దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దాంతో రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి వారికి ఇది చేదు వార్తే. ప్రచారాలకు వెళ్లే వారు చాలాసార్లు సమయాభావం కారణంగా హెలికాప్టర్లను వాడుతుంటారు. అయితే వాటి రేట్లు భారీగా పెరిగినట్లు తెలిసింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చార్టెర్డ్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ 40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా మారుమూల గ్రామాలకు కూడా తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఎక్కువగా హెలికాఫ్టర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే అగ్రిమెంట్లు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.
హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు గంటల ప్రాతిపదికన ఛార్జీలను లెక్కిస్తారు. చార్టర్డ్ విమానం కోసం గంటకు ధర రూ.4.5 లక్షలు నుంచి రూ.5.2 లక్షల మధ్య ఉన్నట్లు సమాచారం. ఇక హెలికాఫ్టర్‌కు సుమారు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ 2023 చివరి నాటికి 112 నాన్ షెడ్యూల్ ఆపరేటర్లు ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక డేటా ద్వారా తెలిసింది.
ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి
ఎన్నికల్లో చాపర్లతో సహా 450 విమానాలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎండీ కెప్టెన్ ఆర్కే బాలి తెలిపారు. సీటింగ్ కెపాసిటీ 3 నుంచి 37 వరకు ఉంటాయన్నారు. 10 కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన హెలికాప్టర్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment