palastina
-
హమాస్, గాజాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు.పాలస్తీనాకు చెందిన గాజాపై డొనాల్డ్ ట్రంప్ తన మనసులోకి మాటను బయట పెట్టారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్ నిర్మించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇందు కోసం గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇతరులకు కూడా అప్పగించవచ్చు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై గాజా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతకుముందు కూడా గాజాపై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశ్చిమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గుటేరస్ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’ అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు. -
గాజాపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు.. ట్రంప్‌కు ఝలక్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాలస్తీనాలోని గాజాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందనే వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఇక, తాజాగా గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. దీంతో, ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.గాజాగా విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ స్పందించారు. ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా గుటేరస్..‘పాలస్తీనా ప్రజలకు వారి సొంత భూమిలో మనుషులుగా జీవించే హక్కు ఉంది. ఐక్యరాజ్యసమితి.. అక్కడ శాంతి, స్థిరత్వం మరియు పాలస్తీనా ప్రజల విడదీయరాని హక్కులకు పూర్తిగా కట్టుబడి ఉంది. గాజాపై పరిష్కారాల అన్వేషణలో, మనం సమస్యను మరింత దిగజార్చకూడదు. అంతర్జాతీయ చట్టం పునాదికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఏ రూపంలోనైనా జాతి ప్రక్షాళనను నివారించడం చాలా అవసరం. గాజా ప్రజలపై భయంకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగించారు. ఇప్పటికైనా పాలస్తీనియన్లకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. The Palestinian people have the right to simply live as human beings in their own land.The @UN is fully committed to peace, stability, and the inalienable rights of the Palestinian people.— António Guterres (@antonioguterres) February 5, 2025మరోవైపు.. గాజా ప్రాంతంలో తమ దేశ సైన్యాన్ని మోహరించడానికి ట్రంప్ సిద్దంగా లేరని వైట్ హౌస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. గాజా పునర్ నిర్మాణంలో అమెరికా భాగస్వామ్యం అవసరమని ట్రంప్ విశ్వస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. In the search for solutions on Gaza, we must not make the problem worse.It is vital to stay true to the bedrock of international law.It is essential to avoid any form of ethnic cleansing.— António Guterres (@antonioguterres) February 5, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు, సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు. -
నెతన్యాహు.. ఇదేం కిరికిరి : హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా బందీల విడుదలను ఆలస్యం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. మా బందీలు సురక్షితంగా విడిచి పెట్టే వరకు.. పాలస్తీనా బందీలను విడుదల చేయడంలో ఆలస్యం చేయాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌తో పాటు ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు’ అని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.ఫలితంగా,హమాస్ చరనుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు సురక్షితంగా విడుదలవ్వగా.. 110 మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ తమ అదుపులోనే ఉంచుకుంది. దీంతో చేసేది లేక 110 మంది బందీల విడుదలలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా హమాస్ మధ్యవర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్
టెల్అవీవ్:కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ , అటు హమాస్ ఒప్పందం అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పదంలో భాగంగా ఇజ్రాయెల్ తాజాగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో నుంచి ముగ్గురిని విడుదల చేసింది.అనంతరం ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం అమల్లోకి వచ్చింది.ఆరు వారాల్లో హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వంలో భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి ఆ పార్టీ వైదొలగింది. పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.2023 అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1200 మందిని చంపారు.కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 47 వేల మంది దాకా మరణించినట్లు సమాచారం. తాజా కాల్పుల విరమణతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలున్నాయి. -
ఓస్లో ఒప్పందం – వాస్తవాలు
ఇజ్రాయెల్, పాలస్తీనాలు ‘రెండు దేశాలుగా బతకడమే దారి’ అనే శీర్షికతో వ్యాసం రాసిన (అక్టోబర్ 23న) ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ కొన్ని వాస్తవాలను విస్మరించారు లేదా తప్పుగా పేర్కొన్నారు. రెండు స్వతంత్ర దేశాలను ప్రతిపాదించిన 1993 నాటి నార్వే (ఓస్లో) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి సంతకం చేయగా అందుకు హమాస్, ఇరాన్ నిరాకరిస్తున్నాయన్నారు. ఆ ఒప్పందం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) అధ్యక్షునిగా యాసిర్ అరాఫాత్కు, ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్‌కు మధ్య జరిగింది.తర్వాత అరాఫాత్ 2004లో మరణించే వరకు 11 ఏళ్లపాటు అది అమలు కాకపోవటానికి కారణం ఎవరు? ఓస్లో ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలూ మొదటిసారిగా పరస్పరం గుర్తించుకున్నాయి. కానీ అది ఆ కాలంలో గానీ, ఈరోజుకు గానీ అమలు కాకపోవటానికి బాధ్యత పూర్తిగా ఇజ్రాయెల్దేనని... స్వయంగా ఆ చర్చలకు సాక్షి అయిన ఆరన్ డేవిడ్ మిల్లర్ అనే అమెరికాకు చెందిన అగ్రస్థాయి నిపుణుడు, అమెరికా నుంచే వెలువడే ‘ఫారిన్ పాలసీ’ అనే సుప్రసిద్ధ జర్నల్‌లో ఇటీవలే రాశాడు. అంతేకాదు, ఆ ఒప్పందంలో అసలు ‘పాలస్తీనా దేశం’ అన్న మాటే లేదని వెల్లడిస్తూ, 1993 నుంచి ఆ మాత్రపు ఒప్పందాన్ని అయినా ఇజ్రాయెల్ ఎట్లా ఉల్లంఘిస్తూ వస్తున్నదో వర్ణించి చెప్పాడు.వ్యాస రచయిత ప్రస్తావించిన వాటిలో మరొకటి మాత్రం చూద్దాము. అరాఫాత్ మరణం తర్వాత పీఎల్ఓ లేదా ఫతా పార్టీ నాయకత్వం పాలస్తీనా అథారిటీ (పీఏ) పేరిట పాలిస్తూ పూర్తి నిష్క్రియాపరంగా, అవినీతిమయంగా మారినందు వల్లనే, అంత వరకు కేవలం నామమాత్రంగా ఉండిన హమాస్, బాగా బలం పుంజుకుని 2006 నాటి ఎన్నికలలో గెలిచి 2007లో అధికారా నికి వచ్చింది. ఆ పరిణామం ప్రజాస్వామిక ఎన్నికలలో జరిగిందే తప్ప బలప్రయోగంతో కాదు. ఇక ఇజ్రాయెల్ 1947 నుంచి మొదలు కొని ఈ 77 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయ స్థానంతో పాటు అనేకానేక ఇతర ప్రపంచ సంస్థలను, ప్రపంచాభిప్రాయాన్ని ధిక్కరిస్తూ ఈరోజున గాజాలో, వెస్ట్ బ్యాంక్‌లో ఏ వ్యూహాన్ని అమలు చేసి అసలు పాలస్తీనా అన్నదే లేకుండా చేయ జూస్తున్నదో కనిపిస్తున్నదే.– టంకశాల అశోక్సీనియర్ సంపాదకుడు, హైదరాబాద్ -
USA: ‘అతివాదం’తో తలనొప్పులు.. హక్కుల కార్యకర్త అరెస్టు
కాలిఫోర్నియా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చిధ్రమవుతున్న గాజా పరిస్థితి మానవతావాదుల హృదయాలను ద్రవింపజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హక్కుల కార్యకర్తలు పాలస్తీనాకు మద్దతుగా తమ గళం విప్పుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా బేకర్స్ఫీల్డ్ నగర కౌన్సిల్లో హక్కుల కార్యకర్త రిద్ది పటేల్ పాలస్తీనాకు మద్దతుగా గొంతు వినపించారు. అయితే గీత దాటి అతివాదం వైపు వెళ్లి కష్టాలు కొనితెచ్చుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై హియరింగ్ సందర్భంగా ఓపిక నశించిన రిద్ది ఏకంగా మేయర్, కౌన్సిల్ సభ్యులనే బెదిరించారు. ‘ఏదో ఒక రోజు మీ ఇంట్లోనే మిమ్మల్ని చంపే పరిస్థితి వస్తుంది’ అని వారిని హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తీర్మానానికి ఎవరూ మద్దతు పలకకపోవడం..తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుండడంతో నిరాశ నిస్పృహలకు లోనైన రిద్ది పటేల్ తనలోని అతివాది బయటికి తీశారు. కౌన్సిల్ సభ్యులను బెదిరించినందుకుగాను రిద్దిపై 16 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పటేల్ తీరును హిందూ అమెరికన్ ఫౌండేషన్లు ఖండించాయి. బెదిరింపుల సందర్భంగా మహాత్మాగాంధీ పేరతో పాటు చైత్ర నవరాత్రిలను రిద్ది ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎంతటి తీవ్రత కలిగిన అంశంపై పోరాడాల్సిన సందర్భంలోనైనా హక్కుల కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాల్సిందేనని రిద్ది పటేల్ ఎదుర్కొంటున్న పరిణామాలే తెలియజేస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి.. సౌదీ జైలులో భారతీయుడు -
గాజాలో దారుణం: తిండి కోసం ఎదురు చూస్తున్న వారిపై పడ్డ పారాచూట్
గాజా: ఇజ్రాయెల్‌తో యుద్ధంలో చిధ్రమైన గాజాలో తిండికోసం ఎదురు చూస్తున్న శరణార్థులపై మరో దారుణం జరిగింది. విమానం నుంచి జారవిడిచిన ఆహారపొట్లాలతో కూడిన పారాచూట్ తెరచుకోకపోవడంతో ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తున్న శరణార్థులపై భారీ పార్సిళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా 10 మంది దాకా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆల్షిఫా ఆస్పత్రికి తరలించారు. అయితే పారాచూట్ జారవిడిచింది తాము కాదని విమానాల ద్వారా గాజాలో ఆహార పొట్లాలు జార విడుస్తున్న జోర్డాన్, అమెరికాలు స్పష్టం చేశాయి. ఈజిప్ట్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా చేపట్టిన సాయంలో భాగంగానే ఈ ప్రమాదం జరిగనట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై గాజా ప్రభుత్వం స్పందించింది. విమానాల ద్వారా ఆహారపొట్లాలు జారవిడవడం కేవలం ప్రచార ఆర్భాటం కోసం తప్ప ఎందుకు పనికిరాని ప్రయత్నమని మండిపడింది. గాజాలో పౌరుల ప్రాణాలకు ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఇదివరకే హెచ్చరించినట్లు తెలిపింది. ఇప్పుడు పారాచూట్‌లోని భారీ పార్సిళ్లు పడి ఐదుగురు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం నుంచి జారవిడవడం కంటే రోడ్డు మార్గం ద్వారా గాజాకు ఆహారం పంపేందుకు మరిన్ని ట్రక్కులను అక్కడికి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితి ఇప్పటికే కోరింది. పది రోజుల క్రితమే ఆకలితో అలమటిస్తూ ఆహారపొట్లాల కోసం ఎగబడ్డ గాజా వాసులపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో వందల మంది మరణించడం అందరి హృదయాలతను ద్రవింపజేసింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ దాడి చేసి వందల మందిని చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాలస్తీనాలోని గాజా, ఇతర ప్రాంతాలపై ఇజ్రాయెల్‌పై భీకరదాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో గాజా మొత్తం ధ్వంసమై అక్కడి ప్రజలు చెల్లాచెదురై ఇళ్లు కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఇదీ చదవండి.. నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్ -
గాజా ఘోరం: ఇజ్రాయెల్ కీలక ప్రకటన
జెరూసలెం: గాజాలో ఆహారం కోసం ఎగబడిన సమయంలో జరిగిన కాల్పుల్లో 104 మంది మృతి చెందిన ఘటనపై ఇజ్రాయెల్ స్పందించిది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం అర్ధరాత్రి ఒక ప్రకటన చేసింది. పశ్చిమ గాజాలోని అల్ నబుసి ప్రాంతానికి ఆహారం పంచడానికి ట్రక్కులు వచ్చినప్పుడు అక్కడి జనం ఒక్కసారిగా ఎగబడ్డారని తెలిపింది. ఆహారం తీసుకువచ్చిన ట్రక్కుల కింద పడి నలిగిపోవడంతో పాటు తొక్కిసలాట కారణంగానే ఈ ఘటనలో ఎక్కువ మంది మరణించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విటర్)లో వీడియోలు విడుదల చేసింది. ‘ సాయం చేసే ట్రక్కులు రాగానే వాటిపై ఒక్కసారిగా వందల మంది ఎగబడ్డారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు వాహనాలను జనం మీదకు ఎక్కించారు. ఈ కారణంగా పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోయారు’అని ఇజ్రాయెల్ తెలిపింది. “We recognize the suffering of the innocent people of Gaza. This is why we are seeking ways to expand our humanitarian efforts.” Watch the full statement by IDF Spokesperson RAdm. Daniel Hagari on the incident regarding the humanitarian aid convoy the IDF facilitated. pic.twitter.com/m6Pve3Odqw — Israel Defense Forces (@IDF) February 29, 2024 అయితే ఆహారం కోసం ఎగబడ్డ సమయంలో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడం వల్లే 104 మంది మృత్యువాత పడ్డారని వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కాల్పులను పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఖండించారు. ఇదొక భయంకరమైన ఊచకోత అని ఆయన అభివర్ణించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజాపై బాంబులతో విరుచుకుపడటమే కాక గాజాను దాదాపు ఆక్రమించింది. ఇదీ చదవండి.. గాజాలో ఘోరం -
పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో నిరసన
ఇటలీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అభరణాల ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఇజ్రాయెల్ ఎగ్జిబిటర్లకు నిరసన సెగ తగిలింది. ఇజ్రాయెల్ వ్యతిరేక వాదులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇటలీలోని విసెంజాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ దిగారు. స్మోక్ బాంబులు అంటించి గందరగోళం సృష్టించారు. పోలీసులు నిరసనకారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ‘పాలస్తీనాను వదిలేయండి.. గాజాపై బాంబుల దాడి ఆపేయండి’ అని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 40 దేశాల నుంచి సుమారు1300 మంది ఎగ్జిబీటర్లు విసెంజాలో జరుగుతున్న అభరణాల ప్రదర్శన వచ్చారని ఎగ్జిబిషన్ నిర్వాకులు తెలిపారు. నిరసన కూడా ఎగ్జిబిషన్‌కు చాలా దూరంలో జరిగిందని.. నిరసన ప్రభావం ఎగ్జిబిషన్‌పై పడలేదని అన్నారు. ఎగ్జిబిషన్లో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎగ్జిబిటర్లు ఉన్నారా అన్న విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. 🚨 ITALY TODAY: Pro-Hamas Protestors & Police Clash🚨 ⚠️ WATCH: Don’t miss the ending! Violence erupts at an anti-Israel protest during Italy’s jewelry fair. Pro-Hamas demonstrators face a harsh reality check in the streets. 👍 Like and share if Italy’s approach inspires you… pic.twitter.com/jdxP4iS2HB — Shirion Collective (@ShirionOrg) January 20, 2024 ఈ నిరసనలను విసెంజా మేయర్ గియాకోమో పోస్సామై తీవ్రంగా ఖండించారు. హింస చెలరేగే విధంగా నిరసన తెలపటాన్ని పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లుగా సమర్థించలేమన్నారు. శాంతి, కాల్పుల విరమణ కోసం నిరసనల ద్వారా హింసను ప్రేరేపించటం సరి కాదన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న చేసిన మెరుపుదాడుల్లో 1140 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇంకా 132 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్నారు. అక్టోబర్ 7 అనంతరం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బీకరంగా దాడుల ప్రారంభించింది. ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో 24,973 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు. చదవండి: Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి -
జో బైడెన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హమాస్
Israel-Hamas War: హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తునే ఉంది. గాజాపై దాడులును నిలిపివేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహును కోరిన విషయం తెలిసిందే. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫొన్లో మాట్లాడారు. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ సంభాషణ అనంతరం నెతాన్యహు పాలస్తీనాను స్వంతత్ర దేశంగా అంగీకరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఇజ్జత్ అల్-రిష్క్ స్పందించారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయల్ ప్రధానిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్జత్ తోసిపుచ్చారు. గాజాలో జరుగుతున్న మారణహోమం వెనుక ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందని మండిపడ్డారు. ఇక పాలస్తీనా ప్రజలకు ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన బైడెన్‌పై సదభిప్రాయం కలిగి ఉండరని చెప్పారు. బైడెన్ మాటలతో తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం పాలస్తీనా ప్రజల్లో లేదని పేర్కొన్నారు. బైడెన్.. నెతన్యహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండు దేశాల విధానం ద్వారా చాలా దేశాలు ఉన్నాయని.. అటువంటి దేశాలు కూడా యూఎన్‌ఏలో భాగమై ఉన్నాయని తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించమని తేల్చి చెప్పారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా ఇచ్చినా హమాస్ వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తప్పదని అన్నారు. ఇక హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపమని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 24, 927 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందారు. చదవండి: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం -
ఇజ్రాయెల్‌కు ఖతర్ ప్రధాని హెచ్చరికలు
హమాస్ సాయుధులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తీరుపై ఖతర్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ మండిపడ్డారు. గాజాలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తిరస్కరించిన విషయం తెలిసిందే. దావోస్‌లోని మంగళవారం ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో తీవ్రమైన విధ్వంసం జరుగుతోందని.. అందుకే దాడులు ఆపేయాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌పై చేస్తున్న దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం, అంతర్జాతీయ సమాజంపై యాన విమర్శలు చేశారు. గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి ఇరుదేశాల మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసరమని తెలిపారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు గాజాలో తిరిగి మళ్లీ మునుపటి పరిస్థితి తీసుకురావటం కష్టమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రస్తుతం గాజా అనేది లేకుండా పోయిందన్నారు. అంటే గాజాలో ఏం లేదని.. పలు చోట్ల ఇజ్రాయెల్ చేసిన భారీదాడులకు గాజా తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. వెస్ట్‌బ్యాంక్‌లో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతత నేపథ్యంలో పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో దాడులు ఆపేయాలని ఇజ్రాయెల్ కోరారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, రాజకీయ నేతల సహకారం లేకుండా ప్రస్తున్న నెలకొన్న ఇజ్రాయెల్, గాజాల సమస్యకు పరిష్కారం లభించదని అన్నారు. అదే విధంగా ఇప్పడు జరుగుతున్న దాడులకు ముగింపు కూడా పలకలేమని తెలిపారు. ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై యెమెన్‌లోని హౌతీ దళాలు చేస్తున్న దాడులపై ఆయన మండిపడ్డారు. చదవండి: చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు.. చిక్కుకుపోయిన వందల మంది -
Israel-Hamas War: ఫౌదా సిరీస్ నటుడికి తీవ్ర గాయాలు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాయకుడు, నటుడు ఇదాన్ అమేదీ తీవ్రంగా గాయపడ్డారు. గాజాలో నిర్వహిస్తున్న భూతల దాడుల్లో ఆయన తీవ్రంగా గాయాలపాలైనట్లు ఇజ్రాయెల్ దౌత్యవేత్త అవియా లెవీ వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఇదాన్ అమేదీ సైన్యంలో చేరారు. అప్పట్లో ఓ పోస్టు కూడా పెట్టాడు. ఫౌదాలో ఇది దృశ్యం కాదు.. నిజ జీవితం అని రాసుకొచ్చాడు. ఇజ్రాయెల్ సైన్యం ఎదుర్కొంటున్న కష్టాలను స్ఫూర్తిగా తీసుకుని ఫౌదా సిరీస్‌ను కూడా నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది మంచి ప్రజాధరణ పొందింది. గత ఏడాది అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షాలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధంలో ఇప్పటికే హమాస్ వైపు 22 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఇజ్రాయెల్ వైపు 1100లకు పైగా మరణించారు. యుద్ధం ప్రారంభంలోనే ఇజ్రాయెల్ మూడు లక్షల రిజర్వు సైన్యాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఇదాన్ అమేదీతో పాటు ఈ ఫౌదా సిరీస్‌లో నటించిన లియర్ రాజ్ కూడా యుద్ధంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: India-Maldives Controversy: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఒకే కుటుంబంలో 14 మంది మృతి
ఖాన్‌యూనిస్: ఇజ్రాయెల్ నిరంతరాయంగా కనికరం లేకుండా జరుపుతున్న దాడుల్లో పాలస్తీనియన్ల కుటుంబాలు సమిధలవుతున్నాయి. గురువారం ఖాన్యూనిస్కు సమీపంలోని ఓ ఇంటిపై జరిగిన దాడితో అందులో సలాహ్ కుటుంబానికి చెందిన 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో అయిదేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. వీరంతా గాజాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. అటు.. యుద్ధం లెబనాన్ రాజధాని బీరూట్ వైపు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరూరిని ఇజ్రాయెల్ సేనలు మంగళవారం హతమార్చారు. అరూరి అంగరక్షకులు కూడా ఈ యుద్ధంలో మరణించారు. ఈ ఘటన అనంతరం ఇరువర్గాల మధ్య పరిస్థితులు మరింత వేడెక్కాయి. బందీల అప్పగింతపై చర్చలు ముందుకు సాగడం కష్టంగా మారింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ యుద్ధంలో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22,185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
Israel vs America: అమెరికాపై ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జెరూసలెం: మిత్రదేశమైన అమెరికాపై ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మంత్రి బెన్ గ్విర్ విరుచుకుపడ్డారు. అమెరికా తమ మిత్ర దేశమే అయినప్పటికీ ఇజ్రాయెల్‌కు ఏది మంచిదైతే తాము అదే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘ప్రస్తుతం గాజా నుంచి వందలు వేల సంఖ్యలో జరుగుతున్న జనాభా వలసల వల్ల ఇజ్రాయెల్ పౌరులకు గాజాకు తిరిగి వేళ్లే అవకాశం దక్కుతుంది. మేం అమెరికాను ఎంతగానో గౌరవిస్తాం. అంతమాత్రాన అమెరికా జెండాలో ఇజ్రాయెల్ మరో స్టార్ కాదలుచుకోలేదు’అని ఇజ్రాయెల్ మంత్రి అన్నారు. గాజా జనాన్ని అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతంలోకి ఇజ్రాయెల్ పౌరులు వెళ్లడాన్ని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి కూడా సమర్థించుకున్నారు. గాజాలో ఉన్న 20 లక్షల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోసి రేపులు, మర్డర్లు చేద్దామనే ఉద్దేశంతోనే నిద్ర లేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా,గాజాకు జనాభా బదిలీ చేయడమేనే ఆలోచన విద్వేషపూరితమైన, బాధ్యతా రహితమైనదని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. గాజా అనేది పాలస్తీనా భూ భాగంలో అంతర్భాగమని, అది అలాగే కొనసాగుతుందని అమెరికా తెలిపింది. అమెరికా చేసిన ఈ ప్రకటనపైనే ఇజ్రాయెల్ మండిపడుతోంది. ఇదీచదవండి.. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత మృతి -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత మృతి
లెబనాన్: పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరూరిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్‌కు బీరూట్ కేంద్రంగా మారింది. బీరూట్ శివారులో ఉన్న హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. హమాస్ డిప్యూటీ నాయకుడిని చంపిన వార్తను హమాస్ టీవీ కూడా పేర్కొంది. లెబనీస్‌లో జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు వెల్లడించింది. అటు.. గాజాలోనూ హమాస్ సైన్యానికి ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర పోరు జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 70 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ యుద్ధంలో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22,185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది మరణించారు. ఇదీ చదవండి: ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం.. అరగంట వ్యవధిలో రెండుసార్లు -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరమైన దాడులు చేస్తోంది. ఖాన్ యూనిస్ పట్టణంలోని దక్షిణ భాగంలో తమ దాడుల తీవ్రతను పెంచడానికి ఇజ్రయెల్ సేనలు సిద్ధమవుతున్నాయ. ఇజ్రాయెల్ సైన్యం యుద్ధ ట్యాంక్‌లతో విరుచుకుపడుతోంది. వైమానిక బాంబు దాడులకు పాల్పడుతోంది. హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులల్లో శుక్రవారం రాత్రి వరకు సుమారు 24 గంటల్లో 200 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సేనలు హమాస్ కమాండ్ సెంటర్ల, ఆయుధ డిపోల వద్దకు చేరుకున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తెలిపారు. గాజా సిటీలో ఉన్న హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్ ఇంటి లోపల ఉన్న ఓ సొరంగాన్ని ధ్వంసం చేశామని తెలిపారు. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో ఉన్న నుసిరత్ క్యాంప్ సమీపంలోని ఓ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడిలో స్థానిక అల్-ఖుద్స్ టీవీ పనిచేస్తున్న పాలస్తీనా జర్నలిస్టు, అతని కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా.. 240 మంది వారి చేతిలో బంధీలు ఉన్నారు. గాజాలో పూర్తిగా హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రత పెంచుతోంది. చదవండి: గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు! -
బందీల కాల్చివేత.. సమర్థించుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ
టెల్ అవీవ్: బందీల కాల్చివేత ఘటనలో సైనికులు తమ అవగాహన మేరకు సరైన పనిచేశారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ కాల్పుల్లో ఎలాంటి దురద్దేశం లేదని స్పష్టం చేసింది. కాల్పుల్లో సైనిక విధానాలకు కట్టుబడి ఉండటం తప్పనిసరని అన్నారు. ముప్పు లేని సందర్భాల్లో శత్రువుపై సందిగ్దత నెలకొన్నప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరమని ఆర్మీ చీఫ్ జనరల్ హెర్జి హలేవి తెలిపారు. బందీల కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం నివేదికను వెల్లడించింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉగ్రవాదులుగా భావించి డిసెంబర్ 15న ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) కాల్చి చంపింది. షజయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలు సహాయం కోసం అరిచారు. కానీ అది హమాస్ కుట్రగా భావించిన ఇజ్రాయెల్ సేనలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో బందీలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరోమారు ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. బందీలను రక్షించడంలో విఫలమయ్యామని పేర్కొంది. అటు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా విచారం వ్యక్తం చేశారు. బందీల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. దాదాపు 240 మంది ఇజ్రాయెల్‌కు చెందిన వ్యక్తులను హమాస్ బందించింది. నాటి నుంచి ఇరువైపుల నుంచి యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో నష్టం జరిగింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1200 మంది బలయ్యారు. అటు.. హమాస్ వైపు 20,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Donald Trump: ప్చ్.. మరో బ్రేక్: ట్రంప్‌కి మూసుకుపోతున్న దారులు -
పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ!
క్రిస్మస్ వేడుకలతో హోరెత్తిపోవాల్సిన పాలస్తీనా నగరాలు నిర్వికారంగా మారాయి. అందులోకి క్రీస్తూ నడయాడిన ప్రాంతంగా పేరుగాంచిన పాలస్తీనా పర్యాటకుల సందడితో కళకళలాడాల్సిన వీధులన్నీ ముళ్లకంచెలు, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. కొందరు నిరసనకారులు యుద్ధానికి విరామం ప్రకటించి క్రిస్మస్ వేడకలకు అనుమతి ఇవ్వాలని వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం గమనార్హం. అయితే వాటిని కూడా అధికారులు అడ్డుకుని దొరికిని వారిని దొరికినట్టుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శాన్ఫ్రాన్సిస్కోలో శనివారం పాలస్తీనాలో జరిగిన నిరసనల్లో ఒక నినాదం అందర్నీ ప్రముఖంగా ఆకర్షించింది. మారణహోమంలో ఎప్పటిలానే కిస్మస్ ఉండదు అనే నినాదం అందర్నీ ఆలోచింపచేసేలా ఉంది. ఈ నినాదాలతో యూనియన్ స్కేర్ వద్ద ఉన్న ప్రసిద్ధ ఐకానిక్ క్రిస్మస్ చెట్టు పైకి ఓ నిరసనకారుడు ప్లకార్డులు, జాతీయ జెండాతో పైకెక్కుత్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇజ్రాయెల్ హామాస్ యుద్ధం కారణంగా వేడుకలును నిషేధించారు అధికారులు. దీంతో వేలామంది నిరసకారులు వ్యతిరేకిస్తూ రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అలానే క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగే యూనియన్ స్కేర్ వద్ద మరింతగ నిరసనలు జరిగాయి. అందులోనూ సుమారు 83 అడుగుల ఎత్తైన క్రిస్మస్ చెట్టువద్దకు పెద్ద ఎత్తున నిరసకారుల వచ్చారు. అందులో ఒక నిరసనకారుడు శనివారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆ చెట్టును ఎక్కుతూ నిరసనలు చేయడగమే గాక, అతనికి మద్దతు తెలుపుతూ మరికొంతమంది నిరసకారులు నిరసనలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అల్లకల్లోలం, విధ్యంసానికి తెగబడిన అనేకమంది నిరసకారులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. Pro-Palestine protestor climbs on Christmas tree in Union Square, San Francisco pic.twitter.com/irUAdDgXep — Raw Reporting (@Raw_Reporting) December 24, 2023 నిజానికి హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం. దీన్ని ఓ సీక్రెట్ ఆపరేషన్లా చేపట్టి హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడం లేదా బంధీలుగా పట్టుకోవడం చేయాల్సింది. ఇలా నేరుగా యుద్ధానికే తెగబడితే చాలావరకు సాధారణ పౌరులు, అమాయక ప్రజలే బలవ్వుతారు. ఎందరో అనాథలవుతారు. ఈ విధ్వసం అమాయక ప్రజలను బలిగొనడం కంటే జరిగే ప్రయోజనం శూన్యం. యుద్ధంతో దేన్ని నివారించలేం. దాని వల్ల కలిగే ప్రయోజనం కూడా ఏం ఉడదు. వెనుదిరిగి చూసినా.. లేదా ఆత్మ పరిశీలన చేసుకున్నా ఎందుకోసం ఈ యుద్ధం చేశాం అని అనిపించక మానదు. ఎవరు నష్టపోయారు? ఏం మిగిలింది? అంటే.. చెప్పేందుకు కూడా ఏం ఉండదు. తెలివైన వాడు ఎప్పుడు తనకు దెబ్బ తగలకుండా ప్రత్యర్థి ఆటను కట్టించగలగాలే గానే నేరుగా యుద్ధానికి కాలు దువ్వి తనని తన దేశాన్ని దెబ్బతినేలా చేయకూడదు. ప్రపంచ దేశాలన్నే ఈ విషయమే ఘంటా పథంగా చెబుతున్నా వినకుండా ముందుగా రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి సై అంది. ప్రపంచదేశాలన్ని నెత్తినోరుకొట్టుకుని చెప్పినా వినలేదు. చివరికీ జనాభా తగ్గి.. సైనం కొరత ఏర్పడి, నానా అగచాట్టు పడుతోంది రష్యా. అది మరవక మునుపై ఈ హామాస్ యుద్ధం. నిజానికి డిసెంబర్ నెల వచ్చేటప్పటికీ క్రిస్మస్ వేడుకలతో హోరెత్తాల్సిన పాలస్తీనా నగరం శిథిలా నగరంగా మారపోయింది. పర్యాటకుల సందడితో మంచి ఆదాయాలను ఆర్జిస్తూ ఉండాల్సిన టైం తనకు తానే ఆర్థిక పరిస్థితిపై గండి కొట్టుకునేలా చేసింది ఈ యుద్ధం. నిజానికి పాలస్తీనా హమాస్ మిలిటెంట్లను అంతం చేస్తుందా లేక తనకు తానుగా యుద్ధం పేరుతో ఆర్థిక పరంగా, అభివృద్ధిపరంగా వెనకబడిపోతుందా అనేది కాలం తప్పక తెలియజేస్తుంది. ఆ తర్వాత తప్పిదమని తెలుసుకున్నా.. చేయాల్సిందేముండదు. ఇది దేశ పరంగానే కాదు ఓ కుటుంబ పరంగానైనా సరే ఏ వివాదాన్నైనా సంయమనంతో సమస్యను క్లియర్ చేసుకుంటూ పోవాలే తప్ప యుద్ధోన్మాదంతో మాత్రం కాదు. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
Christmas: కళ తప్పిన క్రీస్తు జన్మస్థలం
బెత్లెహాం: క్రిస్మస్ వేడుకలు లేకపోవడంతో పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని క్రీస్తు జన్మస్థలం బెత్లెహాం నగరం కళ తప్పింది. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు, నగరంలోని మేంజర్ స్క్వేర్‌లో చేసే ప్రత్యేక అలంకారాలు ఏవీ కనిపించడం లేదు. ఎక్కడ చూసిన ముళ్ల కంచెలు, శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా క్రీస్తు జన్మించిన బెత్లెహాం నగరంలో ఈసారి క్రిస్మస్ వేడుకలు రద్దు చేశారు. క్రిస్మస్ సందర్భంగా మేంజర్ స్క్వేర్‌లో విదేశీ టూరిస్టులు, వందల మంది యువకులు చేసే మార్చ్ బ్యాండ్‌కు బదులు సైనికులు కవాతు చేస్తున్నారు. ‘ఈ ఏడాది బెత్లెహాంలో క్రిస్మస్ చెట్టు లేదు. వెలుగులు లేవు. కేలం చీకట్లే ఉన్నాయి’ అని జెరూసలెంలో ఆరు సంవత్సరాల నుంచి నివసిస్తున్న వియత్నాంకు చెందిన మాంక్ జాన్ విన్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ వేడుకల రద్దు బెత్లెహాం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెత్లెహాం ఆదాయంలో 70 శాతం విదేశీ పర్యాటకుల నుంచే వస్తుంది. ఇది కూడా చాలా వరకు క్రిస్మస్ సీజన్లో వచ్చే ఆదాయమే. ఇప్పుడు ఈ ఆదాయం లేకపోవడంతో నగరంలోని 70 హోటల్లు మూతపడ్డాయి. వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
పొరపాటున ముగ్గురు బందీలను చంపిన ఇజ్రాయెల్ సైన్యం
టెల్ అవీవ్: హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. ఇదే వరసలో ఉగ్రవాదులుగా భావించి హమాస్ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) కాల్చి చంపింది. షజయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలపై కాల్పులు జరిపగా.. వారు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనపై తాము కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సైన్యం పేర్కొంది. మరోమారు ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. ప్రాణాలు కోల్పోయినవారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫర్ అజా ప్రాంతం వ్యక్తిగా గుర్తించగా.. మరో వ్యక్తి యోటమ్ హైమ్ ప్రాంతవారని పేర్కొన్నారు. మూడో వ్యక్తి వివరాలను బాధితుని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. నాటి నుంచి యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇరువైపుల నుంచి భారీ స్థాయిలో నష్టం జరిగింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1200 మంది బలయ్యారు. అటు.. హమాస్ వైపు 18,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ -
హమాస్ సొరంగాలకు కృత్రిమ వరద..?
టెల్ అవీవ్: హమాస్ అంతమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న ఇజ్రాయెల్ మరో కీలక ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలను బయటకు రప్పించడానికి కృత్రిమ వరదను సృష్టించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు సైన్యం నీటి పంపులను తరలిస్తున్నట్లు సమాచారం. సొరంగాలను నీటితో నింపితే ప్రాణ రక్షణ కోసం ఉగ్రవాదులు బయటకు వస్తారని (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఐడీఎఫ్ వ్యూహ రచన చేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఆల్-షతీ శరణార్థి క్యాంపుకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ ఐదు భారీ పంపులను నవంబర్ ప్రారంభంలోనే ఏర్పాటు చేసింది. గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యమున్న భారీ పంపులను సైన్యం తరలించింది. వీటితో కొన్ని వారాల్లోనే సొరంగాలన్నింటినీ నీటితో నింపేయవచ్చు. బందీల విడుదల ప్రక్రియ పూర్తైన తర్వాత ఐడీఎఫ్ ఈ వరద ఎత్తుగడను ఉపయోగిస్తుందా..? లేక అంతకు ముందే నీటిని విడుదల చేస్తుందా? అనే అంశం ప్రస్తుతానికి తెలియదు. మరోవైపు బంధీలను సురక్షిత ప్రాంతంలో ఉంచామని హమాస్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్‌ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఐడీఎఫ్ మిలిటరీ, టెక్నికల్‌గా అన్ని దారుల్లో ముందుకు వెళుతోంది. కాల్పుల విరమణ తర్వాత భూతల దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. సరికొత్త యుద్ధ తంత్రాలను ఉపయోగిస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట హమాస్ దాడుల్ని ప్రారంభించినా.. ఇజ్రాయెల్ తేరుకుని చావు దెబ్బ కొడుతోంది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. బాంబుల మోతతో గాజా అంతటా విలయం తాండవం చేస్తోంది. ఇప్పటికే గాజాలో 12 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైపు 1400 మంది చనిపోయారు. ఇటీవల నాలుగు రోజులు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. కానీ గడువు ముగియగానే మళ్లీ యుద్ధం ప్రారంభించారు. ఇదీ చదవండి: విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి -
బందీల విడుదలపై ఐర్లాండ్ ప్రధాని ట్వీట్.. ఇజ్రాయెల్ ఫైర్
టెల్ అవీవ్: హమాస్ రెండో విడత 17 మంది బందీలను ఆదివారం విడుదల చేసింది. వీరిలో ఐర్లాండ్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. తమ దేశ బాలిక విడుదలపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. తమ దేశ బాలిక ఎమిలి హ్యాండ్ విడుదల కావడంపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ హర్షం వ్యక్తం చేశారు. తప్పిపోయిందుకున్న బాలిక తిరిగిరావడం ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు. బాలిక కుటుంబంతో కలిసినందుకు ఇది ఎంతో సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. తమకు ఇది ఎంతో ఊరటను కలిగించిందని అన్నారు. అయితే.. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. బాలిక తప్పిపోయిందని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దళాల ఒత్తిడితోనే బందీలను హమాస్ విడుదల చేసిందని స్పష్టం చేసింది. ఎమిలిని హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి బందీగా అపహరించుకుపోయారని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా కాల్పులకు విరమణ ప్రకటించారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేయాలని ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం 24 మందిని హమాస్ విడుదల చేసింది. రెండో విడతగా 17 మందిని వదిలిపెట్టింది. ఇదీ చదవండి: Uttarakashi Tunnel Operation: ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ -
ఆ ఆదాయం మొత్తం ఇచ్చేస్తా: ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్-హమాస్ వార్ నేపథ్యంలో టెస్లా అధినేత ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలాన్ మస్క్ కీలక విషయాన్ని ప్రకటించారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. X Corp will be donating all revenue from advertising & subscriptions associated with the war in Gaza to hospitals in Israel and the Red Cross/Crescent in Gaza — Elon Musk (@elonmusk) November 21, 2023 ఈ మేరకు మస్క్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, గాజాను పాలించే హమాస్ మధ్య భీకర పోరుకు నాలుగు రోజుల తాత్కాలిక విరామం ప్రకటన తరువాత మస్క్ సాయం ప్రకటన వచ్చింది. గత నెలలో, ఎలాన్ మస్క్ గాజాలోని గుర్తింపు పొందిన సహాయ సంస్థలకు కనెక్టివిటీని అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీకర యుద్ధం మొదలైంది. ఈ యుద్దానికి నిన్నటికి(నవంబరు 21) 46 రోజులు గడిచింది. ఈ దాడుల్లో 13వేలమందికి పైగా మరణించారు. OPERATIONAL UPDATE: IDF and ISA forces revealed a significant 55-meter-long terrorist tunnel, 10 meters underneath the Shifa Hospital complex during an intelligence-based operation. The tunnel entrance contains various defense mechanisms, such as a blast-proof door and a firing… pic.twitter.com/tU4J6BD4ZG — Israel Defense Forces (@IDF) November 19, 2023 చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక -
హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. 50 మంది బందీలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ కేబినెట్ తీర్మాణాన్ని ఆమోదించింది. హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన నాటినుంచి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో మహిళలు, పిల్లలను కాపాడుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ప్రతి రోజూ 12 మంది చొప్పున విడుదల చేసేలా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇందుకు అంగీకరించింది. తమ చెరలో ఉన్న పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. గాజాకు అధిక మొత్తంలో ఇంధన, మానవతా సాయం అందడానికి కూడా అనుమతించింది. అటు.. హమాస్ చెరలో దాదాపు 240 మంది ఇజ్రాయెల్ వాసులు బందీలుగా ఉన్నారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం గాజాపై దాడులు తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్‌ను అంతమొందించాలనే ధ్యేయంతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఎడతెరిపిలేని యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తర గాజాను పూర్తిగా ఖాలీ చేయించింది. ప్రస్తుతం దక్షిణ గాజాపై యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: బందీలకు ఇక విముక్తి! -
నెతన్యాహును ఆ మోడల్లో చంపాలి : కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కొచ్చి: ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుపై కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూపై న్యూరెంబర్గ్ మోడల్ వాడాలని కాసర్గడ్ ఎంపీ రాజమోహన్ ఉన్నితన్ వ్యాఖ్యానించారు. పాలస్తీనాలోని గాజాపై యుద్ద నేరానికి పాల్పడినందుకుగాను నెతన్యాహును ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపాలని రాజ్‌మోహన్ అన్నారు. కేరళలోని కాసర్‌గఢ్‌లో పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. జెనీవా కన్వెన్షన్ కింద అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిన వారిని ఇంతకంటే ఏం చేయాలని ఎంపీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందు యుద్ధ నేరస్తుడిగా నెతన్యాహు నిల్చున్నారని తెలిపారు. పాలస్తీనీయన్లపై పాల్పడ్డ అకృత్యాలకు అతడిని వెంటనే న్యూరెంబర్గ్ మోడల్లో అంతమొందించాల్సిందేనన్నారు. కాగా, న్యూరెంబర్గ్ మోడల్లో శిక్షలను హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీలు ఎక్కువగా అమలు చేసేవారు. ఈ పద్ధతిలో యుద్ధ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపేశేవారు. ఇదీచదవండి..కాంగ్రెస్ నేతలపై దాడి.. జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు -
దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
ఖాన్ యూనిస్: హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజా ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. తాజాగా దక్షిణ ప్రాంతంపై కూడా గురిపెట్టింది. దక్షిణ గాజాలో పౌరులందరూ పశ్చిమ ప్రాంతానికి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు చేసింది. 'దక్షిణ గాజాను ఖాలీ చేయాల్సిందిగా పౌరులకు సూచించాం. వెంటనే సాధ్యం కాదని మాకు తెలుసు. కానీ కాల్పుల్లో పౌరులు మరణించకూడదని కోరుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో మానవతా సహాయం అందుతుంది.' అని ప్రధాని నెతన్యాహు సన్నిహితుడు మార్క్ రెగెవ్ తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధంతో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే లక్షల్లో జనాభా దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లింది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ నగరంలో దాదాపు 4 లక్షల జనాభా ఉంటుంది. ప్రస్తుతం వీరందర్ని పశ్చిమం వైపు వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ ఆదేశిస్తోంది. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనీయులకు పశ్చిమానికి వెళ్లడం తప్పేలా కనిపించడం లేదు. 24 మంది మృతి.. అల్-షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. ఆస్పత్రి కేంద్రంగా దాడులు చేస్తోంది. దీంతో ఆస్పత్రికి ఆక్సిజన్, ఇంధనం, కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రిలో తాజాగా 24 మంది రోగులు మృతి చెందారని పాలస్తీనా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 1200 మంది మరణించగా.. పాలస్తీనా మధ్య 12,000పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష -
అమానవీయం: గాజా ఆస్పత్రిలో 179 మంది సామూహిక ఖననం
గాజా: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్ షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో 179 మందిని సామూహికంగా ఖననం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహ్మద్ అబు సల్మియా.. మానవతా సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక సమాధి చేసినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఆస్పత్రికి ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఐసీయూలో ఉన్న ఏడుగురు పిల్లలతో సహా 29 మంది రోగులు మరణించారు. వారందర్నీ సామూహికంగా పూడ్చిపెట్టామని అధికారులు తెలిపారు. ఏడుగురు పిల్లల్ని ఒకే కార్పెట్‌లో చుట్టి సమాధి చేసిన ఫొటోను ఆస్పత్రి యాజమాన్యం బయటకు విడుదల చేసింది. అల్ షిఫా ఆస్పత్రి శవాల నిలయంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రి ప్రాంగణంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. కుళ్లిన శవాల కంపుతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్ షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారని ఆరోపించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఆస్పత్రిని చుట్టుముట్టింది. గత వారం 72 గంటల పాటు అల్ షిఫాకు కరెంట్, నీరు, ఆహారం సరఫరా కాకుండా నిలిపివేసింది. కాల్పులతో ఆస్పత్రి చుట్టూ భీకర వాతావరణం ఏర్పడటంతో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తప్పని స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోనే ఖననం చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడానికి ఇజ్రాయెల్ సేనలు సొరంగాలను కేంద్రంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. హమాస్ సొరంగాలకు కేంద్రంగా అల్ షిఫా ఆస్పత్రి ఉందని ఇజ్రాయెల్ దళాలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి కేంద్రంగా ఉగ్రవాదుల ఇళ్లకు సొరంగాలు ఉన్నాయని సైన్యం అంటోంది. ఇదీ చదవండి: హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా? -
పాలస్తీనియన్లకు ఫ్రాన్స్ న్యాయవాది భరోసా!
ఇజ్రాయెల్- పాలస్తీనాకు చెందిన హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పేందుకు తాము అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సీనియర్ న్యాయవాది గిల్లెస్ డెవర్స్ ప్రకటించారు. అంతేకాదు.. ఈ న్యాయయుద్ధం కోసం ఆయన కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు న్యాయవాదులతో ఒక బృందాన్నీ ఏర్పాటు చేశారు. గత నెల ఏడవ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేయడంతో మొదలైన యుద్ధం ఆ తరువాత మరింత తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ వైమానిక, పదాతి దళాలతో గాజా ప్రాంతంపై విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. ఆస్తినష్టమూ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ యుద్ధంలో తప్పు ఎవరిదన్నవిషయంలో ప్రపంచం రెండుగా విడిపోయిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉగ్రవాద సంస్థ హమాస్‌ను తుదముట్టించే లక్ష్యంతో తాము దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతూండగా.. హమాస్ పేరుతో తమ ప్రాణాలు పొట్టన బెట్టుకుంటున్నారని పాలస్తీనీయులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రులు, ఆంబులెన్సులపై దాడులు చేస్తూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ న్యాయవాది గిల్లెస్ డెవర్స్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం, అంతర్జాతీయ న్యాయాలయాల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కేసులు వేస్తామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్లెస్ డెవర్స్ తన ప్రయత్నాలను వివరిస్తూ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. అందులో పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘మిమ్మల్ని రక్షించడానికి, జాతీయ, అంతర్జాతీయ కోర్టుల ద్వారా న్యాయం అందించేందుకు తమ న్యాయ సైన్యం సిద్ధంగా ఉందని’ గిల్లెస్ ప్రకటించారు. యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెట్ భవిష్యత్తు అంధకారం కావడం గ్యారెంటీ అని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ Gilles Devers is one of the most veteran lawyers in France, who in just 10 days gathered an army of lawyers from all the continents of the world to prosecute Israel for its war crimes against the Palestinians. Lawyer Giles Devers is promising the Israeli occupation with a dark… pic.twitter.com/cs8U7sz6n6 — Bhavika Kapoor ✋ (@BhavikaKapoor5) November 13, 2023 -
పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం
కోపెన్హాగన్: పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమస్టర్‌డ్యామ్‌లో పర్యావరణానికి సంబంధించిన ర్యాలీలో ఆమె మైక్‌ను ఓ వ్యక్తి బలవంతంగా లాక్కున్నాడు. థన్‌బర్గ్ పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. #GretaThunberg gets interrupted at a climate rally after she speaks up about #Palestine the crowd begins to chant " let her speak" pic.twitter.com/XdrdPD4qyW — Arthur Morgan (@ArthurM40330824) November 13, 2023 అణిచివేతకు గురవుతున్నారు.. స్వతంత్య్రం కోసం పోరాడుతున్నారు.. ప్రపంచ శాంతి లేకుండా పర్యావరణ సమతుల్యాన్ని సాధించలేం అని థన్‌బర్గ్ అన్నారు. పాలస్తీనీయులు ధరించినట్లు తలకొప్పు ధరించి.. ఆక్రమిత ప్రాంతాల్లో పర్యావరణం కాపాడలేం అంటూ నినదించారు. ఈ సమయంలోనే ర్యాలీలో ఓ గుంపు పాలస్తీనాకు స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి సంబంధించిన ర్యాలీని థన్‌బర్గ్ రాజకీయ కార్యక్రమంగా మార్చివేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. రాజకీయ విషయాలు మాట్లాడవద్దంటూ ర్యాలీలో ముందుకు వచ్చి థన్‌బర్గ్ వద్ద ఉన్న మైక్‌ను లాక్కున్నాడు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా గాజాలో కొంతభాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పాలస్తీనాకు అండగా నినదిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ చేసేదే సరైనదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ను తొలగించిన రిషి సునాక్ -
హమాస్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
టెల్ అవీవ్: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వదిలేవరకు దాడులను ఆపేదని లేదని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరగాజాపై హమాస్ పట్టు కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే.. యుద్ధం అనంతరం గాజా పాలన పరిస్థితి ఏంటనేది పెద్ద మిస్టరీగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన నెతన్యాహు.. యుద్ధానంతరం గాజాను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. దీనిని అమెరికా ఖండిస్తోంది. "హమాస్‌పై పోరాటంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిందే. బందీలును తప్పకుండా కాపాడతాం. అల్-షిఫా ఆస్పత్రిని ఇప్పటికే ఆక్రమించాం. మా ఆపరేషన్ లక్ష్యమే బందీలను విడిపించడం" అని నెతన్యాహు ప్రకటించారు. అయితే.. పశ్చిమాసియా దేశాలు హమాస్‌కు వ్యతిరేకంగా నిలబడాలని ఆయన మరోసారి కోరారు. యుద్ధం ప్రారంభమైననాటి నుంచీ గాజాను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని ప్రధాని నెతన్యాహు చెప్పుకొచ్చారు. కానీ తాజాగా గాజా ఇజ్రాయెల్ దళాల ఆధీనంలోనే ఉంటుందని మాట్లాడారు. బహుళజాతి దళాలను అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. గాజా స్వాధీనం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తున్నట్లు నెతన్యాహు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. గాజాపై దాడిని ఓ పక్క ప్రపంచదేశాలు కోరుతున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ముందుకు పోతోంది. గాజా ఆక్రమణ సరైన విధానం కాదని అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తోంది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. శరణార్థి శిబిరాలపై కూడా రాకెట్ దాడులు చేస్తోంది. మరోవైపు పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా దాడులు చేస్తోంది. శక్తివంతమైన బుర్కాన్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడికి దిగింది. ఇదీ చదవండి: ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
యుద్ధంలో కీలక ఘట్టాన్ని చేరాం: ఇజ్రాయెల్
టెల్ అవీవ్: కాల్పుల విరమణ చేయాలని కోరుతున్న ప్రపంచ దేశాల విన్నపాన్ని ఇజ్రాయెల్ మరోసారి తోసిపుచ్చింది. ఆదివారం బాంబుల దాడులతో గాజా నగరంపై విరుచుకుపడింది. గాజాను రెండుగా విభజించి హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కీలక ఘట్టానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటించారు. గాజాను మొత్తం చుట్టుముట్టి, ఉత్తర-దక్షిణ గాజాగా విభజించడంలో విజయం సాధించామని వెల్లడించారు. అటు.. గాజాలో సమాచార వ్యవస్థ నిలిచిపోవడం యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇది మూడోసారి. హమాస్ అంతమే ధ్యేయంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్ సేనలు.. ఆదివారం గాజాలో రెండు శరణార్థి శిబిరాలపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 53 మంది మరణించారు. అటు.. హమాస్‌ను అంతం చేసేవరకు వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. తమకు ఇంకో దారి లేదని తెలిపారు. యుద్ధాన్ని ప్రారంభించింది హమాస్ అని గుర్తుచేశారు. మరోవైపు దక్షిణ గాజాలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్‌లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 1400 మంది మరణించారు. 280 మంది నిర్బంధంలో ఉన్నారు. ఇదీ చదవండి: Vladimir Putin Body Doubles: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? -
పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు
న్యూయార్క్: ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల నిరసనకారులు అమెరికాలో ఆందోళన చేపట్టారు. యూదు సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొని క్యాపిటల్ బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. నిరసనలకు అనుమతి తీసుకోకుండానే బిల్డింగ్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. నిరసనల్లో దాదాపు 300 మంది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాజాలో ఆల్ రిహ్లా ఆస్పత్రి దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. యుద్ధాన్ని నిలిపివేయాల్సిందిగా ప్రపంచదేశాలు ఇరుపక్షాలను కోరాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి ఘటనలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతూనే కాల్పుల విమరణకు ఒప్పించే ప్రయత్నం చేశారు. Hundreds of primarily Jewish protesters are currently in the Capitol’s Cannon building staging a sit-in protest, calling on Biden and Congress to push for a ceasefire in Gaza. They’re slowly being arrested. pic.twitter.com/mGLELwRj6p — Jack Jenkins (@jackmjenkins) October 18, 2023 జో బైడెన్ పర్యటన అనంతరం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా నేడు ఇజ్రాయెల్ సందర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో యుద్ధం పరిస్థితులపై చర్చించనున్నారు. అటు.. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్ట సడలించినట్లు తెలుస్తోంది. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు ఆహారం, నీటిని రఫా సరిహద్దు గుండా అందించడానికి అంగీకరించింది. BREAKING: According to Marjorie Taylor Greene, an insurrection is currently taking place on Capitol Hill. pic.twitter.com/s30I7UgS1P — Patrick Webb (@RealPatrickWebb) October 18, 2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు -
ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు
జెరూసలేం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి దాడి అంశంలో ఇజ్రాయెల్ వాదనకు మద్దతు తెలిపారు. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చిన్నాభిన్నమైన గాజాకు ఆహారం, నీటిని రాఫా సరిహద్దు గుండా సరఫరా చేయడానికి అనుమతించారు. గాజాలో ఆస్పత్రిపై రాకెట్ దాడులు జరిపింది హమాస్ దళాల పనే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బహిర్గతం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వాదనలకు అమెరికా మద్దతుగా నిలిచింది. అటు.. గాజా ఆక్రమణ దిశగా ఇజ్రాయెల్ ఆలోచన సరైంది కాదని తెలుపుతూనే యుద్ధంలో కాల్పుల విరమణ వైపు ఆలోచించాలని అమెరికా కోరింది. ఆ తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మంది మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇదీ చదవండి: బైడెన్ చొరవ.. ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్.. గాజాకి అందనున్న మానవతా సాయం -
శరద్ పవార్‌పై అసోం సీఎం వ్యంగ్యాస్త్రాలు
ముంబయి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో భారత్ స్టాండ్‌ను ఎన్సీపీ నేత శరత్‌పవార్ తప్పుబట్టడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శించారు. శరత్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను యుద్ధంలో హమాస్ తరుపున పోరాడటానికి పంపుతారని వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఇజ్రాయెల్‌లోని నోవా ఫెస్టివల్ వేళ హమాస్ దళాలు రాకెట్ దాడులు జరిపాయి. ఇజ్రాయెలీలను దారుణంగా హతమార్చాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. హమాస్ దాడులను ఖండించారు. అమాయక ప్రజల పక్షాన నిలుస్తూ ఇజ్రాయెలీలకు మద్దతు తెలిపారు. అయితే.. హమాస్ దాడులపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో శరద్ పవార్.. ప్రధాని మోదీ స్టాండ్‌ను విమర్శించారు. పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడాలని ఆయన భావించారు. ఇజ్రాయెలీలకు భారత్ మద్దతు తెలపడంపై శరద్ పవార్ తప్పుబట్టడాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని కోరారు. హమాస్ పట్ల సీనియర్ నాయకుడైన శరద్ పవార్ దృక్పథం సరిగా లేదని అన్నారు. దేశం గురించి మొదలు ఆలోచించాలని కోరారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా శరద్ పవార్ వ్యాఖ్యలను ఖండించారు. ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
మలాలా యూసఫ్‌జాయ్ రూ.2.5 కోట్ల విరాళం
లండన్: గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణకాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ చలించిపోయారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గాజాలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో బాంబు పేలుడు ఘటనను మీడియాలో చూసి భయాందోళనకు గురయ్యానని చెప్పారు. ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, గాజాకు నిత్యావసరాలు, ఆహారం, నీరు సరఫరా చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని మలాలా కోరారు. ఈ విపత్కర సమయంలో గాజాలో పాలస్తీనియన్ల సంక్షేమం కోసం కృషి మూడు స్వచ్ఛంద సంస్థలకు 3 లక్షల డాలర్ల (రూ.2.5 కోట్లు) విరాళం ఇవ్వబోతున్నానని మలాలా ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పోరాడుతున్నవారితో తాను కూడా గొంతు కలుపుతున్నానని వ్యాఖ్యానించారు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వారేనని అన్నారు. -
Video: గాజా ఆసుపత్రిపై దాడికి ముందు, ఆ తర్వాత దృశ్యాలు
గాజాలోని ఆసుప్రతిపై దాడి అనంతరం హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై జరిగిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 900 మంది గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దాడిలో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా హాస్పిటల్ ఘటనపై తాము బాధ్యులం కాదని చెబుతూ.. రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయిలే ఈ దాడికి పాల్పడిందని హమాస్ ఆరోపిస్తుండగా.. దీనిని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని, తాము ఆసుపత్రి సమీపంలో ఎలాంటి వైమానిక దాడులు జరపడం లేదని స్పష్టం చేసింది. ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని పాలస్తీనా మిలిటెంట్లను నిందించింది. చదవండి: ఇజ్రాయెల్‌కు మా పూర్తి మద్దతు: బైడెన్ ఈ మేరకు ప్రమాదానికి ముందు.. ఆ తర్వాత ఆసుపత్రి ఆవరణకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ విఫలమైన రాకెట్ ప్రయోగం గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిని తాకింది. ఈ రాకెట్ ప్రయోగానికి ముందు ఆ తరువాత ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతం’ అని ఐడీఎఫ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. A failed rocket launch by the Islamic Jihad terrorist organization hit the Al Ahli hospital in Gaza City. IAF footage from the area around the hospital before and after the failed rocket launch by the Islamic Jihad terrorist organization: pic.twitter.com/AvCAkQULAf— Israel Defense Forces (@IDF) October 18, 2023 కాగా ఇజ్రాయెల్- హమాస్ ఉగ్రవాదుల మధ్య ఘర్షణ 12వ రోజుకు చేరింది. హమాస్ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా గాజాపై భీకర స్థాయిలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తోంది. భారీగా రాకెట్లు ప్రయోగిస్తుంది. ఈ దాడులో పదలు సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. -
ఆపరేషన్ అజయ్: భారత్ చేరిన ఐదో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ అజయ్ నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా 286 మందితో కూడిన మరో విమానం భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత్ తిరిగి వచ్చిన వారు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి A340 విమానం ఆదివారం టెల్ అవీవ్ నగరానికి చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా సోమవారం రావాల్సిన విమానం మంగళవారం 286 మందితో ఢిల్లీ చేరుకుంది. ఇందులో 22 మంది కేరళ వాసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. దీంతో స్వదేశానికి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే నాలుగు విమానాల్లో సుమారు 900పైగా మందిని భారత్‌కు తరలించారు. తాజాగా ఐదో విమానం చేరుకుంది. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి -
'గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ దళాల పనే'
జెరూసలేం: గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న పాలస్తీనా ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేసింది. ఆస్పత్రి దాడిపై తీవ్రంగా ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ హమాస్‌తో కలిసి మిత్ర కూటమిగా పనిచేస్తోంది. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. #IsraelHamasConflict | Al Ahli Hospital hit by the Islamic Jihad terror organization. @PoojaShali with more details. #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @GauravCSawant pic.twitter.com/DUOFYMRz9p — IndiaToday (@IndiaToday) October 18, 2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. A purported Islamic Jihad rocket hit hospital #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @PoojaShali pic.twitter.com/RgTJ8hldgm — IndiaToday (@IndiaToday) October 18, 2023 ఇదీ చదవండి: సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు -
దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్
జెరూసలేం: గాజా ఆస్పత్రిపై దాడిలో వందల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో గాజా నగరం అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో ఉత్తర గాజా సగభాగాన్ని ప్రజలు ఇప్పటికే ఖాలీ చేశారు. దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ కూడా హతమయ్యారు. ఈ క్రమంలో హమాస్ నుంచి కీలక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్ దాడులను తక్షణమే నిలిపివేస్తే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలను వదిలేస్తామని ప్రకటన వెలువడినట్లు సమాచారం. హమాస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. 'మంగళవారం ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు జరిపింది. అందులో విఫలమైన ఓ రాకెట్ ఆస్పత్రిపై పడింది. మా బలగాలు ఆ ఆస్పత్రిపై రాకెట్‌ను ప్రయోగించలేదు.' అని ఐడిఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. #IsraelHamasConflict | Al Ahli Hospital hit by the Islamic Jihad terror organization. @PoojaShali with more details. #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @GauravCSawant pic.twitter.com/DUOFYMRz9p — IndiaToday (@IndiaToday) October 18, 2023 ఆసుపత్రిపై జరిగిన దాడిని పాలస్తీనా అధికారులు ఊచకోతగా పేర్కొన్నారు. గాజాలో ఆసుపత్రిపై వైమానిక దాడిలో వందలాది మంది మరణించడంతో మూడు రోజుల సంతాప దినాలను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. 'మారణహోమం జరుగుతోంది. ఈ మారణకాండను ఆపడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలి. మౌనం ఇకపై ఆమోదయోగ్యంకాదు'అని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి -
హమాస్ దాడుల్లో కూతురు మాయం.. అమెరికా వ్యాపారి కన్నీటిగాథ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో నోవా వేడుకపై హమాస్ పాశవిక దాడి ఎందరో జీవితాల్లో చీకట్లు నింపింది. అయినవారిని పోగొట్టుకున్న బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటుతున్నాయి. తమవారు ఎమయ్యారో..? చనిపోతే మృతదేహాలు ఎక్కడున్నాయో..? తెలియక అయోమయంలో కన్నీరుపెడుతున్నారు. ఈ క్రమంలో కూతురుని పొగొట్టుకున్న ఓ అమెరికా వ్యాపారి ధీనగాథ సదరు పాఠకుల హృదయాలను కలచివేస్తోంది. వాల్డ్‌మాన్ ఇజ్రాయెల్ ఆధారిత అమెరికా వ్యాపారి. కంప్యూటర్ నెట్వర్క్ బహుళజాతి సరఫర సంస్థ మెల్లనాక్స్ వ్యవస్థాపకుడు వాల్డ్‌మెన్. ఆయన కూతురు డేనియల్(24), ఆమె ప్రియుడు నోమ్ షాయ్‌తో కలిసి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన నోవా వేడుకకు హాజరైంది. ఈ క్రమంలోనే హమాస్ దళాలు దాడులు జరిపాయి. విషయం తెలుసుకున్న వాల్డ్‌మెన్.. కూతురు జాడ కోసం ఇజ్రాయెల్ చేరుకున్నారు. తన కూతురును హమాస్ దళాలు బందీగా పట్టుకెళ్లి ఉంటాయని భావించిన వాల్డ్‌మెన్.. చనిపోయినవారి జాబితాలో తన కూతురు కూడా ఉందని తెలుసుకుని కుంగిపోయారు. తన వద్ద ఉన్న ఆపిల్ వాచ్‌తో కూతురు ఫోన్‌ను ట్రాక్ చేయగా.. అక్టోబర్ 11న దిగ్బ్రాంతికర విషయాలు ఆయనకు తెలిశాయి. డేనియల్‌కు సంబంధించిన కారు, వారి వస్తువులు మొదట దర్శనమిచ్చాయి. అక్కడ తన కూతురు, ఆమె ప్రియున్ని హమాస్ దళాలు చంపిన తీరు అతి క్రూరంగా ఉందని ఆయన వెల్లడించారు. కనీసం ఐదుగురు ఉగ్రవాదులు తన కూతురు ఉన్న కారును చుట్టుముట్టి దాడి చేశారని వెల్లడించారు. కారులో తప్పించుకునే ప్రయత్నంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. డేనియల్, ఆమె ప్రియుడు నోమ్ షాయ్ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే ఇద్దరూ తమ కుక్కతో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి మారారని చెప్పారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన.. డేనియల్, నోమ్ షాయ్‌కి ఒకే దగ్గర అంత్యక్రియలు జరిగినట్లు తెలిపారు. ఇదీ చదవండి: 'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన -
'చేతులు ట్రిగ్గర్ మీదే ఉన్నాయ్..' ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆపకపోతే పశ్చిమాసియాలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్ మీదే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ఘాటుగా స్పందించారు. 'ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితిని నియంత్రించడానికి, యుద్ధం మరింత పెద్దగా మారబోదని చెప్పడానికి ఎవరూ హామీ ఇవ్వలేరు. యుద్ధం మరింత ఉదృతం కాకుండా నిరోధించడానికి ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులకు వ్యతిరేకంగా జరుగుతున్న అనాగరిక దాడులను నిరోధించాల్సిన అవసరం ఉంది.' అని హొస్సేన్ అమిరబ్డొల్లాహియా అన్నారు. గాజాపై భూతల దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. హమాస్ ఉనికి లేకుండా చేస్తానని ఓ వైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇప్పటికే 700 మంది పిల్లలతో 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1400 మంది మరణించారు. హమాస్ దాడులు వెనక తమ ప్రమేయం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. హమాస్ బృందాలకు ఆయుధ సరఫరా చేస్తున్నారని ఇరాన్‌ను ఇజ్రాయెల్ మొదటి నుంచీ నిందిస్తోంది. ఇదీ చదవండి అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్ -
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల సూత్రధారి సిన్వార్.. అసలు కథేంటి..?
ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన తర్వాత యాహ్యా సిన్వార్ పేరు హల్ చల్ చేస్తోంది. సిన్వార్‌ను 1,300 మంది ఇజ్రాయెలీలను చంపిన క్రూరునిగా ఇజ్రాయెల్ అధికారులు పేర్కొంటున్నారు. హమాస్ దాడులకు సూత్రధారిగా సిన్వార్ అని ఆరోపిస్తున్నారు. గాజాలో భూతల దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఈ దాడుల్లో యాహ్యా సిన్వార్, అతని గ్రూప్ తమ లక్ష్యంలో ఉన్నారని ఇజ్రాయెల్ బలగాల ప్రతినిధి చెప్పారు. అయితే.. అసలు సిన్వార్ ఎవరు? ఈయన నేపథ్యం ఏంటి? బాల్యం.. 1962లో జన్మించిన సిన్వార్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో పెరిగి పద్దయ్యాడు. అప్పట్లో ఖాన్ యూనిస్ నగరం ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది. సిన్వార్ కుటుంబం మొదట్లో అష్కెలోన్లో స్థిరపడింది. కానీ 1948లో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన తర్వాత గాజాకు తరలి వెళ్లారు. సిన్వార్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 24 ఏళ్ల పాటు జైలు జీవితం సిన్వార్ మొత్తం 24 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. 1982లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు తొలిసారిగా అరెస్టయ్యాడు. పాలస్తీనా ఉద్యమంలో ఇజ్రాయెల్ గూఢచారులపై దాడులు చేయడానికి సలా షెహడేతో జతకట్టి ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ బలగాల చేతుల్లో షెహడే మరణించిన తర్వాత 2002లో హమాస్ మిలటరీ విభాగానికి సిన్వార్ సారథ్యం వహించాడు. Yahya Sinwar is a direct enemy of the State of Israel and his genocidal terrorist organization—Hamas—is a threat to the entire world. pic.twitter.com/mYCgcOgjpX — Israel Defense Forces (@IDF) October 16, 2023 2006లో హమాస్ సైనిక విభాగం ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించడానికి సొరంగాన్ని ఉపయోగించింది. ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసి ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను చంపారు. అనేకమందిని గాయపర్చారు. గిలాడ్ షాలిత్ అనే ఒక సైనికుడిని పట్టుకున్నారు. శాలిత్ ఐదేళ్లపాటు బందీగా ఉన్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యాడు. షాలిత్ విడుదల కోసం ఇజ్రాయెల్ 1,027 మంది పాలస్తీనియన్, ఇజ్రాయెలీ అరబ్ ఖైదీలను విడుదల చేసింది. వారిలో సిన్వార్ ఒకరు. విడుదలైన కొన్ని సంవత్సరాలలో సిన్వార్ హమాస్‌లో ముఖ్య నేతగా ఎదిగారు. 2015లో సిన్వార్‌ను అమెరికా వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేంతటి స్థాయికి చేరాడు. 2017లో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వార్ ఎన్నికయ్యాడు. ప్రధాన నేతగా.. హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే తర్వాత సిన్వార్ 2వ స్థానంలో ఉన్నారు. హనియే స్వచ్ఛంద ప్రవాసంలో నివసిస్తున్నందున, గాజా వాస్తవ పాలన సిన్వార్ చేతుల మీదే నడిచేది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దళాలను సమర్ధవంతంగా సమీకరించాడు. ఆవేశపూరిత ప్రసంగాలతో పేరుపొందిన సిన్వార్.. హమాస్‌కు సంపూర్ణ విధేయత చూపేవాడు. హమాస్ కార్యకర్తల నిఘా విషయంలో ఏమాత్రం రాజీకి వచ్చేవాడు కాదని అంటుంటారు. Have you ever Googled "Who is Yahya Sinwar"? pic.twitter.com/wrhc4q0FsB — Israel Defense Forces (@IDF) October 13, 2023 ప్రస్తుతం ఇజ్రాయెల్ నగరాలపై దాడులకు సిన్వార్ ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ శనివారం జర్నలిస్టులతో మాట్లాడుతూ.. సిన్వార్ తమ లక్ష్యంలో ఉన్నాడని తెలిపారు. ఇదీ చదవండి అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్ -
అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్
న్యూయార్క్ అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కి హేలి ఫైరయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు.. పాలస్తీనియన్లను ఎందుకు ఆహ్వానించట్లేదని మండిపడ్డారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ బామా, జో బైడెన్‌ను విమర్శించారు. హమాస్, హెజ్బొల్లాను పెంచి పోషిస్తున్నారని ఇరాన్‌ను దూషించారు. 'పాలస్తీనా అమాయక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు దేశాల పాత్ర ఎంటి? ఈజిప్టుకు ఏడాదికి బిలియన్లు కొద్ది అమెరికా డబ్బుల్ని ఇస్తోంది. పాలస్తీనియన్ల కోసం గేట్లు తెరవలేరా..?' అని నిక్కి హేలి అన్నారు. 'పాలస్తీనియన్లు వారికి వద్దు. వారి పక్కనే హమాస్ ఉంచుకోవాలనుకోరు. మరి ఇజ్రాయెల్ ఎందుకు వారిని ఉంచుకుంటుంది? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు రక్షించాలనుకోరు. వారిని తమ దేశాల్లో ఉంచుకోవాలనుకోరు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌ను నిందిస్తుంటారు. పశ్చిమాసియా సమస్యలను పరిష్కరించగల సత్తా వారికి ఉంది. కానీ చేయరు. హమాస్‌తో నిత్యం కలిసి పనిచేస్తుంటారు. వారికి నిధులను సమకూరుస్తారు. ఇజ్రాయెల్ దాడులపైనే మాట్లాడుతున్నారు. హమాస్ ఏం చేసిందో మాట్లాడరు. హమాస్ అరాచకాలపై పెదవి విప్పరు.' అని నిక్కి హేలి మండిపడ్డారు. ఇదీ చదవండి ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
గాజాలో ఇజ్రాయెల్ దాడులు అంతకు మించి: చైనా
బీజింగ్: గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని నిలిపివేయాలని కోరారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం పెద్ద యుద్ధంగా పరిణామం చెందకుండా చైనా సహకారాన్ని కోరుతూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్లో మాట్లాడిన మరుసటి రోజే చైనా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడ్డాయి. "పరిస్థితిని తీవ్రతరం చేయడానికి ఎవరూ ఎటువంటి చర్య తీసుకోకూడదు. వీలైనంత త్వరగా చర్చల దిశగా అడుగులు వేయాలి." అని వాంగ్ యి సౌదీ విదేశాంగ మంత్రితో ఈ మేరకు మాట్లాడారు. కాగా.. ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని ముగించడానికి, కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్ వచ్చే వారం పశ్చిమాసియాను సందర్శించనున్నారు. పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితి తన పాత్రను పోషించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య ముగియడానికి ఏకైక మార్గం ఇరుదేశాలు చర్చలను ప్రారంభించడమేనని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలో సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం టూ- స్టేట్ ఫార్ములాగా పేర్కొన్న చైనా.. పాలస్తీనా స్వతంత్రానికి పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చైనా స్పందన సరిగా లేదని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసింది. చైనా ప్రకటన అసత్యంగా ఉందని ఆరోపించింది. ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచించకుండా ప్రకటన వెలువరించిందని తెలిపింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు -
ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు
టెహ్రాన్: గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం అదుపు తప్పుతోందని ఇరాన్ హెచ్చరించింది. తక్షణమే ఆపకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్-నియంత్రిత గాజా భూభాగంలో ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే ప్రతిస్పందించవలసి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఇరాన్ మిషన్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. 'గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలి. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ రకమైన యుద్ధం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దీని అంతాన్ని ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత తీసుకునే స్థాయికి వెళుతోంది.' అని ఇరాన్ స్పష్టం చేసింది. గాజా భూభాగంలో ఇరాన్ మద్దతుగల హమాస్‌పై భూదాడి చేయడానికి ఇజ్రాయెల్ శనివారం సిద్ధమైంది. అధిక జనసాంద్రత కలిగిన ఈ భూభాగంలో పాలస్తీనియన్లను గాజా దక్షిణం వైపు పారిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దళాలు అడుగులు వేస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు. ఇదీ చదవండి: ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం -
ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం
జెరూసలేం: హమాస్ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. హమాస్‌ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు.. యుద్ధంలో మరోస్థాయికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు గాజాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ ఇజ్రాయెల్ దళాలను ప్రధాని బెంజమన్ నెతన్యాహు కలిశారు. తొమ్మిదో రోజు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సైనికులను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని పెంచారు. యుద్ధంలో మరో స్థాయికి వెళ్లనున్నామని తెలిపిన నెతన్యాహు.. ఇందుకు సిద్ధమేనా అంటూ సైనికులను అడిగారు. అందుకు వారు సిద్ధమని చెబుతూ తలలు ఊపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. యుద్ధంలో అసలైన ఘట్టం వచ్చేసిందని ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ 'ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ బ్యాటిల్'కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' గురించి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని సైనికులతో కరచాలనం చేశారు. యుద్ధంలో మరోస్థాయికి వెళుతున్నామని సైనికులకు తెలిపిన వీడియో బయటకు వచ్చింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులను హెచ్చరించిన ఇజ్రాయెల్.. యుద్ధాన్ని తదుపరి మరింత ఉద్ధృతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అటు.. గాజాను వీడకూడదంటూ హమాస్ దళాలు పిలుపునిచ్చాయి. ఈ హోరాహోరి పోరు రానున్న రోజుల్లో యుద్ధం మరింత భీకర స్థాయికి చేరనున్నట్లు తెలుస్తోంది. భూతల దాడి.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్‌ను నిర్మూలించడం గ్రౌండ్ అటాక్ ముఖ్య లక్ష్యం. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను ఈ దాడుల ద్వారా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. గత శనివారం ఇజ్రాయెల్‌లపై జరిగిన అకృత్యాలకు సిన్వార్ బాధ్యత వహించాడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి గ్రౌండ్ అటాక్ మాత్రమే సరైనదని భావిస్తున్నారు. ఈ వారాంతంలో ఈ దాడి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా సరిహద్దులో 30,000 ఇజ్రాయెల్ సైనికులు వేచి ఉన్నారు. 10,000 మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు. ఈ దాడులకు కావాల్సిన యుద్ధ సామగ్రిని, యుద్ధం ట్యాంకులను సరిహద్దుకు చేర్చారు. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం ఆరంభం అయింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో బదులిస్తోంది. భూతల, వాయు మార్గాల్లో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలో 1900 మంది మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: అల్‌ఖైదా కంటే ప్రమాదకరం -
ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు
ఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఓ రోజు రెండు విమానాలు భారత్ చేరాయి. 197 మందితో మూడో విమానం, 274 మందితో నాలుగో విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన భారతీయులకు జాతీయ జెండాలు ఇచ్చి కేంద్ర మంత్రి కౌషల్ కిషోర్ స్వదేశానికి స్వాగతం పలికారు. యుద్ధంతో సంక్షోభంలో ఉన్న ప్రాంతం నుంచి స్వదేశానికి తీసుకువచ్చినందుకు బాధితులు కేంద్ర ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి, రెండో విమానంలో 212, 235 మందిని వరుసగా ఇండియాకి తరలించారు. నాలుగో విమానం 274 మందితో టెక్ అవీవ్ నుంచి శనివారం రాత్రి 11:45కి ఇప్పటికే బయలుదేరింది. ఇప్పటివరకు దాదాపు 918 మందిని భారత్‌కి తరలించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులకు ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి. హమాస్ దళాలపై భూతల, వాయు, జల మార్గాల్లో దాడులు చేస్తున్నారు. ఇళ్లలో, సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై పట్టు వీడకుండా పోరాడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3500 మంది ఇప్పటికే మరణించారు. ఇజ్రాయెల్‌లో 1300 పైగా పౌరులు మరణించగా.. పాలస్తీనాలో 2000కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్ భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఈ రెండు సర్వీసులు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానం, అమృత్సర్ నుంచి స్పైస్‌జెట్ విమానం బయల్దేరతాయి. ఇదీ చదవండి: 235 మందితో రెండో విమానం రాక -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే హమాస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. నిన్న రాత్రి జరిగిన వైమానికి దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ వైమానిక విభాగానికి అధిపతిగా పనిచేసిన మురాద్ అబు మురాద్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ వైమానిక కార్యకలాపాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లోకి గ్లైడర్ల పైనుంచి చొచ్చుకు వచ్చి దాడి చేసే హమాస్ దళాలకు మురాద్ అబు మురాద్ శిక్షణ ఇచ్చేవారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే... పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ పోరులో ఇరువర్గాలకు చెందిన సుమారు 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 600 చిన్నారులతో 1,900 పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: 'భారత వాలంటీర్లతో ఇజ్రాయెల్‌కు మరో ఆర్మీ ' -
'భారత వాలంటీర్లతో ఇజ్రాయెల్‌కు మరో ఆర్మీ '
ఢిల్లీ: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్ తమకు మద్దతు తెలుపుతున్నందుకు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తరుణంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపారు. హమాస్‌ను ఉగ్రదాడిగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మద్దతును తాము ఎప్పటికీ మర్చిపోబోమని నౌర్ గిలోన్ అన్నారు. తమకు మద్దతు తెలుపుతున్న వాలంటీర్లతో మరో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ను తయారు చేయవచ్చని నౌర్ గిలోన్ అన్నారు. యుద్ధంలో పోరాడుతున్న తమకు మద్దతుగా మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. 'ఇజ్రాయెల్ ఎంబసీ సోషల్ మీడియాను చూడండి. మద్దతు తెలుపుతున్న భారత వాలంటీర్లతో మరో రక్షణ దళాన్ని తయారు చేయవచ్చు. ఇజ్రాయెల్ తరుపున పోరాడటానికి మేమంతా ఉన్నామంటూ పోస్టులు పెడుతున్నారు.' అని నౌర్ గిలోన్ తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ స్నేహసంబంధాలు ఎంత ప్రత్యేకమో ఇంతకంటే ఎక్కువ చెప్పలేమని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి -
ఆపరేషన్ అజయ్: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో విమానం 235 మందితో ఢిల్లీ చేరుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 212 మంది భారతీయులతో శుక్రవారమే మొదటి విమానం చేరుకున్న విషయం తెలిసిందే. సొంత ఖర్చులతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై బాధితులు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా మొదటగా రిజస్టర్ చేసుకున్నవారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. రెండో విమానం రాత్రి 11.02కు ఢిల్లీ చేరుకుంది. ఆదివారం కూడా ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ ఎంబసీలో రిజస్టర్ చేసుకున్నవారికి నేడు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. నేడు కూడా మరో విమానం భారత్ చేరనుంది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: 212 మంది భారతీయుల తరలింపు -
'ఎటు చూసిన బాంబుల శబ్ధమే.. 36 గంటల నరకం': నటి ఎమోషనల్ వీడియో
హమాస్ ఉగ్రదాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో వందలమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ వారి కోసం దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో భారత్‌కు చెందిన బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆమె ఎక్కడ ఉందో తెలియకపోవడంతో భయపడ్డారు. కానీ ఎట్టకేలకు సురక్షితంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా అక్కడ ఎదురైన భయాకన పరిస్థితులను వివరించారు. (ఇది చదవండి: హమాస్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బుల్లితెర నటి వీడియో!) నుస్రత్ బరుచ్చా మాట్లాడుతూ.. 'రెండు రోజుల క్రితం నేను ఇజ్రాయెల్‌లోని ఓ హోటల్లో ఉన్నా. 36 గంటలు ప్రత్యక్ష నరకం చూశా. ఆ సమయంలో మా చుట్టూ ఉన్న ప్రాంతంలో బాంబుల శబ్దం వినిపించింది. దీంతో మేం తీవ్ర భయాందోళనకు గురయ్యాం. మాకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితి నాకెప్పుడు ఎదురుకాలేదు. ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చా. ఇప్పుడు సేఫ్‌గా ఉన్నా. ఇది చూశాక నాకు ఓ విషయం స్పష్టంగా అర్థమైంది. మనం ఎంత సురక్షితమైన దేశంలో ఉన్నామో తెలిసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అదే విధంగా ఇండియన్ ఎంబసీ, ఇజ్రాయెల్ ఎంబసీకి నా ధన్యవాదాలు. నా దేశానికి సేఫ్‌గా తీసుకొచ్చారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియో రిలీజ్ చేసింది. కాగా.. ఆమె ఇజ్రాయెల్‌లో జరుగుతున్న హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్లింది. View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) -
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా ట్వీట్.. నెట్టింట దుమారం
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం క్రమంలో ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా వివాదంలో చిక్కుకున్నారు. పాలస్తీనాకు మద్దతుగా పోస్టు చేసిన నేపథ్యంలో కెనడాకు చెందిన ఓ కంపెనీ ఆమెతో బిజినెస్ డీల్‌ను రద్దు చేసుకుంది. అంతేకాకుండా మియా పోస్టుపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దారుణమైన దాడులకు తెగబడ్డారు. ఈ యుద్ధంలో వందలాది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. Can someone please tell the freedom fighters in Palestine to flip their phones and film horizontal — Mia K. (@miakhalifa) October 7, 2023 ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్ దళాలను మియా ఖలీఫా స్వాతంత్య్ర సమరయోధులుగా కీర్తిస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు. ఇది కాస్త నెట్టింట వివాదాస్పదంగా మారింది. ఎంతలా అంటే.. కెనడియన్ బ్రాడ్‌కాస్టర్, రేడియో హోస్ట్ టాడ్ షాపిరో.. మియా ఖలీఫాను వ్యాపార ఒప్పందం నుండి తప్పించారు. This is such a horrendous tweet @miakhalifa. Consider yourself fired effective immediately. Simply disgusting. Beyond disgusting. Please evolve and become a better human being. The fact you are condoning death, rape, beatings and hostage taking is truly gross. No words can… https://t.co/ez4BEtNzj4 — Todd Shapiro (@iamToddyTickles) October 8, 2023 “ఇది చాలా భయంకరమైన ట్వీట్. మియా ఖలీఫా దయచేసి అభివృద్ధి చెందండి. మంచి మనిషిలా మారండి. మీ అజ్ఞానానికి ఏ పదాలు లేవు. ముఖ్యంగా విషాదం ఎదురైనప్పుడు మనుషుల మధ్య శాంతి నెలకొనేలా స్పందించాలి. మీరు మంచి వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. మన బిజినెస్ డీల్ నుంచి మీరు తొలగింపబడ్డారని భావించండి.”అని షాపిరో ఎక్స్‌లో చెప్పారు. I’d say supporting Palestine has lost me business opportunities, but I’m more angry at myself for not checking whether or not I was entering into business with Zionists. My bad. https://t.co/sgx8kzAHnL — Mia K. (@miakhalifa) October 8, 2023 షాపిరో ట్వీట్‌కు స్పందించిన మియా ఖలీఫా.. తన నిర్ణయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రీట్వీట్ చేశారు. 'పాలస్తీనాకు మద్దతు తెలిపి ఓ డీల్‌ను మాత్రమే కోల్పోయాను. కానీ ఏ మాత్రం ఆరా తీయకుండా యుదులకు మద్దతు తెలిపే వ్యక్తితో డీల్ ఏర్పాటుకు సిద్ధమైనందుకు నాపైనే నాకు కోపంగా ఉంది' అంటూ మియా ఖలీఫా ట్వీట్ చేశారు. తన ట్వీట్ హింసను ప్రేరేపించబోదని తెలిపిన మియా ఖలీఫా.. పాలస్తీనా ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. కాబట్టే తాను స్వాతంత్య్ర సమరయోధులు అని పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. I just want to make it clear that this statement in no way shape or form is enticing spread of violence, I specifically said freedom fighters because that’s what the Palestinian citizens are… fighting for freedom every day https://t.co/U9mLwzqnnT — Mia K. (@miakhalifa) October 9, 2023 తన గురించి ఆలోచించే ముందు మీ చిన్న కంపెనీకి ఓ దిశా నిర్దేశం లేదని విచారించండి అంటూ షాపిరోని మియా ఖలీఫా విమర్శించారు. పోరాడే ప్రజల పక్షానే తాను ఉంటానని చెప్పారు. తాను లెబనాన్ నుంచి వచ్చినట్లు పేర్కొన్న మియా ఖలీఫా.. వలసవాదం వైపు ఉంటానని ఎలా ఆశిస్తున్నారని షాపిరోని దుయ్యబట్టారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర పోరు నడుస్తోంది. యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
ఇజ్రాయెల్ సూపర్ నోవా ఫెస్టివల్‌పై హమాస్ దాడి.. అసలేం వేడుకిది..?
జెరూసలెం: ఇజ్రాయెల్‌లో సూపర్ నోవాగా పేరుగాంచిన బహిరంగ మ్యూజికల్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. వందలాది మంది సాధారణ ప్రజలు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. ఆనందంగా జరగాల్సిన మ్యూజిక్ ఈవెంట్లో క్షతగాత్రుల ఆర్తనాదాలతో మరణమృదంగం వినిపించింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉన్న వివాదంతో హమాస్ దాడులు చేయగా.. ఇరువైపుల దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ సూపర్ నోవా ఫెస్టివల్ అంటే ఏమిటి..? ఎందుకు దాన్నే టార్కెట్‌గా ఉగ్రదాడులు జరిగాయి..? సూపర్ నోవాను యూనివర్సల్ పారలెల్లో ఫెస్టివల్ అని కూడా అంటారు. గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీమ్‌లో జరిగింది. సూపర్ నోవా పండుగను యూదులు వారంపాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ 29, 2023 నుంచి అక్టెబర్ 6, 2023 వరకు జరిగే వేడుక. పంట సేకరణను ఉద్దేశించి జరుపుకునే వేడుక ఇది. పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ ఐక్యమత్యం, ప్రేమలకు గుర్తుగా మనసుకు హత్తుకునే అంశాలతో కూడుకుని ఉంటుంది. గత శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అయింది. పండుగ సందర్భంగా వేలాది మంది యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాత్రిపూట గాజా సరిహద్దును దాటుకుని వందిలాది రాకెట్ దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గన్లతో దాదాపు 3500 మంది ఇజ్రాయెల్ యువతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వేడుకలో చాలా మంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా.. బైక్‌లపై వచ్చిన దుండగులు ఏకే-47 వంటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. భయంతో పరుగులు తీస్తున్న జనం, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
అలా అయితే.. ఇజ్రాయెల్‌పై దాడి జరిగుండేది కాదు: ట్రంప్
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను మాజీ ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులకు బైడెన్ బాధ్యత వహించాలంటూ దుయ్యబట్టారు. తాను అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నట్లు చెప్పారు. న్యూ హాంప్‌షైర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. 'అమెరికాకు ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. ఆ డేటా మనదగ్గర ఉండదు. చాలా కేసుల్లో ఇలా మనదగ్గర ఉండి వెళ్లినవారే వివిధ దేశాల్లో దాడులు చేస్తుంటారు. ఇజ్రాయెల్‌లోనూ ఇలాంటివారే దాడులకు పాల్పడుతున్నారు. బైడెన్ అమెరికాకు ఏమీ ప్రయోజనం చేకూర్చే పనులు చేయలేదు. నేను అధ్యక్షునిగా ఉంటే.. ఇజ్రాయెల్‌పై దాడి జరిగి ఉండేది కాదు.' అని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్ దళాలు.. పిల్లలను, మహిళలను దారుణంగా హింసిస్తున్నారని ట్రంప్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్న కాలంలో స్థిరమైన శాంతిని నెలకొల్పినట్లు వెల్లడించారు. పెద్దన్నగా మారణోమాలకు అమెరికా అడ్డుకట్ట వేసేదని తెలిపారు. "హమాస్ దాడులు అవమానకరం. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఎంతో పోరాడుతోంది. పాపం, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డాలర్లు ఈ దాడులకు నిధులు సమకూర్చాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన అనేక నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అమెరికా బలహీనమవుతుందని చెప్పడానికి ప్రస్తుత ఘటనలే నిదర్శనం" అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆధీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి
బీరుట్: సిడాన్ దక్షిణ పోర్టు నగరంలో పాలస్తీనా శరణార్ధులున్న శిబిరంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగాయి. ఇస్లాం ఉగ్రవాది మహమ్మద్ ఖలీల్‌ను హతమార్చే క్రమంలో అతని అనుచరుడిని చంపడంతో అల్లర్లు చెలరేగాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుండి వలస వచ్చిన 55,000 మంది పాలస్తీనీయులు ఉంటున్న ఈ శరణార్థుల శిబిరంలో ఒక్కసారిగా తుపాకులతోను, గ్రెనేడ్లతోనూ కాల్పులు జరిగాయి. మిలిటెంట్లకు మిలటరీ సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడ్డారని అధికారులు అన్నారు. చనిపోయినవారిలో ఐక్యరాజ్యసమితి తరపున శరణార్ధుల యోగక్షేమాలు చూడటానికి వచ్చిన యూఎన్ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులు, ఫతాహ్ గ్రూపుకు చెందిన పాలస్తీనా మిలటరీ జనెరల్ తోపాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: ట్విట్టర్ పేరు మార్పు నా చావుకొచ్చింది.. ఆ రోజు నుండి నిద్ర లేదు.. -
అరుదైన కరెన్సీ నోటు వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా!
ఒక చారీటీ దుకాణంలో దొరికిన బ్యాంకు నోటు ఆన్లైన్ వేలంలో అత్యంత అధిక ధరకు అమ్ముడుపోయింది. ఆ నోటు విలుకంటే అధిక రెట్లు అమ్ముడుపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఏంటా కరెన్సీ నోటు? ఆ నోటుకి ఉన్న ప్రత్యేకత ఏంటో అనే కదా! వివరాల్లోకెళ్తే....పాలస్తీనాలోని ఎసెక్స్‌లో ఆక్స్‌ఫామ్ వాలంటీర్ పాల్ అనే వ్యక్తి బ్రెంట్వుడ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు 100 పౌండ్ల కరెన్సీ నోటు దొరికింది. అది 1927 ఏళ్ల నాటి బ్రిటిష్ మాండేట్ సమయంలో ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసిన నోటు. ఆ నోటును పాల్ తన ఇంటి అరమారలో ఉంచాడు. ఆ తర్వాత దాన్ని అలా ఉంచకూడదని లండన్‌లోని స్పింక్ వేలం హౌస్‌లో వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆ నోటుని ఆన్లైన్లో వేలానికి ఉంచగానే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 1.3 కోట్ల రూపాయలు పలికింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి ఆనోటు విలువ కేవలం రూ. 29 లక్షలు కానీ వేలంలో ఊహించని విధంగా అధిక ధర పలకింది. ఈ మొత్తం ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెళ్తుందని బ్రిటిష్ మీడియా తన నివేదికలో పేర్కొంది. ఇంతకీ ఈ ఆక్స్‌ఫామ్ సంస్థ తూర్పు ఆఫ్రికాలో కరువు పీడిత ప్రజలకు, ఉక్రెయిన్ నుండి వచ్చిన శరణార్థులను అక్కున చేర్చుకుని సేవలందిస్తోంది. (చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది) -
Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే
గాజా సిటీ: పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్‌పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ముగింపు పలుకనుంది. ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలో గురువారం జరిగిన భద్రతా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. గాజాలో పాలస్తీనియన్లపై దాడుల్లో చిన్నారులు, మహిళలతో సహా సాధారణ పౌరులు మృతి చెందడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ధోరణిపై విమర్శలు వచ్చాయి. సంయమనం పాటించాలని పలుదేశాలు విజ్ఞప్తి చేశాయి. శాంతిస్థాపన కోసం ఈజిప్టు సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం నెరిపాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారైన అమెరికా ఒత్తిడి పెంచింది. దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి కోరారు. తమ లక్ష్యం నెరవేరేదాకా ఆపబోమని భీష్మించిన ఇజ్రాయెల్ చివరకు అమెరికా నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అధికారిక వార్తా ఛానల్ కాన్ మాత్రం ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై హమాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 230 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ రాకెట్ల దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
నాటు బాంబుల నుంచి రాకెట్ల దాకా..
దుబాయ్: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా హమాస్ పాలకుల మధ్య నాలుగో యుద్ధం మొదలయ్యింది. ఇరు వర్గాలు భీకరస్థాయిలో తలపడుతున్నాయి. అత్యాధునిక ఆయుధ శక్తి కలిగిన ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ మిలటరీ ధీటుగా బదులిస్తోంది. వైమానిక దాడులకు జవాబుగా రాకెట్లను ప్రయోగిస్తోంది. 10 రోజుల క్రితం ఇజ్రాయెల్, హమాస్ నడుమ ఘర్షణ ప్రారంభమయ్యింది. హమాస్ ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌పై 4,000కు పైగా రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నిర్వీర్యం చేసింది. అయితే, యూదు దేశంతో పోలిస్తే బలహీనం అని అంతర్జాతీయ సమాజం భావిస్తున్న హమాస్ ఆయుధ బలం ఇప్పుడు భారీగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరైన కచ్చితత్వంతో హమాస్ రాకెట్లు ప్రయోగించడం గమనార్హం. కొన్ని రాకెట్లు తీరప్రాంత నగరమైన టెల్ అవీవ్ వరకు చేరుకున్నాయి. హమాస్ డ్రోన్ దాడులు చేసింది. సముద్ర గర్భంలో జలాంతర్గామి(సబ్‌మెరైన్) ద్వారా ఇజ్రాయెల్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించింది. ఆంక్షలను ధిక్కరించి.. దశాబ్దాలుగా యుద్ధాల్లో మునిగితేలి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న హమాస్ సొంతంగానే ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుందని పరిశీల కులు చెబుతున్నారు. అందరూ ఊహిస్తున్న దాని కంటే హమాస్ బాంబింగ్ వ్యవస్థ చాలా పెద్దది, కచ్చితమైనదని గాజా సిటీలోని అల్–అజార్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఖైమర్ అబూసదా చెప్పారు. ఈజిప్టు సహా పలు దేశాలు కఠినమై న ఆంక్షలు, నిబంధనలు విధించినప్పటికీ హమాస్ తన ఆయుధాగారాన్ని బలోపేతం చేసుకోవడం ఆసక్తికరమైన అంశం. ఇరాన్ అండదండలు అంతర్జాతీయంగా ప్రస్తుతం మార్మోగుతున్న హమాస్ 1987లో ఏర్పాటయ్యింది. నాటు›బాంబులతో మొదలైన హమాస్ ప్రస్థానం ఇప్పుడు లాంగ్రేంజ్ రాకెట్ల దాకా చేరింది. ఒక రాజకీయ సంస్థగా ప్రారంభమైన హమాస్ తదనంతరం వ్యవస్థీకృత సైన్యాన్ని నిర్వహించే స్థాయికి చేరిందని శత్రుదేశం ఇజ్రాయెల్ అంగీకరిస్తోంది. ప్రారంభంలో హమాస్ ఇజ్రాయెల్ పౌరులపై కాల్పులు జరిపేది, వారిని అపహరించేది. 2000వ దశకంలో ఆత్మాహుతి దాడుల్లో వందలాది మంది ఇజ్రాయెల్ వాసులను బలితీసుకుంది. 2005లో గాజాపై పట్టు బిగించాక ఇరాన్, సిరియా నుంచి ఆధునిక ఆయుధాలు కూడగట్టుకోవడం మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు ముస్లిం దేశాలు హమాస్‌కు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేశాయి. ఇందుకోసం అండర్‌గ్రౌండ్ సొరంగాలను హమాస్ ఉపయోగించుకుంది. ఆధునిక సాంకేతికతను, ఆయుధ తయారీ పరిజ్ఞానాన్ని హమాస్ సొంతం చేసుకుంది. ఆయు«ధ ఉత్పత్తి ప్రారంభించింది. 2012లో ఈజిప్టు అధ్యక్షుడిగా మోర్సీ ఎన్నిక కావడం హమాస్‌కు బాగా కలిసొచ్చింది. మోర్సీ హమాస్‌కు పూర్తిస్థాయిలో సహకరించారు. 2012లో మోర్సీ పదవీచ్యుతుడైన తర్వాత హమాస్‌ను ఇరాన్‌ను ఆదుకుంది. ఇరాన్ ఏటా హమాస్‌కు 100 మిలియన్ డాలర్ల మేర సాయం అందిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ అంచనాల ప్రకారం.. హమాస్ వద్ద 7,000కు పైగా రాకెట్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో ఏమూలనైనా లక్ష్యంగా చేసుకోగల దూరశ్రేణి క్షిపణులు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే 300 యాంటీ ట్యాంక్, 100 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్స్‌ను సైతం సొంతం చేసుకుంది. అంతేకాకుండా 30 వేల మంది సుశిక్షితులైన సైనికులు, 400 మంది నేవీ కమెండోలున్నారు. -
భద్రతా దళాల కాల్పుల్లో నటికి తీవ్ర గాయాలు
గత వారం హైఫాలో జరిగిన నిరసన సందర్భంగా బాగ్దాద్ సెంట్రల్ స్టార్, పాలస్తీనా నటి మైసా అబ్ద్ ఎల్హాది ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆమె గురువారం (మే 13) సోషల్ మీడియాలో "ప్రస్తుతం తాను కోలుకుంటున్నాని.. బాగానే ఉన్నాను’’ అని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల తరువాత అనేక పాలస్తీనా కుటుంబాలు తమ ఇళ్ల నుంచి బహిష్కరణను ఎదుర్కొన్నాయి. దీని ఫలితంగా నగరంలో ఉద్రిక్తతలు పెరిగి నిరసనలకు దారితీసింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా గత వారం హైఫాలో ఆందోళన చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మైసా కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనికులు నిరసనకారులపై గ్రెనేడ్లను కాల్చడం ప్రారంభించిరని.. ఈ ఘటనలో తాను కూడా గాయపడ్డానని వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మైసా అసలు ఆ రోజు ఏం జరిగిందనేది తెలిపారు. ‘‘ఆదివారం హైఫాలో జరిగిన శాంతియుత నిరసన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. నినాదాలు, పాటలు ద్వారా మా కోపాన్ని తెలియజేస్తున్నాం. నేను కూడా నినాదాల చేస్తూ.. అక్కడ జరిగే వాటిని రికార్డ్ చేస్తున్నాను. నిరసన ప్రారంభమైన కొద్దిసేపటికే, సైనికులు అక్కడ స్టన్ గ్రెనేడ్లు, గ్యాస్ గ్రెనేడ్లను కాల్చడం ప్రారంభించారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన నేను.. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి సురక్షితంగా అనిపించిన ప్రదేశంలో ఒంటరిగా నిలబడ్డాను. నా వెనక సైనికులున్నారు. అప్పుడ నేను బహాయ్ గార్డెన్స్‌పై ఉన్న పాలస్తీనా జెండాను ఫోటో తీస్తున్నాను. అప్పటి వరకు ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు” అని మైసా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ‘‘నేను నా కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. పెద్ద శబ్దం వినిపించింది. నా ప్యాంట్ ఏమైనా చిరిగిందా ఏంటి అనుకుంటూ.. అక్కడ నుంచి ఫాస్ట్‌గా వెళ్లాలని భావించాను. కానీ నేను నడవలేకపోతున్నాను. కాలు విపరీతంగా నొప్పి పెడుతుంది. ఏం జరిగింది అని వంగి చూడగా.. నా కాలు చర్మం చీరుకుపోయి.. విపరీతమైన రక్తస్రావం అవుతుంది. అది చూసి నేను భయంతో కేకలు వేశాను. అక్కడ ఉన్న కొందరు నన్ను ఆస్పత్రిలో చేర్చారు’’ అని తెలిపారు. నటి కాలికి తీవ్ర గాయమయ్యింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పరస్పరం రాకెట్లతో దాడి చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారని తెలిపింది. చదవండి: Israel- Palestine: క్షతగాత్రి పాలస్తీనా -
వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్
గాజా సిటీ: ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గురువారం ఇరు వర్గాలు భీకరస్థాయిలో ఘర్షణకు దిగాయి. రాకెట్లతో నిప్పుల వర్షం కురిపించుకున్నాయి. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈజిప్టు రంగంలోకి దిగింది. ఉద్రిక్తతలను చల్లార్చి, సాధారణ స్థితిని నెలకొల్పడమే లక్ష్యంగా ఈజిప్టు మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఒకవైపు చర్చలు సాగుతుండడగానే రాకెట్లతో దాడులు కొనసాగడం గమనార్హం. హమాస్ భారీ స్థాయిలో రాకెట్లతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడింది. కొన్ని రాకెట్లు ముఖ్యనగరం టెల్ అవీవ్ దాకా దూసుకురావడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం సైతం ధీటుగా బదులిచ్చింది. గాజాపై తన అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఇంకోవైపు గాజాలో అరబ్, యూదు ప్రజలు వీధుల్లో బాహాబాహీకి దిగారు. 13 మంది హమాస్ తీవ్రవాదులు హతం! గాజాలో హమాస్ తీవ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న మూడు బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమ సభ్యులు 13 మంది అమరులైనట్లు హమాస్ తెలిపింది. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ‘ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, దిమోనా, జెరూసలేం నగరాలపై బాంబులు వేయడం మాకు మంచి నీళ్లు తాగడం కంటే సులభం’ అని హమాస్ మిలటరీ విభాగం ప్రతినిధి ఒకరు ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అణు రియాక్టర్ దిమోనా సిటీలో ఉంది. హమాస్ తమ దేశంపై 1,200 రాకెట్లు ప్రయోగించగా, ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో 90 శాతం రాకెట్లను నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
Israel- Palestine: క్షతగాత్రి పాలస్తీనా
ఒక సంక్లిష్ట సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం వెనకుండే ప్రధాన లక్ష్యం పరస్పరం తలపడే వైరి వర్గాల మధ్య సామరస్యాన్ని కుదర్చడం, శాంతి స్థాపన జరిగేలా చూడటం. కానీ ఆ పరిష్కారాన్ని వైరి వర్గాలు ఒక ఎత్తుగడగా మాత్రమే భావిస్తే, భవిష్యత్తులో బలాబలాల సమీకరణకు చిక్కిన వ్యవధిగా విశ్వసిస్తే... కనుగొన్న పరిష్కారం కాస్తా సమస్యను మించి జటిలంగా మారుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు నిరంతరాయంగా కురిపిస్తున్న నిప్పుల జడిలో ధ్వంసమవుతున్న పాలస్తీనాలో జరిగింది అదే. ఈ ఘటనల నేపథ్యాన్ని ఒకసారి చూడాలి. ఇజ్రాయెల్‌లో గత రెండేళ్లుగా నాలుగుసార్లు ఎన్నికలు నిర్వహించినా ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. పాలస్తీనాలో 2006 నుంచి పెండింగ్‌లో వున్న పార్లమెంటు ఎన్నికలు ఘర్షణలు మొదలైన వెంటనే వాయిదా పడ్డాయి. ఇప్పుడు వర్తమాన ఘర్షణల వెనకున్నదెవరో, ఏ ప్రయోజనం ఆశించి వీటిని సాగిస్తున్నారో సులభంగానే అంచనా వేయొచ్చు. మొత్తానికి ఇటు గాజా స్ట్రిప్ ను పర్యవేక్షిస్తున్న హమాస్‌కూ, అటు ఇజ్రాయెల్ దళాలకూ మధ్య సాగుతున్న సంకుల సమరంలో ఇంతవరకూ 83 మంది పాలస్తీనా పౌరులు కన్నుమూశారు. ఇందులో 17 మంది పిల్లలు, మరో ఏడుగురు మహిళలు. 480 మంది గాయ పడ్డారు. ఇజ్రాయెల్‌వైపు ఒక సైనికుడు, ఆరుగురు పౌరులు మరణించగా అందులో కేరళకు చెందిన ఒక నర్సు కూడా వున్నారు. ఆకాశాన్నంటే భవంతులు కుప్పకూలాయి. మీడియా సంస్థ లున్న భవనం సైతం ఇజ్రాయెల్ దాడిలో నాశనమైంది. హింస నివారించి, అన్ని పక్షాలూ శాంతి స్థాపనకు ప్రయత్నించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. కానీ ఎప్పటిలాగే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారు. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఆ దేశానికున్నదంటూ సమర్థించారు. అరబ్–ఇజ్రాయెల్ ఘర్షణల్లో ఇది రివాజే. ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నట్టు హమాస్ మిలి టెంట్లు తొలి దాడికి దిగివుండొచ్చుగానీ... కానీ దానికి దారి తీసిన పరిణామాలేమిటి? ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో చరిత్రాత్మకమైన అల్–అక్సా మసీదులో ఎప్పటిలాగే ప్రార్థన లకు ఉపక్రమించిన వేలాదిమందిపై ఇజ్రాయెల్ పోలీసులు ఎందుకు దాడి చేశారు? ఇజ్రాయెల్‌కు ఆత్మ రక్షణ హక్కు వున్నట్టే పాలస్తీనా పౌరులకూ వుండాలి కదా! తటస్థంగా వుండదల్చుకుంటే వేరు. కానీ ఆ ముసుగులో ఒక పక్షానికే కొమ్ము కాయడం, దాని తీరు సరైందన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేయడం వంచన తప్ప మరేం కాదు. యాభై అయిదేళ్లక్రితం...అంటే 1967లో ఆరు రోజులపాటు జరిగిన అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో వర్తమాన విషాదానికి బీజాలున్నాయి. ఆ యుద్ధంలో తూర్పు జెరూసలేం ప్రాంతాన్ని జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు కైవసం చేసుకున్నాయి. జెరూసలేం తమ రాజధాని అంటూ ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించినా అంతర్జాతీయంగా దాన్నెవరూ గుర్తించలేదు. శాంతి ఒప్పందంలో భాగంగా తూర్పు జెరూసలేంలోని అల్–అక్సా మసీదు నిర్వహణ బాధ్యత జోర్డాన్ ఆధ్వర్యంలోని ఇస్లామిక్ ట్రస్టు అధీనంలో వుంది. కానీ ఆ కట్టడం వున్న 35 ఎకరాల ప్రాంతం ముస్లింలతోపాటు క్రైస్తవులకూ, యూదులకూ కూడా పవిత్రమైన ఆవరణ. యథాపూర్వ స్థితి ఏర్పడేలా చూసినప్పుడే ఏ శాంతి ఒప్పందమైనా నాలుగు కాలాలపాటు మనుగడ సాగిస్తుంది. కానీ జరిగింది అది కాదు. తూర్పు జెరూసలేంనుంచి ఇజ్రాయెల్‌ను పొమ్మనకుండా, అల్–అక్సా ఆవరణను మూడు మతాల వారూ సందర్శించడానికి వీలుకల్పిస్తూ రాజీ కుదిర్చారు. ఇదే సమస్యను మరింత జటిలం చేసింది. అక్కడ భిన్న మతాల తీవ్రవాద బృందాలమధ్య ఘర్షణలు జరగడం... వాటిని ఎప్పటికప్పుడు ఏదో రకంగా చల్లార్చడం రివాజైంది. అల్–అక్సా ప్రాంతంలో యూదు తీవ్రవాద బృందాల కదలికలు ఎక్కువయ్యాయని గత నెలలో జోర్డాన్ విదేశాంగమంత్రి ఫిర్యాదు చేశారు. ఇది రంజాన్ మాసమై నందువల్ల ఏ చిన్న ఘర్షణైనా పెనుముప్పుగా పరిణమించొచ్చని హెచ్చరించారు. ఈలోగా తమకూ ప్రార్థించే హక్కుందంటూ యూదు తీవ్రవాద బృందాలు పేచీ మొదలెట్టాయి. అంతక్రితమే పాత నగరంలో యూదు ఛాందస బృందాలకూ, పాలస్తీనా పౌరులకూ ఘర్షణలు రాజుకున్నాయి. ఆ సాకుతో ముస్లింలు అటు రావడానికి వీల్లేదంటూ ఇజ్రాయెల్ పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే ఇజ్రాయెల్ పౌరుల కోసం ఆవాసాల నిర్మాణం మొదలైంది. ఇవన్నీ ఎందుకు చోటుచేసు కున్నాయో సులభంగానే అంచనా వేయొచ్చు. అధికారాన్ని అంటిపెట్టుకుని వుండాలన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆశలపై గత రెండేళ్లలో ఒకసారి కాదు... నాలుగుసార్లు ఆ దేశ ప్రజలు నీళ్లు చల్లారు. మళ్లీ పాలస్తీనా పోరు రాజేసి గట్టెక్కాలని ఆయన ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ విపక్షాలన్నీ నెతన్యాహూ లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వర్తమాన ఘర్షణ నెతన్యాహూ కోరుకుంటున్నట్టు ఆయన స్థితిని మెరుగుపరుస్తుందో లేదో చూడాలి. అయితే ఈ దారుణ మారణ హోమంలో పాలస్తీనా పౌరులు సమిధలవుతున్నారు. దీన్నంతటినీ నిర్వికారంగా చూస్తూ వుండిపోవడం మానవీయతకే అపచారమని ప్రపంచ పౌరులు గుర్తిస్తే తప్ప ఇందుకు శాశ్వత పరిష్కారం దొరకదు. దురాక్రమణదారుగా, మారణహోమ సృష్టికర్తగా, అకారణ పేచీలతో నిత్యం పాలస్తీనా పౌరులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇజ్రాయెల్ 1967కు ముందునాటి భూభాగానికి ఉపసంహరించుకోవడం ఒక్కటే వారి శాశ్వత భద్రతకు గ్యారంటీ ఇవ్వగలదు. చదవండి: వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్ I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H — Abier-Almasri (@abier_i) May 12, 2021 -
500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్ డోమ్’
గాజా సిటీ: దాదాపు 500 రాకెట్లు ఒక్కసారిగా దాడి చేస్తే.. ఎంతటి విధ్వంసం జరగాలి. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా తక్కువ నష్టంతో బయటపడింది. ఇదేలా సాధ్యం అంటే ఐరన్ డోమ్. ఇజ్రాయెల్‌ను రక్షించిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థ. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శత్రుత్వం కొనసాగుతున్న తరుణంలో, సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి 1,050 కి పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో దాడులకు తెగబడ్డారు. ఈ హింసాకాండలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ దాదపు 500 రాకెట్లను అడ్డుకున్నట్లు తెలిపింది. ఐరన్ డోమ్ అంటే ఏంటి.. సాధారణంగా తక్కువ దూరాల్లోని శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థే ఐరన్ డోమ్. దీన్ని అమెరికా సాయంతో ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమ్స్ పది సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసింది. 2011లో దీనిని వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజాస్ట్రిప్ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, మోర్టార్ షెల్స్‌ని ఇది ఎదుర్కొంటుంది. దీని రేంజ్ 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఎలా పని చేస్తుంది.. ఈ వ్యవస్థ మొత్తంలో రాడార్లు,సాఫ్ట్వేర్,రాకెట్ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజాస్ట్రిప్ లో రాకెట్ ప్రయోగించిన వెంటనే రాడార్ పసిగట్టి.. దాని గురించిన సమాచారాన్ని సాఫ్ట్వేర్ వ్యవస్థకు పంపిస్తుంది. టార్గెట్ రాకెట్ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. ఒకవేళ అది జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగించి శత్రువుల రాకెట్‌ను గాల్లోనే పేల్చివేస్తుంది. దీని సక్సెస్ రేట్ 90 శాతంగా ఉంది. చదవండి: భర్తతో వీడియో కాల్.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్ The #IronDome is truly a life saver! This is the Iron Dome in action tonight, as rockets are fired at southern #Israel from #Gaza! pic.twitter.com/y4HCyaTntK — Arsen Ostrovsky (@Ostrov_A) May 10, 2021 -
మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా
గాజా సిటీ: ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. జెరూసలేంలో కొద్దివారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు పెరిగి... యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి వందలకొద్ది రాకెట్ బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. దీంతో ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రోజంతా ఎడతెగకుండా గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదులు లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 16 మందిని ఉగ్రవాదులేనని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. హమాస్ దాడులపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఊహించని స్థాయిలో హమాస్‌పై దాడులుంటాయని హెచ్చరించారు. 5000 మంది రిజర్వ్ సైనికులను గాజా సరిహద్దుకు తరలించాల్సిందిగా రక్షణ మంత్రి ఆదేశాలిచ్చారు. జెరూసలేంలోని అల్ అక్సా మసీదు వద్ద సోమవారం ఇజ్రాయిల్ సైనికుల, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన గొడవలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇవి కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ముస్లిం దేశాలు మంగళవారం తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యను పాశవికమని పేర్కొన్నాయి. చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: తుపాకీకి భయపడి బిల్డింగ్ పైనుంచి దూకిన చిన్నారులు -
ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?!
జెరూసలేం: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది. నోరెళ్లబెట్టే ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన ఫోటోలు కొన్ని తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని పోస్ట్ చేసిన వ్యక్తి సృజనాత్మకతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు జనాలు. ఇంతకు ఆ ఫోటోల్లో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. పాలస్తీనాకు చెందిన సాయిద్ అనే యువకుడికి ప్లేన్‌గా, సాధారణంగా ఉన్న తన ఫ్రిజ్ స్క్రీన్ చూసిన ప్రతి సారి బోర్‌గా అనిపించేది. ఈ క్రమంలో ఓ రోజు సాయిద్ తన ఫ్రిజ్‌ను అందంగా మార్చాలని భావించాడు. ఇందు కోసం తనకు ఎంతో ప్రావీణ్యం ఉన్న ఫోటోషాప్‌ని ఉపయోగించుకున్నాడు. ఇక తన ప్రతిభతో అద్భుతాలను సృష్టించాడు. సాయిద్ ఎలాంటి ఫోటోలు తీశాడంటే.. సడెన్‌గా వీటిని చూసిన వారంతా.. నిజంగా అతడు ఫ్రిజ్ లోపల కూర్చాన్నాడేమో అనుకుంటారు. ఇలా తీసిన ఫోటోలని సాయిద్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే అనూహ్య రీతిలో వీటికి భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోటోలని 73,700 మంది రీట్వీట్ చేయగా.. 7,29,600కుపైగా లైకులు వచ్చాయి. చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’ -
ఓ పవిత్ర పర్వతం కోసం ఆ రెండు దేశాలు
జెరూసలేం : టెంపుల్ మౌంట్ అనే పవిత్ర పర్వతం మాదంటే మాదంటూ ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు కొట్టుకుంటున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇస్లాం పవిత్ర దినాలలో ఒకటైన ఈద్ అల్ అదాను జరుపుకోవడానికి దాదాపు 80,000 మంది పాలస్తీనా ముస్లింలు పాత జెరూసలేంలోని టెంపుల్‌మౌంట్‌కు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు చెందిన యూదులకు కూడా ఇదే రోజు టిషాబీఆవ్ అనే పండుగ ఉండటంతో వారు సైతం కొండ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని కొండపైకి ఇజ్రాయెల్ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదానికి సహకరిస్తున్నారా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అయితే, టెంపుల్ మౌంట్ ప్రాంత ప్రవేశద్వారం వద్ద హమాస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు, ముస్లిం బ్రదర్హుడ్ నాయకుడు మొహమ్మద్ మోర్సీ ఫోటోలతో కూడిన పెద్ద బ్యానర్ ఉండటం యూదులను ఇంకా ఆగ్రహానికి గురిచేసింది. కొందరు రాడికల్ యూదులు కొండపై ఉండే అల్-అక్సా మసీదును ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగి హింస చెలరేగడంతో ఇజ్రాయెల్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు బాష్పవాయువును ప్రయోగించడంతో చాలామంది గాయపడ్డారు. కాగా, మక్కా వార్షిక తీర్థయాత్రల ముగింపును సూచించే ఈద్ అల్ అదా పండుగను జరుపుకొనే పవిత్ర ప్రాంతంగా టెంపుల్‌మౌంట్‌ను ముస్లింలు భావించగా, చరిత్రలో యూదులు ఎదుర్కొన్న విపత్తులను స్మరించుకుంటూ, దాడుల్లో నాశనం అయిన కొండప్రాంతంపై గల రెండు పురాతన జెరూసలేం దేవాలయాలను తలుచుకొని.. రెండు రోజుల సంతాపం దినంగా టిషాబీ ఆవ్ అనే పండుగను ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకుంటారు. సరిహద్దు ఘర్షణలో పాలస్తీనీయులు మృతి గాజా-ఇజ్రాయెల్ మధ్య సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం నలుగురు పాలస్తీనీయులను ఇజ్రాయెల్ సైన్యం కాల్చి చంపింది. ఈ మేరకు సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. రైఫిల్స్, క్షిపణి నిరోధక ట్యాంకర్లు, హ్యాండ్ గ్రెనెడ్ వంటి భారీ ఆయుధాలు ఆ నలుగురి వద్ద ఉన్నాయని, వాటిలో ఒక దానిని ఇజ్రాయెల్ సైన్యంపై విసిరారని ఆ ప్రకటన పేర్కొంది. వారిలో ఒకరు సరిహద్దును దాటి రావడంతో కాల్పులు ప్రారంభించినట్లు సైన్యం వెల్లడించింది. -
అక్కడ సింహాలతో ఆడుకోవచ్చు!
గాజా, పాలస్తీనా : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న పాలస్తీనియన్ రాజ్యం గాజాలోని పార్కులు సందర్శకులకు వినూత్న అనుభవం కలిగిస్తున్నాయి. ఏకంగా సింహాలతో ఆడుకునే వెసలుబాటు కల్పించి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ గాజాలోని రఫాలో ఉన్న ఓ జూ పార్కులో ‘ఫెలెస్టీన్’ అనే ఆడ సింహాన్ని జూ నిర్వాహకులు సమీపంలో ఉన్న ఇళ్లకు తీసుకువెళ్లి ఆడిస్తుండటం విశేషం. ఈ విషయం గురించి జూ యజమాని మహ్మద్ జుమ్మా మాట్లాడుతూ... ‘ సింహంలో ఉన్న క్రూరత్వాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా. అందుకే దాని గోళ్లు కత్తిరిస్తున్నాం. సందర్శకులతో తను స్నేహంగా ఉంటోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. పిల్లలు కూడా ఆడుకున్నారు... ఫెలెస్టీన్ను మంగళవారం షికారుకు తీసుకువెళ్లినట్లు దాని శిక్షకుడు ఫయీజ్ అల్- హదద్ వెల్లడించారు. ‘ కొన్ని రోజులుగా ఫెలెస్టీన్ మానసిక స్థితిని అంచనా వేశాను. అందుకే సమీపంలో ఓ అపార్ట్మెంట్కి తీసుకు వెళ్లాను. అక్కడ ఉన్న వారంతా పిల్లలతో సహా ఫెలెస్టీన్తో ఆడుకున్నారు. దాని గోళ్లు కత్తిరించాం కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే పళ్లు మాత్రం అలాగే ఉంచుతాం. కాబట్టి దాని సహజత్వాన్ని కోల్పోదు. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తాం’ అని పేర్కొన్నాడు. కాగా శిథిలావస్థకు చేరిన జూ పార్కులను పునరుద్ధరించేందుకు.. జంతువులతో ఆడుకోవడం వంటి వెసలుబాటు కల్పిస్తున్న యజమానుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారం కోసం జంతువుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదని.. అదేవిధంగా జంతువులను బయట తిప్పడం వల్ల పలువురి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిరంతరం బాంబుల మోతతో దద్దరిల్లే గాజాలో పిల్లల ముఖాల్లో కాస్త సంతోషం చూసేందుకే ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నామని జూ నిర్వాహకులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. -
నవల రాయడం పెళ్లి లాంటిది
గ్రేట్ రైటర్ హీబ్రూ నుంచి అత్యధికంగా అనువాదమైన రచయితల్లో మొదట చెప్పగలిగే పేరు ఏమస్ ఓజ్. ఇజ్రాయెల్‌కు వలస వచ్చిన లేదా మూలాలను వెతుక్కుంటూ తిరిగి వచ్చిన యూదు తల్లిదండ్రులకు 1939లో జన్మించాడు. అతడి పన్నెండో ఏట తల్లి డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మీద ఒక తిరుగుబాటుగా సామూహిక వ్యవసాయ క్షేత్రాలైన కిబుట్స్‌కు వెళ్లిపోయాడు. అక్కడే జీవితంలో చాలాభాగం గడిపాడు. ఓజ్ అంటే స్ట్రెంత్. తన బలం రాయడంలో ఉందని గ్రహించిన తర్వాత రాయడాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. నవలలు, కథలు, వ్యాసాలు విరివిగా రాశాడు. కవిత రాయడమంటే ఎఫైర్– వన్ నైట్ స్టాండ్ లాంటిదనీ, కథ రాయడం రొమాన్స్– ఒక బంధం, కానీ నవల రాయడమంటే పెళ్లి చేసుకోవడం– దానికోసం త్యాగాలు చేయాలి, రాజీ పడాలీ అంటాడు. తనతో తాను నూటికి నూరు శాతం ఏకీభవించే అంశాలైతే, అలా అరుదుగా జరిగినప్పటికీ, వాటిని వ్యాసాలుగా రాస్తాననీ; ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయదలిచినప్పుడు కథకుగానీ నవలకుగానీ పూనుకుంటాననీ చెబుతాడు. అలాగని రచయితేమీ దేవుడు కాదు, ఎలాగైనా పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోవడానికి; ఒకసారంటూ వాటికి ప్రాణం పోశాక వాటిని రచయితైనా నిలువరించలేడని చెబుతాడు. ఇజ్రాయెల్‌లో జన్మించినవాడిగా వాస్తవం నుంచి పారిపోలేననీ, ఒక అన్యాయం పట్ల తిరుగుబాటుగా తాను రాస్తాననీ అంటాడు. తక్కువ విస్తృతి ఉన్నప్పటికీ హీబ్రూలోనే రాయడానికి కారణం, అది తాను నవ్వే, శపించే, కలలుగనే భాష కాబట్టి, అంటాడు. ఒకవేళ దేశం వదిలి పెట్టాల్సివచ్చినా భాషను వదులుకోనని చెబుతాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణను న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయ పోరాటంగా చూస్తాడు. అదే ట్రాజెడీ అనీ, ఇద్దరూ భూమిని పంచుకుని పరస్పరం సహకరించుకోవడం మినహా మార్గం లేదనీ చెబుతాడు. పీస్ నౌ మూవ్మెంట్ ఆద్యుల్లో ఒకడైన ఏమస్ ఓజ్ మొన్న 2018 డిసెంబర్ 28న మరణించాడు. -
పటాలను చూస్తే భయపడి పోతున్న ఇజ్రాయిల్
-
గాలిపటాలు వస్తాయి.. కాల్చి పడేస్తాయి
జెరూసలేం : ఇజ్రాయిల్ ప్రజలు గాలి పటాలను చూస్తే భయపడి పోతున్నారు. గాల్లో ఎగిరే గాలి పటాలు ఎక్కడ కనిపించినా వాటికి దూరంగా పరిగెడుతున్నారు. గాలి పటాలు చక్కగా ఎగరేయాలి గానీ భయపడటం దేనికి? అనుకుంటున్నారా. అవి మామూలు గాలి పటాలు కాదు మరి.. అడవులను, ఊర్లను తగలపెట్టే నిప్పు పటాలు. అసలు సంగతేంటంటే.. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మామూలుగా ఈ రెండు దేశాలు బాంబులతో, మిసైల్లతో, పెద్ద పెద్ద గన్నులతో దాడులు చేసుకునేవి. కానీ పాలస్తీనాకు ఇప్పుడు వినూత్నంగా గాలి పటాలను రంగంలోకి దింపింది. చిన్న, భారీ సైజులో ఉండే ఈ గాలి పటాల తోకల చివర నిప్పుపెట్టి ఇజ్రాయెల్ దేశంలోకి ఎగరేసింది. అంతే అలా ఆ గాలి పటాలు అడవులను, ఊర్లను తగుల బెట్టుకుంటూ పోయాయి. గాలి పటాల వల్ల అటవీ ప్రాంతాలు, ఊర్లు తగలబడటం వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కేవలం గాలి పటాలనే కాదు బెలూన్లను సైతం ఇజ్రాయెల్ దేశంలోకి వదిలింది పాలస్తీనా. వీటి కారణంగా శనివారం ఒక్క రోజే పది చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విసిగిపోయిన ఇజ్రాయెల్ ఈ దాడులకు ప్రతిగా పాలస్తీనా ప్రధాన నాయకుడి కారును పేల్చిసింది. -
‘నేను అమరుడినైనా సరే.. కంచె దాటుతా’
గాజా, పాలస్తీనా : ఇజ్రాయెల్-గాజా సరిహద్దులో పాలస్తీనియన్లు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. శరణార్థులను తిరిగి ఇజ్రాయెల్‌లోకి అనుమతించాలంటూ ఆరు వారాల పాటు నిరసన వ్యక్తం చేయాలని పాలస్తీనియన్ సున్ని ముస్లిం సంస్థ ‘హమాస్’ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగాయి. టైర్లను మండించడం ద్వారా పొగ వ్యాప్తి చేసి సైనికుల దృష్టిని మళ్లించి కంచెను తొలగించాలని నిరసనకారులు ప్రయత్నించారు. అంతేకాకుండా వారిపై రాళ్లు విసరడంతో ఇజ్రాయెల్ సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపారు. వారం క్రితం ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో సైనికుల కాల్పుల్లో ఇప్పటికే 20 మంది పాలస్తీనియన్లు మరణించారు. ‘ద ఫ్రైడే ఆఫ్ ఓల్డ్ టైర్స్’ పేరిట శుక్రవారం చేపట్టిన నిరసనలో మరో ముగ్గురు మరణించగా.. సుమారు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ‘హమాస్ దాడులను ప్రోత్సహిస్తోంది’.. ఈ నిరసనలో మరణించిన వారి కుటుంబానికి 3 వేల డాలర్లు, తీవ్రంగా గాయపడిన వారికి 5 వందల డాలర్లు, గాయపడిన వారికి 2 వందల డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని హమాస్ ప్రకటించింది. హమాస్ నిర్ణయం దాడులను ప్రోత్సహించేలా ఉందని ఇజ్రాయెల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆవేదన పట్టించుకోరా... బాంబు దాడులు, సైనికుల కాల్పులు, నిరసనలతో రణరంగంగా మారిన గాజా ఎల్లప్పుడూ పౌరుల ఆర్తనాదాలతో మారుమోగుతూనే ఉంటుంది. అయినా వారు వెనకడుగు వేయకుండా తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం విడిచి వెళ్లి, కష్టాలు అనుభవిస్తున్న యూధు శరణార్థులను తిరిగి దేశంలోకి అనుమతించాలంటూ పాలస్తీనియన్లు సరిహద్దులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ‘ఈరోజు నేను అమరుడినైనా సరే.. కంచె దాటుతానంటూ’ సైనికుల చేతుల్లో గాయపడిన 20 ఏళ్ల అహ్మద్ ఘాలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘గత వారం జరిగిన కాల్పుల్లో నేను గాయపడ్డాను.. కానీ ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకున్నాను. మా పోరాటం ఆగదంటూ’ ఖాన్ యూనిస్ అనే పాలస్తీనియన్ బాధ వెళ్లగక్కాడు. ‘మా ప్రాణాలు పోయినా సరే.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరం నిరసన వ్యక్తం చేస్తాం. ఎందుకంటే మేము బలహీనులం కాదని నిరూపించాలనుకుంటున్నాం’ అని మరో నిరసనకారుడు హెచ్చరించాడు. ఇది చట్ట విరుద్దం.. సరిహద్దులో నిరసన తెలపడం ద్వారా ప్రాణాలు ప్రమాదంలో పడతాయంటూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి నిరసనకారులను హెచ్చరించారు. పాలస్తీనియన్ల పట్ల ప్రభుత్వ తీరును ఖండించిన హక్కుల సంఘాలను ఉద్దేశించి.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. దీనిని ఖండిస్తున్నాం.. : అమెరికా రాయబారి సరిహద్దు ప్రాంతం నుంచి వెళ్లిపోవాల్సిందిగా పాలస్తీనియన్లను శ్వేత సౌధ రాయబారి కోరారు. ‘హింసకు పాల్పడాలని పిలుపునిచ్చిన నాయకులు చిన్నారులను కూడా ఈ నిరసనలోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా దీన్ని ఎంత మాత్రం సహించదని, ఈ చర్యలను ఖండిస్తున్నాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిరసన హింసాత్మకం : 16 మంది మృతి
గాజా, పాలస్తీనా : ఇజ్రాయెల్-గాజా సరిహద్దులో పాలస్తీనియన్లు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పాలస్తీనియన్లు- ఇజ్రాయెల్ దళాల మధ్య చెలరేగిన గొడవల్లో 16 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 11 వందల మంది గాయాలపాలయ్యారు. శరణార్థులు తిరిగి ఇజ్రాయెల్‌కు వచ్చే అంశంపై ఆరు వారాల పాటు ఇజ్రాయెల్-గాజా సరిహద్దులో నిరసన చేపట్టాలని పాలస్తీనియన్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీ శనివారం నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమం హింసాత్మకమైంది. ఇజ్రాయెల్ నుంచి జెరూసలేంకు అమెరికా ఎంబసీని మార్చనున్నట్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫొటోలను నిరసనకారులు తగులబెట్టారు. దీంతో 30 వేల మందిపై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లను ఉపయోగించి ఏడుపు వాయువును ప్రయోగించింది. ఇజ్రాయెల్ సరిహద్దులోని ఫెన్సింగ్‌కు హాని కలిగించడం వల్లే ఆందోళనకారులపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. -
అంతా భారత్ చేతుల్లోనే!
ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. అంతకుముందు, మోదీకి రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. రమల్లా: ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. శాంతి నెలకొల్పే అంశంలో వివిధ దేశాలతో చర్చించి ఒప్పించాల్సిన బాధ్యతను మోదీ భుజస్కంధాలపై పెట్టారు. అంతకుముందు, మోదీకి (పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధాని) రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఆరు ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు. తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రభావం కారణంగానే ఈ శాంతిప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని కోరామని అబ్బాస్ వెల్లడించారు. పాలస్తీనాకు అండగా ఉంటాం పాలస్తీనా ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మోదీ అన్నారు. ‘భారత్, పాలస్తీనాల మధ్య స్నేహం పురాతనమైనది. పాలస్తీనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. చర్చల ప్రక్రియ ద్వారా పాలస్తీనా త్వరలోనే స్వతంత్ర, సార్వభౌమ దేశంగా నిలవనుంది’ అని మోదీ అన్నారు. పాలస్తీనాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పే ప్రక్రియలో భారత్ మద్దతుంటుందని.. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని మోదీ తెలిపారు. దౌత్యం, దూరదృష్టి మాత్రమే హింసకు అడ్డుకట్ట వేయగలవన్నారు. ‘ఇదేమీ అంత సులభమైన విషయం కాదు. కానీ మేం ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. యూఏఈతో ఐదు ఒప్పందాలు పాలస్తీనాలో శాంతి నెలకొల్పేందుకు భారత నాయకత్వం మొదట్నుంచీ అండగా నిలుస్తోందని అబ్బాస్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. పాలస్తీనాతోపాటు పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొంటున్న పరిస్థితులను మోదీకి వివరించామన్నారు. అయితే.. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా అంగీకరించాల్సిందేనని అబ్బాస్ పేర్కొన్నారు. జోర్డాన్ నుంచి యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీకి అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమై.. విస్తృతాంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057వరకు 40 ఏళ్లపాటు అమ ల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మోదీకి అరుదైన గౌరవం పాలస్తీనా పర్యటన సందర్భంగా మోదీకి ఆ దేశం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. అంతకుముందు జోర్డాన్ రాజధాని అమ్మన్ నుంచి రమల్లా వరకు మోదీ హెలికాప్టర్‌కు ఇజ్రాయెల్ హెలికాప్టర్లు రక్షణగా వచ్చాయి. హెలికాప్టర్ దిగగానే.. పాలస్తీనా ప్రధాని హమ్దల్లా స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష భవనం (మఖాటా)లో ఏర్పాటుచేసిన స్వాగత కార్యక్రమానికి అబ్బాస్ ఆలింగనంతో ఆహ్వానించారు. రమల్లాలోని యాసర్ అరాఫత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. పాలస్తీనా తమ విదేశీ అతిథులకిచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో మోదీని సత్కరిస్తున్న పాలస్తీనా ప్రధాని మహమూద్ అబ్బాస్. శనివారం రమల్లాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని అందించారు. -
పశ్చిమాసియాతో బంధం కీలకం
న్యూఢిల్లీ/రమల్లా/ అమాన్: నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమాన్‌లో మోదీకి ఆ దేశ ప్రధాని హని అల్– ముల్కి ఘన స్వాగతం పలికి, ఆయన్ని రాజప్రాసాదానికి తీసుకెళ్లారు. అక్కడ మోదీకి రాజు అబ్దుల్లా–2 సాదర స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. రాజు అబ్దుల్లా–2తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని తర్వాత మోదీ అన్నారు. భారత విదేశీ సంబంధాల్లో పశ్చిమాసియాకు కీలక స్థానం ఉందని తెలిపారు. శనివారం పాలస్తీనా వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని మహ్మద్ అబ్బాస్‌తో భేటీ అవుతారు. భారత్ ప్రధాని ఒకరు పాలస్తీనాలో పర్యటించటం ఇదే ప్రథమం. అక్కడి నుంచి యూఏఈ వెళతారు. ఆ దేశ పాలకుడు, ప్రధానితోపాటు, అక్కడి భారతీయ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ఇంధన భద్రత, మౌలికరంగాల్లో యూఏఈ సుమారు 11 మిలియన్ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దుబాయ్‌లో నిర్మించిన హిందూ దేవాలయం ప్రారంభోత్సవంలో ఆదివారం పాల్గొన్న అనంతరం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తారు. అక్కడి నుంచి పర్యటనలో చివరిగా ఒమన్ చేరుకుంటారు. ఒమన్ సుల్తాన్‌తోపాటు ముఖ్యనేతలతో పాటు అక్కడి ముఖ్య వ్యాపారవేత్తలతో భేటీ అయి పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటారు. భారత్ పాత్ర కీలకం: అబ్బాస్ పశ్చిమాసియా శాంతి చర్చల్లో భారత్ కీలకపాత్ర పోషించాలని పాలస్తీనా ప్రధాని మహ్మద్ అబ్బాస్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ చారిత్రక పర్యటన సందర్భంగా ఈ విషయమై చర్చిస్తామని వివరించారు. ఇజ్రాయెల్‌తో తుది ఒప్పందం కుదిరేలా అన్ని వర్గాలతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపైనా మోదీతో మాట్లాడుతానన్నారు. బడ్జెట్‌ను ప్రజలకు వివరించండి! కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పేదలు, రైతుల అనుకూల సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. క్షేత్రస్థాయిలో ఈ పథకాలను వివరించటంలో ఎంపీలు ప్రయత్నంపైనే వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ఆధారపడి ఉంటుందన్నారు. శుక్రవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలనుద్దేశించి మోదీ మాట్లాడారు. బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించాలని.. వీటిని మరింత విస్తృతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీలకు సూచించారు. -
సొరంగం ధ్వంసం.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ షాక్
జెరూసలెం : పాలస్తీనాకు చెందిన ఓ సొరంగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వైమానిక దాడులతో తాము దానిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ సైనిక వ్యవహారాల అధికారిక ప్రతినిధి జోనాథన్ కాంక్రియస్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ హమాస్‌లో పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ ఉద్యమ సమయంలో ఆ సొరంగాన్ని ఏర్పాటు చేశారని, దాని సాయంతోనే స్మగ్లింగ్‌ను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు కుట్రలు చేసేవారని అన్నారు. గతంలో ఇలాంటి సొరంగ మార్గాలన్నింటినీ కూడా దాడులు చేసేందుకే ఉపయోగించేవారని చెప్పారు. ఈ సొరంగం గాజా స్ట్రిప్ నుంచి తమ దేశం మీదుగా ఈజిప్టు వరకు ఉందని తెలిపారు. తాము నిర్వహించిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే, ఈ సొరంగం ఇప్పటికీ కొనసాగతున్నట్లు వెల్లడించారు. గ్యాస్‌పైప్ లైన్ మాదిరిగా ఈ సొరంగ నిర్మాణం భారీ గోడలతో జరిగినట్లు వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందే వారు వైమానిక దాడులు జరపడం గమనార్హం. -
ఉద్యమ నేత కాల్చివేత...
జెరూసలేం : పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. గాజాలోని వెస్ట్ బ్యాంక్ వద్ద పాలస్తీనియన్ ఉద్యమ నేత అయిన ఇబ్రహీం అబు తురాయను శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం కాల్చి చంపటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వీల్ చైర్లో ఉన్న అబును ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా కాల్చటంపై పాలస్తీనీయులను మండిపడుతున్నారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలోనే... పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలోనే తిరిగి ఆందోళనలు మొదలయ్యాయి. చేపలు పట్టుకుని జీవించే తురాయా 2008లో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడుల్లో తన రెండు కాళ్లు కోల్పోయి వీల్‌చైర్‌కు పరిమితం అయ్యారు. అయినా కార్లు తుడుచుకుంటూ ఆయన హక్కుల పోరాటంలో పాల్గొనేవారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రతీ ప్రదర్శనలోనూ ఆయన ముందుంటారు. అప్పుడు కాళ్లు మాత్రమే కోల్పోయిన ఆయన.. ఇప్పుడు అదే ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో ఏకంగా ప్రాణమే పొగొట్టుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రగులుతున్న పాలస్తీనా... తురాయ మరణ వార్త తెలుసుకోగానే మొత్తం పాలస్తీనీయులు భగ్గుమన్నారు. ఆయనను కాల్చి చంపిన వీడియోలు కొన్ని సోషల్ మీడియలో వైరల్ కావటంతో ఆగ్రహ జ్వాలలు తారా స్థాయికి చేరుకున్నాయి. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహణకు పెద్ద ఎత్తున్న ప్రజలు హాజరయ్యారు. రెండు రోజుల నుంచి రోడ్లపై ఆందోళన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన రెండు రోజుల ముందు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు పాలస్తీనీయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ‘‘ఇది(జెరూసలేం) మన భూమి.. వదిలే ప్రసక్తే లేదు. అమెరికా తన ప్రకటన వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆయన మరణం ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించకపోవటం విశేషం. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదంలో మరో మలుపు -
అరబ్ దేశాల ఆగ్రహం... అమెరికాకు తీవ్ర హెచ్చరిక
తెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరూసలేం ప్రకటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఉగ్రవాదులను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారంటూ చెప్పుకుంటున్న నేపథ్యంలోనే ఓ గట్టి వార్నింగ్ వచ్చి పడింది. ఇరాక్‌కు చెందిన అల్-నొజాబా అనే మిలిటెంట్ సంస్థ తమ దేశంలో మోహరించిన అమెరికా సైన్యంపై ఏ క్షణంలోనైనా దాడి చేస్తామని ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్ అక్రమ్ అల్ కాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 1500 మంది సైన్యంతో ఐసిస్‌తో కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పని చేస్తోంది. సుమారు 6 వేల మంది అమెరికా సైనికులు మోహరించినట్లు పెంటగాన్ వెల్లడించగా.. ఆ సంఖ్య 9 వేల దాకా ఉండొచ్చన్న మరో అంచనా ఉంది. కాగా, ట్రంప్ వ్యాఖ్యలతో వారందరికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టెల్ అవివ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్రంప్ చేసిన ప్రకటనను అరబ్ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. భారత్ తటస్థం... ? పాలస్తీనా విషయంలో తాము తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ భారత్ తరఫున ప్రకటన చేశారు. భారత్ తన అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే ఉంటుందని, దీన్ని ఏ మూడో దేశం నిర్ణయించబోదని తేల్చి చెప్పారు. -
ఒకే గుండెతో పుట్టారు.. విడదీయగలరా?
హెబ్రోన్: పాలస్తీనాకు చెందిన ఓ మహిళ గురువారం ఒకే గుండెతో పుట్టిన ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సాధారణంగా జన్యులోపాల కారణంగా కవలలు ఇలా జన్మిస్తారు. వీరికి అసిల్, హదిల్ అని పేర్లు పెట్టినట్లు వారి తండ్రి అన్వర్ జ్వాదత్ తెలిపారు. పిల్లలను వేరు చేయడానికి కుదురుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. అయితే, పాలస్తీనాలో అంత టెక్నాలజీ అందుబాబులో లేదని సౌదీ అరేబియాలో ఆపరేషన్ సాధ్యపడుతుందని చెప్పినట్లు వివరించారు. అసిల్, హదిల్ల శరీరాలు నడుము భాగం నుంచి గుండె వరకూ కలిసి ఉన్నాయి. ఇరువురికీ ఒకే గుండె ఉంది. దీంతో ఇరువురినీ వేరు చేయాలంటే ఇద్దరు బిడ్డల్లో ఒకరికి వేరే గుండెను అమర్చాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు చాలా డబ్బు అవసరమవుతుందని ఇప్పటివరకూ దాతలెవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని అన్వర్ తెలిపారు. పాలస్తీనాలో వైద్యం కోసం ఎదురుచూసేవారికి ఇజ్రాయెల్ వైద్య సాయం చేస్తుంది. ఆ వైద్యానికి అయ్యే ఖర్చు మాత్రం పాలస్తీనా ప్రభుత్వం భరిస్తుంది. అయితే, ఈ కవలలకు అవసరమయ్యే ఆపరేషన్‌పై ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం ఇంకా ప్రకటించలేదు.