ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు | Israel strikes Iran military targets | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు

Published Sat, Oct 26 2024 7:18 AM | Last Updated on Sat, Oct 26 2024 10:41 AM

Israel strikes Iran military targets

జెరూసలేం: ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్‌ దళాలు   ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, సమీప స్థావరాలపై పలు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా వార్తలు వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి  తీవ్ర  ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని   ఇజ్రాయెల్‌  ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఎదురుదాడులతో విరుచుకుపడుతోంది.

‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ తరచూ దాడులకు దిగుతోంది.  ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించాం. ప్రస్తుతం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయి’’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

అక్టోబరు 1న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై పెద్దఎత్తున మిసైల్స్‌తో మెరుపుదాడికి దిగింగి. దాదాపు 200 మిసైల్స్‌ను ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై ప్రయోగియోగించింది. ఆరు నెలల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ రెండోసారి ప్రత్యక్ష దాడికి దిగింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా గ్రూప్‌ చెందిన కీలక నేతను  ఇజ్రాయెల్‌ అంతం చేయటంతో ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది.

అక్టోబరు 7, 2023న  పాలస్తీనాకు చెందిన హమాస్‌ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసి.. ఇజ్రయెల్‌పై పౌరులను గాజాకు బంధీగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి   హమాస్‌ను అంతం చేయటమే టార్గెట్‌గా  గాజాపై దాడులు చేస్తోంది. మరోవైపు.. గాజాపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్‌పై పోరులో హమాస్‌కు మద్దతుగా ఇరాన్, హెజ్‌బొల్లా గ్రూప్‌ చేరాయి.

దాడులపై స్పందించిన ఇరాన్‌
ఇజ్రాయల్‌ చేసిన దాడులపై ఇరాన్‌ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఇలామ్‌, ఖుజెస్తాన్‌, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్‌ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడుల కారణంగా పెద్దస్థాయిలో నష్టం జరగతేదు’’ అని ఓ ప్రకటనలో  పేర్కొంది.

చదవండి: సంధి దిశగా ఇజ్రాయెల్‌, హమాస్‌.. యుద్ధానికి ముగిసినట్టేనా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement