టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాయకుడు, నటుడు ఇదాన్ అమేదీ తీవ్రంగా గాయపడ్డారు. గాజాలో నిర్వహిస్తున్న భూతల దాడుల్లో ఆయన తీవ్రంగా గాయాలపాలైనట్లు ఇజ్రాయెల్ దౌత్యవేత్త అవియా లెవీ వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే.
యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఇదాన్ అమేదీ సైన్యంలో చేరారు. అప్పట్లో ఓ పోస్టు కూడా పెట్టాడు. ఫౌదాలో ఇది దృశ్యం కాదు.. నిజ జీవితం అని రాసుకొచ్చాడు. ఇజ్రాయెల్ సైన్యం ఎదుర్కొంటున్న కష్టాలను స్ఫూర్తిగా తీసుకుని ఫౌదా సిరీస్‌ను కూడా నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది మంచి ప్రజాధరణ పొందింది.
గత ఏడాది అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షాలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధంలో ఇప్పటికే హమాస్ వైపు 22 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఇజ్రాయెల్ వైపు 1100లకు పైగా మరణించారు. యుద్ధం ప్రారంభంలోనే ఇజ్రాయెల్ మూడు లక్షల రిజర్వు సైన్యాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఇదాన్ అమేదీతో పాటు ఈ ఫౌదా సిరీస్‌లో నటించిన లియర్ రాజ్ కూడా యుద్ధంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: India-Maldives Controversy: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా
Comments
Please login to add a commentAdd a comment