బీరుట్: లెబనాన్ దేశంలో హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దాడి జరిగింది. ఒకే సమయంలో జరిగిన దాడిలో పేజర్లు వినియోగించే వెయ్యిమంది హిజ్బుల్లా ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి సైతం గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా తెలిపింది.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. నిత్యం క్షిపణులు, వందలాది డ్రోన్లతో బీభత్సం సృష్టించే ఇజ్రాయెల్ ఈసారి రూటు మార్చింది. టెక్నాలజీని ఉపయోగించి దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, ఇరాన్ మద్దతుగల లెబనాన్ దేశంలోని హిజ్బుల్లా ఉగ్రవాదుల వద్ద ఉన్న వేలాది కమ్యూనికేషన్ పరికరాలు (పేజర్లు) వరుసగా పేలాయి. ఈ పేలుళ్లలో ప్రజలు, వైద్యులు, వెయ్యి మందికి పైగా హిజ్బుల్లా సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు అతిపెద్ద భద్రతా ఉల్లంఘన గా హిజ్బుల్లా ప్రతినిధులు తెలిపారు.
లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో ప్రాథమికంగా పేలుళ్లు జరిగాయి. అలా పేలుళ్లు జరిగిన 30 నిమిషాల తర్వాత కూడా పేలుళ్లు తీవ్రత మరింత పెరిగిందని, గాయపడ్డ గాయపడ్డ క్షత గాత్రులకు తరలించేందుకు అంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కోసం పేజర్లు వినియోగిస్తుంటారు. ఆ పేజర్లతో బహిరంగ ప్రదేశాలకు వెళుతుంటారు. అలా వెళ్లిన హిజ్బుల్లా ఉగ్రవాదుల వద్ద ఉన్న వెయ్యికి పైగా పేజర్లు టపాసుల్లా పేలాయి. ఈ పేలుడు వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తమ హస్తం ఉందని ఇజ్రాయెల్ ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment