల్లో ఉంది నైనితాల్. చుట్టూ హిమాలయ పర్వతాలు, దట్టమైన పచ్చని వృక్షాల మధ్య ఓ సరస్సు. పచ్చదనం మధ్యలో ఉండడం వల్లనేమో నీరు కూడా పచ్చలరాశిని తలపిస్తుంది. పౌరాణిక కథల ప్రకారం సతీదేవి కన్ను పడిన ప్రదేశం ఇదని చెబుతారు. ఈ సరస్సు పరిసరాల్లో ఉండే భీమ్తాల్, సాత్తాల్, నౌకుచియాల్తాల్లకు కూడా పౌరాణిక కథనాలున్నాయి. మనదేశంలో హిల్ స్టేషన్లను ఎక్స్ప్లోర్ చేసింది బ్రిటిషర్లే. చల్లని ప్రదేశాలను వేసవి విడుదులుగా డెవలప్ చేశారు వాళ్లు. దాంతో ఇక్కడ బ్రిటిష్ బంగ్లాల మధ్య విహరిస్తుంటే యూరప్‌ను తలపిస్తుంది. నైనితాల్‌లో బోట్ షికార్‌తో΄పాటు యాచింగ్, పెడలింగ్ చేయవచ్చు. ఇంకా గుడారాల్లో క్యాంపింగ్, పర్వతాల మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, పారా గ్లైడింగ్ చేయవచ్చు. ఏ అడ్వెంచర్ చేసినా చేయకపోయినా కేబుల్ కార్ మాత్రం ఎక్కాల్సిందే. కేబుల్ కార్లో వెళ్తూ తెల్లటి మంచు శిఖరాలను పై నుంచి చూడవచ్చు. -
అల్లం టీ పెట్టిన సీఎం.. మురిసిపోయిన జనం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు సీఎం నిరాడంబరతను చాలామంది మెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన నైనిటాల్లో బస చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక పని ప్రజల దృష్టిని ఆకర్షించింది.ధామీ క్రమంతప్పక మార్నింగ్‌వాక్ చేస్తుంటారు. తాజాగా ఆయన మార్నింగ్ వాక్ సమయంలో రోడ్డు పక్కగా ఉన్న ఒక టీ దుకాణాన్ని గమనించారు. తరువాత అక్కడికి వెళ్లి, స్వయంగా అల్లాన్ని తరిగి టీ పెట్టారు. దీనిని గమనించిన అక్కడున్న వారంతా సీఎం చుట్టూ చేరారు. సీఎం వారిని కుశలప్రశ్నలు వేశారు. ఇంతటి సింప్లిసిటీ కలిగిన సీఎం దొరకడం తమకు లభించిన వరమని అంటూ అక్కడున్నవారంతా మురిసిపోయారు. అనంతరం సీఎం ఆ పక్కనే మైదానంలో ఆడుకుంటున్న క్రీడాకారులను పలుకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
‘నైనిటాల్’లో పెరిగిన రెడ్ పాండా జనాభా
ఉత్తరాఖండ్‌లో సరస్సుల నగరంగా నైనిటాల్ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు .. రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. నైనిటాల్ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. -
మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన మంచి మనసును చాటుకున్నాడు. షమీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. శనివారం అర్ధ రాత్రి షమీ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో తన ముందు వెళ్తున్న ఓ కారు కొండపై నుంచి కిందకి దూసుకు వెళ్లింది. ఈ క్రమంలో షమీ వెంటనే తన కారును ఆపి.. కొంతమంది సాయంతో కారులో నున్న వ్యక్తిని సకాలంలో బయటకు తీసి అతడికి రెండో జన్మను ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షమీ షేర్ చేశాడు. "అతను చాలా అదృష్టవంతుడు. దేవడు అతనికి రెండో జీవితాన్ని ఇచ్చాడు. నేను నైనిటాల్‌కు వెళ్తుండగా కొండ రహదారిపై నా ముందు వెళ్తున్న ఓ కారు లోయలో పడిపోయింది. వెంటనే నా కారుని ఆపి కొంత మంది సాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశాం అని ఆ వీడియాకు షమీ క్యాప్షన్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో షమీపై ప్రశంసల వర్షం కురిస్తోంది. నిజంగా నీవు చాలా గ్రేట్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్-2024కు రాజస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి..
MS Dhoni- Sakshi Dhoni: ‘హోదా’ కాస్త పెరగగానే అందుకు అనుగుణంగా ఆహార్యంతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకునే వారు ఎందరో ఉంటారు. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మాత్రం కొందరిలోనే ఉంటుంది. అలాంటి వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడు. భారత జట్టుకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథిగా జేజేలు అందుకున్న ధోని.. మైదానం వెలుపలా తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెలుచుకుంటూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. తన భార్యతో కలిసి ధోని బుధవారం ఉత్తరాఖండ్‌కు వెళ్లాడు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తమ పూర్వీకులు నివసించిన ఆల్మోరా గ్రామాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగాడు. వాళ్లతో ఫొటోలు దిగి సంతోషపరిచాడు. అంతేకాదు.. తనను ఆత్మీయంగా పలకరించిన మహిళ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అందుకే కదా ధోనిని అందరూ ఇంతలా ఇష్టపడేది’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ధోని ఉత్తరాఖండ్‌కు వెళ్లడం విశేషం. సతీమణి సాక్షితో కలిసి తొలుత ఆల్మోరా వెళ్లిన తలా.. గురువారం నైనిటాల్ వెళ్లి.. అక్కడి నుంచి తమ స్వగ్రామమైన లవాలికి చేరుకున్నాడు. ధోని తండ్రి రాంచికి రాగా చాలా ఏళ్ల తర్వాత.. అది కూడా టీమిండియా దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత ధోని వస్తుండటంతో అతడి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్తులు. ఆ తర్వాత పలు ఆలయాలు సందర్శించిన ధోని పూజలు చేశాడు. అనంతరం తమ కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకున్నాడు. కాగా 1970లలో ధోని తండ్రి పాన్ సింగ్ ఉద్యోగరీత్యా ఉత్తరాఖండ్ నుంచి రాంచికి వలస వచ్చాడు. అయితే, ధోని కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు మాత్రం అక్కడే హల్ద్వానిలో నివసిస్తున్నారు. చదవండి: CWC 2023: వచ్చాడయ్యో ‘షమీ’.. వారసత్వాన్నే నిలబెట్టంగా.. జట్టును ఫైనల్‌కు చేర్చంగా! Show me a more Humble Person than MS Dhoni, I will wait.🥺❤️pic.twitter.com/Z9IgbLz15C — DIPTI MSDIAN (@Diptiranjan_7) November 15, 2023 -
మరిన్ని ‘జోషి మఠ్’లు!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో ఇళ్లు పగుళ్లివ్వడానికి విపరీతమైన వర్షాల వల్ల భూమి క్రమక్షయం, నేల లోపలి భాగం గుల్లబారడం వంటివి కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘వీటితో పాటు ఇష్టారాజ్యంగా తవ్వకాలు, ఇళ్లతో పాటు డ్యాముల వంటి భారీ నిర్మాణాలు కూడా సమస్యకు కారణమే. అయితే భూమి లోపలి పొరల్లోని (టెక్టానిక్) కదలికలే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఇది వేగం పుంజుకుంది. దీన్ని అడ్డుకోవడం మన చేతుల్లో లేదు ’’ అని వారంటున్నారు. రాష్ట్రంలోని నైనిటాల్, ఉత్తరకాశి, చంపావత్ తదితర పట్టణాలకూ ఇలాంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని సున్నితం, బలహీనమైన నేల, దాని లోపలి పొరలతో ఎప్పటికైనా ప్రమాదమేనని చెబుతున్నారు. మరోవైపు, జోషి మఠ్‌ను కొండచరియలు విరిగిపడే ముప్పున్న ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా 60కి పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. మరో 90 కుటుంబాలను కూడా తరలించనున్నారు. కలెక్టర్ సారథ్యంలో ప్రభావిత ఇళ్ల పరిశీలన కొనసాగుతోంది. పట్టణంలోని 4,500 పై చిలుకు ఇళ్లలో 610 ఇళ్లు పగుళ్లిచ్చి నివాసానికి పనికిరాకుండా పోయినట్టు గఢ్వాల్ కమిషనర్ సుశీల్‌కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం పుష్కర్‌సింగ్ ధామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. ప్రధాని కార్యాలయం కూడా ఆదివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపింది. ప్రజల క్షేమమే తొలి ప్రాధాన్యమని ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఐటీ రూర్కీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. జోషి మఠ్ పరిస్థితిపై హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా అధ్యయనం చేయనున్నాయి. -
భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి
రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతం వద్ద ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణిస్తుండగా వారిలో ఓ బాలిక కూడా ఉంది. బాధితులంతా పంజాబ్‌కు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ధేలా నది ఉప్పొంగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ నీటి ప్రవాహం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని కుమావోన్ రేంజ్ డీఐజీ ఆనంద్ భరన్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఎర్టిగా కారు శుక్రవారం ఉదయం 5 గంటలకు కార్బెట్ వైపు వెళుతోంది. వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ధేలా గ్రామంలోని నది వంతెనపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు నీటిలో కొట్టుకుపోయింది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా నదిపై వంతెన నిర్మాణం లేకపోవడంతో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. చదవండి: రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి -
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్‌లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
ఒకేసారి 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
-
ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. 34 మంది మృత్యువాత
ఉత్తరాఖండ్ వర్షాలు అప్డేట్స్: ► రాష్ట్రంలోని భారీ వర్షాలతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరింది. మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల పరిహారం అందించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ► వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ధామి ఏరియల్ సర్వే చేపట్టారు. ► వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ 15 బృందాలను నియమించింది. ►వరద ప్రభావిత ఉత్తరాఖండ్‌లో భారత వైమానిక దళం రెస్క్యూ మిషన్‌ను నిర్వహిస్తోంది. ►నైనిటాల్ సరస్సు పొంగిపొర్లుతుంది. ఇప్పటి వరకు కనీసం 24 మంది చనిపోయారు., రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి #HADROps#Uttarakhandfloods #IAF has inducted 3 x Dhruv helicopters at Pantnagar for #floodrelief efforts. 25 people marooned at 3 locations near #Sunderkhal village were airlifted to safer areas by these helicopters.#HarKaamDeshKeNaam pic.twitter.com/i2aEm5LPqO — Indian Air Force (@IAF_MCC) October 19, 2021 డెహ్రాడూన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తుండగా, పలు ప్రాంతాల్లో ఇళ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడగా…వరద ఉద్ధృతికి ఇళ్లు, బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. కాగా గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఉత్తరాఖండ్ వర్షాలు: నైటిటాల్‌తో సంబంధాలు కట్ Uttarakhand CM Pushkar Singh Dhami undertook an aerial survey of flood-affected areas of Ramnagar, Bazpur, Kiccha, Sitarganj, this evening; Uttarakhand DGP Ashok Kumar also present. pic.twitter.com/TaOI4A9Xhj — ANI (@ANI) October 19, 2021 అయితే ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలతో 34 మంది మృత్యువాతపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల పరిహారం అందించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. మృతుల్లో నేపాల్‌కు చెందిన కూలీలు కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడడం వల్ల శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఇక చంపావత్‌లో ఓ ఇళ్లు కూలడం వల్ల మరో ఇద్దరు మృతిచెందారు. మూడు ఆర్మీ హెలీక్యాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. So far 34 deaths, 5 missing in #uttarakhandrains. Rs 4 lakh compensation to the families of the deceased, those who lost their houses will be given Rs 1.9 lakhs. Possible help to be extended to those who lost their livestock: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/J8RhIeC3Jx — ANI (@ANI) October 19, 2021 కాగా నైనిటాల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నైనిటాల్ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అధిక నీటి ప్రవాహంతో చల్తి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అదే విధంగా హల్ద్వానీలోని గౌలా నది ఉద్ధృతికి అక్కడి వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వంతెన మీదకు రావడాన్ని గమనించిన స్థానికులు, అధికారులు అతడిని హెచ్చరించడంతో వెనుదిరిగాడు. దీంతో ప్రమాదం తప్పింది. Scary situation .May God protect them #Uttarakhand #UttarakhandRain #Uttarakhandfloods pic.twitter.com/LVFzqciGh6 — Pamela Bhattacharya (@PamelaBhattac10) October 19, 2021 మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీ యువతులను సహాయ బృందాలు కాపాడాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సఫారీ కోసం వెళ్లిన సుష్మ, ఆమె స్నేహితులు వరదల్లో చిక్కుకుపోగా.. తమ పరిస్థితి గురించి తెలంగాణ సీఎంవో, కేంద్ర మంత్రులకు ట్వీట్ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన మంత్రి సహాయక చర్యలకు ఆదేశించారు. దీంతో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. అనంతరం వీరు తమ వాహనంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. Rail Tracks washed away in #Kathgodam due to Extremely Heavy Rainfall 🌧️🌧️🌧️🌧️#Haldwani #Nainital #Uttarakhand #uttarakhandrains #UttarakhandRain pic.twitter.com/3afy635ANt — Weatherman Shubham (@shubhamtorres09) October 19, 2021 కాగా, ఉత్తరాఖండ్ వర్షాలు, వదర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామి, కేంద్రమంత్రి అజయ్ భట్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. -
ఉత్తరాఖండ్ వర్షాలు: నైటిటాల్‌తో సంబంధాలు కట్
డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ వణికిపోతోంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న వరద బీభత్సానికి ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. నైనిటాల్, ఇతర ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుని పోయాయి. రైల్వే పట్టాలు, రహదారులు, వీధుల్లోకి వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కుండపోత వర్షాల కారణంగా నైటిటాల్‌తో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈ పర్యాటక ప్రాంతానికి వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. నైనీ సరస్సు పొంగిపొర్లుతున్న వీడియాలో సోషల్ మీడియాలో పోటెత్తాయి. నైనిటాల్ జిల్లాలోని రామ్‌గఢ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చని నైనిటాల్ ఎస్ఎస్పీ ప్రియదర్శిని మీడియాకు తెలిపారు. కోసి నది నుంచి వరద పోటెత్తడంతో రాంనగర్-రాణిఖేట్ మార్గంలో లెమన్ ట్రీ రిసార్ట్‌లో సుమారు 200 మంది చిక్కుకున్నారు. పోలీసుల సహాయంతో వీరిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు సైనిక హైలికాప్టర్ల సాయంతో వరద బాధితులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. (భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్) -
మహిళపై అత్యాచారం.. ఆపై వివాహం.. కొండపై తీసుకెళ్లి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహల కారణంగా కట్టుకున్న భార్యను హింసించి.. కొండపై నుంచి తోసేసి హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన ఉధామ్‌సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. కాగా, 24 ఏళ్ల రాజేష్‌రాయ్ అనే యువకుడు సెల్స్‌మెన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతడు, గతేడాది 29 ఏళ్ల బబిట అనే మహిళను అత్యాచారం చేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, బబిటా తనను వివాహం చేసుకుంటే.. ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని చెప్పింది. దీంతో, రాజేష్ రాయ్, బబిటను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు వీరి వివాహబంధం సాఫీగానే కొనసాగింది. కాగా, గత కొంత కాలంగా రాజేష్ రాయ్, బబిటను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈక్రమంలో, భర్త పోరు పడలేక బబిట ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో గత నెల జూన్ 11న రాయ్ పుట్టింటికి వెళ్లి తన భార్యను తెచ్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బబిట ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రాజేష్‌రాయ్‌ను బబిట గురించి ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి బంధువులు రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. రాజేష్ రాయ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో బబిటను నైనిటల్ కొండపై తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసినట్లు.. రాయ్ పోలీసుల విచారణంలో అంగీకరించాడు. కాగా, కొండ ప్రాంతంలో బాధిత మహిళ మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. -
చుక్కలు చూపిస్తున్న కరోనా.. అక్కడికి వెళ్లిపోయిన నటి
కరోనా వచ్చిన పేషెంట్ ఇంట్లో ఉంటే ఒక విడి గది ఇచ్చే వీలు లేని సామాన్యులు కోట్లాదిమంది ఉన్నారు. అదే సమయంలో కరోనా నుంచి రక్షించుకోవడానికి నగరాలకు దూరంగా వెళ్లే సెలబ్రిటీలు ఉన్నారు. కరోనా వార్తలు గత సంవత్సరం వచ్చిన వెంటనే నటి నీనా గుప్తా నైనిటాల్‌కు సమీపంగా ఉండే ముక్తేశ్వర్‌లోని తన విడిది గృహానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడే ఉండి తగ్గాక వచ్చింది. ఇప్పుడు మళ్లీ కరోనా ఉధృతం కాగానే ఆమె ముక్తేశ్వర్‌లో ప్రత్యక్షమయ్యారు. కరోనా సెకండ్ వేవ్ బాలీవుడ్‌కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా విలన్ అశుతోష్ రాణాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా ఎంతమందికి రానుందో తెలియదు. ముంబై ఏమాత్రం సేఫ్ కాదని తెలిసిన చాలామంది ఫామ్‌హౌస్‌ల బాట పట్టారు. నటుడు సల్మాన్ ఖాన్ గత సంవత్సరం నుంచి దాదాపుగా తన పాన్వెల్ ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి నటి నీనా గుప్తా కూడా గత సంవత్సరం ముక్తేశ్వర్ లో ఉన్న తన విడిదింటికి వెళ్లిపోయారు. అక్కడే ఏడెనిమిది నెలలు ఉన్నారు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చినా ప్రస్తుత పరిస్థితి దృష్టా మళ్లీ ముక్తేశ్వర్ చేరుకున్నారు. ముక్తేశ్వర్ నైనిటాల్‌కు సమీపంగా ఉండే గొప్ప టూరిస్ట్ స్పాట్. ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం. ‘ఇక్కడి ప్రజలు, వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉతికిన గుడ్డలను బయట ఆరవేయడం వారికి నచ్చదు. బట్టలు బాగా ఎండకు ఆరితే తప్ప నాకు అవి ఆరినట్టుగా అనిపించదు. అయినా బట్టలు ఉతికి ఆరేస్తేనే కదా అది ఇల్లు అనే భావన వస్తుంది’ అని నీనా గుప్తా ముక్తేశ్వర్‌లో తన విడిదింటి నుంచి తాజా వీడియోలో పేర్కొంది. నీనా గుప్తా కుమార్తె మసాబా ఫ్యాషన్ రంగంలో పని చేస్తోంది. తల్లీకూతుళ్లు కలిసి నటిస్తున్నారు కూడా. అయినా ఆ పనులకు బ్రేక్ ఇచ్చి సురక్షితంగా ఉండాలి అని నీనా భావిస్తున్నందుకు ఆమెను అభినందించాలి. ఆమె స్టే బాగా గడవాలని కోరుకుందాం. చదవండి: అమితాబ్‌కి భార్యగా..'నా కల నెరవేరింది' ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీనా గుప్తా -
హిమాలయాల్లో కింగ్ కోబ్రా.. అసాధారణ విషయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు మొట్టమొదటి సారి ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. హిమాలయాల్లో సుమారు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా సంచారాన్ని గుర్తించారు. మంచు వాతావరణంలో ఇంత ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో దీని గురించి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ అటవి శాఖ అధికారులు ఓ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం పాములు వంటి శీతల రక్త జీవులు టెరాయి ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో కనిపించగా.. కొండ ప్రాంతాల్లో 2400 మీటర్ల ఎత్తులో కనిపిస్తాయి. కానీ హిమాలయాల వంటి మంచు ప్రాంతంలో ఇంత ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారం కనిపించడం ఇదే ప్రథమం కాక అసాధరణ విషయం అని నివేదిక తెలిపింది. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరగాలని సూచించింది. (చదవండి: వైరల్: కింగ్ కోబ్రాతో ఆట అదుర్స్!) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌లో భాగంగా ఉత్తరాఖండ్ అటవిశాఖ అధికారులు నైనిటాల్ జిల్లాలోని ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు తొమ్మిది నెలల పాటు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వీరు అనేక చోట్ల కింగ్ కోబ్రా నివాసాలను గుర్తించారు. సాధారణంగా పాములు వంటి శీతర రక్తం కల జీవులు బయటి వేడి మీద ఆధారపడతాయి. ఈ క్రమంలో అవి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను తమ ఆవాసాలుగా చేసుకుంటాయి. ఈ సందర్భంగా సంజీవ్ చతుర్వేది అనే అధికారి మాట్లాడుతూ.. ‘ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా గూళ్లను(పుట్టలు) చూశాం. ఇంత ఎత్తులో మంచు ప్రాంతంలో ఇవి కనిపించడం నిజంగా రికార్డే. గతంలో డెహ్రాడూన్‌లో 2,303 మీటర్ల ఎత్తులో, సిక్కింలో 1088 మీటర్ల ఎత్తులో, మిజోరాంలో 1170 మీటర్ల ఎత్తులో.. నీలగిరిలో 1830 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించాము. ప్రస్తుతం నైనిటాల్లో గుర్తించిన కింగ్ కోబ్రా తన ఆవాసంగా పైన్ చెట్ల ఆకులను వినియోగించుకుంది. వీటికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మంటలు వ్యాపించడంలో ప్రతి ఏటా ఈ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి’ అన్నారు. (చదవండి: ‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’) సాధారణంగా కింగ్ కోబ్రాలు ఎక్కువగా పశ్చిమ, తూర్పు కనుమల ప్రాంతంలో, సుందర్బన్స్ మాంగ్రూవ్స్, ఒడిశాలో కనిపిస్తాయి. అయితే కోబ్రాలు ఏ వాతావరణంలో అయినా త్వరగా కలిసిపోతాయని.. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మార్చుకుంటాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులకు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం అంటున్నారు నిపుణులు. దీని కారణంగా చల్లని ప్రదేశాలు కూడా వేడిగా మారుతున్నాయని.. ఫలితంగా పాములు మంచు ప్రాంతాల్లో కూడా నివసించగల్గుతున్నాయన్నారు. అంతేకాక ఇంత ఎత్తు ప్రాంతంలో జనసంచారం పెరగడం.. ఫలితంగా చెత్తా చెదారం పెరుకుపోవడంతో ఎలుకలు ఇక్కడ ఉంటున్నాయని.. ఇవి పాములను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఏది ఏమైనా ఈ అరుదైన విషయంపై సమగ్ర శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు. -
భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!
నైనిటాల్: పాములను చూస్తే మీరు భయంతో వణికిపోతారా? అయితే ఉత్తరాఖండ్‌లోని ఒక ఇంటిలో పామును బంధిస్తున్న ఈ వీడియో కచ్చితంగా మిమ్మలి భయానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో నైనిటాల్‌లోని ఓ ఇంటి నుంచి అటవీ శాఖ రాపిడ్ రెస్పాన్స్ టీం విషపూరిత పామును ఎలా బంధించిందో ఉంది. ఒక భారీ పాము ఇంటిలోని టేబుల్ కింద దాక్కుంది. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు దానిని బంధించారు. ఈ క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఆకాష్ కుమార్ వర్మ ట్విట్టర్లో షేర్ చేశారు. పామును బంధించడానికి అటవీశాఖ సిబ్బంది ఒకరు టేబుల్ కిందకు వెళ్లాల్సి వస్తుంది. పామును పట్టుకొని దానిని ఇంటి టెర్రస్ పైకి తీసుకువచ్చి ఒక సంచిలో వుంచుతారు. ఒకానొక సమయంలో ఆ పాము అతడి మెడ చుట్టూ కూడా చుట్టుకుంటుంది. ఇది చాలా భయంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూస్తే ఒళ్లు జలదరిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, చాలా మంచి పని చేశారని మరో నెటిజన్ అటవీ శాఖ అధికారులను అభినందించాడు. పామును సంచిలో నుంచి బయటకు వదిలినప్పుడు అది అడవిలోకి వెళ్లడం కూడా చూపించారు. ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కంటే కింగ్ కోబ్రా చాలా విషపూరితమైనది. చదవండి: డేంజర్ గేమ్: 23వ అంతస్తు చివరి నుంచి.. A #King Cobra rescued by Forest Department's Rapid Response Team from a house at Nainital! 🎥DFO Nainital. @moefcc @ndtv @CentralIfs @AnimalsWorId @Uttkhand_Forest @nature @Discovery @MadrasCrocBank @REPTILESMag @mygovindia @MygovU @uttarakhandpost @ndtvindia @ZeeNews @dodo @IUCN pic.twitter.com/kXWameDNzf — Akash Kumar Verma, IFS. (@verma_akash) August 11, 2020 Release of the #King #Cobra in it's natural habitat. @moefcc @UttarakhandIFS @uttarakhandpost @CentralIfs @dodo @UNBiodiversity @MadrasCrocBank @REPTILESMag pic.twitter.com/kfmECfLLFT — Akash Kumar Verma, IFS. (@verma_akash) August 11, 2020 -
వడగళ్ల వాన.. అయితేంటి మందు ముఖ్యం
డెహ్రడూన్ : లాక్‌డౌన్‌ను మే 17వరకు పొడిగించిన నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతివ్వడంతో చాలా రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు పునః ప్రారంభమయ్యాయి. దీంతో వైన్ షాపుల మందుబాబులు క్యూ కట్టారు. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం విక్రయాలు జరగడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఎండ, వానకు భరిస్తూ క్యూలైన్లలో వేచి ఉన్నారు. (మందుబాబులకు షాక్.. ఒక్కొక్కరికి రెండు బాటిళ్లు మాత్రమే) తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో భారీ వడగళ్ల వర్షం పడుతున్నా లెక్కచేయకుండా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కిలోమీటర్ల మేర జనం మద్యం షాపు ముందు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి షేర్ చేస్తూ.. వీళ్లు నిజంగానే యోధులు. ఎంతో ఓపికగా కిలోమీటర్ల మేర నిల్చున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఇది అచ్చం అమితాబ్ బచ్చన్ నటించిన ఓ సినిమా సన్నివేశంలా ఉంది. అందులో తండ్రి చనిపోతే ఆయన్ను చూడటానికి వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఊరంతా కదిలింది అంటూ ఓ క్యాప్షన్‌ను జోడించారు. ఈ వీడియా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. Agnipath.. Agnipath.. Agnipath. Outside a liquor shop. Today. Via Whatsapp. pic.twitter.com/sul4F5uIBt — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 5, 2020 -
హనీమూన్ విషాదాంతం: ‘తమన్నా’ మృతి
భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన నూతన వధువు తమన్నా (25) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి చనిపోయిందని భర్త చెబుతుండగా, మృతురాలి బంధువులు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ సంఘటన అనంతరం తమన్నా భర్త పరారీలో ఉండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన తమన్నా, షాదాబ్ లకు గత ఏడాది నవంబర్‌లో వివాహం అయింది. ఈ నెలలో కొత్త జంట హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లింది. తాము ఇద్దరం సెల్పీ తీసుకుంటుండగా హఠాత్తుగా అక్కడ పాము కనిపించిందని, దీంతో భయపడిన తమన్నా అనుకోకుండా వెనక్కి జరుగుతూ.. సుమారు 250 అడుగుల లోయలోకి పడిపోయిందని, తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందనేది తమన్నా భర్త చెబుతున్నకథనం. క్యాడ్ డ్రైవర్ అందించిన సమాచారం ప్రకారం.... జనవరి 15న నైనిటాల్ సైట్ సీయింగ్ కోసం ఈ కొత్త జంట క్యాబ్ బుక్ చేసుకున్నారు. మధ్యలో తమన్నా కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో..దంపతులు ఇద్దరూ క్యాబ్ దిగి కొండవాలు వైపు నడుచుకుంటూ వెళ్లారని, ఇంతలో అరుపులు, ఏడుపులు వినడంతో తాను అక్కడకు చేరుకోగా.. పామును చూసి భయపడి తన భార్య లోయలో పడిపోయిందని షాదాబ్ చెప్పినట్లు తెలిపాడు. వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. తన సోదరిని కట్నం కోసమే షాబాద్ చంపేశాడని తమన్నా సోదరుడు అరిఫ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం తమన్నా మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినట్లు టైనిటాల్ పోలీసు స్టేషన్ అధికారి ప్రమోద్ పతక్ తెలిపారు. -
నైనిటాల్.. నయన మనోహరం!
వేసవి మొదలైందంటే చాలు.. మండే ఎండల నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు చల్లటి ప్రాంతాల సందర్శనకు టూర్లు ప్లాన్లు మొదలు పెడతారు. వాటిలో హిల్స్టేషన్లదే అగ్రస్థానం. అలాంటి వాటిలో ఉత్తరాంచల్‌లో ఉన్న అతి సుందర ప్రాంతం నైనిటాల్ ఒకటి. హిమాలయ ప్రాంతంలో అందమైన ప్రకృతి సోయగాలతో 12 చ.కిమీ విస్తీర్ణంలో 6000 అడుగల ఎత్తులో ఉన్న ఈ హిల్‌స్టేషన్ విశేషాల గురించి మనమూ తెలుసుకుందామా..! భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలిచే నైనిటాల్ హిమాలయ శ్రేణుల్లో ఉంది. కుమావోస్ హిల్స్ మధ్య భాగంలో అందమైన సరస్సులతో నిండి ఉంది. నైనిటాల్ను పూర్వం నైనితాల్ అని పిలిచేవారు. నైనీ అంటే నయనం, తాల్ అంటే సరస్సు అని అర్థం. ఇది ప్రసిద్ధ హిల్‌స్టేషన్ గానేకాక పుణ్యక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. పర్యాటక ఆకర్షణలు.. కిల్బరీ.. నైనిటాల్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న అందమైన పిక్నిక్ స్పాట్ ఇది. పచ్చని ఓక్, పైన్, రోడోడెండ్రాడ్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశంగా మార్చాయి. ఈ అడవుల్లో సుమారు 580 జాతులకు పైగా పలు రకాల వృక్ష జాతులు, రంగురంగుల పక్షులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2481 అడుగుల ఎత్తున ఉన్న లరికంత పర్యాటకులకు ఎన్నో అందమైన హిమాలయ దృశ్యాలను చూపుతుంది. ఇది నైనిటాల్లో రెండో ఎత్తై ప్రాంతం. నైనాదేవి ఆలయం.. నైనాదేవి ఆలయం ఒక శక్తి పీఠం. నైని సరస్సుకు ఉత్తర దిశగా ఉంది. ఈ గుడిలో హిందువుల దేవత నైనాదేవి కొలువై ఉంది. ఈమె విగ్రహంతో పాటు గణపతి, కాలి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న పెద్ద రావిచెట్టు ఎంతో పురాతనమైంది. చైనా శిఖరం.. నైనా శిఖరాన్నే చైనా శిఖరం అంటారు. ఇది నైనిటాల్లో ఎత్తై శిఖరం. సముద్ర మట్టానికి 2611 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని చేరుకోవాలంటే గుర్రంపై వెళ్లాలి. టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం. ఇక్కడ చాలా ఆహ్లాదంగా గడపొచ్చు. ఇక్కడే ఒక ఎకోకేవ్ గార్డెన్ కూడా ఉంది. రోప్.. నైనిటా రోప్ వే ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. దీన్ని కుమావొస్ మండల వికాస్ నిగం నిర్వహిస్తుంది. ఇది ఇండియాలో స్థాపించిన తొలి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీటర్ల ఎత్తులో కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 825 కిలోల బరువు మోయగలదు. ఈ రోప్ వే స్నోవ్యూను కలుపుతుంది. రోప్ వే సెకనుకు 6 మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో టూరిస్టులు అద్భుత దృశ్యాలు చూసేందుకు అవకాశం ఉంటుంది. నైనీ సరస్సు.. నైనిటాల్లో నైనీ సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలతో కన్ను ఆకారంతో ఉంటుంది. దీన్నే ‘ముగ్గురు రుషుల సరస్సు’ అని కూడా అంటారు. ఈ పేరు స్కందపురాణంలోని మానస్‌ఖండ్ అధ్యాయంలో ఉంది. ఈ సరస్సు చాలా పొడవైంది. దీని ఉత్తరపు కొనను ‘మల్లితాల్’ అని, దక్షిణపు కొనను ‘తల్లితాల్’ అనీ అంటారు. స్నో వ్యూ.. స్నో వ్యూ అనేది సముద్ర మట్టానికి 2270 మీటర్ల ఎత్తున ఉన్న ఒక సుందర ప్రదేశం. ఇది నైనిటాల్ సిటీకు 2.5 కి.మీల దూరంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు చేరుకోవాలంటే రోప్‌వే, వాహనాల ద్వారా ప్రయాణించొచ్చు. ఇది షేర్ క దండ అనే ఎత్తై చిన్న కొండపై ఉంది. గుహల తోట.. గుహలతోటను ఇకో గుహ గార్డెన్ అనికూడా పిలుస్తారు. ఈ గార్డెన్ పర్యావరణాన్ని ఆరాధించే వారికి ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ గుహలు పెట్రోమాక్స్ దీపాలతో ఒక మ్యూజికల్ ఫౌంటెన్‌తో ఉంటాయి. ఈ గుహలను టైగర్ కేవ్, పాంథర్ కేవ్, బాట్ కేవ్, స్క్విరాల్ కేవ్, ఫ్లై ఇంగ్ ఫాక్స్ కేవ్, ఏప్ కేవ్.. అని రకరకాల పేర్లతో పిలుస్తారు. హార్స్ రైడింగ్.. నైనిటాల్లో హార్స్‌రైడింగ్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వివిధ ప్రదేశాలను వీక్షించేందుకు గుర్రాలను రవాణాకు వినియోగిస్తారు. సిటీలో గుర్రపుస్వారీని నిషేధించినప్పటికీ బారాపత్తర్ వద్ద దీన్ని ఆనందించొచ్చు. గుర్రాల పేడ సరస్సును కలుషితం చేస్తోందన్న కారణంతో నగరంలో గుర్రాల వినియోగం నిషేధించారు. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్’ నైనిటాల్లో ప్రధాన ఆకర్షణ. ఈ సంస్థ మనోర శిఖరంపై నైనిటాల్‌కు 9 కి.మీ దూరంలో ఉంది. ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఈ సంస్థ ఆసక్తి కలవారికి ముందస్తు అనుమతులతో వారి టెలిస్కోప్‌లలో గ్రహాలు, నక్షత్రాలు పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సంస్థను 1955లో స్థాపించారు. చరిత్ర.. బ్రిటిష్ వ్యాపారి బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఇక్కడ ఒక బ్రిటిష్ కాలనీని స్థాపించి ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తర్వాత కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. దీని పూర్తి స్థాయి అభివృద్ధి మాత్రం 1841 తర్వాతే ప్రారంభమయింది. షాజాన్వూరుకు చెందిన ఒక చక్కెర వ్యాపారి భక్తుల వసతి గృహం స్థాపించడంతో ఇక్కడ తొలి నిర్మాణం ప్రారంభమయింది. 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ అర్టిల్లరీ నైనిటాల్ను సందర్శించాడు. తర్వాత యునెటైడ్ ప్రొవిన్స్ గవర్నర్‌కు వేసవి విడిదిగా మారింది. -
అడవి పందులను తరిమేస్తున్న హనీసింగ్!
నైనిటాల్: 'శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః' అంటారు. సంగీతానికి పశుపక్ష్యాదులు సైతం స్పందిస్తాయని వింటూనే ఉంటాం. అదే సంగీతంతో అడవిపందులను సైతం తరిమేయొచ్చా? అవునంటున్నారు రైతులు. ఉత్తరాఖండ్ రైతులకు అడవిపందుల బెడద ఎక్కువగా ఉంది. అవి తమ పంటలను సర్వనాశనం చేస్తుండటంతో వాటిని తరిమేయాలని రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అది సర్కారుకు తలకు మించిన భారం అవుతుంది. దీంతో అక్కడి రైతులు వినూత్నంగా ఆలోచించారు. తమ పొలాల వద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. వాటిలో పంజాబీ గాయకుడు యోయో హనీసింగ్ పాటలను ప్లే చేస్తున్నారు. అది కూడా భారీ శబ్దంతో.. ఈ ఐడియా బ్రహ్మాండంగా పనిచేసింది. దీంతో అడవి పందులతో పాటు ఇతర జంతువులు కూడా తమ పొలాల జోలికి రాకుండాపోయాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నైనిటాల్ జిల్లాలోని ధరి గ్రామానికి చెందిన రైతు బిషన్ జంత్వాల్ బంగాళాదుంపలు సాగుచేశాడు. అడవిపందుల బెడద నుంచి పంటను కాపాడుకోవడానికి వ్యవసాయ క్షేత్రం చుట్టూ స్పీకర్లను ఏర్పాటుచేసి మంచి ఫలితాలను పొందాడు. తర్వాత ఇదే విధానాన్ని ఆ ప్రాంతంలోని ఇతర రైతులు కూడా అనుసరిస్తున్నారు. -
వాళ్లు ఏదో చేస్తున్నారంటూ...దాడి
నైనిటాల్: అమ్మాయి-అబ్బాయి కలిసి తిరగటమే పెద్ద నేరంగా మారిపోతుంది. రోడ్డు మీద, రోడ్డు పక్క... చివరకు గుడికి వెళ్తేకూడా తప్పుగా భావిస్తున్నారు కొందరు వ్యక్తులు. వంకరగా ఆలోచించే వాడికి అన్నీ వంకర ఆలోచనలే అన్నట్లుగా వ్వవహరించారు ఉత్తరాఖండ్‌లోని కొందరు. నైనిటాల్ సమీపంలోని రాంనగర్‌కు చెందిన బావ-మరదలు.... నది ఒడ్డున వున్న గుడికి వెళ్లారు. అలా... పిల్ల గాలులు పీల్చుకునేందుకు వారిద్దరూ నది ఒడ్డున కూర్చున్నారు. దీంతో.. వాళ్లు ఏదో చేస్తున్నారంటూ... నది ఒడ్డున వున్నవాళ్లు భావించారు. వాళ్ల దగ్గరకు వచ్చి.. ఇక్కడేమి చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కనీసం వారిద్దరూ చెప్పేది కూడా వినకుండా... యువకుడితో గొడవకు దిగారు. ఆ తరువాత.. పిడిగుద్దులు గుద్దారు. అతను మా బావ అని యువతి చెబుతున్నా... పట్టించుకోలేదు ఆకతాయిలు. తన బావను.. ఏమీ అనవద్దని ఆమె బతిమాలినా...ఇదేమి పట్టించుకోని యువకులు.... ఇద్దరిని చితకబాదారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఓ దశలో ఆమెను అడవిలోకి లాక్కెళ్లటానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న ఇద్దరు... సమీపంలోని గర్జియా పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు. జరిగిన విషయం చెప్పటంతో పోలీసులు ఆకతాయిలను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. అయితే పోకిరీల దెబ్బలకు భయపడిన యువకుడు... ఘటన తరువాత కన్పించకుండా పోయాడు. -
నైనిటాల్ బస్సు ప్రమాదంలో 16 మంది మృతి
నైనిటాల్/లక్నో: ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక పెళ్లి బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 16 మంది మృత్యువాత పడ్డారు. కలదుంగి పట్టణ సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా బరపత్తర్ ప్రాంతంలో పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని చెప్పారు. ఇరుకైన రహదారిలో ఒక మలుపు దగ్గర డ్రైవర్ స్టీరింగ్‌పై అదుపు కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయింది. మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహ జిల్లా మెరాసరే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.