టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ‘ఇరాన్ ఏం చేయబోతోందో ఇజ్రాయెల్‌కు తెలియదు. తమ దేశంపై ఎక్కడ దాడి జరుగుతుందోనని వణుకుతోంది.
ఇప్పటికే ఇజ్రాయెల్‌లో చాలామంది షెల్టర్లలోకి పారిపోయారు. అసలైన యుద్ధం కంటే ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధమే వారిని మరింత భయపెడుతోంది’అని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు యాహ్యా రహీం సఫావీ పేర్కొన్నారు. మరోవైపు.. హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.
నౌకలో 17 మంది భారతీయులు ఉండడంతో వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి బదులు తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించినప్పటి నుంచి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఇదీ చదవండి..ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment