
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా ఈ సమాచారాన్ని ప్రపంచం ముందు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య ప్రణాళికాబద్ధంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. ఎస్ఫహాన్‌లో రెండు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించారు.
ఇరాన్ ఆర్మీ కమాండర్ ఒకరు ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇరాన్‌కున్న శత్రువులను హెచ్చరించడమేనని అన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంలో హమాస్‌కు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది.
ఇరాన్ సైన్యం యుద్ధ విన్యాసాలు చేపట్టిన నేపధ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఒక ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ‘గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలను ఆపకపోతే, ఆ దేశం ఇతర కూటములతో కూడా కూడా పోరాడవలసిన దుస్థితికి చేరుకుంటుందని, అప్పుడు ఆ దేశం ఎదుర్కోబోయే పరిస్థితులను ఆపడం అసాధ్యమని హెచ్చరించారు. కాగా ఇరాన్ హెచ్చరికలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని విశ్లేషకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘కృత్రిమ మేథ’ పక్కదారి పడితే? ‘ఓపెన్ ఏఐ’ చేయబోతున్నదిదే...
Comments
Please login to add a commentAdd a comment