2024 election economy
-
మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్ మీడియా సాయమెంత..?
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమవుతోంది. అన్ని రాజకీయపార్టీలు ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రచారసభలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నేరుగా ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు కొన్నిసార్లు ప్రతి ప్రచారకర్తకు వీలుకాకపోవచ్చు. కానీ ప్రస్తుతం అందరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్నారు. దాంతో పార్టీలు ప్రచార పంథాను మార్చుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు వీటినే ప్రచారసాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో ఇన్‌ఫ్లూయెన్సర్లదే కీలక పాత్ర. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా రూ.325 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.356 కోట్లు ఖర్చు చేసింది. కొవిడ్-19 పరిస్థితుల తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సంఖ్య పెరిగింది. వాళ్లకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలను పార్టీ అనుకూల ప్రచారానికి మాధ్యమాలుగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారం లేకుండా గెలిచే పరిస్థితి లేదని పార్టీలు గట్టిగా నమ్ముతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఓటర్లను నేరుగా కలవకుండా.. ఏఐ సాంకేతికతతో సంభాషించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది. -
ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్..
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దాంతో రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి వారికి ఇది చేదు వార్తే. ప్రచారాలకు వెళ్లే వారు చాలాసార్లు సమయాభావం కారణంగా హెలికాప్టర్లను వాడుతుంటారు. అయితే వాటి రేట్లు భారీగా పెరిగినట్లు తెలిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చార్టెర్డ్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ 40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా మారుమూల గ్రామాలకు కూడా తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఎక్కువగా హెలికాఫ్టర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే అగ్రిమెంట్లు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు గంటల ప్రాతిపదికన ఛార్జీలను లెక్కిస్తారు. చార్టర్డ్ విమానం కోసం గంటకు ధర రూ.4.5 లక్షలు నుంచి రూ.5.2 లక్షల మధ్య ఉన్నట్లు సమాచారం. ఇక హెలికాఫ్టర్‌కు సుమారు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ 2023 చివరి నాటికి 112 నాన్ షెడ్యూల్ ఆపరేటర్లు ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక డేటా ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి ఎన్నికల్లో చాపర్లతో సహా 450 విమానాలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎండీ కెప్టెన్ ఆర్కే బాలి తెలిపారు. సీటింగ్ కెపాసిటీ 3 నుంచి 37 వరకు ఉంటాయన్నారు. 10 కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన హెలికాప్టర్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. -
ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..?
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా రాబోయే బడ్జెట్లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని ఎగుమతిదారులతోపాటు భారతీయ పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని తెలిపాయి. ఎగుమతులకు అనుగుణంగా రవాణా ఖర్చులు పెరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో ఓ గ్లోబల్ షిప్పింగ్ లైన్‌నూ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ వర్గాలు సూచించాయి. దీనివల్ల భారతీయ సంస్థలకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు వ్యయభారం తగ్గనుందని చెప్పాయి. 2021లో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చార్జీలో భాగంగా 80 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించాల్సి వచ్చేదని, 2030 నాటికి ఇది 200 బిలియన్ డాలర్లను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. చైనా, అమెరికా, కొరియా, ఇజ్రాయెల్ దేశాల కంటే ఆర్అండ్డీపై భారత్ పెడుతున్న ఖర్చు చాలా తక్కువగా ఉందని, ఇది దేశ జీడీపీలో 1 శాతానికిలోపే ఉందని ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు ఇస్రార్ అహ్మద్ అన్నారు. ఇదీ చదవండి: ఇకపై మృదువైన రోబోలు.. అంతర్జాతీయ కస్టమర్లకు భారతీయ ఉత్పత్తులు మరింత చేరువయ్యేలా మార్కెటింగ్ సౌకర్యాలు కావాలని, మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) స్కీం కింద బడ్జెట్లో మరిన్ని నిధులను కేటాయించాలని అహ్మద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రూ.5,000 కోట్ల కార్పస్‌తో దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన ఓ పథకాన్ని ప్రకటించేందుకున్న వీలును పరిశీలించవచ్చని సలహా ఇచ్చారు.