ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.
‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.
ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment