Christmas Tree
-
మేలిమి బంగారంతో ఖరీదైన క్రిస్మస్ ట్రీ, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీని తయారు చేయిడం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ వార్తల్లో నిలిచింది. జర్మనీ ఈ స్పెషల్ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని మేలిమి బంగారు నాణాలతో రూపొందింది ఆవిష్కరించింది. ఆశ్చర్యంగా ఉంది కదా..రండి దీని విశేషాల గురించి తెలుసుకుందాం.అద్బుతమైన బంగారపు ట్రీని మ్యూనిచ్‌లోని బులియన్ డీలర్స్ ప్రో ఆరమ్ (Pro Aurum) తయారు చేసిందట. 10 అడుగుల ఎత్తు, దాదాపు 60 కిలోల బరువు, 2,024 (ఏడాదికి గుర్తుగా) బంగారు వియన్నా ఫిల్హార్మోనిక్ నాణేలతో ఈ ట్రీని తయారు చేశారు. ఈ నాణేం ఒక్కోటి ఒక ఔన్స్ బరువు ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీల పైభాగంలో నక్షత్రం లేదా దేవదూత స్థానంలో 24 క్యారెట్ల బంగారు నాణెంతో(ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణేల్లో ఇదొకటి) వినియోగించారు. ఈ ట్రీని వియన్నా మ్యూసిక్వెరిన్ గోల్డెన్ హాల్ లాగా కనిపించే ఒక వేదికపై ఉంచారు. దీని విలువ ఏకంగా రూ.46 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది అత్యంత ఖరీదైన క్రిస్మస్ చెట్లలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.కంపెనీ ప్రతినిధి బెంజమిన్ సుమ్మ అందించిన వివరాల ప్రకారంప్రతీ ఏడాది ఇలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తమ కంపెనీ 35వ వార్షికోత్సవానికి చిహ్నంగా ఈ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది కేవలం పండుగ అలంకరణ మాత్రమే కాదనీ, బంగారం విలువ తెలియ చేయడం కూడా ఒక ముఖ్య అంశమని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చెట్టుగా రికార్డుల్లో నిలిచిన ఘనత మాత్రం అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో ప్రదర్శించిన క్రిస్మస్ ట్రీకే దక్కుతుంది.2010లొ 43అడుగులతో 11.4 మిలియన్ డాలర్లు వెచ్చించి వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, ఇతర విలువైన రాళ్లతో దీన్ని తయారు చేశారు. -
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్‌ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ!
క్రిస్మస్ వేడుకలతో హోరెత్తిపోవాల్సిన పాలస్తీనా నగరాలు నిర్వికారంగా మారాయి. అందులోకి క్రీస్తూ నడయాడిన ప్రాంతంగా పేరుగాంచిన పాలస్తీనా పర్యాటకుల సందడితో కళకళలాడాల్సిన వీధులన్నీ ముళ్లకంచెలు, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. కొందరు నిరసనకారులు యుద్ధానికి విరామం ప్రకటించి క్రిస్మస్ వేడకలకు అనుమతి ఇవ్వాలని వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం గమనార్హం. అయితే వాటిని కూడా అధికారులు అడ్డుకుని దొరికిని వారిని దొరికినట్టుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శాన్ఫ్రాన్సిస్కోలో శనివారం పాలస్తీనాలో జరిగిన నిరసనల్లో ఒక నినాదం అందర్నీ ప్రముఖంగా ఆకర్షించింది. మారణహోమంలో ఎప్పటిలానే కిస్మస్ ఉండదు అనే నినాదం అందర్నీ ఆలోచింపచేసేలా ఉంది. ఈ నినాదాలతో యూనియన్ స్కేర్ వద్ద ఉన్న ప్రసిద్ధ ఐకానిక్ క్రిస్మస్ చెట్టు పైకి ఓ నిరసనకారుడు ప్లకార్డులు, జాతీయ జెండాతో పైకెక్కుత్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇజ్రాయెల్ హామాస్ యుద్ధం కారణంగా వేడుకలును నిషేధించారు అధికారులు. దీంతో వేలామంది నిరసకారులు వ్యతిరేకిస్తూ రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అలానే క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగే యూనియన్ స్కేర్ వద్ద మరింతగ నిరసనలు జరిగాయి. అందులోనూ సుమారు 83 అడుగుల ఎత్తైన క్రిస్మస్ చెట్టువద్దకు పెద్ద ఎత్తున నిరసకారుల వచ్చారు. అందులో ఒక నిరసనకారుడు శనివారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆ చెట్టును ఎక్కుతూ నిరసనలు చేయడగమే గాక, అతనికి మద్దతు తెలుపుతూ మరికొంతమంది నిరసకారులు నిరసనలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అల్లకల్లోలం, విధ్యంసానికి తెగబడిన అనేకమంది నిరసకారులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. Pro-Palestine protestor climbs on Christmas tree in Union Square, San Francisco pic.twitter.com/irUAdDgXep — Raw Reporting (@Raw_Reporting) December 24, 2023 నిజానికి హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం. దీన్ని ఓ సీక్రెట్ ఆపరేషన్లా చేపట్టి హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడం లేదా బంధీలుగా పట్టుకోవడం చేయాల్సింది. ఇలా నేరుగా యుద్ధానికే తెగబడితే చాలావరకు సాధారణ పౌరులు, అమాయక ప్రజలే బలవ్వుతారు. ఎందరో అనాథలవుతారు. ఈ విధ్వసం అమాయక ప్రజలను బలిగొనడం కంటే జరిగే ప్రయోజనం శూన్యం. యుద్ధంతో దేన్ని నివారించలేం. దాని వల్ల కలిగే ప్రయోజనం కూడా ఏం ఉడదు. వెనుదిరిగి చూసినా.. లేదా ఆత్మ పరిశీలన చేసుకున్నా ఎందుకోసం ఈ యుద్ధం చేశాం అని అనిపించక మానదు. ఎవరు నష్టపోయారు? ఏం మిగిలింది? అంటే.. చెప్పేందుకు కూడా ఏం ఉండదు. తెలివైన వాడు ఎప్పుడు తనకు దెబ్బ తగలకుండా ప్రత్యర్థి ఆటను కట్టించగలగాలే గానే నేరుగా యుద్ధానికి కాలు దువ్వి తనని తన దేశాన్ని దెబ్బతినేలా చేయకూడదు. ప్రపంచ దేశాలన్నే ఈ విషయమే ఘంటా పథంగా చెబుతున్నా వినకుండా ముందుగా రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి సై అంది. ప్రపంచదేశాలన్ని నెత్తినోరుకొట్టుకుని చెప్పినా వినలేదు. చివరికీ జనాభా తగ్గి.. సైనం కొరత ఏర్పడి, నానా అగచాట్టు పడుతోంది రష్యా. అది మరవక మునుపై ఈ హామాస్ యుద్ధం. నిజానికి డిసెంబర్ నెల వచ్చేటప్పటికీ క్రిస్మస్ వేడుకలతో హోరెత్తాల్సిన పాలస్తీనా నగరం శిథిలా నగరంగా మారపోయింది. పర్యాటకుల సందడితో మంచి ఆదాయాలను ఆర్జిస్తూ ఉండాల్సిన టైం తనకు తానే ఆర్థిక పరిస్థితిపై గండి కొట్టుకునేలా చేసింది ఈ యుద్ధం. నిజానికి పాలస్తీనా హమాస్ మిలిటెంట్లను అంతం చేస్తుందా లేక తనకు తానుగా యుద్ధం పేరుతో ఆర్థిక పరంగా, అభివృద్ధిపరంగా వెనకబడిపోతుందా అనేది కాలం తప్పక తెలియజేస్తుంది. ఆ తర్వాత తప్పిదమని తెలుసుకున్నా.. చేయాల్సిందేముండదు. ఇది దేశ పరంగానే కాదు ఓ కుటుంబ పరంగానైనా సరే ఏ వివాదాన్నైనా సంయమనంతో సమస్యను క్లియర్ చేసుకుంటూ పోవాలే తప్ప యుద్ధోన్మాదంతో మాత్రం కాదు. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
Christmas Tree AI Photos: అమేజింగ్ ఏఐ ఫోటోలు
-
దివిలో దివ్యంగా క్రిస్మస్ ట్రీ!
ఆకాశం అనే కాన్వాస్ అద్భుత చిత్రాలకు వేదిక. తాజా అద్భుతం విషయానికి వస్తే... అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘నాసా’ ఒక చిత్రాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. నాసా వారి ‘చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ’ కాప్చర్ చేసిన ఈ ఫోటోలో అంతరిక్షంలో క్రిస్మస్ ట్రీ కనువిందు చేస్తోంది. భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర సమూహం తాలూకు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతి క్రిస్మన్ టీ ఆకారంలో దర్శనమిస్తోంది. పాలపుంత లోపల ఉన్న ఈ నక్షత్ర సమూహాన్ని ‘ఎన్జీసీ 2264’ అని పిలుస్తారు. దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ బెంగళూరులో ఉంది. వంద అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్రిస్మస్ చెట్టు సబ్రీ నగర్‌లోని ‘ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా’ పరిసరాల్లో ఉంది. ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’గా మారింది. మరో విశేషం ఏమిటంటే మూడుసార్లు గ్రామీ అవార్డ్ గెలుచుకున్న మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ ఈ ట్రీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా లైవ్ మ్యూజిక్ షో చేశాడు. బెంగళూరులో దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ -
Christmas 2023: క్రిస్మస్ ట్రీ థీమ్ ఏంటి?
క్రిస్మస్ కాంతులు సమీపించాయి. బెంగళూరులో 100 అడుగుల నిటారుగా ఇండియాలోనే ఎత్తయిన క్రిస్మస్ ట్రీ వెలిసింది. క్రిస్మస్ వచ్చిందంటే ఇంటింటా స్త్రీలు, పిల్లలు క్రిస్మస్ ట్రీని అలంకరించేందుకు ఉత్సాహపడతారు. క్రిస్మస్ ట్రీని అనేక థీమ్లతోఅలంకరించవచ్చు. క్రిస్మస్ ట్రీ కథనూ ఈ సారి అనువైన థీమ్‌లను తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా నక్షత్రాలు పూసే వేళ. కేకులు సువాసనలు వెదజల్లే వేళ. కానుకలు రిబ్బన్ ముక్కల్లో అందంగా ప్యాక్ అయ్యే వేళ, శాంటా కోసం పిల్లలు ఎదురు చూసే వేళ, ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్టు చిగురించే వేళ. ఏసుక్రీస్తు జన్మదినాన జగతి అంతా రంగులను హత్తుకుంటుంది. కురిసే మంచును కేరింతలతో కోస్తుంది. చర్చ్ గంటలు గణగణమోగుతాయి. స్తోత్రగీతాలు హోరెత్తుతాయి. కొవ్వొత్తులు రెపరెపలాడతాయి. ప్రేమ, త్యాగం, కరుణ... మనిషిని కాపాడేవి ఇవే కదా. ఇలాంటి పర్వదినంలో అలంకరణ ఎలా మిస్ అవుతాము? క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ వేళ ప్రతి ఇంటిపై క్రిస్మస్ స్టార్ వెలుగుతుంది. అలాగే క్రిస్మస్ చెట్టు కూడా కొలువుదీరుతుంది. జన సంస్కృతి నుంచి మెల్లగా పండుగలోకి వచ్చిన చిహ్నం ఇది. శీతల దేశాలలో శీతాకాలం కడు దుర్భరంగా ఉంటుంది. జీవేచ్ఛ అడుగంటుతుంది. అందుకని అప్పటి ప్రజలు పచ్చటి పైన్ లేదా ఫర్ చెట్టు కొమ్మలను తెచ్చి ఇంటి బయట వాటిని అలంకరించేవారు. ఇది పాజిటివ్ వైబ్రేషన్స్‌ను తెస్తుందని భావించేవారు. క్రీస్తు జన్మదినం కూడా శీతాకాలంలో వస్తుంది కాబట్టి ఈ అలంకరణ మెల్లగా ఒక దేశం నుంచి మరో దేశానికి పాకి క్రిస్మస్తో జత కలిసింది. క్రిస్మస్ ట్రీని సతత హరిత జీవనానికీ, జీవితేచ్ఛకూ చిహ్నంగా భావిస్తారు. పచ్చగా వర్థిల్లమనే కామన క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ పండగనాడు ఒక చర్చిలో ఏసు ప్రభువు విగ్రహం ఎదుట అందరూ ఖరీదైన కానుకలు పెడుతుంటే ఒక పేద బాలుడు ఒక పచ్చటి మొక్కను పెట్టాడట. ఆ మొక్క వెంటనే బంగారు కాంతులీనిందట. అప్పటి నుంచి నిరాడంబరమైన ఆరాధనకు గుర్తుగా క్రిస్మస్ ట్రీ వచ్చిందని ఒక కథ. ముఖ్యమైన రంగులు నాలుగు క్రిస్మస్ ట్రీ అలంకరణలో నాలుగు రంగులు కనపడతాయి. తెలుపు రంగు– ఇది స్వచ్ఛతకు గుర్తు. కురిసే మంచుకు కూడా. అందుకే క్రిస్మస్ ట్రీలో పత్తిని తెల్లదనానికి ఉపయోగిస్తారు. ఎరుపు రంగు– ఇది క్రీస్తు రక్తానికి, త్యాగానికి చిహ్నం. శాంటా కూడా ఈ రంగు దుస్తులనే ధరిస్తాడు. ఆకుపచ్చ రంగు– ఇది క్రీస్తు సజీవతను గుర్తు చేస్తుంది. బంగారు రంగు– ఇది సంపదకు, మానవాళికి బహుమతిగా దక్కిన ఏసు మార్గానికి గుర్తు. ఒకప్పుడు ఫర్, పైన్ చెట్ల కొమ్మలను తెచ్చే క్రిస్మస్ ట్రీని తయారు చేసేవారు. ఆ తర్వాత చైనా నుంచి కృత్రిమ చెట్లు వచ్చాయి. కేవలం క్రిస్మస్ ట్రీల కోసమే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో 25 రకాల పైన్, ఫర్ చెట్లను సాగు చేస్తున్నారు. ఇవి ఆరడుగుల ఎత్తు పెరగడానికి ఎనిమిది నుంచి పన్నెండేళ్లు పడతాయి. ఎన్నో థీమ్‌లు సంప్రదాయ క్రిస్మస్ చెట్టును అలంకరించడంలో కొత్తదనం కోసం రకరకాల థీమ్‌లు కూడా వచ్చాయి. మన వీలును బట్టి ఆ థీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇంటికి వచ్చిన వారిని ఆశ్చర్యపరచవచ్చు. ► అండర్ ద సీ: అంటే గవ్వలు, జలకన్యలో, సొరచేపలు, తాబేళ్లు... ఇలాంటి రకరకాల బొమ్మలతో అలంకరించవచ్చు ► రెయిన్ బో: అంటే ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు ఒక్కో దొంతరగా కిందనుంచి పై వరకూ వచ్చేలా ఆయా రంగు కాగితాలను, రిబ్బన్లను, లేదా క్రిస్మస్ బాల్స్ లేదా బెల్స్‌ను కట్టొచ్చు ► ట్రావెల్: విహారం థీమ్‌తో మీనియేచర్ బ్యాగులు, వాహనాలు, ఏరోప్లేన్లు, టికెట్లు, మైలు రాళ్ల బొమ్మలు.. ఇవి ఉపయోగించాలి ► జలపాతం: క్రిస్మస్ ట్రీ నుంచి జలపాతాలు జారుతున్నట్టు బ్లూ రిబ్బను పాయలు పాయలుగా వేలాడగట్టాలి ఏ బెలూన్: ఇది ఈజీ థీమ్. కొమ్మ కొమ్మకు మంచి మంచి బెలూన్లు రకరకాల సైజులవి కట్టడమే. ► చాక్లెట్లు: పిల్లలను ఆకర్షించేలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయాలంటే క్యాండీలు, చాకెట్లు, పిప్పరమెంట్లు, జెమ్స్ ప్యాకెట్లు... కొమ్మ కొమ్మలో దూర్చడమే. ► ఎర్ర పూలు: మన దగ్గర దొరికే ఎర్రరంగు పూలు గులాబీలు కావచ్చు, చామంతులు కావచ్చు, మందారాలు కావచ్చు... వీటితో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తే ఆ లుక్కే వేరు. ఇవి కొన్ని సూచనలు. వీటిని అందుకొని మీ సొంత థీమ్‌తో ఈ క్రిస్మస్ను కళకళలాడించండి. హ్యాపీ క్రిస్మస్. -
వైట్‌హౌస్‌లో క్రిస్మస్ వేడుకలు..డెకరేషన్లో బిజీగా ఉన్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో క్రిస్మస్ చెట్టును చక్కగా అలంకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాము కిస్మస్ చెట్టుకు కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నాం. అందరూ ఈ క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. బైడెన్ ఈ వారం ప్రారంభంలోనే వైట్‌హౌస్ నుంచి క్రిస్మస్ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పెరుగుతున్న విభజిత అమెరికాను, రాజకీయాలను కలుషితం చేస్తున్న వాటిని పరస్పరం వ్యతిరేకించే ప్రక్షాళనతో తాజాగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డెమొక్రాటిక్ నాయకుడు బైడెన్ ఇటీవల ప్రతిపక్ష రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంభించారు. ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని క్షణాలు నిశబ్దంగా ఆలోచించి మన హృదయంలో ఒకరినోకరు స్వచ్ఛంగా చూసుకోవాలనేదే ఆశ. అంతేగాదు క్రిస్మస్ చెట్లను పూలతో, దీపాలతో చక్కగా అలంకరించి చేసుకునే ఈ పండుగ నాడు డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్లుగా కాదు తోటి అమెరికన్లు లేదా తోటి మానవులు అన్న భావంతో సహృదయంతో ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు. Just a few finishing touches! Hope you and your loved ones are having a great Christmas Eve. pic.twitter.com/zdCjjRrI9o — President Biden (@POTUS) December 25, 2022 (చదవండి: అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్) -
Viral: చూస్తుండగానే తలపై క్రిస్మస్ చెట్టు రెడీ..! గిన్నిస్ రికార్డు హెయిర్ స్టైల్
వైరల్: పొడవైన జుట్టంటే ఇష్టపడని అమ్మాయిలే ఉండరనడంలో అతిశయోక్తే లేదు. రోజుకో కొత్త హెయిర్ స్టైల్ చేసుకోవడం అమ్మాయిలకు తెగ అలవాటు. తాజాగా ఓ ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ సరికొత్త హెయిర్ స్టైల్ డిజైన్‌తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ అయినటువంటి డానీ హిస్వానీ 2.90 మీటర్ల (9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ చెట్టు ఆకారంలో ఓ మహిళ జుట్టును అందంగా అలంకరించి రికార్డ్ సృష్టించారు. సెప్టెంబర్ 16న దుబాయ్‌లో ప్రపంచలోనే పొడవైన హెయిర్ స్టైల్‌గా హిస్వాని ఈ ఘనత సాధించారు. కాగా హిస్వాని ప్రపంచ ఫ్యాషన్ మ్యగజైన్లు, పెనెలోప్ క్రజ్, దీపిక పదుకొనె, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఈ కేశాలంకరణ చేసిన విధానాన్ని తెలుపుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసింది. ఇందులో హిస్వాని ముందుగా మోడల్ తలకు సపోర్ట్‌గా ఓ హెల్మెట్‌ను పెట్టింది. దానిపై మూడు మెటల్ రాడ్లు అమర్చి జుట్టును క్రిస్మస్ చెట్టు ఆకారంలో వచ్చేందుకు విగ్‌లు, హెయిర్ ఎక్స్టన్షన్స్ను ఉపయోగించించారు. చివరికి హెయిర్ స్టైల్ అనుకున్న సైజ్‌లో వచ్చేందుకు పై అంతస్తుకు వెళ్లీ మరీ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. చదవండి: యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
అదిరేటి హెయిర్‌స్టైల్.. గిన్నిస్ రికార్డు
-
స్వయం కృతాపరాధం: డ్రగ్స్‌తో అలంకరించి ఫోటోలు తీశాడు... అంతే చివరికి!!
Drug Dealer Decorated Christmas Tree With Cash And Cocaine: కొంతమంది అత్యుత్సహం లేదా వింతగా చేయాలనో చేసే పనులు వాళ్లను ఏ స్థితికి తీసుకువెళ్లుతుందో కూడా చెప్పలేం. ఒకచోట ఒక కుటుంబం క్రిస్మస్ చెట్టుని మంచి విద్యుత్ బల్బులతో అలంకరించి పెద్ద అగ్నిప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఈ వ్యక్తి విన్నూతనంగా క్రిస్మస్ చెట్టును అలంకరించి తనను తానే పోలీసులకు పట్టుబడేలా చేసుకున్నాడు. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) అసలు విషయలోకెళ్లితే.... యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మార్విన్ పోర్సెల్లి అనే ఒక డ్రగ్ డీలర్ క్రిస్మస్ చెట్టుని డబ్బులతోనూ, మాదక ద్రవ్యాలతోనూ అందంగా అలంకరించాడు. పోనీ అక్కడితే ఆగకుండా వాటిని తన మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అంతే ఆ ఫోటోలు కాస్త ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్ పోలీసులకు చేరడంతో పోర్సెల్లిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఆ క్రిస్మస్ చెట్టు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా డ్రగ్స్‌కి బానిసైతే వారి అభిరుచి ఇంతటి విచిత్రమైన అలంకరణకు పురిగొలుపుతుందని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఆ వ్యక్తి నుంచి సుమారు రూ 37 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం అని అన్నారు. అంతేకాదు ఓవర్‌బోర్డ్ అనే పేరుతో ఒక సంవత్సరం పాటు సాగిన ఆపరేషన్‌లో పోర్సెల్లిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో పోర్సెల్లి తోపాటు మరో ఎనిమిది మందిని కూడా అరెస్టు చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) Can you imagine our surprise when we searched the mobile of Wavertree drug dealer Marvin Porcelli and found this?! 😮 pic.twitter.com/CvLOiFOwyJ — Merseyside Police (@MerseyPolice) December 20, 2021 We also caught eight other (un)wise men as part of Overboard and found lots of interesting parcels under the tree (as well as in other parts of their houses), namely drugs worth £1.3m pic.twitter.com/PeHOv8n4RO — Merseyside Police (@MerseyPolice) December 20, 2021 -
క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!
క్రిస్మస్ పండగ అనంగానే అందరికి ముందుగా గుర్తు వచ్చేది శాంతాక్లాజ్(క్రిస్మస్ తాత), క్రిసమస్ చెట్లు అవునా!. పైగా పిల్లలకు మంచి గిఫ్ట్‌లు ఇచ్చే శాంతాక్లాజ్(క్రిస్మస్ తాత)నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ క్రిస్మస్ చెట్టు. ప్రతి ఒక్కరూ చాలా అందంగా అలంకరిస్తారు. అయితే ఈ అలంకరించేటప్పడూ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా పెద ప్రమాదాలు సంభవిస్తాయంటున్నారు నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అధికారులు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) అసలు విషయంలోకెళ్లితే...అందరూ క్రిస్మస్ పండుగ రోజు ప్రతి ఒక్కరూ క్రిస్మస్ చెట్టుని చాలా అందంగా అలంకరిచటమే కాకుండా విద్యుత్ దీపాలతో ధగధగ మెరిసేలా చేస్తుంటారు. అయితే క్రిస్మస్ మొక్కను డ్రైగా ఉంచకూడదట. అలంకరించడానికి ముందే క్రిస్మస్ చెట్టుని నీటిలో ఉంచితే ఎటువంటి ప్రమాదం జరగదంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ నెట్టింట ఒక వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!) -
ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది!
డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ సీజన్. నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి. ఇంటిని అలంకరించడండతో మొదలు కొని అన్నీ ఏర్పాట్లతో బిజీబిజీగా గడుపుతుంటారు. క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ రాక ముందు నుంచే ఈ చెట్టును తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. సరిగ్గా ఇలాగే ఓ పెద్ద క్రిస్మస్ చెట్టును ఇంటికి తీసుకొచ్చారు. దానిని అందంగా ముస్తాబు చేస్తుండగా ఓ విషపూరితమైన పాము కనిపించింది. ఆ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. చదవండి: ఓరి వీడి వేశాలో... తల ఆరబెట్టాలంటే ఇలా చేయాలా! ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో నివసిస్తున్న ఓ కుటుంబం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ ట్రీని ఇంటికి తీసుకొచ్చారు. దానికి రిబ్బన్లు, రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వారంతా దాన్ని తీక్షణంగా పరిశీలించగా.. రిబ్బన్ స్థానంలో ఓ విషపూరితమైన పాము చుట్టుకుని కనిపించింది. దీనితో భయభ్రాంతులకు గురైన ఆ కుటుంబం వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని ఇచ్చారు. సుమారు గంటన్నర పాటు శ్రమించిన అతడు.. ఆ పామును చెట్టును నుంచి తీసి దూరంగా అడవుల్లో విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది! -
వైరల్: క్రిస్మస్ చెట్టు మీద కోలా
కాన్బెర్రా: రేపే క్రిస్మస్ పండుగ. ఇప్పటికే ఎంతో మంది క్రిస్మస్ చెట్లను అందంగా అలంకరించి పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు చెందిన కుటుంబం కూడా క్రిస్మస్ చెట్టును బెలూన్లు, లైట్లు, స్టార్లతో అందంగా రెడీ చేసింది. అయితే ఏదో పని మీద ఇంటిసభ్యులు మధ్యాహ్నం బయటకు వెళ్లారు. ఇంతలో ఎలా వచ్చిందో ఏమో కానీ ఓ కోలా ఇంట్లో దూరి అది నిజమైన చెట్టు అనుకుని దాన్నే అంటిపెట్టుకుంది. తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కూడా దాన్ని చూసి మొదట ఏదో బొమ్మ అని భ్రమ పడ్డారు. (చదవండి: అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల) కానీ అది నిజమైన కోలా అని అర్థం కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వీరిని చూసి భయపడ్డ కోలా చెట్టు దిగి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తర్వాత రెస్క్యూ బృందం రంగంలోకి దిగి కోలాను తీసుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ సంఘటన గురించి ఆ కుటుంబంలోని పదహారేళ్ల అమ్మాయి మాట్లాడుతూ.. 'అది నిజమైన చెట్టు కాదు, పాతది కూడా. అయినా సరే కోలా ఆ చెట్టు ఆకులను నమలడానికి ప్రయత్నించింది. కానీ అది ప్లాస్టిక్ అని అర్థం కావడంతో వాటిని తినడం ఆపేసింది' అని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. (చదవండి: వైరల్: వధువు పాదాలను మొక్కిన వరుడు..) -
హిస్టరీ లో.. క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుంది. క్రైస్తవుల లోగిళ్లలో, చర్చిలలో క్రిస్మస్ ట్రీ వెలుగు జిలుగులతో కళకళలాడుతూ ఉంటుంది. మరి ఈ వృక్షం చరిత్రలో ఎలా ప్రసిద్ధిగాంచింది. ఈ ట్రీ హిస్టరీ ఏంటి.. దీని జన్మస్థానం ఎక్కడ.. వివిధ దేశాల్లో వీటిని ఏ పేరుతో పిలుస్తారు తదితరఆసక్తికర అంశాలపై ప్రత్యేక కథనం.– హిమాయత్‌నగర్ తొలిసారిగా జర్మనీలో.. క్రిస్మస్ ట్రీని మొదటిసారిగా 1510లో క్రిస్మస్ రోజు జర్మనీలో లాటివియా అనే ప్రాంతంలోని ‘దిగా’ అనే గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. వీటి కోసం తొలుత ‘కీనిఫిర్లు, ఫైన్, ఫిర్ స్రూసీ’ తదితర జాతుల చెట్లను అప్పట్లో వినియోగించేవారు. మధ్యయుగం నాటి నాటికల్లో క్రిస్మస్ ట్రీ స్వర్గం నుంచి వచ్చిందిగా పేర్కొంటూ ‘ట్రీæ ఆఫ్ ప్యారడైజ్’గా అభివర్ణించారు. ఆరు లేదా ఏడడుగుల మొక్కలను క్రిస్మస్ ట్రీకి ఉపయోగించడంఆనవాయితీ. విద్యుద్దీపాలతోఅలంకరించిన జాన్సన్.. 1782లో థామస్ ఆల్వా ఎడిసన్ సహాయకుడు ఎడ్వర్డ్ జాన్సన్ తొలిసారిగా క్రిస్మస్ ట్రీని విద్యుద్దీపాలతో అలంకరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. కాలగమనంలో ఎక్కువగా ట్రీకి లైటింగ్ ఏర్పాటు చేయడం, దానిపై శాంతాక్లాజ్ వంటివి అమర్చడం, కొవ్వొత్తులు పెట్టి ఎంతో ఆకర్షణగా కనిపించేలా ముస్తాబు చేస్తున్నారు. మనిషి జీవితంలో చెడు నుంచి రక్షణ ఇచ్చి వెలుగును నింపుతుందనే సిద్ధాంతాన్ని వివరిస్తుంది క్రిస్మస్ ట్రీ. ఆన్లైన్లోనూఅందుబాటులో.. గూగుల్‌లో క్రిస్మస్ ట్రీ అని సెర్చ్ చేస్తే చాలు. అవి అందుబాటులో ఉన్న వెబ్‌సైట్స్ అన్నీ తారసపడతాయి. ఆన్లైన్లో అడుగు ట్రీ రూ.199కే లభిస్తోంది. కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో ట్రీ మన ఇంటికే వచ్చేస్తుంది. మార్కెట్లో భారీక్రిస్మస్ ట్రీస్ లభ్యం నగరంలోని పలు స్టోర్స్‌లో క్రిస్మస్ ట్రీస్‌ను విక్రయిస్తున్నారు. ఇవి అడుగు పొడవు నుంచి సుమారు 30 అడుగుల వరకు ఉన్నాయి. అడుగు ట్రీ రూ.299కి లభిస్తుండగా.. ఐదడుగుల ట్రీ రూ.880, 20 అడుగులు రూ.87వేలు, 30 అడుగుల ట్రీ రూ.1.20 లక్షల్లో లభిస్తున్నాయి. -
క్రిస్మస్కు ‘గ్రాండ్’ వెల్కమ్
ఇటు కనువిందు చేసే క్రిస్మస్ ట్రీ.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పశువుల పాక సెట్లో క్రీస్తు జనన దృశ్యం.. అటు నోరూరించే వంటకాలు.. ఇలా క్రిస్మస్ వేడుకలకు కాకినాడలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్లో స్వాగతం పలికారు. వంద కిలోల వివిధ రకాల డ్రైఫ్రూట్స్‌తోపాటు వైన్, స్కాచ్, బ్రాందీ తదితర స్పిరిట్స్ కలిపి నెల రోజుల క్రితమే ప్రారంభించిన ప్లమ్ కేక్ గురువారం నాటికి ప్రత్యేక రూపు సంతరించుకుంది. దీనిని జీఆర్టీ సిబ్బంది కట్ చేసి అతిథులకు ప్రత్యేకంగా వడ్డించారు. ఇక టర్కీ కోడి మాంసంతో తయారు చేసిన రోస్టెడ్ టర్కీ, స్పెషల్ టర్కీ బిర్యానీ సహా ఆరు రకాల మాంసాహార పదార్థాలు భోజనప్రియులను నోరూరించాయి. ఇవి కాకుండా 30 డెసెర్ట్స్ (ఇండియన్ బేకరీ) వంటకాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇలా సందడిగా ప్రారంభమైన వేడుకల్లో హోటల్ జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరి, అకామిడేషన్ మేనేజర్ మారుతిరాజ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ లక్ష్మణ్, ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజర్ జెఫ్రీ తదితరులు పాల్గొన్నారు. - కాకినాడ -
నేలకు దిగిన నక్షత్రాలు
యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, యేసు చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశం లోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టుని ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి. ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకుంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్నో ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకునే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకు, ముగ్గురు జ్ఞానులకు ఆయన దగ్గరకు వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం, క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగు తోందనేది అందరి నమ్మకం. -
క్రిస్మస్ ట్రీ: జగానికి జర్మనీ కానుక
క్రిస్మస్ వేడుకలో చెట్టు అలంకరణ ఎంతో ముచ్చటగా ఉంటుంది. రకరకాల పరిమాణాలలో ఉండే క్రిస్మస్ చెట్టు, రకరకాల బొమ్మలతో, పూలతో, మెరుపుల అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక వేడుకలో కనిపించే కళాత్మక దృష్టికి ఈ చెట్టు నిదర్శనంగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు క్రైస్తవ దేశాలన్నీ క్రిస్మస్ చెట్టు అలంకరణను వేడుకలో భాగం చేసినప్పటికీ, మొదట్లో దీనికి అంత ఆమోదం లభించలేదు. నిజానికి పాత నిబంధనలోనే క్రిస్మస్ చెట్టు ప్రస్తావన ఉంటుందని చెబుతారు. కానీ రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొని 19వ శతాబ్దానికి గానీ ఈ చెట్టు ప్రపంచమంతా విస్తరించలేదు. ఒక పచ్చని చెట్టును నరికి తెచ్చి ఇంటిలో అలంకరించుకోవడం ఇష్టం లేక, ఇది దేవతారాధన సంప్రదాయం కలిగిన మత చిహ్నం కావడం (పాగన్ రెలిజియన్) వల్ల మొదటి దశలో క్రిస్మస్ చెట్టు పెట్టే సంప్రదాయానికి వ్యతిరేకత ఉండేది. ఇప్పటికీ కొన్ని క్రైస్తవ రాజ్యాలలో మాత్రమే క్రిస్మస్ చెట్టును అలంకరించే అలవాటు కనిపిస్తుంది. చెట్టును కొట్టడం, కొంతవరకు పాగన్ మతాల లక్షణాలు కనిపించడ మే ఇందుకు కారణం. ప్రాచీన రోమన్లు క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేసి, దానిని 12 కొవ్వొత్తులతో అలం కరించే సంప్రదాయాన్ని పాటించేవారు. ఆ అంకె వారి ఇష్టదైవం. సూర్యునికి ప్రతీక. ఇంకా చెట్టు నిండా పలు రకాల దేవతా మూర్తులను అలంకరించేవారు. అందులో ‘బాచుస్ దేవత’ కచ్చితంగా ఉండేది. అంటే భూమిని సారవంతం చేసే దేవత. ఇంతకీ అసలు ఈ చెట్టు మొదట ఎక్కడ ఏర్పాటైంది? వేయి సంవత్సరాల క్రితం జర్మనీలోనే ఈ సంప్రదాయం మొదలైందని చెబుతుంటారు. సెయింట్ బోనిఫేస్ అనే ప్రచారకుడు దీనిని ఆరంభించాడు. జర్మనీకి క్రైస్తవాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. అయితే ఆ తర్వాత ఈ సంప్రదాయం కొంతకాలం మరుగున పడినప్పటికీ తిరిగి జర్మనీలోనే మళ్లీ ఆదరణ పొందింది. ఆధునిక చరిత్ర ప్రకారం 16 శతాబ్దం నుంచి జర్మనీలో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ దీనిని పారా డెయిస్ బామ్ (ప్యారడైజ్ ట్రీ) అని పిలుచుకునేవారు. డిసెంబర్ 24న ఒక ఓక్ చెట్టు శాఖను తెచ్చి అలంకరిస్తారు. అదే క్రిస్మస్ చెట్టు. మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఇంగ్లండ్‌లో కూడా ఈ సంప్రదాయానికి అంతగా ప్రాచుర్యం లేదు. ప్రిన్స్ అల్బర్ట్, ఆయన భార్య విక్టోరియా మహారాణిల కాలంలో, అంటే 1840లో మాత్రమే అక్కడ క్రిస్మస్ చెట్టు ప్రత్యక్షమైంది. ఇందుకు కారణం- అల్బర్ట్ జర్మన్ జాతీయుడు. ఆ యుద్ధకాలంలో తమ ట్రెంచ్‌లలో జర్మన్ సైనికులు క్రిస్మస్ చెట్లు అలంకరిస్తే, అవేమిటో ఇంగ్లిష్ సైనికులకు అర్థం కాలేదు. ఆఖరికి అమెరికాలో కూడా 1850 వరకు ఈ చెట్టుకు అంత ప్రాధాన్యత కలగలేదు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్ (1804-1869) మొదటిసారి శ్వేత సౌధంలో క్రిస్మస్ చెట్టును అనుమతిం చాడు. తర్వాత మెల్లగా ఈ సంప్రదాయం ప్రపంచమంతా పాకింది. -
ప్రపంచంలోనే అతి పొడవైన క్రిస్మస్ చెట్టు...
బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో రోడ్రిగో డి ఫ్రీటస్ లాగూన్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపొడవైన , నీటిపై తేలే క్రిస్మస్ ట్రీ ఇది. 85 మీటర్ల పొడవు, 542 టన్నుల బరువు ఉన్న ఈ క్రిస్మస్ చెట్టు 31 లక్షల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగులీనుతోంది. జనవరి 6 దాకా మెరిసిపోనున్న ఈ క్రిస్మస్ చెట్టు ప్రపంచంలోనే అతిపెద్దదని గిన్నిస్ బుక్‌వారు కూడా రికార్డు కట్టబెట్టేశారు. -
ఇవ్వడమే... క్రిస్మస్ పరమార్థం
డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. అందరి ఇళ్లకూ రంగురంగుల నక్షత్రాలు వేళ్లాడుతూ ఉంటాయి. కేకుల ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతుంటాయి. శాంటాక్లాజ్ రాక కోసం చిన్నారుల ఎదురుచూపులు మొదలవుతాయి. అయితే క్రిస్మస్ అనగానే ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తాయి? ఈ సంప్రదాయాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? సంప్రదాయాల వెనుక అర్థం తెలుసుకుంటే, పండుగ వెనుక ఉన్న అసలు అంతరార్థం బోధపడుతుంది. నిజమైన ఆనందం జీవితమంతా నిండుతుంది. క్రిస్మస్ అంటే కేవలం అలంకరణలు, రుచికరమైన వంటకాలు, అందమైన దుస్తులు, ఇచ్చి పుచ్చుకునే కానుకలు మాత్రమే కాదు. ఆత్మీయాంతరార్థం మరుగున పడకుండా చూసుకోవడమే దాని వెనుక ఉన్న అసలు అంతరార్థం. యేసుక్రీస్తు నరావతారిగా భూలోకానికి వేంచేసిన దినమది. దీనులు, దరిద్రులు, నిరాశ్రయులు, నిరుపేదలకు అండగా, ఆసరాగా మానవాళి నిలవాలన్న సందేశాన్ని యేసుక్రీస్తు రూపంలో తెచ్చిన మహా పర్వదినమది. క్రిస్మస్ సందర్భంగా మనకోసం మనమెంత ఖర్చు చేస్తున్నామని కాక, పేదల కోసం కొంతైనా చేస్తున్నామా లేదా అన్నది తప్పక ఆలోచించుకోవాలి. అప్పుడే అది హ్యాపీ క్రిస్మస్... అర్థవంతమైన ఆత్మీయ క్రిస్మస్! రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ క్రిస్మస్ ట్రీ ఇప్పుడంటే ఆర్టిఫీషియల్ క్రిస్మస్ ట్రీలు షాపుల్లో దొరికేస్తున్నాయి కానీ.. అప్పట్లో సరుగుడు చెట్లకొమ్మలు తెచ్చి, దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైందని అంటారు. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొంది, క్రైస్తవులందరి ఇళ్లలోకీ క్రిస్మస్ ట్రీ చేరిందని సమాచారం. ఆ చెట్టును దీపాలు పెట్టి మొదటగా అలంకరించింది... సంస్కరణోద్యమ పితామహుడు మార్టిన్ లూథర్ అట. అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలూ గుర్తించాయి. ఆ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు. శాంటాక్లాజ్ క్రిస్మస్ తాత సంప్రదాయం మూడవ శతాబ్దంలో పరిచయమయ్యాడు. డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే భక్తిపరుడైన క్యాథలిక్ బిషప్ ఉదంతమే శాంటాక్లాజ్ సృష్టికి మూలమని చెబుతారు. నికొలస్ బిషప్‌గా ఉన్న ప్రదేశంలో ఒక పేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేయలేక అవస్థ పడుతుంటాడు. దాంతో బిషప్ నికొలస్ అర్ధరాత్రిపూట బంగారు నాణాలున్న మూడు చిన్న మూటలను చిమ్నీ ద్వారా ఇంట్లోకి జారవిడుస్తాడు. అవి చిమ్నీ ద్వారా జారి, అక్కడ ఆరబెట్టి ఉన్న ఓ సాక్స్‌లో పడ్డాయట (అందుకే క్రిస్మస్ అలంకరణలో సాక్స్‌ను రకరకాల రంగుల్లో వేలాడదీయడం ఆచారంగా మారింది). అలా ఆయన చేసిన సత్కార్యం ఒక పేదరైతు కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ మాట ఆ నోట ఈ నోట వెలువడి అంతా ప్రచారమైంది. దాంతో కష్టాల్లో ఉన్న చాలామంది తమకు కూడా అలా సాయం అందుతుందేమో అని చూడటం మొదలుపెట్టారు. దాంతో మనసున్నవాళ్లంతా రకరకాల సాయాలు చేసే క్రిస్మస్ తాతలుగా పుట్టుకొచ్చారు. కొన్ని చోట్లనైతే ఆ ఏడాదంతా సర్వే చేసి ఎవరికి ఏం అవసరమో తెలుసుకొని వారి వారి అవసరాల ప్రకారం అనామకంగా ఉంటూనే సాయం అందజేసే క్రిస్మస్ తాతలు బయలుదేరారు. క్రిస్మస్ ముందురాత్రి పడుకున్న తరువాత... క్రిస్మస్ తాత ఇంటింటికీ వెళ్లి వారి బహుమతులను ఇంటి ముంగిట పెట్టి తలుపుకొట్టి వెళ్లిపోయేవాడు. పాశ్చాత్యదేశాల్లో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. మనం క్రిస్మస్ తాత అంటాం... వాళ్లు శాంటాక్లాజ్ అంటారు. క్రిస్మస్ అలంకరణ క్రిస్మస్ సందర్భంగా ఇళ్లను రంగు రంగుల నక్షత్రాలు, గంటలతో డెకరేట్ చేయడం పరిపాటి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక విలక్షణమైన తార దర్శనమిచ్చింది. ఆ తారను చూసిన కొందరు జ్ఞానులు తూర్పు దేశాల నుండి బయలుదేరి, ఆ తార చూపించే మార్గంలో పయనించి, బాలయేసు దగ్గరకు చేరుకున్నారు. యేసుక్రీస్తును సందర్శించి, ఆయన్ను ఆరాధించారు. ఈ ఉదంతాన్ని స్మరణకు తెచ్చుకొంటూ క్రైస్తవులంతా తమ ఇళ్ల ముందు క్రిస్మస్ సమయంలో ఒక తారను వేలాడదీస్తారు. నాటి తార యేసుప్రభువును జ్ఞానులకు పరిచయం చేసినట్టే తాము కూడా అభినవ తారలుగా ఆయన్ను లోకానికి పరిచయం చేస్తామంటూ ఆ విధంగా పరోక్షంగా దేవునికి వాగ్దానం చేస్తారన్న మాట. ఇక గంటల సంగతి. గడియారాలు లేని ఆ రోజుల్లో చర్చిలో సమయబద్దంగా మోగించే గంటలే ఊరంతటికీ సమయమెంతో తెలిపేవి. ముఖ్యంగా చర్చిలో పూజలు, ఆరాధనలప్పుడు అవి మోగితే అందరూ ఆలయాల్లో హాజరైపోయేవారు. ప్రభువు సన్నిధికి తాము వెళ్లే సమయాన్ని సూచిస్తున్నందున గంటకు ప్రత్యేకత ఏర్పడింది. అందుకే క్రిస్మస్ సమయంలో గంటలను ఇళ్లలో అలంకరించుకొని ఆనందపడతారు. క్రిస్మస్ కేక్ క్రిస్మస్కి కేక్ తయారుచేయడం అనేది పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయం. పాశ్చాత్యుల విందు భోజనాల్లో కేక్ ఒక అంతర్భాగం. ఇక ప్రత్యేక సందర్భాలైన పుట్టినరోజు, పెళ్లిరోజుల్లో కేక్‌ను కట్ చేయించడం వారికి అలవాటు. అందుకే ఎంతో ముఖ్యమైన క్రిస్మస్కి కూడా కేక్ కటింగ్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. బ్రిటిష్ వారు పరిపాలించిన అన్ని దేశాల్లోకీ ఆ సంప్రదాయం విస్తరించింది. క్రిస్మస్ కేక్ అంటే ప్రసాదం లాంటిదేమీ కాదు. అదొక రుచికరమైన ఆహార పదార్థం మాత్రమే. అందరూ నోటిని తీపి చేసుకుని సరదాగా ఆనందించడానికే తప్ప ఈ సంప్రదాయం వెనుక ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. -
ఊరూవాడా క్రిస్మస్ సందడి
= క్రిస్మస్ ట్రీ, పశువుల పాక ల ఏర్పాటు = క్రిస్మస్ తాత ఆశీర్వచనాల కోసం ఎదురు చూపులు అందాల తార... అరుదెంచె నాకై.... అంబరవీధిలో.. అని పాడుకుంటూ క్రీస్తు విశ్వాసులు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యారు. మానవాళి క్షేమం కోసం శిలువపై తన రక్తాన్ని చిందించిన కరుణామయుని కరుణ కోసం ధ్యానిస్తున్నారు. మచిలీపట్నం/ఈడేపల్లి/చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో క్రిస్మస్ సందడి మొదలైంది. క్రీస్తు విశ్వా సులు ప్రధాన కూడళ్లలో భారీ నక్షత్రాలను ఏర్పాటుచేసి, వాటికి విద్యుత్ వెలుగులు అద్దుతున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏసు పుట్టుకును తెలిపే పశువుల పాక నమూనాలు ఏర్పాటు చేస్తున్నారు. చర్చిలను ఇప్పటికే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రీటింగ్ కార్డులు, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు విక్రయించే దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పలు పాఠశాలల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్తు పుట్టుకే క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు జననం ప్రపంచగమనాన్నే మార్చింది. క్రీస్తు పుట్టుకను ఆధారంగాచేసుకుని కాలాన్ని క్రీస్తుపూర్వం, క్రీస్తుశకంగా పరిగణిస్తున్నారు. భగవంతుడు తనను తాను తగ్గిం చుకుని ఇజ్రాయేలు దేశం, బెత్లెహేంలోని పశువుల పాకలో సామాన్య మానవుడిలా రెండువేల ఏళ్లకు పూర్వం జన్మిం చిన రోజునే క్రిస్మస్‌గా జరుపుతున్నారు. 33 ఏళ్లు జీవించి మానవుల పాప విమోచన కోసం తన ప్రాణాలనే శిలువపై అర్పించి, పునరుత్థానుడైన ఏసును లోక రక్షకుడిగా కొలుస్తున్నారు. తన భోధనల ద్వారా ప్రేమతత్వాన్ని, సోదరభావాన్ని అలవరచి, ప్రజలు ఆధ్యాత్మికపథం వైపు పయనించేలా క్రీస్తు కృషిచేశారు. క్రిస్మస్ సందర్భంగా వివిధ చర్చిల్లో ఆచరించే విధానం వేర్వేరుగా ఉంటుంది. క్రీస్తు జననాన్ని గుర్తుకు తెస్తూ చిన్నారులు ప్రదర్శించే నాటికలు, క్రిస్మస్తాత ఇచ్చే బహుమతులు, చర్చిల్లో క్రీస్తు జన్మించిన పశువుల పాక, అందులో బాలఏసు, ముగ్గురు జ్ఞానుల రాక, క్రీస్తు జననాన్ని ముందునుంచి చెబుతూ వస్తున్న గాబ్రియేలు దేవదూత, క్రీస్తు జననాన్ని చాటుతూ ఆకాశంలో ప్రత్యక్షమైన వేగుచుక్క(స్టార్), గొర్రెల కాపరుల హడావుడిని చాటుతూ చర్చిల్లో పశువుల పాకలను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ఈవ్ సందర్భగా ఏటా డిసెంబర్ 24 తేదీ రాత్రి 10 గంటల నుంచి చర్చిలో ప్రార్థనలు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతాయి. 24న రాత్రి 12 గంటలకు భక్తులు క్రీస్తు జననాన్ని చాటుతూ కొవ్వొత్తులు చేతబట్టి పాటలు పాడుతూ అన్ని వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభువు రాక కోసం సమాయత్తం క్రీస్తును నమ్మినవారికి ఇదోక శుభదినం. ప్రభువు రాక కోసం క్రిస్మస్కు నెల మందు నుంచే క్రీస్తు విశ్వాసులు సమాయత్తం అవుతారు. రక్షకుడిగా, మానవాళి పాపవిమోచకుడిగా, మరణాన్ని గెలిచిన మహారాజుగా ఈ లోకంలో జన్మించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకునేందుకు ముందు నుంచే ప్రార్థనలు చేస్తున్నాం. ఈ క్రిస్మస్ అన్ని వర్గాల వారికి శాంతి, సమాధానం, ప్రేమ పంచాలి. - రెవరెండ్ ఫాదర్ బుర్రి జాన్‌పీటర్ ఆర్సీఎం చర్చి, చల్లపల్లిమండలం, లక్ష్మీపురం