helicapter
-
ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. విధుల నిమిత్తం రాజీవ్ కుమార్‌తో పాటు ఉత్తరాఖండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయ్‌కుమార్ జోగ్దండ్లు హెలికాప్టర్లో మున్సియరికి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం మధ్యలో అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రయాణం గతితప్పింది. దీంతో పైలెట్ హెలికాప్టర్‌ను ఉత్తరఖండ్‌లోని మున్సియరీకి సమీపంలోని మారుమూల ప్రాంతమైన రాలంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.ఈ ఘటనలో ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఖుషీ చాలా స్మార్ట్ : క్యాబ్ ఖర్చుతోనే హెలికాప్టర్ రైడ్, వైరల్ స్టోరీ
న్యూయార్క్ సిటీలో ఇండో అమెరికన్ మహిళ చేసిన పని వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ సిటీ ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఉబెర్ ట్రిప్‌లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ఎంచుకుంది. ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే..క్లీనర్ పెర్కిన్స్‌లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్హాటన్ నుంmr క్వీన్స్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకు ఉబెర్‌లో వెళ్లాలని ప్రయత్నించింది. ఇందుకు పట్టే సమయం 60 నిమిషాలు చూపించింది. అమ్మో...అంత టైమా అనుకుని హెలికాప్టర్ రైడ్‌కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటిమధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది. ధరల స్క్రీన్షాట్లతో పాటు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది. ఎక్స్‌లో ఆమె షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ ఖర్చు రూ. 11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్ హెలికాప్టర్ రైడ్‌కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ. 13,765. అందుకే ఎచక్కా హెలికాప్టర్ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్ రైడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదన్నమాట ప్లాన్. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్ 17న షేర్ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ, హెలికాప్టర్ల సేవలందిస్తోంది. ప్రధానంగా మాన్హాటన్-జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంక మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా.. లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్ పోటీ!
ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ విమానాల తయారీకి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు సాగిస్తుంటే, స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక కంపెనీ ఏకంగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానానికి రూపకల్పన చేసింది.‘ఈవీటాల్’ పేరుతో రూపొందించిన ఈ బుల్లి విమానం పూర్తిగా ద్రవరూపంలో ఉన్న హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఇందులో పైలట్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు అనుగుణంగా సైరస్జెట్ అనే స్విస్ కంపెనీ దీనిని రూపొందించింది.ఇందులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే, 1850 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 520 కిలోమీటర్లు. ఈ విమానానికి పొడవాటి రన్‌వే కూడా అవసరం లేదు. హెలికాప్టర్ మాదిరిగా ఇది నిలువునా టేకాఫ్ చేసుకుని, ఆకాశంలోకి ఎగిరిపోగలదు. ఈ విమాన సేవలను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సైరస్జెట్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారు..ఇప్పటికే లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు బాగా వినియోగంలోకి వచ్చాయి. తాజాగా జపానీస్ కార్ల తయారీ కంపెనీ హోండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో పనిచేసే కారును రూపొందించింది.హోండా ‘సీఆర్–వీ ఈ:ఎఫ్‌సీఈవీ’ పేరుతో రూపొందించిన ఈ కారు నిరంతారయంగా 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. జనరల్ మోటార్స్ సహకారంతో హోండా కంపెనీ ఈ కారులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ను రూపొందించింది. 92.2 కిలోవాట్ల సామర్థ్యం గల ఈ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్ నుంచి ఇంజిన్‌కు 174 హార్స్ పవర్ విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే సహా పలు అధునాతన సాంకేతిక ఏర్పాట్లు చేయడం విశేషం. హోండా కంపెనీ వచ్చే ఏడాది దీనిని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.ఇవి చదవండి: ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
లైవ్ షాకింగ్ విజువల్స్.. !
-
‘హలో ఫ్రెండ్స్.. హెలికాప్టర్లో ఆరంజ్ పార్టీ’ ఇప్పుడేమంటారో..
పాట్నా: హెలికాప్టర్లో ‘ఫిష్ పార్టీ’ వీడియో వివాదం తర్వాత మరో వీడియోను షేర్ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. హెలికాప్టర్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సాహ్నితో కలిసి ఫిష్ పార్టీ వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా తేజస్వి యాదవ్ గురువారం మరో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వీరిద్దరూ బత్తాయి పండ్లను ఆస్వాదించడాన్ని చూడవచ్చు. "హలో ఫ్రెండ్స్, ఈ రోజు హెలికాప్టర్లో ఆరెంజ్ పార్టీ జరుగుతోంది. వారు (బీజేపీ నేతలు) ఆరెంజ్ రంగుపై వివాదం చేయరు కదా?" అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసుకొచ్చారు. ఇంతకు ముందు షేర్ చేసిన వీడియోలో తేజస్వి యాదవ్ చేపలు తింటూ కనిపించడంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నవరాత్రుల వేళ మాంసాహార భోజనమా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. హెలికాప్టర్ లోపల చిత్రీకరించిన ఈ వీడియోలో వీఐపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి తేజస్వి యాదవ్ భోజనం చేస్తూ కనిపించారు. బీజేపీ విమర్శలపై తేజస్వి యాదవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో నవరాత్రి ఉత్సవాలకు ముందు రికార్డ్ చేసిందని, తనను విమర్శించేవారికి "తక్కువ ఐక్యూ" ఉందని ఆరోపించారు. हैलो फ्रैंड्स, आज हेलीकॉप्टर में नारंगी पार्टी हुई। Orange के रंग से तो वो नहीं ना चिढ़ेंगे? #TejashwiYadav #Trending #Viral pic.twitter.com/FlhuyMhM6f — Tejashwi Yadav (@yadavtejashwi) April 10, 2024 -
ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్..
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దాంతో రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి వారికి ఇది చేదు వార్తే. ప్రచారాలకు వెళ్లే వారు చాలాసార్లు సమయాభావం కారణంగా హెలికాప్టర్లను వాడుతుంటారు. అయితే వాటి రేట్లు భారీగా పెరిగినట్లు తెలిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చార్టెర్డ్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ 40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా మారుమూల గ్రామాలకు కూడా తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఎక్కువగా హెలికాఫ్టర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే అగ్రిమెంట్లు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు గంటల ప్రాతిపదికన ఛార్జీలను లెక్కిస్తారు. చార్టర్డ్ విమానం కోసం గంటకు ధర రూ.4.5 లక్షలు నుంచి రూ.5.2 లక్షల మధ్య ఉన్నట్లు సమాచారం. ఇక హెలికాఫ్టర్‌కు సుమారు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ 2023 చివరి నాటికి 112 నాన్ షెడ్యూల్ ఆపరేటర్లు ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక డేటా ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి ఎన్నికల్లో చాపర్లతో సహా 450 విమానాలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎండీ కెప్టెన్ ఆర్కే బాలి తెలిపారు. సీటింగ్ కెపాసిటీ 3 నుంచి 37 వరకు ఉంటాయన్నారు. 10 కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన హెలికాప్టర్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. -
హారతి వేళ.. హెలికాప్టర్ నుంచి పూలవాన!
మరికొద్ది సేపట్లో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా రాములోరికి హారతులు పట్టే సమయాన ఆలయంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 30 మంది కళాకారులు తమ సంగీత ప్రతిభను చాటనున్నారు. హారతి సమయంలో అతిథులంతా గంటలు మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామాలయంలోనికి ప్రధాని నరేంద్ర మోదీ అడుగిడనున్నారు. ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగించనున్నారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం? -
బస్తర్‌లో 404 సార్లు చక్కర్లుకొట్టాయి!
సాక్షి, రాయ్‌పూర్: నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ నిజంగా కత్తిమీద సామే. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఎన్నికల సిబ్బందిని క్షేమంగా పోలింగ్ స్టేషన్లకు పంపించాలి. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎం యంత్రాలుసహా సిబ్బందిని తిరిగి సురక్షితంగా తీసుకురావాలి. నక్సల్స్ మందుపాతరలు, మెరుపుదాడులకు పేరుగాంచిన బస్తర్ జిల్లాలో సిబ్బంది తరలింపు సవాళ్లతో కూడుకున్నదే. అందుకే ఈసారీ రోడ్డు మార్గంలోకాకుండా వాయుమార్గంలో సిబ్బందిని తరలించి శెభాష్ అనిపించుకుంది భారత వాయుసేన. రాష్ట్రంలో తొలి దఫా ఎన్నికలు జరిగిన నవంబర్ 7వ తేదీన 20 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడం తెల్సిందే. ఈ నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లకు 860 మందికిపైగా సిబ్బందిని తరలించేందుకు వాయుసేన తన ఎంఐ–17 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఎనిమిది హెలీకాప్టర్లు ఆరు రోజులపాటు ఇలా ఎన్నికల సిబ్బంది తరలింపులో అవిశ్రాంతంగా పనిచేశాయి. ‘సిబ్బంది తరలింపు కోసం హెలికాప్టర్లు 404 సార్లు రాకపోకలు సాగించాయి. విధి నిర్వహణలో పోలింగ్ సిబ్బంది మాత్రమే కాదు వాయుసేన హెలికాప్టర్లు తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి’ అని ప్రశంసిస్తూ ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్, కాంకేర్, దంతేవాడ, నారాయణ్‌పూర్ జిల్లాలో 156 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించిన 860కిపైగా సిబ్బందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన హెలికాప్టర్లలోనే తరలించింది’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్రాజ్ చెప్పారు. హెలికాప్టర్లపైకీ నక్సల్ కాల్పులు! 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్బందిని తరలిస్తున్న హెలికాప్టర్లపైకీ నక్సల్స్ కాల్పులు జరిపారు. ఆనాడు బీజాపూర్ జిల్లాలోని పెడియా గ్రామంలో ఓటింగ్ యంత్రాలు, సిబ్బందితో వెళ్తున్న ఒక హెలికాప్టర్ పైకి నక్సల్స్ కాల్పులు జరపగా కాక్‌పిట్‌లోని ఫ్లైట్ ఇంజనీర్ సర్జెంట్ ముస్తఫా అలీ మరణించారు. వెంటనే అందులోని కెపె్టన్ స్క్వాడ్రాన్ లీడర్ టీకే చౌదరీ చాకచక్యంగా అది కూలిపోకుండా చూసి సురక్షితంగా జగ్దల్పూర్ పట్టణంలో ల్యాండ్చేశారు. -
మోగిన మూడవ ప్రపంచ యుద్ధ ఘంటికలు? 200 హెలికాప్టర్లతో ఇరాన్ యుద్ధ విన్యాసాలు!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా ఈ సమాచారాన్ని ప్రపంచం ముందు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య ప్రణాళికాబద్ధంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. ఎస్ఫహాన్‌లో రెండు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించారు. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఒకరు ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇరాన్‌కున్న శత్రువులను హెచ్చరించడమేనని అన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంలో హమాస్‌కు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఇరాన్ సైన్యం యుద్ధ విన్యాసాలు చేపట్టిన నేపధ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఒక ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ‘గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలను ఆపకపోతే, ఆ దేశం ఇతర కూటములతో కూడా కూడా పోరాడవలసిన దుస్థితికి చేరుకుంటుందని, అప్పుడు ఆ దేశం ఎదుర్కోబోయే పరిస్థితులను ఆపడం అసాధ్యమని హెచ్చరించారు. కాగా ఇరాన్ హెచ్చరికలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని విశ్లేషకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘కృత్రిమ మేథ’ పక్కదారి పడితే? ‘ఓపెన్ ఏఐ’ చేయబోతున్నదిదే... -
హెలికాఫ్టర్లతో మోరంచవాగులో రెస్క్యూ ఆపరేషన్
జయశంకర్ భూపాలపల్లి: చిట్యాల మండలంలోని నైన్పాక శివారు మోరంచవాగు బ్రిడ్జి నిర్మాణానికి కూలీలుగా పని చేస్తున్న ఆరుగురు కార్మికులు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి స్థానిక జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎస్సై రమేష్‌లు ఎమ్మెల్యే, కలెక్టర్లకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన వారు రెండు హెలికాప్టర్లను పంపించి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. వరదల్లో చిక్కుకున్న బీకే ఆరుంగ్, బీపిన్ అరుణ్, గానో, ఉత్తమ్, మున్న, రోహిత్‌లు అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన కార్మికులు బ్రిడ్జి పనులు చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. వారితోపాటు మరో 20 మంది కార్మికులు రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పడుకున్నారు. ఈక్రమంలో తెల్లవారు జామున ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కొంత మంది అప్రమత్తమై పరుగులు తీసుకుంటూ సురక్షితంగా బయటికి వచ్చారు. ఆరుగురు మాత్రం అక్కడే ఉండిపోయారు. దీంతో వరద పెరగడంతో జేసీబీపై కూర్కొని ఆర్తనాదాలు పెట్టారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. -
అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు
బిలియనీర్లు అనగానే సాధారణంగా టాటాలు, అంబానీ, అదానీలే గుర్తువస్తారు. వీరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త,భారతదేశపు అత్యంత సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన, దుబాయ్‌లోని నివసిస్తున్న రవి పిళ్లై కూడా ఒకరు. ఈ ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్లై(68) కు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. 100 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌బస్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన రికార్డు మాత్రం రవి పిళ్లై సొంతం. (ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త!) కేరళలోని కొల్లంకు చెందిన రవి పిళ్లై చాలా కష్టపడి బిలియనీర్‌గా ఎదిగిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన రవి పట్టుదలగా తన వ్యాపార సామ్రాజ్యాన్నిబిల్డ్ చేసుకున్నారు. లోప్రొఫైల్ మెంటైన్ చేసే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా పాపులర్. ప్రస్తుతం ఆఫ్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవోగా రవి పిళ్లై 2.8 బిలియన్ డాలర్ల (18,200 కోట్లు) సంపదతో అత్యంత సంపన్న కేరళీయులలో ఒకరు. 2022, జూన్‌లో అత్యాధునిక ఎయిర్‌బస్ H145 హెలికాప్టర్‌ను అప్పట్లోనే దీనివిలువ. రూ. 100 కోట్లు. ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు,మరో ఏడుగురు ప్రయాణించ వచ్చు. ఇది సముద్ర మట్టానికి 20వేల అడుగుల ఎత్తు నుంచి లాంచింగ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం దీని సొంతం. (టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు) రైతు కుటుంబ నేపథ్యం: లక్ష అప్పుతో మొదలై వ్యాపార సామ్రాజ్యం సెప్టెంబర్ 2, 1953లో జన్మించిన రవి పిళ్లై కొచ్చి విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని ఎక్సెల్సియర్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందాడు. లక్ష రూపాయల అప్పుతో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించించారు. 1978లో, రవి పిళ్లై సౌదీ అరేబియా వెళ్లి చమురు సంపన్న గల్ఫ్ దేశంలో తన నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ పేరే నాసర్ ఎస్. అల్ హజ్రీ కార్పొరేషన్ (NSH). కుమార్తె పెళ్లి ఒక విశేషం రవి పిళ్లైకి సంబంధించిన మరోవిషయం ఏమిటంటే నవంబర్ 26, 2015లో తన కుమార్తె వివాహానికి 42 దేశాల నుండి 30వేల గెస్ట్‌లను ఆహ్వానించారు. అనేక కంపెనీలు, సీఈవీలో,పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, మిడిల్ ఈస్టర్న్ రాజకుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అతిథులు హాజరుకావడంతో అపుడు విశేషంగా నిలిచింది. కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుతో తన కుమార్తె డాక్టర్ ఆరతి రవి పిళ్లై వివాహానికి రూ.55 కోట్లు ఖర్చు చేశారు. చిత్ర కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలోని 200 మంది నిపుణుల బృందం పెళ్లి మండపాన్ని రూపొందించారు. బాహుబలి సినిమా సెట్ కంటే వెడ్డింగ్ సెట్ చాలా గొప్పగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. రవి పిళ్లై కుమారుడు గణేష్ పిళ్లై వివాహం కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ 2010లో భారత ప్రభుత్వం విశిష్ట పురస్కారం పద్మశ్రీ ని అందుకున్నారు. 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ సత్కరాన్నిపొందారు. -
హెలిప్యాడ్‌ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా?
ఆకాశంలో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లను మనమంతా చూసేవుంటాం. విమానాలు ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే అవసరం అవుతుంది. హెలికాప్టర్లు ఎక్కడైనా ల్యాండ్ అవుతాయి.అయితే హెలికాప్టర్ ఆగేందుకు నిర్దేశిత ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.ఇది వృత్తాకారంలో కనిపిస్తుంది. దీనిలోపలనే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అయితే ఈ వృత్తాకారం లోపల ఇంగ్లీషు బాషలోని హెచ్ అక్షరం రాసివుంటుంది. ఇలా ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని అన్ని దేశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేప్రాంతంలో హెచ్ అని రాసివుంటుంది. హెలికాప్టర్లను వీవీఐపీలు వినియోగిస్తారనే సంగతి మనకు తెలిసిందే. హెలికాప్టర్ల వినియోగానికి సంబంధించి పలు దేశాల్లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ఒక్కోసారి హెలిప్యాడ్లను తయారు చేస్తుంటారు. దీనిలో రూపొందించే హెచ్ ఆకారం హెలికాప్టర్ నడిపే పైలెట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. దీని కారణంగానే హెలికాప్టర్ ముందుభాగం, వెనుకభాగం ఎటువైపు ఉంచాలనేది పైలెట్‌కు తెలుస్తుంది. దీనిని తగిన రీతిలో నిలిపివుంచడం వలన హెలికాప్టర్లో ప్రయాణించేవారికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. సాధారణంగా వీవీఐపీ కేటగిరీలోకి వచ్చేవారు ఎంతో బిజీగా ఉంటారు. వీరి సమయం వృథాకాకుండా ఉండేందుకు కూడా హెలిప్యాడ్ రూపకల్పన ఉపకరిస్తుంది. చదవండి: ‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే... -
క్రాష్ అయిన నావీ హెలికాప్టర్: వీడియో వైరల్
మెక్సికో సిటీ: మెక్సికోలో ఓ నావీ హెలికాప్టర్ కుప్పకూలింది. లాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. హారికెన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ హెలికాప్టర్లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని నావికాదళ అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి:VIRAL VIDEO: ఇదేం సరదా? ప్రాణాంతకంగా మారిన ఛాలెంజ్ -
ఇదీ రైతు పోరాటమే
‘ఎకార్డింగ్ టు ది గివెన్ సర్వే నెంబర్.. దీజ్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్స్ టు పటేదార్ యూ నో..’ అన్నాడు రెవిన్యూ ఆఫీసర్! అతడేమన్నాడో బసంతీబాయ్‌కి అర్థం కాలేదు. ‘ఈ పొలం నాది. పొలానికి వచ్చిపోయే దారులన్నీ పరమానంద్ పటేదార్, ఆయన కొడుకులు మూసేశారు. దారులు తెరిపించండి’ అని వేడుకుంది. ‘పొలం నీదైతే కావచ్చు. పొలానికి వెళ్లే ఏదారీ నీ దారి కాదు’ అన్నాడు ఆఫీసర్! పొలానికి దారి లేకుంటే బతికే దారీ లేనట్లే బసంతీబాయ్ కుటుంబానికి. పై అధికారులకు ఉత్తరం రాసింది. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కి లెటర్ పెట్టింది. ఆయన దగ్గర్నుంచీ ఎవరూ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించుకుంది. ఆ లేఖ చేరిందీ లేనిదీ తెలియదు. చివరికి రాష్ట్రపతి రామ్నా£Š కోవింద్‌కి లెటర్ రాసింది. ముందరి ఉత్తరాల్లో తన పొలానికి వెళ్లే దారులను తెరిపించండి అని రాసిన బసంతీబాయ్ రాష్ట్రపతికి రాసిన ఉత్తరంలో అలా రాయలేదు. ఎలా రాస్తే ఆయన తనను పట్టించుకుంటాడని అనుకుందో అలా రాసింది. ‘‘అయ్యా.. మా ఇంటికి కొద్ది రూరంలో ఉన్న నా పొలానికి రోజూ వెళ్లి రావడానికి నాకొక హెలికాప్టర్ అవసరం అయింది. హెలికాప్టర్‌ను కొనడానికి లోన్ మంజూరు చేయించండి. అలాగే హెలికాప్టర్ నడిపే లైసెన్స్ ఇప్పించండి’’ అని విన్నవించుకుంది. రాష్ట్రపతి నుంచి ఇంకా ఏమీ సమాధానం రాలేదు. వచ్చేవరకు ఆమె కుటుంబానికి పస్తులే. ఆ పొలమే ఆమె జీవనాధారం. ∙∙ షగర్ తాలూకాలోని అగర్ గ్రామ రైతు బసంతీబాయ్. మధ్యప్రదేశ్‌లోని మండ్సార్ జిల్లాలో ఉంది ఆ గ్రామం. అక్కడే ఓ రెండెకరాల పొలం ఉంది బసంతీబాయ్‌కి. అందులో పండించుకునే ధాన్యం, కూరగాయలే ఆ కుటుంబాన్ని నడుపుతున్నాయి. ఉదయం వెళ్లడం, పొలం పనులు చేసుకుని చీకటి పడే వేళకు ఇంటికి చేరడం. ఇంట్లోని పశువులు కూడా ఆమె చేతి పలుగు–పారల్లా ఆమె వెంటే పొలానికి వెళ్లివచ్చేవి. అకస్మాత్తుగా ఇప్పుడు పొలానికి దారి లేకుండా పోయింది! పొలం కన్నా దారే ఇప్పుడు ఆమె ప్రాణాధారం అన్నంతగా అయింది. ఆవుదూడ దగ్గరికి వెళ్లనివ్వకపోతే ఆవు ఎంత గింజుకుంటుందో.. ఆవులాంటి పొలం దగ్గరకి తనను వెళ్లనివ్వకుండా చేసినందుకు బసంతీ అంత విలవిల్లాడింది. పటేదార్, ఆయన కొడుకులు పొలానికి వెళ్లే దారులన్నీ మూసేశారు. అడిగితే, ఆ దారులు తమ పొలం లోనివి అన్నారు. ఆమెను అటుగా రానివ్వలేదు. తన పొలంలోకి తనను పోనివ్వడంలేదు. వాళ్లకేదో ఆలోచన ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. దారుల పేరు చెప్పి పొలాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసులకు కాళ్లరిగేలా తిరిగితే మనం గల్లీ నుంచి ఢిల్లీకి అంటుంటాం. అక్కడివాళ్లు ‘చౌపాల్ నుంచి భోపాల్’ అంటారు. అలా అన్ని ఆఫీసులకు, అందరు ఆఫీసర్ల దగ్గరకు తిరిగి, ఎవరికీ పట్టకపోవడంతోనే సీఎంకి, ప్రధానికి, రాష్ట్రపతికి ఉత్తరాలు రాసింది బసంతీబాయ్. రాష్ట్రపతికి ఆమె రాసిన ఉత్తరం వైరల్ అవుతోంది తప్పితే.. సహాయానికెవరూ రాలేదు. ఆమె సమస్యేమిటో వెళ్లి చూడమని జిల్లా కలెక్టర్ మనోన్ పుష్ప మహరాజ్ ఒక బృందాన్నయితే పంపారు కానీ, ఆ మహరాజ్ గారి టీమ్‌కు బసంతీరాయ్ బాధేమిటో అర్థం కాలేదు. ‘అంతా సవ్యంగానే ఉంది. దారులన్నీ తెరిచే ఉన్నాయి’ అని కలెక్టర్‌కి నివేదించారు! ఉన్నదారిని మూసేయడం ఏంటని వాళ్లు అడిగి ఉంటే బాధితురాలికి న్యాయం జరిగి ఉండేదేమో. పటేదార్ ఆ టీమ్ వచ్చినప్పుడు తెరిచి ఉంచిన దారిలో పొలానికి వెళ్లొళ్చి, ‘దారి తెరిచే ఉంది’ అని రిపోర్ట్ రాశారు. ఇక సమస్యేం కనిపిస్తుంది! ఈ లోకంలో ఒక చిన్న ప్రాణి బతకడానికి ఎన్ని పెద్ద జీవాలను ఎదుర్కోవాలో బసంతీబాయ్‌కి తెలియంది కాదు కానీ, రాష్ట్రపతి ఏమైనా చేస్తాడా అని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. రాష్ట్రపతికి రాసిన ఉత్తరాన్ని చూపుతున్న బసంతీబాయ్ -
ఈసీ సస్పెన్షన్ ఆర్డర్‌పై క్యాట్ స్టే
బెంగళూరు: ఒడిశాలో ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసినందుకు మహ్మద్ మొహ్సిన్ అనే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) గురువారం స్టే విధించింది. కర్ణాటక కేడర్‌కు చెందిన మొహ్సిన్ను ఒడిశాలో ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమించగా, ఆయన మోదీ హెలికాప్టర్‌ను సంబాల్పూర్లో తనిఖీ చేయడం, అది నిబంధనలకు విరుద్ధం అంటూ ఈసీ మొహ్సిన్‌పై సస్పెన్సన్ వేటు వేయడం తెలిసిందే. ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్లను తనిఖీ చేయకూడదని ఎన్నికల సంఘం పేర్కొనగా, అలాంటిదేమీ లేదని క్యాట్ తాజాగా వెల్లడించింది. విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. కాగా, ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను మాత్రం ఈసీ ఎత్తివేసింది. -
అగస్టా కేసులో ఈడీ మరో చార్జిషీటు
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్, తదితరులు రూ.300 కోట్ల మేర లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొంది. 3వేల పేజీల రెండో చార్జిషీటును గురువారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషీటులో మిషెల్ వ్యాపార భాగస్వామి డేవిడ్ సిమ్స్‌నూ చేర్చింది. వీరిద్దరూ గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్ ఎఫ్జెడ్ఈ అనే సంస్థలు నడుపుతున్నారు. భారత ప్రభుత్వం, ఇటలీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా మిషెల్, సిమ్స్ తదితరులు ఈ సొమ్మును పొందారని ఈడీ పేర్కొంది. ఆ రూ.300 కోట్ల సొమ్ము అగస్టా సంస్థే గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్‌లకు చెల్లించిందని ఆరోపించింది. ఈడీ తాజా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవాలో వద్దో ఈ నెల 6వ తేదీన ప్రకటిస్తానని స్పెషల్ జడ్జి తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి మిషెల్, ఇతర మధ్యవర్తులు రూ.225 కోట్ల మేర లబ్ధి పొందారని 2016లో న్యాయస్థానానికి సమర్పించిన మొదటి చార్జిషీటులో ఈడీ పేర్కొంది. -
ఎన్నికల వేళ హెలికాప్టర్లు, విమానాలకు భలే గిరాకీ
గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు రాజకీయ నాయకులు కార్లు, బస్సులు వాడేవారు. ఊళ్లలో అయితే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల వంటిని ఉపయోగించేవారు. ఇప్పుడంతా స్పీడ్.. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. దాంతో ప్రచారానికి హెలికాప్టర్లు, చిన్న విమానాలు వాడుతున్నారు. వీటి వల్ల ఖర్చు ఎక్కువైనా తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రాంతాలను చుట్టేయొచ్చు. రోడ్డు సౌకర్యం లేని శివారు ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రచారం చేయొచ్చు. ఈ ఉద్దేశంతోనే ప్రధాన పార్టీల నేతలంతా అందుబాటులో ఉన్న హెలికాప్టర్లు, చిన్న విమానాలను బుక్ చేసేసుకున్నారు.మే మూడో వారం వరకు.. దేశంలో ప్రస్తుతం 250 వరకు రిజిస్టరయిన హెలికాప్ట ర్లు ఉన్నాయని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా పశ్చిమ విభాగం అధ్యక్షుడు కెప్టెన్ ఉదయ్ గెల్లి చెబు తున్నారు. వీటిలో హెలికాప్టర్ కంపెనీల దగ్గర 75 వరకు ఉన్నాయి. అవన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. చిన్నపాటి విమానాల్లో ఒక ఇంజిన్, రెండు ఇంజిన్లు, అంతకంటే ఎక్కువ ఇంజిన్లు ఉన్నవి ఉన్నాయి. పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణించే కింగ్ఎయిర్ సీ90, ఇద్దరు పైలట్లు, 8 మంది ప్రయాణించగల కింగ్ ఎయిర్ బీ200 వంటి విమానాలు దేశంలో డజను వరకు ఉన్నాయని ముంబైకి చెందిన విమానయాన నిపుణుడు ప్రదీప్ చెప్పారు. వీటికిప్పుడు డిమాండు బాగా ఉందని, మే మూడో వారం వరకు ఇవన్నీ ముందే బుక్ అయిపోయాయని చెప్పారు. గంటల్లో కాంట్రాక్టు.. లక్షల్లో అద్దె దేశంలో అందుబాటులో ఉన్న హెలికాప్టర్లు, చిన్న విమానాల్లో 50 శాతం బీజేపీయే బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చాలా పార్టీలు 45–60 రోజుల కోసం వీటిని అద్దెకు తీసుకున్నాయని గెల్లి చెప్పారు. రకాన్ని బట్టి వీటి అద్దె గంటకు 75 వేల నుంచి మూడున్నర లక్షల వరకు ఉంటుంది. వీటిని రోజూ కనీసం 3 గంటల పాటు బుక్ చేసుకోవాలి. అన్ని గం టలు తిరిగినా తిరగకున్నా అద్దె మాత్రం చెల్లించాలి. గరిష్టంగా అరగంటలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలు హెలికాప్టర్లు, విమానాలను ఎన్నికల ప్రచారానికి వాడే విషయంలో ఎన్నికల సంఘం కొన్ని నిబంధన లు పెట్టింది. ప్రధాని మినహా మిగతా వారెవరూ ప్రభుత్వ హెలికాప్టర్/ విమానాలను వాడరా దు. హెలికాప్టర్ల అద్దె, రాకపోకల లెక్కలు పక్కా ఉండాలి. -
ప్రాణాలకు తెగించి పైలట్ సాహసం.. వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : మంచు పర్వాతాలు ఎక్కుతూ పర్వతారోహకులు, స్కీయింగ్ చేస్తూ సాహసికులు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవడం, వారిని ఎమర్జెన్సీ సర్వీసులకు చెందిన నిపుణులు హెలికాప్టర్లలో వెళ్లి రక్షించడం తెల్సిందే. మంచు పర్వతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వెళ్లే హెలికాప్టర్లు కూడా కొంత దూరం నుంచి తాళ్లతోని, ఇతరత్రా బాధితులకు కాపాడుతాయి. బాధితుల వద్దకు పూర్తిగా వెళ్లే అవకాశం వాటికి ఉండదు. ఎందుకంటే హెలికాప్టర్లు కూడా ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది కనుక. కానీ ఫ్రెంచ్ ఎమర్జెన్సీ సర్వీసుకు చెందిన ఓ హెలికాప్టర్ పైలట్ మాత్రం ప్రాణాలకు తెగించి సాహసించడమే కాకుండా అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి ప్రపంచ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. జనవరి రెండవ తేదీన ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ మంచు పర్వతాల్లో బ్రూనో తాజియట్ స్కీయింగ్ చేస్తుంటే అతని మొకాలి చిప్ప ‘డిస్లోకేట్’ అవడంతో అతను కుప్పకూలిపోయారు. ఇది గమనించిన అతని మిత్రుడు నికోలస్ డెరీలీ ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేయడంతో ఓ హెలికాప్టర్ వచ్చి వెయ్యి మీటర్ల ఎత్తులో చిక్కుకున్న బ్రూనోను రక్షించింది. రోడ్డుమీద గాయపడిన వ్యక్తి వద్దకు అంబులెన్స్ తీసుకొచ్చి ఆపినట్లుగా ఏటవాలుగా ఉన్న కొండ అంచుదాక హెలికాప్టర్‌ను తీసుకెళ్లి దాని ముక్కును మంచులోకి గుచ్చి నిశ్చలంగా హెలికాప్టర్ నిలబడేలా పైలట్ దాన్ని కంట్రోల్ చేస్తుండగా, బాధితుడిని మరొక మిత్రుడు హెలికాప్టర్లోకి ఎక్కించడం మనకు కనిపిస్తుంది. ఈ సాహసోపేత చర్యను తన సెల్‌ఫోన్ వీడియాలో బంధించిన మిత్రుడు నికోలస్ ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఏడున్నర లక్షల మంది దీన్ని వీక్షించారు. -
ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రిలో ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఓఎన్జీసీకి చెందిన హెలికాఫ్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణంతో ల్యాండింగ్ కష్టమై ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అయితే స్థానికంగా ఉన్న రావులపాలెం వద్ద పొలాల్లో హెలికాఫ్టర్‌ను ఫైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో హెలికాఫ్టర్‌లో ఉన్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం నుంచి రాజమండ్రిలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్టు చెట్లు, భారీ హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. మరోవైపు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. -
ఫడ్నవిస్‌కు ‘ఓవర్ లోడింగ్’ అంతరాయం
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ ప్రయాణానికి మరోసారి అంతరాయం కలిగింది. నాసిక్ నుంచి శనివారం ఆయన ఔరంగాబాద్‌కు హెలికాప్టర్లో వెళ్తుండగా పరిమితికి మించి మనుషులు ఎక్కడంతో టేకాఫ్ తీసుకోగానే మళ్లీ కిందకు తీసుకొచ్చి ఒకరిని దింపేశారు. హెలికాప్టర్‌ను ఎందుకు కిందకు దింపారో పోలీసులు చెప్పనప్పటికీ...ఒక మనిషిని, కొంత సామగ్రిని దించేయడాన్ని బట్టి చూస్తుంటే పరిమితికి మించిన బరువు హెలికాప్టర్లో ఉన్నందునే ఇలా జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ‘హెలికాప్టర్ నిర్దేశిత ఎత్తుకు ఎగరలేకపోవడంతో కొంత లగేజిని దించేశాం. సీఎం పర్యటనకు ఇబ్బంది లేదు’ అని ఒక అధికారి చెప్పారు.∙మే నెలలో రెండుసార్లు, జూలైలో ఒకసారి ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు వివిధ కారణాలతో స్వల్ప ప్రమాదాలకు గురైనా ఆయన క్షేమంగా బయటపడ్డారు . -
వావ్ వాట్ ఏ ఐఫోన్.. హెలికాప్టర్ నుంచి..
న్యూయార్క్ : ఐఫోన్ అంటేనే ఒక బ్రాండ్ అని విశ్వాసం. అది చేతిలో ఉంటే చాలు తమ స్టేటస్‌ను తెలుపుతుంది అని అనుకునే వాళ్లు చాలామంది. మార్కెట్లోకి ఎన్ని రకాల కంపెనీలకు చెందిన ఫోన్లు వచ్చినా ఒక్క ఐఫోన్ మీదనే మోజు ఉండటంలో ఏ మాత్రం తప్పులేదనిపించక తప్పదేమో ఈ వీడియో చూశాక. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 అడుగులో ఎత్తులో నుంచి పడిపోయినా ఐఫోన్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా అంత ఎత్తు నుంచి కింద పడిన తర్వాత కూడా అది చాలా బాగా పనిచేసింది. వివరాల్లోకి వెళితే.. హెలికాప్టర్లో 500 మీటర్ల ఎత్తులో నుంచి వెళుతున్న జాన్ అనే వ్యక్తి తన చుట్టు ఉన్న ప్రాంతాలను ఐఫోన్లో చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అయితే, అనుకోకుండా ఆ ఫోన్ పడిపోయింది. దీంతో అప్పటికప్పుడు విమానాన్ని కిందికి దించి దాదాపు గంటపాటు వెతికిన తర్వాత అతడికి దొరికింది. 'గంట సమయం తర్వాత నా ఐఫోన్ నాకు దొరికింది. అప్పటికీ నా ఫోన్ వీడియోను రికార్డు చేస్తూనే ఉంది' అని జాన్ చెప్పాడు. -
వావ్ వాట్ ఏ ఐఫోన్.. హెలికాప్టర్ నుంచి పడినా..
-
వావ్ ఫ్యాక్టర్: నో పైలట్
డ్రైవర్ల అవసరం లేని కార్లు చూశాం. డ్రైవర్ లేని బస్సులు.. లారీలూ వచ్చేశాయి. ఇక మిగిలింది గాల్లో ఎగిరే వాహనాలు. ఈ కొరతనూ తీర్చేస్తోంది ‘ఎయిర్‌బస్’ సంస్థ. ఎగిరే కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాగూ కొంత సమయం ఉందనుకుందో ఏమో.. ఈ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ వీఎస్ఆర్ 700 పేరుతో ఈమధ్యే ఓ అటానమస్.. అదేనండీ.. డ్రైవర్ల అవసరం లేని హెలికాప్టర్‌ను పరిచయం చేసింది. ఓ డమ్మీ పైలట్‌ను కూర్చోబెట్టి.. కేవలం సాఫ్ట్వేర్, కొంత హార్డ్‌వేర్ సాయంతో పైకి ఎగరడం మాత్రమే కాకుండా గాల్లోనే కొంతసేపు నిలకడగా ఉండేలా చేసింది.. ఆ తరువాత క్షేమంగా ల్యాండ్ చేసింది కూడా. ఫొటోలో చూపినట్లు ఉండే వీఎస్ఆర్ 700లో ఇద్దరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే 250 కిలోల బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. ఒకసారి గాల్లోకి ఎగిరితే పది గంటలపాటు ప్రయాణించేలా ఇంధన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దీన్ని మిలటరీ అవసరాలకు మాత్రమే వాడుకునే అవకాశముంది. ఇందుకు అనుగుణంగానే దీంట్లో బోలెడన్ని సెన్సర్లు, రాడార్లు ఏర్పాటు చేశారు. నేవీతోపాటు పదాతిదళంలోనూ శత్రు స్థావరాల సమాచార సేకరణకు, లక్ష్యాలను గుర్తించేందుకు దీన్ని వాడుకోవచ్చునని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రామగుండం ఎన్టీపీసీకి హెలికాప్టర్
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పర్మినెంట్ టౌన్షిప్ హెలిప్యాడ్‌కు శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్ చేరుకుంది. ఆదివారం తెలంగాణ స్టేజీ–1 శంకుస్థాపన జరగనున్న క్రమంలో సంస్థ అధికారిక హెలికాప్టర్‌ను రామగుండం తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ప్రాజెక్టు ఏరియాలో గణపతి హోమం అనంతరం అధికారులు గజ్వేల్ వెళ్లేందుకు హెలికాప్టర్ అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.