పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్‌ క్రిస్మస్‌ ట్రీ! | Pro Palestine Protesters Scale 83 Ft Tall Christmas Tree Goes Viral | Sakshi
Sakshi News home page

పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్‌ క్రిస్మస్‌ ట్రీ

Published Mon, Dec 25 2023 11:14 AM | Last Updated on Mon, Dec 25 2023 11:32 AM

Pro Palestine Protesters Scale 83 Ft Tall Christmas Tree Goes Viral - Sakshi

క్రిస్మస్‌ వేడుకలతో హోరెత్తిపోవాల్సిన పాలస్తీనా నగరాలు నిర్వికారంగా మారాయి. అందులోకి క్రీస్తూ నడయాడిన ప్రాంతంగా పేరుగాంచిన పాలస్తీనా పర్యాటకుల సందడితో కళకళలాడాల్సిన వీధులన్నీ ముళ్లకంచెలు, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. కొందరు నిరసనకారులు యుద్ధానికి విరామం ప్రకటించి క్రిస్మస్‌ వేడకలకు అనుమతి ఇవ్వాలని వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం గమనార్హం. అయితే వాటిని కూడా అధికారులు అడ్డుకుని దొరికిని వారిని దొరికినట్టుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శాన్‌ఫ్రాన్సిస్కోలో శనివారం పాలస్తీనాలో జరిగిన నిరసనల్లో ఒక నినాదం అందర్నీ ప్రముఖంగా ఆకర్షించింది. మారణహోమంలో ఎప్పటిలానే కిస్మస్‌ ఉండదు అనే నినాదం అందర్నీ ఆలోచింపచేసేలా ఉంది.  

ఈ నినాదాలతో యూనియన్‌ స్కేర్‌ వద్ద ఉన్న ప్రసిద్ధ ఐకానిక్‌ క్రిస్మస్‌ చెట్టు పైకి ఓ నిరసనకారుడు ప్లకార్డులు, జాతీయ జెండాతో పైకెక్కుత్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఇజ్రాయెల్‌ హామాస్‌ యుద్ధం కారణంగా వేడుకలును నిషేధించారు అధికారులు. దీంతో వేలామంది నిరసకారులు వ్యతిరేకిస్తూ రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అలానే క్రిస్మస్‌ వేడుకలు అట్టహాసంగా జరిగే యూనియన్‌ స్కేర్‌ వద్ద మరింతగ నిరసనలు జరిగాయి. అందులోనూ సుమారు 83 అడుగుల ఎత్తైన క్రిస్మస్‌ చెట్టువద్దకు పెద్ద ఎత్తున నిరసకారుల వచ్చారు. అందులో ఒక నిరసనకారుడు శనివారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆ చెట్టును ఎక్కుతూ నిరసనలు చేయడగమే గాక, అతనికి మద్దతు తెలుపుతూ మరికొంతమంది నిరసకారులు నిరసనలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అల్లకల్లోలం, విధ్యంసానికి తెగబడిన అనేకమంది నిరసకారులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

నిజానికి హమాస్‌ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం. దీన్ని ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌లా చేపట్టి హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించడం లేదా బంధీలుగా పట్టుకోవడం చేయాల్సింది. ఇలా నేరుగా యుద్ధానికే తెగబడితే చాలావరకు సాధారణ పౌరులు, అమాయక ప్రజలే బలవ్వుతారు. ఎందరో అనాథలవుతారు. ఈ విధ్వసం అమాయక ప్రజలను బలిగొనడం కంటే జరిగే ప్రయోజనం శూన్యం. యుద్ధంతో దేన్ని నివారించలేం. దాని వల్ల కలిగే ప్రయోజనం కూడా ఏం ఉడదు. వెనుదిరిగి చూసినా.. లేదా ఆత్మ పరిశీలన చేసుకున్నా ఎందుకోసం ఈ యుద్ధం చేశాం అని అనిపించక మానదు. ఎవరు నష్టపోయారు? ఏం మిగిలింది? అంటే.. చెప్పేందుకు కూడా ఏం ఉండదు. తెలివైన వాడు ఎప్పుడు తనకు దెబ్బ తగలకుండా ప్రత్యర్థి ఆటను కట్టించగలగాలే గానే నేరుగా యుద్ధానికి కాలు దువ్వి తనని తన దేశాన్ని దెబ్బతినేలా చేయకూడదు.

ప్రపంచ దేశాలన్నే ఈ విషయమే ఘంటా పథంగా చెబుతున్నా వినకుండా ముందుగా రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి సై అంది. ప్రపంచదేశాలన్ని నెత్తినోరుకొట్టుకుని చెప్పినా వినలేదు. చివరికీ జనాభా తగ్గి.. సైనం కొరత ఏర్పడి, నానా అగచాట్టు పడుతోంది రష్యా. అది మరవక మునుపై ఈ హామాస్‌ యుద్ధం. నిజానికి డిసెంబర్‌ నెల వచ్చేటప్పటికీ క్రిస్మస్‌ వేడుకలతో హోరెత్తాల్సిన పాలస్తీనా నగరం శిథిలా నగరంగా మారపోయింది. పర్యాటకుల సందడితో మంచి ఆదాయాలను ఆర్జిస్తూ ఉండాల్సిన టైం తనకు తానే ఆర్థిక పరిస్థితిపై గండి కొట్టుకునేలా చేసింది ఈ యుద్ధం. నిజానికి పాలస్తీనా హమాస్‌ మిలిటెంట్‌లను అంతం చేస్తుందా లేక తనకు తానుగా యుద్ధం పేరుతో ఆర్థిక పరంగా, అభివృద్ధిపరంగా వెనకబడిపోతుందా అనేది కాలం తప్పక తెలియజేస్తుంది. ఆ తర్వాత తప్పిదమని తెలుసుకున్నా.. చేయాల్సిందేముండదు. ఇది దేశ పరంగానే కాదు ఓ కుటుంబ పరంగానైనా సరే ఏ వివాదాన్నైనా సంయమనంతో సమస్యను క్లియర్‌ చేసుకుంటూ పోవాలే తప్ప యుద్ధోన్మాదంతో మాత్రం కాదు. 

(చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)


 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement