Iran Attacks Israel Live Updates
జెరూసలెం: పశ్చిమాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకు పడుతుంది. టెల్ అవీవ్,జెరుసలేంతో పాటు ఇతర నగరాల్లో భారీ విధ్వంసం సృష్టిస్తుంది. తొలిసారిగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌పై హైపర్‌సోనిక్ ఫట్టా క్షిపణులను ఉపయోగించాయి. దీంతో ఇజ్రాయెల్‌లో తాము చేసిన దాడులు 90 శాతం ఫలితాల్ని ఇచ్చినట్లు ఇరాన్ ఆర్మీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది
ఈ తరుణంలో తమ దేశంపై వైమానిక దాడులు చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇరాన్,హెజ్‌బొల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. దాడులు ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు.
‘ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇరాన్ పెద్ద ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందంటూ’ హెచ్చరించారు.
కమ్ముకున్న యుద్ధ మేఘాలు
ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత జులైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్పొరుషన్‌ను హతమార్చినందుకు ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది.
400 మిసైళ్లతో దాడి
జెరూసలెం, టెల్ అవీవ్ నగరాలపై ఏకకాలంలో 400 మిసైళ్లతో దాడులు చేసింది. ఇరాన్‌కు దన్నుగా హెజ్‌బొల్లా సైతం బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లోని పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశం మొత్తం సైరన్ మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది.
ఓవైపు ఇజ్రాయెల్‌పై వైమానికి దాడులకు పాల్పడుతూనే టెల్‌అవీవ్‌లో ఇరాన్.. ఉగ్రవాదుల్ని రంగంలోకి దించింది. టెల్‌అవీవ్‌లోని ఓ మెట్రో స్టేషన్‌లో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది.
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్‌అవీవ్‌లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
విమానాల రాకపోకలపై ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ ప్రభావం పడింది. ప్రపంచ దేశాలు పశ్చిమాసియా మీదిగా విమానాల రాకపోకలను రద్దు చేసుకున్నాయి.
👉ఇదీ చదవండి : టపాసుల్లా పేలిన హెజ్‌బొల్లా ఉగ్రవాదుల పేజర్లు
Comments
Please login to add a commentAdd a comment