మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్‌ మీడియా సాయమెంత..? | Social Media Influencers Play Big Role In Election Campaign | Sakshi
Sakshi News home page

మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్‌ మీడియా సాయమెంత..?

Published Thu, Mar 21 2024 3:21 PM | Last Updated on Thu, Mar 21 2024 4:40 PM

Social Media Influencers Play Big Role In Election Campaign - Sakshi

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమవుతోంది. అన్ని రాజకీయపార్టీలు ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రచారసభలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నేరుగా ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు కొన్నిసార్లు ప్రతి ప్రచారకర్తకు వీలుకాకపోవచ్చు. కానీ ప్రస్తుతం అందరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. అందులో సోషల్‌ మీడియా యాప్స్‌ వినియోగిస్తున్నారు. దాంతో పార్టీలు ప్రచార పంథాను మార్చుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు వీటినే ప్రచారసాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో ఇన్‌ఫ్లూయెన్సర్లదే కీలక పాత్ర. 

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం కోసం భాజపా రూ.325 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.356 కోట్లు ఖర్చు చేసింది. కొవిడ్‌-19 పరిస్థితుల తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల సంఖ్య పెరిగింది. వాళ్లకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలను పార్టీ అనుకూల ప్రచారానికి మాధ్యమాలుగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రచారం లేకుండా గెలిచే పరిస్థితి లేదని పార్టీలు గట్టిగా నమ్ముతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: వాట్సప్‌ స్టేటస్‌ పెడుతున్నారా..? అదిరిపోయే అప్‌డేట్‌ మీ కోసమే!

ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఓటర్లను నేరుగా కలవకుండా.. ఏఐ సాంకేతికతతో సంభాషించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement