టెహ్రాన్: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆపకపోతే పశ్చిమాసియాలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్ మీదే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ఘాటుగా స్పందించారు.
'ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితిని నియంత్రించడానికి, యుద్ధం మరింత పెద్దగా మారబోదని చెప్పడానికి ఎవరూ హామీ ఇవ్వలేరు. యుద్ధం మరింత ఉదృతం కాకుండా నిరోధించడానికి ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులకు వ్యతిరేకంగా జరుగుతున్న అనాగరిక దాడులను నిరోధించాల్సిన అవసరం ఉంది.' అని హొస్సేన్ అమిరబ్డొల్లాహియా అన్నారు.
గాజాపై భూతల దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. హమాస్ ఉనికి లేకుండా చేస్తానని ఓ వైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇప్పటికే 700 మంది పిల్లలతో 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1400 మంది మరణించారు.
హమాస్ దాడులు వెనక తమ ప్రమేయం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. హమాస్ బృందాలకు ఆయుధ సరఫరా చేస్తున్నారని ఇరాన్‌ను ఇజ్రాయెల్ మొదటి నుంచీ నిందిస్తోంది.
ఇదీ చదవండి అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment