
ఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. విధుల నిమిత్తం రాజీవ్ కుమార్‌తో పాటు ఉత్తరాఖండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయ్‌కుమార్ జోగ్దండ్‌లు హెలికాప్టర్‌లో మున్సియరికి వెళ్లాల్సి ఉంది.
అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం మధ్యలో అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రయాణం గతితప్పింది. దీంతో పైలెట్ హెలికాప్టర్‌ను ఉత్తరఖండ్‌లోని మున్సియరీకి సమీపంలోని మారుమూల ప్రాంతమైన రాలంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటనలో ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment