
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా బందీల విడుదలను ఆలస్యం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు.
మా బందీలు సురక్షితంగా విడిచి పెట్టే వరకు.. పాలస్తీనా బందీలను విడుదల చేయడంలో ఆలస్యం చేయాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌తో పాటు ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు’ అని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
ఫలితంగా,హమాస్ చరనుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు సురక్షితంగా విడుదలవ్వగా.. 110 మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ తమ అదుపులోనే ఉంచుకుంది. దీంతో చేసేది లేక 110 మంది బందీల విడుదలలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా హమాస్ మధ్యవర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment