ఖాన్‌యూనిస్: ఇజ్రాయెల్ నిరంతరాయంగా కనికరం లేకుండా జరుపుతున్న దాడుల్లో పాలస్తీనియన్ల కుటుంబాలు సమిధలవుతున్నాయి. గురువారం ఖాన్‌యూనిస్‌కు సమీపంలోని ఓ ఇంటిపై జరిగిన దాడితో అందులో సలాహ్ కుటుంబానికి చెందిన 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో అయిదేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. వీరంతా గాజాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు.
హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. అటు.. యుద్ధం లెబనాన్ రాజధాని బీరూట్ వైపు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరూరిని ఇజ్రాయెల్ సేనలు మంగళవారం హతమార్చారు. అరూరి అంగరక్షకులు కూడా ఈ యుద్ధంలో మరణించారు. ఈ ఘటన అనంతరం ఇరువర్గాల మధ్య పరిస్థితులు మరింత వేడెక్కాయి. బందీల అప్పగింతపై చర్చలు ముందుకు సాగడం కష్టంగా మారింది.
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష‍్యమని ఇజ్రాయెల్ యుద్ధంలో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22,185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment